వాడుకరి:వంగలపూడి శివకృష్ణ
స్వరూపం
నా పేరు వంగలపూడి శివకృష్ణ, మా నాన్న గారు కీ.శే. శ్రీ వంగలపూడి సూర్యనారాయణ గారు - గొప్ప పులివేషం కళాకారులు. మా ఊరు పెద్దాపురం, మా తాత గారు వంగలపూడి కొండయ్య - శేషమ్మ దంపతులు, ముత్తాత గారు వంగలపూడి నారాయణ - మైడమ్మ దంపతులు - వారికి ముందు వంగలపూడి పెదకొండయ్య - రమణమ్మ - అంతకు ముందు వంగలపూడి జగ్గయ్య గారూ పెద్దాపురం సంస్థానం వత్సవాయి వంశస్తుల అనుయూయులు కావడం వల్ల నాకు స్వతహాగానే పెద్దాపురం చరిత్రను పరిశోదించాలనే కుతూహలం కలిగింది. నా పరిశోదనకి వికీపీడియా ఎంతగానో ఉపకరిస్తుంది. నేను పెద్దాపురం సస్థానం చరిత్రను అచ్చుదిద్దుతున్నాను. పెద్దాపురం చరిత్రను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను.