Jump to content

వాడుకరి:వల్లి 123

వికీపీడియా నుండి

ఆర్. వైశాలి

[మార్చు]

ఆర్. వైశాలి(2001 జూన్ 21). భారతీయ చెస్ క్రీడాకారిణి, మహిళా గ్రాండ్ మాస్టర్ . అండర్-14 విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  బంగారు పతకాలు  సాధించింది.  ఆమె ప్రముఖ గ్రాండ్ మాస్టర్ ప్రగ్నానంద సోదరి .

వ్యక్తిగత జీవితం , నేపథ్యం

[మార్చు]

వైశాలి 21 జూన్ 2001 న భారతదేశంలోని చెన్నైలో జన్మించింది. ఆమె అనుకోకుండానే చెస్ క్రీడ పట్ల ఆకర్షితురాలయింది. ఆమె ఆరేళ్ళ వయసులో, టెలివిజన్ చూడకుండా నిరుత్సాహపరిచేందుకు ఆమె తల్లిదండ్రులు ఆమె దృష్టిని చిత్రలేఖనం, చెస్ క్రీడ పట్ల మరల్చే ప్రయత్నం చేశారు. [1]  వారి వ్యూహం ఫలించింది. కేవలం చెస్ ఆడటాన్ని ఆమె ఎంజాయ్ చెయ్యడం మాత్రమే కాదు.. అందులో అత్యుత్తమ ప్రతిభను కూడా ప్రదర్శించేది. ఆమె ప్రాక్టీస్ చేయడానికి ఇంట్లోనే మరో అద్భుతమైన చెస్ క్రీడాకారుడు సోదరుడిగా ఉండటం వల్ల ఆమె తన క్రీడా నైపుణ్యాన్ని మరింత పెంచుకునేందుకు సహాయపడింది.

2012 లో జరిగిన అండర్ -11 బాలికల జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకం సాధించింది. వైశాలికి ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం  వచ్చింది.

చెస్ ఖరీదైన క్రీడ అన్న సంగతి ఆమె కుటుంబానికి ముందే తెలుసు. చెస్ సాఫ్ట్ వేర్ల సాయంతో ఒక పద్ధతి ప్రకారం నేర్చుకునేందుకు ఆమె వద్ద ల్యాప్ టాప్ కానీ లేదా కంప్యూటర్ కానీ ఉండేది కాదు.  మొదట్లో ఆమె పుస్తకాల్లో చదివి తన క్రీడానైపుణ్యాలను పెంచుకునేది. అంతేకాదు జాతీయ స్థాయిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగే పోటీలకు ఆమెను పంపడం కూడా వైశాలి కుటుంబానికి కష్టంగా ఉండేది. [2]

   వైశాలి 2012 లో స్లోవేనియాలో జరిగిన అండర్ -12  విభాగంలో జరిగిన బాలికల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది..  తరువాత ఆమె భారత మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను గెలుచుకుంది.తన క్రీడా ప్రయాణం అంత సాఫీగా సాగిపోవడానికి కారణం తన సోదరుడు, తల్లిదండ్రులే అని వైశాలీ అంటూ ఉంటుంది.

2012లో జరిగిన అండర్-11, అండర్-13 బాలికల జాతీయ చెస్ ఛాంపియన్ షిప్‌లో వైశాలి స్వర్ణ పతకాలు సాధించింది. అదే ఏడాది జరిగిన అండర్-12 వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది.  తరువాత 2014లో అండర్ 15 విభాగంలో జరిగిన జాతీయ చెస్ ఛాంపియన్ షిప్‌లో వైశాలీ స్వర్ణ పతకం  సాధించింది. 2015-16 సంవత్సరాలలో కూడా ఆమె తన విజయపరంపరను కొనసాగించింది. జాతీయ స్థాయిలో జరిగిన జూనియర్ గరల్స్ చెస్ ఛాంపియన్ షిప్స్‌లో కూడా ఆమె బంగారు పతకాలు సాధించింది. ఆమె  వరుసగా వరల్డ్ యూత్ చెస్ చాంపియన్ షిప్, అలాగే ఆసియా చెస్ ఛాంపియన్ షిప్‌లో కూడా భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. 2015లో గ్రీస్‌లో అండర్-14 విభాగంలో జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించింది. [3]

మూలాలు:

ఆర్. వైశాలి
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుఆర్. వైశాలి
పౌరసత్వంభారతీయురాలు
జననం21 జూన్ 2001
చెన్నై, ఇండియా
క్రీడ
క్రీడచెస్
సాధించినవి, పతకాలు
జాతీయ ఫైనళ్ళు2012 లో అండర్ 11 నేషనల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం
2012 లో అండర్ 13 బాలికల జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం
2017 లో జరిగిన ఆసియా ఇండివిజువల్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం
2014 లో అండర్ 15 బాలికల జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం
జాతీయ జూనియర్ బాలికల చెస్ ఛాంపియన్‌షిప్ 2015, 2016 లో బంగారు పతకం

https://www.bbc.com/telugu/india-55817315

2. https://www.outlookindia.com/website/story/sports-news-indian-grandmaster-r-vaishali-defeats-former-world-chess-champion-antaoneta-stefanova/355391

3. https://sportstar.thehindu.com/chess/speed-chess-vaishali-online-praggnanandhaa-ushenina/article31957444.ece

  1. "ఆర్ వైశాలి: చెస్ ఆటలో మహిళా కెరటం - ISWOTY". BBC News తెలుగు. Retrieved 2021-02-18.
  2. Bose, K. S.; Sarma, R. H. (1975-10-27). "Delineation of the intimate details of the backbone conformation of pyridine nucleotide coenzymes in aqueous solution". Biochemical and Biophysical Research Communications. 66 (4): 1173–1179. doi:10.1016/0006-291x(75)90482-9. ISSN 1090-2104. PMID 2.
  3. Kumar, P. K. Ajith. "Women's Speed Chess: The Praggnanandhaa touch in R. Vaishali". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.