వాట్స్‌యాప్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
wasteapp
WhatsApp logo.svg

[[File:[

[File:Windows Whatsapp.png|300px]]
విండోస్ ఫోన్ కోసం రూపొందింపబడ్డ వాట్స్‌యాప్
Developer(s) వాట్స్‌యాప్ ఇంక్.
Initial release 2009 (2009)
Stable release
Operating system
Available in బహుభాషలు
Type ఇన్‌స్టంట్ మెసేజింగ్
License యాజమాన్య హక్కులు
Website www.whatsapp.com

వాట్స్ యాప్ ఒక ఇంటర్నెట్ ఆధారిత సాఫ్ట్‌వేర్. ఇంటర్నెట్ ఉంటే చాలు. దీంతో ఏదైనా చేసేయొచ్చు. ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. వీడియోల్ని సెకన్లలో పంపేయొచ్చు. ఆడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపేయొచ్చు. వాట్స్ యాప్ వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. 2014 లో ఈ సంస్థను ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు (రూ.1.18 లక్షల కోట్లు) పెట్టి కొనేసింది. ==విశేషాలు

  • ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలకు సంబంధించి ఇదో అప్లికేషన్(యాప్). దీనిద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫొటోలు ఏవైనా సరే వేరొకరికి లేదా గ్రూపునకు పంపొచ్చు.
  • వేరొకరు పంపిన వీడియోలు, ఫోటోలు, మెసేజ్‌లు ఇతరులతో పంచుకోవచ్చు.
  • దీనికి టెలిఫోన్ ఆపరేటర్ల నుంచి ఎలాంటి రుసుములు ఉండవు. స్మార్ట్, ఫీచర్ ఫోన్లు అన్నింటిలోనూ (గూగుల్ ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఓఎస్, యాపిల్ ఐఓఎస్; నోకియా ఆశా, విండోస్ ఫోన్ ఇతరత్రా) ఈ యాప్ అందుబాటులో ఉంది.
  • ప్రపంచంలో ఏ మూలనుంచైనా ఈ యాప్‌ను ఉపయోగించొచ్చు. ఫోన్ లేదా ట్యాబ్‌లో కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. యూజర్ల మొబైల్ నంబర్ల ఆధారంగా ఇది అనుసంధానం అవుతుంది.
  • డౌన్‌లోడ్ చేసుకున్న తొలి ఏడాది పాటు ఈ యాప్‌ను ఉచితంగానే వాడుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఏడాదికి ఒక డాలరు (దాదాపు రూ.62) చొప్పున ఫీజు చెల్లించాలని వాట్స్‌యాప్ చెబుతోంది.
  • ప్రసుత్తం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా యూజర్లు వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు 10 లక్షల మంది కొత్త యూజర్లు జతవుతున్నట్లు అంచనా. అంతేకాదు వాట్స్‌యాప్ యూజర్లలో 70 శాతం మంది యాక్టివ్‌గా (రోజులో కనీసం ఒకసారైనా వాడేవారు) ఉంటున్నారు.
  • స్వల్పకాలంలోనే వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని అధిగమించగలదని అంచనా.
  • రోజుకు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్‌లు దీనిద్వారా షేర్ అవుతున్నట్లు అంచనా.who is founder of this app where is native place born on this app

బయటి లంకెలు[మార్చు]