వాడుకరి:వయస్వి/Ningxiang
నింగ్జియాంగ్ (Ningxiang)
宁乡市 నింగ్సియాంగ్( Ningsiang) | |
---|---|
దేశ స్థాయి నగరం (County-level city) | |
Motto: జాతీయ ఆరోగ్య నగరం 心忧天下、敢为人先 | |
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/China Hunan" does not exist. | |
Coordinates (నింగ్జియాంగ్ ప్రభుత్వం (Ningxiang government)): 28°16′41″N 112°33′07″E / 28.278°N 112.552°E | |
దేశం (Country) | పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా People's Republic of China) |
ప్రొవిన్స్ (Province) | హూనన్ (Hunan) |
మండల స్థాయి నగరం (Prefecture-level city) | చంగ్షా (Changsha) |
స్థాపించిన కాలం (Established) | 627 (టాంగ్ జహెన్గుయాన్ TangZhenguan) |
Seat | యుటన్ (Yutan) |
టౌన్ షిప్ స్థాయి విభాగాలు (Township-level divisions) | 4 ఉప జిల్లాలు(subdistricts), 21 టౌన్ లు ( towns), 8 టౌన్ షిప్ లు (townships), 1 జిల్లా( and 1 district) |
Government | |
• కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి (Communist Party Secretary) | యు క్సిన్ఫాన్ (Yu Xinfan) (于新凡) |
• నింగ్సియాంగ్ పీపుల్స్ కాంగ్రెస్ ఛైర్మన్ (Chairman of Ningxiang People's Congress) | హి యింగ్హుయ్(He Yinghui) (贺应辉)[2] |
విస్తీర్ణం | |
• దేశ స్థాయి నగరం (County-level city) | 2,906 కి.మీ2 (1,122 చ. మై) |
Highest elevation | 884 మీ (2,900 అ.) |
Lowest elevation | 127.2 మీ (417.3 అ.) |
జనాభా (August 2012) | |
• దేశ స్థాయి నగరం (County-level city) | 13,68,117[1] |
• Urban | 3,00,000 |
Time zone | UTC+8 |
Postal code | 410600 |
ప్రాంతపు కోడ్ | (0)731 |
నింగ్జియాంగ్ ( సరళీకరించిన చైనీస్: 宁乡市; సంప్రదాయ చైనీస్: 寧鄕市; పిన్యిన్: Níngxiāng Shì; lit. 'peaceful home' ) చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో అత్యధిక జనాభా కలిగిన కౌంటీ-స్థాయి నగరం, అలాగే 2వ కౌంటీ-స్థాయి డివిజన్; ఇది చాంగ్షా పరిపాలనలో ఉన్న ప్రిఫెక్చర్-స్థాయి నగరం. ఈ నగరం ఉత్తర సరిహద్దుల్లో హేషన్ (Heshan) జిల్లాలోని యియాంగ్ (Yiyang), తావోజియాంగ్(Taojiang) కౌంటీ, పశ్చిమాన అన్హుఆ (Anhua) కౌంటీ, లియాన్ యుఆన్ (Lianyuan) సిటీ, దక్షిణాన లౌక్సింగ్ (Louxing) జిల్లా లోని లౌడి (Loudi), క్సియాంగీక్స్యంగ్ (Xiangxiang) సిటీ, షావోషన్(Shaoshan)సిటీ ఇంకా యుహు(Yuhu)జిల్లా లోని క్సియంగ్టాన్ (Xiangtan), తూర్పున యుయెలు, వాంగ్‌చెంగ్ జిల్లాలు ఉన్నాయి. హునాన్ ప్రావిన్స్‌కు తూర్పు మధ్యన ఉన్న నింగ్‌క్సియాంగ్ వైశాల్యం 2,906 కి.మీ2 (1,122 చ. మై.). దీని నమోదిత జనాభా 1,393,528 మంది, [3] కాగా నివాస జనాభా (2014 నాటికి)1,218,400 మంది. [3] నగర అధికార పరిధిలో 4 ఉపజిల్లాలు, 21 పట్టణాలు ఇంకా 4 టౌన్‌షిప్‌లు ఉన్నాయి. దీని పరిపాలనా కేంద్రం యుటాన్ ఉపజిల్లా లో ఉంది (玉潭街道). [4]
అత్యంత ప్రసిద్ధ చారిత్రాత్మక వ్యక్తి లియు షావోకి, అధ్యక్షుడిగా బీజింగ్‌కు వెళ్ళటానికి ముందు 1898 నుండి 1920 వరకు నింగ్‌క్సియాంగ్‌లోనే నివాసముండే వాడు.
ప్రముఖులైన హీ షుహెంగ్ , క్సీ జుజాయ్ , లియు షావోకి ల పూర్వ నివాసంగానే కాక, బైయున్ , మియిన్ , పూజి దేవాలయాలతో ఈ నగరం పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది.
పురాతత్వము
[మార్చు]నింగ్జియాంగ్, షాంగ్ కాలం నాటి ఎన్నో పురావస్తు మూలాలు లభించిన ప్రాంతం.[5]
2004లో, ఒక చైనీస్ బృందం తన్హేలి వద్ద పశ్చిమ జౌ కాలం (11వ శతాబ్దం-771 సా.శ.పూ.) నాటి శిథిలాలను వెలికి తీసింది. అక్కడ పసుపు మృత్తిక తో నిర్మించిన రెండు పెద్ద కృత్రిమ భవనాలు, ఇంకో రెండు అతిపెద్ద రాజమందిరాలు (Palace) గా భావిస్తున్న నిర్మాణాలను కనుగొన్నారు. నగరం లోపల, వెలుపల కందకాల అవశేషాలు లభించాయి. నగరం వెలుపల ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల్లో సంస్థానాధిపతులు, ఇంకా ప్రభువుల కోసం నిర్మించిన ఏడు చిన్న సమాధులు బయట పడ్డాయి. వీటిల్లో అనేక కాంస్య సంస్కృతికి చెందిన ఉపకరణాలు లభించాయి. పచ్చలతో తయారు చేసినవి కూడా వీటిలో ఉన్నాయి . ఈ ప్రదేశం 2004 నాటి మొదటి పది పురావస్తు ఆవిష్కరణలలో ఒకటిగా [6] బీజింగ్ పత్రిక పేర్కొంది.
</img> | మానవ ముఖాలతో కూడిన కాంస్య చతురస్రపు పాత్ర (డింగ్) : ఈ డింగ్ మానవ ముఖంతో అలంకరించిన ఒక పాత్ర. తదనంతర షాంగ్ రాజవంశానికి చెందిన ఈ కాంస్య పాత్ర 1959లో నింగ్‌క్యాంగ్ కౌంటీలోని హువాంగ్‌కాయ్ టౌన్, జైజిషాన్ వద్ద లభించింది. దీనిని హునాన్ ప్రావిన్షియల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. |
</img> | సియాంగ్‌ఫాంగ్‌జున్ లేదా నాలుగు -మేకల చతురస్రపు జున్ పాత్ర (Four-goat Square Zun) : తరువాతి షాంగ్ రాజవంశానికి చెందిన ఈ జున్ పాత్ర 转耳仑山腰), హువాంగ్‌కాయ్ పట్టణం, నింగ్‌క్సియాంగ్ కౌంటీ వద్ద ఏప్రిల్ 1938లో జియాంగ్ జింగ్సు (姜景舒) అతని ఇతర ఇద్దరు సోదరులు కనుగొన్నారు. ఇది నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాలో ప్రదర్శనకు ఉంచారు. |
చరిత్ర
[మార్చు]
- కియన్జోహ్ంగ్ కమాండరీ(Qianzhong Commandery), ఛు స్టేట్(Chu State) (1115–223 సా.శ.పూ.)
- చంగ్షా కమాండరీ(Changsha Commandery), కిన్ రాజవంశం(Qin dynasty) (221–207 సా.శ.పూ.)
- యియంగ్ కౌంటీ/క్సియన్గయిన్ కౌంటీ(Yiyang County/ Xiangyin County), హాన్ రాజవంశం(Han dynasty) (202 సా.శ.పూ.–220 సా.శ.)
- క్సిన్యంగ్ (Xinyang County), వు స్టేట్(Wu State) (222–280)
- క్సిన్కాంగ్ కౌంటీ(Xinkang County), జిన్ రాజవంశం(Jin dynasty) (280–420)
- యియంగ్ కౌంటీ(Yiyang County), సూయి రాజవంశం(Sui dynasty) (589–618)
- క్సిన్కాంగ్ కౌంటీ(Xinkang County), టాంగ్ రాజవంశం(Tang dynasty) (621–907)
- నింగ్క్సియంగ్ కౌంటీ(Ningxiang County), టాంగ్,సాంగ్ రాజవంశాలు(Tang and Song dynasties) (627–1276)
- టన్జ్హోఔలు, యుయన్ రాజవంశం( Tanzhoulu, Yuan dynasty) (1271–1368)
- చంగ్షాఫు (Changshafu), మింగ్,కింగ్ రాజవంశాలు (Ming)( and) (Qing dynasties) (1372–1911)
- హూనన్ కు చెందిన 5వ క్సిన్గ్షు (No. 5 Xingshu of Hunan), రిపబ్లిక్ ఆఫ్ చైనా(Republic of China) (1911–1949)
- యిన్యంగ్ జహుఅంకు(Yiyang Zhuanqu), 1949–1952; 1962–1983
- క్సియన్టన్ జహుఅంకు(Xiangtan Zhuanqu), 1952–1962
- నింగ్క్సియంగ్ కౌంటీ (Ningxiang County) 1983–2017
- నింగ్క్సియంగ్ సిటీ (Ningxiang City), 2017నుంచి–ప్రస్తుతం వరకు(present)
నింగ్జియాంగ్‌లోని మానవ నివాసపు ఆనవాళ్లు బహు పురాతన కాలం నాటివి. ఇప్పటివరకు జరిపిన పురావస్తు త్రవ్వకాల్లో తన్హెలి (Tanheli) ప్రాంతం లో హువాంగ్కాయ్(Huangcai) టౌన్ వద్ద లభించినవి నాలుగు మేకల స్క్వేర్ జున్, ఇంకా దహే రెన్మియన్వెన్(Dahe Renmianwen) స్క్వేర్ డింగ్. ఇవి అలనాటి షాంగ్ రాజవంశ (10 వ-11 వ సా.శ.పూ.) కాలం నాటివి. అప్పుడు హునాన్ ప్రావిన్స్ రాజధాని ఛాంగ్ షా (Changsha, capital of Hunan province) బైయుఎ(Baiyue) తెగకు చెందిన యాంగ్యుఎ(Yangyue) ఆధీనంలో ఉండేది. వారింగ్ స్టేట్స్ (475 – 221 సా.శ.పూ.) కాలంలో, నింగ్జియాంగ్ ఛు రాష్ట్రానికి చెందిన కియాంజహవోంగ్జూన్ (Qianzhongjun) (1115 – 223 సా.శ.పూ.) 黔中郡) అధికార పరిధిలోకి వచ్చింది. [7]
అన్ని రాష్ట్రాలను జయించిన తర్వాత, చక్రవర్తి క్విన్ షి హువాంగ్ 221 సా.శ.పూ. లో ప్రిఫెక్చర్లు, కౌంటీల వ్యవస్థను అమలు చేశాడు. అలా నింగ్జియాంగ్ చాంగ్‌షాజున్ (长沙郡)కి పరిధి లోకి వచ్చింది. [7]
హాన్ రాజవంశపు పాలనలో (202 సా.శ.పూ. – 220 సా.శ.) నింగ్జియాంగ్, యియాంగ్ కౌంటీ, జియాంగ్యిన్ కౌంటీ ల అధికార పరిధిలో ఉండేది. [7]
మూడు సామ్రాజ్యాల కాలం (220 – 280 సా.శ), వు రాష్ట్రపు రాజు (222 – 280) సన్ క్వాన్, జింగ్జౌ (Jingzhou) ను స్వాధీనం చేసుకోవడంతో నింగ్జియాంగ్ వు రాష్ట్ర అధికార పరిధిలోకి వచ్చింది. 257లో, ఇంపీరియల్ కోర్ట్ జింకాంగ్ కౌంటీని ఏర్పాటు చేసింది. దాంతో చాంగ్‌కియావో (ప్రస్తుతం హెంగ్షి) కౌంటీ పరిపాలనా కేంద్రంగా మారింది. [7]
ఇక టాంగ్ రాజవంశ (618 – 907)పాలన లో, ఇంపీరియల్ కోర్ట్ నేటి లావోలియాంగ్‌కాంగ్ టౌన్‌లో ధాన్యాగారాన్ని ఏర్పాటు చేసింది. 9వ శతాబ్ద కాలంలోనే నింగ్జియాంగ్‌లో బౌద్ధమత ప్రవేశం జరిగింది. వు డెంగ్ హుయ్ యువాన్ ( 《五灯会元》 ) పేర్కొన్న ప్రకారం, 806లో, ప్రధాన మంత్రి పీ జియు ఇంపీరియల్ కోర్టుకు వ్రాతపూర్వకంగా వీ పర్వతం పాదాల వద్ద మియిన్ ఆలయాన్నినిర్మించడానికి తన ప్రతిపాదనను సమర్పించాడు. దానికి ఆమోదం లభించింది. అతని కుమారుడు,జువాంగ్యువాన్ (పట్టభద్రుడు ) అయిన పీ వెండే (裴文德), "జిన్‌షాన్ ఫహై" (金山法海) అనే ధార్మిక నామంతో సన్యాసిగా నియమితుడయ్యాడు. లెజెండ్ ఆఫ్ ది వైట్ స్నేక్‌లోని ఫహై పాత్ర అతనిని ఆధారం చేసుకుని సృష్టించారు. లియు డుయ్, నింగ్జియాంగ్ చరిత్రలోనే మొదటి జిన్షీ, అతన్ని"నింగ్జియాంగ్ కి మొదటి జిన్షీ " (破天荒进士) అని కూడా పిలుస్తారు. [7]
తీయంచెంగ్ Tiancheng కాలం (927) లోని 2 వ సంవత్సరంలో టాంగ్ రాజవంశ పాలన అంత్య దశలో (923 – 936) , చు రాజు, మ యిన్ (Ma Yin), చు రాజవంశపు (927– 963 ) పాలనకు నాంది పలికాడు. అతను నింగ్జియాంగ్ ప్రాంతంలో యియాంగ్ (Yiyang), చంగ్షా(Changsha), క్సియాంగీక్స్యంగ్ (Xiangxiang) అనే మూడు కౌంటీలను ఏర్పాటు చేశాడు. క్సింకాంగ్యి (Xinkangyi) (新康驿) కి పచ్చ లాంటి చెరువు ఉండడంతో దాని పేరు యుటాన్ టౌన్ గా మార్చాడు. [7]
సాంగ్ రాజవంశ (960 – 1279) పాలనలో, మొదటి సారి నింగ్జియాంగ్ ప్రజలు "వెన్జువాంగ్యువాన్" (文状元) అనే కీర్తిని , ఇక యి ఫూ, "ఫౌండింగ్ మ్యాన్ ఆఫ్ నింగ్జియాంగ్ 宁乡开国男) " అనే బిరుదుని పొందాడు.
యువాన్ రాజవంశ (1271 – 1368)పాలన ప్రారంభ కాలం లోనే నింగ్జియాంగ్, టాంజౌ (潭州) అధికార పరిధిలోకి వచ్చింది, అనంతరం టాన్జహ్లు (潭州路) అధికార పరిధిలోకి మారింది. [7]
మింగ్ రాజవంశం (1368 – 1644) పు హాంగ్వు కాలం (1372)లోని 5వ సంవత్సరం జూన్‌లో, టాంజౌ పేరును చంగ్షాఫు(Changsha Fu) (长沙府)గా మార్చి, నింగ్జియాంగ్ను దాని అధికార పరిధిలోకి తెచ్చారు.
క్వింగ్ రాజవంశపు (1644 – 1911) షుంజి కాలం (1647)లోని 4వ సంవత్సరంలో, గావో షిజున్ (高士浚) చాంగ్షాను తన సైన్యం తో జయించటంతో నింగ్జియాంగ్, క్వింగ్ సామ్రాజ్యపు భూభాగంలో విలీనం అయింది. చాంగ్‌షాఫు ఏర్పాటు చేసి, నింగ్‌క్యాంగ్‌తో సహా 12 కౌంటీలను తో హు-గువాంగ్ ప్రావిన్స్‌కు అనుబంధంగా మార్చారు. క్వింగ్ రాజవంశ పాలన చివరిలో, ఝు యిడియన్ (朱衣点) తన దళాలతో జుషి బ్రిడ్జ్‌లోని తైపింగ్ ఆర్మీతో జత కలిశాడు. అతను జియాంగ్జీ, జెజియాంగ్ ఇంకా ఫుజియాన్‌లలో అనేక యుద్ధాలు చేసి "జియోటియన్ యివాంగ్" (孝天义王) , "ఫుచావో టియాంజున్" (扶朝天军). [7] అనే బిరుదులు పొందాడు.
1922లో, నింగ్జియాంగ్ హునాన్ ప్రావిన్స్‌లో ఉండేది. [7]
జూన్ 18, 1944న, ఇంపీరియల్ జపనీస్ సైన్యం చాంగ్షాను స్వాధీనం చేసుకుంది. ఇంపీరియల్ జపనీస్ సైన్యం యియాంగ్ నుండి నింగ్‌క్సియాంగ్‌పై దాడి చేసింది. ఇక చైనీస్ నేషనలిస్ట్ 74వ ఆర్మీలోని 58వ డివిజన్ బెటాలియన్ వీ నది 乔口)పై దాడి చేసి, యుద్ధ సామాగ్రి అయిపోయే వరకు పోరాడారు. వారు శత్రువులతో ముఖా ముఖీ పొరాడినా వాస్తవానికి యుద్ధంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు. దీనికే "బ్యాటిల్ ఆఫ్ హిల్ ఆఫ్ డు ఫ్యామిలీ" (血战杜家山) అని పేరు. [7]
1949,ఫిబ్రవరి 9న, జియాంగ్ యక్సున్ (姜亚勋), లిషికియు (李石秋)ల సారధ్యంలో హువాంగ్‌కాయ్, తాంగ్షి అనే రెండు పట్టణాల్లో హువాంగ్-టాంగ్ తిరుగుబాటుకు (黄唐起义) పూనుకున్నారు. వారు సెంట్రల్ హునాన్ ప్రజలకు ఒక లేఖ (告湘中人民书)ను, చెంగ్ కియాన్ (致程潜的公开信)కు మరో బహిరంగ లేఖను ప్రకటించారు. ఆగస్ట్ 4న, 49వ సైన్యపు PLA 4వ ఫీల్డ్ ఆర్మీ లోని 146వ డివిజన్ కి చెందిన 436వ రెజిమెంట్, కుయ్ రోంగ్ తై (Cui Rongtai)(崔荣泰), వాంగ్ కియవో (Wang Qiao) ( 王侨)ల నేతృత్వంలో నింగ్‌క్సియాంగ్ ని విముక్తం చేసింది. ఆగస్ట్ 27న, నింగ్సియాంగ్ కౌంటీ పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పడింది. [7]
1949, అక్టోబర్ లో కమ్యూనిస్ట్ రాజ్య స్థాపన తర్వాత, నింగ్జియాంగ్, యియాంగ్ జువాన్క్ (益阳专区; 'Yiyang Special Administrative Region' ) అధికార పరిధిలోకి వచ్చింది. 1952 నుండి నవంబర్ 1962 వరకు, నింగ్‌క్సియాంగ్, జియాంగ్‌టాన్ జువాన్ (湘潭专区; 'Xiangtan Special Administrative Region' ) పరిధి లోను , ఆపై జూన్ 1983 వరకు యియాంగ్ జువాన్ కు చెందినదిగానే ఉన్నా కౌంటీ మాత్రం చాంగ్షా అధికార పరిధిలో ఉండేది. [7]
2017లో, నింగ్‌క్సియాంగ్ ను కౌంటీ- స్థాయి నగరంగా పై హోదాకు మార్చారు. [8] [9]
పరిపాలనా విభాగం
[మార్చు]2015, నవంబర్ 19న నింగ్‌క్సియాంగ్ కౌంటీ, టౌన్షిప్ స్థాయి పరిపాలనా విభాగాల సర్దుబాటు ఫలితంగా, [4] [10] ఫెంగ్ ముకియావో (Fengmuqiao)టౌన్షిప్, క్సిఎలెకియవో (Xieleqiao) పట్టణాలు హుటాంగ్ (Huitang) పట్టణంలోను, నాంటియాన్పింగ్ (Nantianping) టౌన్షిప్ బటాంగ్ (Batang) పట్టణంలోను , జులియాంగ్కియావో(Zhuliangqiao) టౌన్షిప్ షుయాంగ్జియాంగ్కౌ(Shuangjiangkou) పట్టణంలోను విలీనం అయ్యాయి. నింగ్‌క్సియాంగ్ కౌంటీ అధికార పరిధిలోకి 4 టౌన్‌షిప్‌లు, 21 పట్టణాలు ఇంకా 4 ఉప జిల్లాలు వచ్చాయి.
పేరు | చైనీస్ లిపి | జనాభా (2005) | విస్తీర్ణం (కి.మీ.² ) | నోట్ |
---|---|---|---|---|
కింగ్స్హాన్కియవో | 青山桥镇 | 49,000 | 71.8 | |
లివుస్హాహే (Liushahe) | 流沙河镇 | 69,000 | 140.57 | |
యుటాన్ సబ్ డిస్ట్రిక్ట్ (Yutan Subdistrict) | 玉潭街道 | 200,000 | 20 | |
డావోలిన్ (Daolin) | 道林镇 | 56,000 | 135 | |
హుయమింగ్లవ్ (Huaminglou) | 花明楼镇 | 51,000 | 112.4 | |
డాన్గ్హుటాన్గ్ (Donghutang) | 东湖塘镇 | 47,000 | 138 | |
క్సియాడుఓపు ( Xiaduopu) | 夏铎铺镇 | 37,000 | 103.4 | |
క్సిఎలెకియవో (Xieleqiao) | 偕乐桥镇 | 21,000 | 72.5 | |
షుయంగ్ఫుపు (Shuangfupu) | 双凫铺镇 | 47,000 | 62.9 | |
మెయ్టాన్బ(Meitanba) | 煤炭坝镇 | 53,000 | 73.4 | |
బటాంగ్ (Batang) | 坝塘镇 | 41,000 | 107 | |
హుయ్ టన్గ్ (Hui tang) | 灰汤镇 | 23,000 | 43 | |
షుయంగ్జియాంగ్కౌ (Shuangjiangkou) | 双江口镇 | 38,000 | 89.5 | |
లావ్లియాంగ్కాంగ్ (Laoliangcang) | 老粮仓镇 | 63,000 | 121.8 | |
క్సియంగ్జిక్వ్ (Xiangzikou) | 巷子口镇 | 42,000 | 105.8 | |
లాంగ్టియన్ (Longtian) | 龙田镇 | 21,000 | 72.5 | |
హెన్గ్షి (Hengshi) | 横市镇 | 50,000 | 123 | |
హుఇలోన్గ్పు(Huilongpu) | 回龙铺镇 | 37,000 | 71.8 | |
హుయంగ్కై (Huangcai) | 黄材镇 | 62,000 | 220 | |
జిన్జహౌ (Jinzhou) | 金洲镇 | 31,000 | 62.1 | |
డాచెంగ్కియవో (Dachengqiao) | 大成桥乡 | 43,000 | 106.2 | |
జహులియన్గ్కియవో (Zhuliangqiao) టౌన్ షిప్ | 朱良桥乡 | 33,000 | 82.72 | |
జింగ్హుఅపు (Jinghuapu) టౌన్ షిప్ | 菁华铺乡 | 32,000 | 65.8 | |
నాన్టియన్పింగ్ (Nantianping) టౌన్ షిప్ | 南田坪乡 | 27,000 | 64 | |
జిఫు ( Zifu) | 资福镇 | 38,000 | 87.4 | |
ఫెంగ్ముకియవో (Fengmuqiao) టౌన్ షిప్ | 枫木桥乡 | 38,000 | 72.6 | |
యుజియవో (Yujia'ao) టౌన్ షిప్ | 喻家坳乡 | 39,000 | 96.85 | |
షటియన్ (Shatian) టౌన్ షిప్ | 沙田乡 | 34,000 | 74.22 | |
బెయ్మకియావో (Baimaqiao) సబ్ డిస్ట్రిక్ట్ | 白马桥街道 | 50,000 | 22.8 | |
లీజింగ్పు(Lijingpu) సబ్ డిస్ట్రిక్ట్ | 历经铺街道 | 34,000 | 35 | |
చెంగ్జియవొ (Chengjiao) సబ్ డిస్ట్రిక్ట్ | 城郊街道 | 50,000 | 22.8 | |
వెయ్షన్(Weishan) టౌన్ షిప్ | 沩山乡 | 14,000 | 42.8 |
భౌగోళిక స్వరూపం
[మార్చు]నింగ్జియాంగ్ కౌంటీ హునాన్ ప్రావిన్స్ మధ్యలో ఉంది. కౌంటీ మొత్తం వైశాల్యం 2,903.52 చదరపు కిలోమీటర్లు (1,121.06 చ. మై.). తూర్పున వాంగ్ చెంగ్ (Wangcheng) జిల్లా, ఆగ్నేయాన జియాంగ్ టాన్ కౌంటీ (Xiangtan county) , దక్షిణాన షావోషన్(Shaoshan), క్సియాంగ్స్యంగ్ (Xiangxiang), లియాన్ యుఆన్ (Lianyuan), ఇంకా లౌడి (Loudi), పశ్చిమాన అన్హువా కౌంటీ (Anhua county), ఉత్తరాన తావోజియాంగ్(Taojiang) ఇంకా యియాంగ్ (Yiyang) కౌంటీ, నింగ్జియాంగ్ కౌంటీకి సరిహద్దులు.
వాతావరణం
[మార్చు]నింగ్జియాంగ్ కౌంటీ రుతుపవనాల ప్రభావం వల్ల తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణపు జోన్‌లో ఉంది. ఇది నాలుగు విభిన్న రుతువులతో కూడుకొని ఉంటుంది . వసంత ఋతువు ఇంకా శరదృతువుల్లో వెచ్చగాను, శీతాకాలం చల్లదనంతో కూడిన గాలులతో చల్లగాను ఉంటుంది. శీతాకాలపు ఉష్ణోగ్రతల సగటు 5 °C (41 °F). వేసవికాలం చాలా వేడిగాను, ఇంకా పొడిగాను ఉంటుంది. ఇక్కడ జూలై రోజువారీ సగటు ఉష్ణోగ్రత 29 °C (84 °F).
నదులు
[మార్చు]వీ నది నింగ్‌క్సియాంగ్ కౌంటీ గుండా ప్రవహిస్తుంది. దీనికి ఉన్న ఏడు ప్రధాన ఉపనదులు : హువాంగ్‌జువాన్ నది, డువాన్ నది, మెయి నది, టైచాంగ్ నది, యుటాంగ్ నది, చు నది ఇంకా వు నది .
జియాంగ్ నదికి ఉన్న అతిపెద్ద ఉపనదుల్లో ఒకటైన జిన్ నది నింగ్జియాంగ్ కౌంటీ గుండా జియాంగ్టాన్ వరకు ప్రవహిస్తుంది.
సరస్సులు ఇంకా రిజర్వాయర్లు
[మార్చు]హువాంగ్‌కాయ్ రిజర్వాయర్, దీనినే "కింగ్‌యాంగ్ సరస్సు" అని కూడా పిలుస్తారు. ఇది నింగ్‌క్యాంగ్ కౌంటీ కి వాయువ్య భాగంలో ఉన్న ఒక పెద్ద రిజర్వాయర్. ఇది నింగ్జియాంగ్ కౌంటీలో ఉన్న అతిపెద్ద నీటి వనరే కాకుండా నింగ్జియాంగ్ కౌంటీలోని అతిపెద్ద రిజర్వాయర్ కూడా.
టియాన్‌పింగ్ రిజర్వాయర్, దీనినే "కింగ్‌షాన్ లేక్" అని కూడా పిలుస్తారు. ఇది నింగ్‌క్సియాంగ్ కౌంటీ కి పశ్చిమ భాగంలో ఉన్న ఒక పెద్ద రిజర్వాయర్. ఇది నింగ్జియాంగ్ కౌంటీలో ఉన్న రెండవ అతిపెద్ద నీటి వనరు అలాగే నింగ్జియాంగ్ కౌంటీలోని రెండవ అతిపెద్ద రిజర్వాయర్.
నింగ్‌క్సియాంగ్ కౌంటీలో సహజ సిద్దమైన అత్యంత ఎత్తైన ప్రాంతం 1071 మీ. ల వజిజై (瓦子寨 )
ప్రభుత్వం
[మార్చు]నింగ్జియాంగ్ CPC పార్టీ ప్రస్తుత కార్యదర్శి యు జిన్ఫాన్, ఇక ప్రస్తుత మేయర్ ఫు జుమింగ్. హే యింగ్‌హుయ్ నింగ్‌క్యాంగ్ పీపుల్స్ కాంగ్రెస్‌కు ప్రస్తుత చైర్మన్, ఈ స్థాయి పార్లమెంటు అధినేతతో సమానం. నింగ్జియాంగ్ CPPCC కమిటీ ప్రస్తుత ఛైర్మన్ డెంగ్ జీపింగ్.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]నింగ్జియాంగ్ హునాన్ లోని అత్యంత అభివృద్ధి చెందిన కౌంటీలలో ఒకటి. ఇది 2020 లో చైనా లోని సమగ్ర శక్తి తో అభివృద్ధి సాధించిన 100 కౌంటీలు, కౌంటీ స్థాయి నగరాల్లో 18 వ స్థానంలో నిలిచింది. [11] ఇది ఈ ప్రావిన్స్‌లోని అభివృద్ధి చెందిన ఉత్పాదక కౌంటీలు, కౌంటీ-స్థాయి నగరాలలో ఉత్తమంగా నిలిచిన వాటిలో ఒకటి. తయారీ పరిశ్రమ దాని ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం. నింగ్జియాంగ్ యొక్క ఆర్థిక పుష్టి చోధకాలు ఆహారం ఇంకా పానీయాలు, అధునాతన పరికరాల తయారీ, నవీన సామాగ్రి, ఆధునిక సేవల పరిశ్రమ, యంత్రాల తయారీ ఇంకా వస్త్ర పరిశ్రమ . ఉదాహరణకు, 2015లో, నింగ్జియాంగ్ కౌంటీ స్థూల దేశీయోత్పత్తి CN¥ 100.22 బిలియన్లు (US$16.09 బిలియన్), ఈ మొత్తంలో, తయారీ పరిశ్రమ భాగపు విలువ CN¥61.31 బిలియన్లు (US$9.84 బిలియన్). అంటే GDP [12] లో 61.18 శాతం.
నింగ్‌క్సియాంగ్ కౌంటీలో వాంగ్‌బులియావో దుస్తులు, సన్‌డాన్స్ దుస్తులు, సింగ్‌టావో బ్రేవరీ, జియా జియా ఫుడ్ (Jiajia Food [ zh ]), ఇంకా సానీ పరిశ్రమలున్నాయి. కౌంటీ లోని తయారీ ఉత్పత్తులలో కాగితం, సాంకేతిక పరికరాలు, ఆటోమొబైల్స్, ఆహారం, దుస్తులు ఇంకా ఇతర వస్తువులు ఉన్నాయి. కౌంటీ ఆర్థిక వ్యవస్థ లోని సేవా రంగంలో బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణం, కమ్యూనికేషన్లు, విద్య, పర్యాటకం ఇంకా ప్రభుత్వం వంటి అంశాలు ఉన్నాయి. 2014లో వచ్చిన 20 మిలియన్ల మంది సందర్శకుల ఖర్చు విలువ ¥2 బిలియన్లు . నింగ్‌క్సియాంగ్ కౌంటీ ఆర్థిక వ్యవస్థలో ఈ పర్యాటకానిది కూడా పెద్ద భాగస్వామియమే.
స్టాటిస్టికల్ అథారిటీ యొక్క ప్రాథమిక అంచనాల ప్రకారం, 2017లో నింగ్‌క్సియాంగ్ సిటీ యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి 122,445 మిలియన్ యువాన్లు (18,135 మిలియన్ US డాలర్లు ), ఇది మునుపటి సంవత్సరం కంటే 10.3 శాతం పెరిగింది. ఈ మొత్తం ఆదాయంలో ప్రధామిక పరిశ్రమల వాటా 12,382 మిలియన్ యువాన్లు (1,834 మిలియన్ అమెరికన్ డాలర్లు), అంటే మునపటి కంటే 3.9 శాతం ఎక్కువ. ఇక ద్వితీయ పరిశ్రమల వాటా 80,666 మిలియన్ యువాన్లు (11,947 మిలియన్ US డాలర్లు) అంటే మునపటి కంటే10.6 శాతం ఎక్కువ. ఇక తృతీయ పరిశ్రమల వాటా 29,397 మిలియన్ యువాన్లు (4,354 మిలియన్ US డాలర్లు), గతానికంటే 12.5 శాతం పెరిగింది. ప్రాథమిక పరిశ్రమల వాటా విలువ GDPలో 10.11 శాతం; ద్వితీయ పరిశ్రమల వాటా 65.88 శాతం; ఇక తృతీయ పరిశ్రమల వాటా 24.01 శాతంగా ఉంది. 2017లో తలసరి GDP 96,118 యువాన్లు (14,236 US డాలర్లు). [13]
అభివృద్ధి జోన్
[మార్చు]నింగ్‌క్సియాంగ్ ఆర్థిక ,సాంకేతిక అభివృద్ధి మండలి (NETZ ) లో నింగ్‌క్సియాంగ్ కౌంటీ లోని చెంగ్జియావో (Chengjiao), షుయాంగ్జియాంగ్కౌ (Shuangjiangkou) ఇంకా జింగ్హుయాపు (Jinghuapu)ప్రాంతాలు ఉన్నాయి. దీనిని 1998,జనవరి 10న ప్రారంభించి తరువాత 2010, నవంబర్ 11 న రాష్ట్ర ETZ స్థాయికి పెంచటం జరిగింది. ఈ జోన్‌లోని ప్రధాన పరిశ్రమలలో ఆహారం ఇంకా పానీయం, అధునాతన మెటీరియల్, అధునాతన పరికరాల తయారీ, ఆరోగ్య ఉత్పత్తులు ఇంకా సౌందర్య సాధనాలు ఉన్నాయి . 2016 నాటికి, దీని నిర్మాణ ప్రాంతం 25 కి.మీ2 (9.7 చ. మై.). ఇక వీటి మొత్తం స్థూల ఉత్పత్తి 97.07 బిలియన్ యువాన్ల (US$14.61 బిలియన్)కి చేరుకుంది. [14]
జనాభా వివరాలు
[మార్చు]జనాభా
[మార్చు]2012 నాటికి కౌంటీ జనాభా 1,368,117గా, నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, అంచనా వేసింది.
భాష
[మార్చు]మాండరిన్ ఇక్కడి అధికారిక భాష. స్థానిక ప్రజలు చాంగ్షా, నింగ్‌క్సియాంగ్ మాండలికాలలో మాట్లాడతారు.
మతం
[మార్చు]కౌంటీ ప్రభుత్వం అన్ని మతాలకు మద్దతు ఇస్తుంది. 2015 నాటికి, నింగ్‌క్సియాంగ్ లో ఎక్కువ మంది ప్రజలు నాస్తికులు. మతాన్ని అనుసరించే వారివ అత్యధికులు చైనీస్ జానపద మతాన్ని అనుసరిస్తారు. నింగ్‌క్సియాంగ్ ప్రజలలో 3% మాత్రమే బౌద్ధులు, 1% టావోయిస్ట్‌లు ఇంకా 1% రోమన్ కాథలిక్‌లు లేదా ప్రొటెస్టంట్లు .
విద్య
[మార్చు]నింగ్‌క్సియాంగ్ కౌంటీ విద్యకు సంబంధించి తన స్వంత చట్టాలనురూపొందించుకుంది. కౌంటీ ప్రభుత్వం ప్రకారం యువత పాఠశాలకు హాజరు కావాలి. దానికి వయో పరిమితి ఆరు నుండి పదిహేను సంవత్సరాలు. కౌంటీలోని ప్రతి బిడ్డకు 9 సంవత్సరాల వరకు విద్య కు హామీ ( చైనీస్: 九年义务教育 ). కిండర్ గార్టెన్ నుండి పన్నెండవ తరగతి వరకు విద్యారతులను చేర్చుకుంటారు. వారు వేసవి ప్రారంభం అయ్యేవరకు వరకు రోజుకు సగటున ఐదు గంటలు, వారానికి ఐదు రోజులు తరగతులకు హాజరవుతారు.
ఝాన్‌జియాంగ్ సిటీ వరకు. [15] కౌంటీలోని విద్యార్థులకు అనేక స్థాయిల విద్య అందుబాటులో ఉంది. హైస్కూల్ డిప్లొమా సాధించటానికి అనేక పాఠ్యాంశాలున్నాయి. అవి :
- ప్రాథమిక పాఠశాల. ఎలిమెంటరీ స్కూల్ అంటే సాధారణంగా గ్రేడ్ 1 నుండి 6 వరకు. 7, 8 ఇంకా 9 తరగతులకు "ఎలిమెంటరీ మిడిల్ స్కూల్". నింగ్‌క్సియాంగ్ కౌంటీలో 200 కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు, ఇంకా 100 కు మించి ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. దాదాపు ప్రతి ప్రాథమిక పాఠశాల లో చైనీస్ భాష (ఇందులో చదవడం, వ్యాకరణం, కూర్పు ఇంకా సాహిత్యం ఉంటాయి), ఆంగ్ల భాష, గణితం, సైన్స్, చరిత్ర, భౌగోళిక, జీవశాస్త్రాలు, సైద్ధాంతిక ,రాజకీయ శాస్త్రాలు , కంప్యూటర్, కళ, సంగీతం ఇంకా భౌతిక విద్య.
- మాధ్యమిక పాఠశాల. సెకండరీ స్కూల్ అంటే సాధారణంగా గ్రేడ్ 10-12. ఈ గ్రేడ్‌లను "హై స్కూల్" అని పిలుస్తారు. మాధ్యమిక పాఠశాలలు విద్యనందించే విషయాలు : చైనీస్ భాష, ఆంగ్ల భాష, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, చరిత్ర, భౌగోళిక, రాజకీయ శాస్త్రాలు, కంప్యూటర్ ఇంకా భౌతిక విద్య. నింగ్‌క్సియాంగ్ కౌంటీలో 16 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]రైలు
[మార్చు]లుయోయాంగ్-జాన్‌జియాంగ్ రైల్వే, దీనిని సాధారణంగా "లుజాన్ రైల్వే" అని పిలుస్తారు. లుయోయాంగ్ సిటీ, హెనాన్ ప్రావిన్స్ నుండి, నింగ్‌క్యాంగ్ ద్వారా ఝాన్‌జియాంగ్ సిటీ, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ వరకు.
ఆగ్నేయ నింగ్జియాంగ్ లోని డాటున్యింగ్ టౌన్, డాలిన్ టౌన్ ల గుండా షాంఘై-కున్మింగ్ హై-స్పీడ్ రైల్వే సాగుతుంద. [15]
షిమెన్-చాంగ్షా రైల్వే ఈశాన్య నింగ్జియాంగ్ లోని జిన్‌జౌ టౌన్ ఇంకా చెంగ్జియావో ఉపజిల్లా మీదుగా వెళుతుంది. [15]
ఎక్స్‌ప్రెస్‌వే
[మార్చు]G5513 చాంగ్ షా -జంగ్జియాజీ (Changsha-Zhangjiajie) ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమం నుండి తూర్పు వరకు చెంగ్జియావో సబ్‌డిస్ట్రిక్ట్ ఇంకా జిన్‌జౌ టౌన్ గుండా వెళుతుంది. [15]
S71 యియాంగ్-లౌడీ-హెంగ్‌యాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే, దీనిని "యిలౌహెంగ్ ఎక్స్‌ప్రెస్‌వే" అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర-దక్షిణంగా పశ్చిమ నింగ్‌క్సియాంగ్ గుండా వెలుతూ, క్వింగ్‌షాన్‌కియావో, లియుషాహే, లావోలియాంగ్‌కాంగ్, హెంగ్షి, యుజియావో, యియాంగ్ లని S50 చంగ్షా - షాషాన్ - లౌడి (Loudi) ఎక్స్ప్రెస్వే తో క్సియాంగ్స్యంగ్ (Xiangxiang) కి చెందిన ఫాన్జియాంగ్ (Fanjiang) టౌన్ వద్ద కలుపుతుంది . [15]
S50 చంగ్షా - షాషాన్ - లౌడి (Loudi) ఎక్స్ప్రెస్వే , స్థానికంగా "చంగ్షావలవ్ (Changshaolou) ఎక్స్ప్రెస్వే" అని పిలుస్తారు, అది తూర్పు, దక్షిణ నింగ్‌క్సియాంగ్ ద్వారా ఉత్తరానికి యూఎలు(Yuelu) జిల్లా చాంగ్షానూ, పడమటివైపు లౌక్సింగ్(Loosing) జిల్లా లౌడి(Loudi)నీ చేరుతుంది. [15]
షావోషన్ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరాన డాటున్యింగ్ టౌన్ గుండా వెళుతూ హుమింగ్‌లౌ టౌన్ వద్ద S50 చాంగ్‌షా-షోషన్-లౌడీ ఎక్స్‌ప్రెస్‌వేకి కలుస్తుంది. [15]
జాతీయ రహదారి
[మార్చు]సాధారణంగా "G319"గా పిలుచుకునే జాతీయ రహదారి G319 నగరానికి తూర్పు భాగంలోని డౌన్‌టౌన్, వాణిజ్య ఇంకా పారిశ్రామిక జిల్లాల గుండా సాగే వాయువ్య-ఆగ్నేయ రహదారి. [15]
ప్రాంతీయ రహదారి
[మార్చు]ఉత్తర నింగ్‌క్సియాంగ్ లోని జింగ్‌వాపు టౌన్‌షిప్, మీటాన్‌బా టౌన్ ల గుండా ప్రావిన్షియల్ హైవే S206 వెళుతుంది. [15]
నింగ్‌క్సియాంగ్ కి తూర్పువైపున ఉన్న లిజింగ్‌పు సబ్‌డిస్ట్రిక్ట్, జియాడూపు టౌన్, బటాంగ్ టౌన్, డోంఘుటాంగ్ టౌన్, డాటున్యింగ్ టౌన్ ల గుండా ప్రావిన్షియల్ హైవే S208 ఉత్తరం నుండి దక్షిణంగా సాగుతుంది. [15]
నింగ్‌క్సియాంగ్ లోని యుటాన్ సబ్‌డిస్ట్రిక్ట్, బైమాకియావో సబ్‌డిస్ట్రిక్ట్, హుయిలాంగ్‌పు టౌన్, డాచెంగ్‌కియావో టౌన్, షువాంగ్‌ఫుపు టౌన్, హెంగ్షి టౌన్, లావోలియాంగ్‌కాంగ్ టౌన్, లివుషహే టౌన్, కిన్గ్షాన్కీయవో టౌన్ లాంటి పట్టణాలను దాటుకుంటూ అనేక ఉపజిల్లాల గుండా ఒక ప్రధాన ఈశాన్య-నైరుతి రహదారి ప్రావిన్షియల్ హైవే S209 వెళుతుంది.
ఆగ్నేయం నుండి వాయువ్యంగా నైరుతి నింగ్‌క్సియాంగ్ గుండా వెళుతూ కింగ్‌షాన్కియావో టౌన్ వద్ద ప్రావిన్షియల్ హైవే S209తో ప్రావిన్షియల్ హైవే S311,అనుసంధానం అవుతుంది . [15]
సంస్కృతి
[మార్చు]స్థానిక కళా రంగం(థియేటర్) పై హువాగుక్సీ ప్రభావం ఎక్కువ.
పర్యాటకం
[మార్చు]నింగ్‌క్సియాంగ్ కౌంటీ లో అత్యధికులు దర్శించే మియిన్(Miyin) బౌద్ధ దేవాలయం ఉంది. దీన్ని టాంగ్ రాజవంశ(907 618) కాలంలో వెయ్షన్(Weishan) టౌన్షిప్ లో నిర్మించారు. ఈ కౌంటీ లో ఇంకా పుజి(Puji) , కిన్గ్షాన్కీయవో(Qingshanqiao) టౌన్ లో షాంగ్లివ్(Shangliu ), హుఇలాంగ్(Huilong) పర్వతం పైన బైయున్( Baiyun) ఆలయాలు ఉన్నాయి.
ఇక్కడి వేడినీటి బుగ్గ హుటాంగ్ హాట్ స్ప్రింగ్ మరో ఆకర్షణ.
లియు షావోకి , క్సీజుఎజై (Xie Juezai) ,హే షుహెన్గ్ (He Shuheng) ల పూర్వ నివాసాలు నింగ్‌క్సియాంగ్ లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]నింగ్‌క్సియాంగ్ కౌంటీ ఈ క్రింది వారికి జన్మస్థలం:
- గన్ సికి (Gan Siqi) - "ఫౌండింగ్ జనరల్" ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గౌరవం పొందిన 57 మందిలో ఒకడు.(one of only 57 generals bestowed the honour of being a "founding general" of the People's Republic of China).
- హి షుహెన్గ్ (He Shuheng) - ఆధునిక చైనా శ్రామికవర్గ విప్లవ కారుడు. (a proletarian revolutionary in modern China.)
- హుయాన్గ్ యలి (Huang Yali) - 2006, సూపర్ గర్ల్ పోటీలో 6వ స్థానం సాధించిన పాప్ గాయని. (a pop singer who earned sixth place in the 2006 Super Girl contest.)
- రే హుయాన్గ్ (Ray Huang) - తన చివరి కాలంలో విశాల, స్థూల చరిత్రల ఆలోచన విధానాలతో పేరెన్నిక గన్న చరిత్ర కారుడు, తత్వ వేత్త(a historian and philosopher best known in his later years for the idea of macro-history).
- లి జెహౌ (Li Zehou) - వివేచనాత్మక చరిత్ర, తత్వ శాస్త్రాల మేధావి. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ నివాసి. (a scholar of philosophy and intellectual history who currently resides in the United States.)
- లియు షఒకి (Liu Shaoqi) - పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మాజీ అధ్యక్షుడు. అతని పూర్వ నివాస గృహం మ్యూజియంగా మారింది. (a former president of the People's Republic of China. His former residence is now a museum.)
- లియు యుయన్- పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ లాజిస్టిక్ డిపార్ట్మెంట్ కి జనరల్, రాజకీయ కమీషనర్ అయిన లియు షఒకి కుమారుడు. (Liu Yuan - one of sons of Liu Shaoqi, a general and the political commissar of the People's Liberation Army General Logistics Department.)
- లు డిపింగ్ (Lu Diping) - మిలటరీ జనరల్, రాజకీయ నాయకుడు (a military general and politician.)
- లు లి [[(Lu Li])] - 1992, బార్సిలోనా వేసవి ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన జిమ్నాస్ట్. (gymnast best known for her gold medal on the uneven bars in the 1992 Summer Olympics inBarcelona.)
- కి క్సుఎకి (Qi Xueqi) - ప్రసిద్ధ జపాన్ వ్యతిరేక రాజయ పార్టీ కోమింటాంగ్ కి కమాండర్. (a famous Anti Japanese commander of the Kuomintang (KMT).
- టాంగ్ సులాన్ (Tang Sulan) - రచయిత, రాజకీయ నాయకుడు. (a writer and politician.)
- టావో జిహియుఎ Tao Zhiyue - రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వ్యతిరేక పోరాటం చేసిన కోమింటాంగ్ కి జనరల్. (a Kuomintang general during the Second Anti-Japanese War.)
- టాంగ్ ఎన్జ్హెన్గ్ (Tong Enzheng) - పురాతత్వ, చారిత్రిక శాస్త్రవేత్త, డిజైనర్, సైన్స్ ఫిక్షన్ రచయిత.( an archaeologist, historian, designer, and science fiction author.)
- క్సియన్ జహెజున్ Xiang Zhejun - న్యాయవేత్త, ఇంటర్నేషనల్ ఫర్ మిలిటరీ ట్రిబ్యూనల్ ఫర్ ద ఫార్ ఈస్ట్ ప్రాసిక్యూటర్. ( a jurist and prosecutor at International Military Tribunal for the Far East.)
- క్సీ జుఎజై (Xie Juezai) - సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ కి మాజీ ఉప కార్యదర్శి.(former Deputy Secretary of the Central Commission for Discipline Inspection.)
- క్సీ ఫై Xie Fei - ప్రపంచ ప్రసిద్ద చైనీస్ సినిమా దర్శకుడు క్సుఏ ఉఎజై కుమారుడు.(son of Xue Juezai, a world-recognized Chinese film director.)
- యే క్సియవోవెన్ (Ye Xiaowen) - ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ రిలీజియస్ అఫ్ఫైర్స్ కి మాజీ డైరెక్టర్.(former director of the State Administration for Religious Affairs)
- జఔ గుయంగ్జహావ్ (Zhou Guangzhao) - చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కి మాజీ అద్యక్షుడు.(former President of Chinese Academy of Sciences.)
- జహౌ షుగుయంగ్ Zhou Shuguang - బ్లాగర్, చైనా అంతా తిరుగుతూ పౌరుల పట్ల జరుగుతున్న అన్యాయాలను వెలికి తీసే ప్రసిద్ధ పౌర జర్నలిస్ట్. (a blogger and citizen journalist best known for traveling around China to document injustice done to citizens.)
ఫుట్ నోట్స్
[మార్చు]
బాహ్య లింకులు
[మార్చు]మూస:County-level divisions of Hunan [[వర్గం:Coordinates on Wikidata]]
- ↑ "Archived copy" 宁乡县第六次全国人口普查主要数据公报. Ningxiang Government (in చైనీస్). 2012-08-30. Archived from the original on 2015-04-11. Retrieved 2015-04-19.
{{cite news}}
: CS1 maint: archived copy as title (link) - ↑ 宁乡县十六届人大四次会议开幕. Red.net. Changsha. 2015-01-14.
- ↑ 3.0 3.1 长沙统计年鉴2015 (in Chinese (China)). Changsha Bureau of Statistics.
- ↑ 4.0 4.1 "Archived copy" 《长沙市人民政府关于调整望城区部分乡镇区划的通知》. changshamca.gov (in Chinese (China)). 2015-11-27. Archived from the original on 2016-11-14. Retrieved 2017-01-05.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Cambridge History of Ancient China, 1999:209
- ↑ "Ruins from the Western Zhou Period, Tanheli, Ningxiang County, Hunan Province". www.china.org. Retrieved 2008-01-28.
- ↑ 7.00 7.01 7.02 7.03 7.04 7.05 7.06 7.07 7.08 7.09 7.10 7.11 Huang Haichao; Jiang Hongzhao (2002). 宁乡史地 [History and geography of Ningxiang] (in చైనీస్). Hainan: Nanfang Publishing House. ISBN 7-80660-538-X.
- ↑ 重磅!国务院批准宁乡撤县改市!. iFeng (in చైనీస్). 2017-04-12.
- ↑ Kuang Chunlin (2017-04-13). 国务院批准宁乡撤县设市 由湖南省直辖长沙市代管. rednet (in చైనీస్).
- ↑ 《湖南省民政厅关于同意宁乡县乡镇区划调整方案的批复》(湘民行发〔2015〕40号). rednet (in Chinese (China)). 2015-12-04. also see: 《长沙昨日下发通知调整乡镇行政区划 合并乡镇20个》. rednet (in Chinese (China)). 2015-12-03.
- ↑ Wang Jingdong (王敬东), ed. (10 May 2020). 百强县榜单来了!看不懂,这个经济大省竟只有三席. CCTV.COM (in చైనీస్). Retrieved 29 July 2020.
- ↑ 宁乡县2015年国民经济和社会发展统计公报 (in Chinese (China)). Ningxiang People's Government.
- ↑ According to 宁乡市2017年国民经济和社会发展统计公报 see hntj.gov (2018-04-02) or changsha.gov (2018-04-03)
- ↑ About Ningxiang ETZ - 宁乡经济技术开发区: (in Chinese (China)). Ningxiang Economic and Technological Development Zone.
- ↑ 15.00 15.01 15.02 15.03 15.04 15.05 15.06 15.07 15.08 15.09 15.10 Zhang Hong, ed. (2018). "Ningxiang" 《宁乡市》. 《中国分省系列地图册:湖南》 [Maps of Provinces in China: Hunan] (in చైనీస్). Xicheng District, Beijing: SinoMaps Press. pp. 34–35. ISBN 978-7-5031-8949-4.