Jump to content

వాడుకరి:వల్లి 123/ప్రయోగశాల

వికీపీడియా నుండి

సిమ్రన్‌జిత్ కౌర్

[మార్చు]

సిమ్రన్‌జిత్ కౌర్ ( 1995 జూలై 10) పంజాబ్‌కి చెందిన ఇండియన్ అమెచ్యూర్ బాక్సర్.  2011 నుంచి భారత్‌కు ఆమె ప్రాతినిద్యం వహించింది . 2018 AIBA విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిమ్రన్‌జిత్ కాంస్య పతకం సాధించింది . భారతీయ మహిళల బాక్సింగ్ బృందంలో ఉంటూ 64 కిలోల విభాగంలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన.అహ్మెత్ కొమెర్ట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించింది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో 60 కిలోల విభాగంలో ఆమె పాల్గొన్నది [1]. [2]

వ్యక్తిగత జీవితం ,నేపథ్యం:

[మార్చు]

సిమ్రన్‌జిత్ పంజాబ్‌లోని, చకర్ గ్రామంలో , ఓ నిరు పేద  కుటుంబంలో జన్మించింది . ఆమె తల్లి జీవనోపాధి కోసం ఇరుగుపొరుగు ఇళ్లలో పని చేసేది . తండ్రి  మద్యం దుకాణంలో చిన్న ఉద్యోగం చేసేవాడు .  బాక్సింగ్ పట్ల వారి కుటుంబానికి అభిరుచి ఉండేది. అందువల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తన తోబుట్టువుల అడుగుజాడలను అనుసరించి బాక్సింగ్‌ను కొనసాగించమని సిమ్రన్‌జిత్ తల్లి ఆమెను ప్రోత్సహించేది .  సిమ్రన్‌జిత్ అక్క మరియు ఇద్దరు తమ్ముళ్ళు – బాక్సర్లు అయినప్పటికీ వారిలో ఎవరూ ఆమె స్థాయికి చేరలేకపోయారు [3]

నిజానికి ఉపాధ్యాయురాలు కావాలన్నది సిమ్రన్‌జిత్ కల. కానీ సిమ్రన్‌జిత్ తల్లి మాత్రం పట్టుబట్టి  మరీ వారి గ్రామంలో ఉన్న షేర్-ఎ-పంజాబ్ బాక్సింగ్ అకాడమీకి తీసుకువెళ్లి, ఆ క్రీడ గురించి ఆమెకు చెప్పి , ఆమెలో ప్రేరణ కల్గించేది. చివరకు తల్లి మాట విని బాక్సింగ్ నేర్చుకునేందుకు సిమ్రన్‌జిత్ అంగీకరించింది . [3]

జూలై 2018 లో సిమ్రన్‌జిత్ తన తండ్రిని కోల్పోవడం ఆమె జీవితంలో కోలుకోలేని దెబ్బ. [4]ఆమె తల్లి మాత్రం సిమ్రన్‌జిత్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేది . పేదరికం నుంచి బయట పడి  విజయవంతమైన జీవితాన్ని గడపడానికి క్రీడలే ఉత్తమ మార్గం అని సిమ్రన్‌జిత్ తల్లి నమ్మేది .

వృత్తిపరమైన జీవితం:

[మార్చు]
సిమ్రన్‌జిత్ కౌర్
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుసిమ్రన్‌జిత్ కౌర్ బాథ్
పౌరసత్వంభారతీయురాలు
జననం10 జూలై 1995
బరువులైట్ వెల్టర్ వెయిట్


64 కిలోలు / 60 కిలోలు
క్రీడ
క్రీడమహిళల  అమెచ్యూర్ బాక్సింగ్
సాధించినవి, పతకాలు
ప్రపంచస్థాయి ఫైనళ్ళుప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు

2018 న్యూ New దిల్లీలో కాంస్యం ఏసియా ఛాంపియన్‌షిప్‌లు

2019 బ్యాంకాక్‌లో రజతం

2011లో, పాటియాలాలో జరిగిన 6వ జూనియర్ విమెన్ నేషనల్ బాక్సింగ్ఛాంపియన్‌షిప్‌లో సిమ్రన్‌జిత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది . ఆ తర్వాత 2013లో 8 వ జూనియర్ విమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది .

మొదట 48 కిలోల విభాగంలో బాక్సింగ్ కెరియర్‌ను ప్రారంభించింది సిమ్రన్‌జిత్ . కాని ఆ తరువాత అధిక బరువు విభాగాలకు మారింది .

2013లో జరిగిన యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో  60 కిలోల విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించింది.

2015 లో, గువాహటిలోని  (గౌహతి) న్యూ బొంగాగావ్‌లో జరిగిన 16 వ సీనియర్ (ఎలైట్) విమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది సిమ్రన్‌జిత్ .

హరిద్వార్‌లో జరిగిన 2016 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో  బంగారు పతకం సాధించి ఉత్తమ బాక్సర్‌గా ఎంపికయ్యింది . సీనియర్ నేషనల్‌లో రజతం, ఓపెన్ నేషనల్‌లో కాంస్యం గెలుచుకుంది .  తరువాత 2017 లో కజాఖస్థాన్‌లో జరిగిన సీనియర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మరో రెండు కాంస్య పతకాలు సాధించింది .

2018 లో తన తండ్రిని కోల్పోయిన తరువాత, సిమ్రన్‌జిత్ .. టర్కీలో జరిగిన 32 వ అహ్మద్ కమెర్ట్ బాక్సింగ్ టోర్నమెంట్లో 64 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి, పతకాన్ని తన తండ్రికి అంకితం చేసింది. [5]

2018 లో జరిగిన ఏఐబిఏ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌లో బారతదేశం నుంచి పాల్గొన్న పదిమంది జట్టులో సిమ్రన్‌జిత్ ఒకరు. ఈ ఛాంపియన్ షిప్‌లో ఆమె కాంస్య పతకం కైవసం చేసుకుంది . [5]

2019 లో, ఇండోనేషియాలోని లాబున్ బాజులో జరిగిన 23 వ ప్రెసిడెంట్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆమె బంగారు పతకం సాధించింది[1]

మార్చి 2020 లో,  టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది . పంజాబ్ ప్రభుత్వం ఆమెకు నగదు బహుమతి ప్రకటించడంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. తన ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ తనకు సహయపడుతుందని సిమ్రన్‌జిత్ ఆశాభావం వ్యక్తం  చేసింది. [6]

మూలాలు:

Simranjit Kaur (boxer) English Wikipedia [1]

Ludhiana girl Simranjit Kaur wins gold at international boxing tournament[2]

ਮੁੱਕੇਬਾਜ਼ਸਿਮਰਨਜੀਤਕੌਰਦੀਮਾਂਦੀਕਹਾਣੀਜਿਸਨੇਘਰਾਂ'ਚਕੰਮਕਰਕੇਧੀਨੂੰਓਲੰਪਿਕਪਹੁੰਚਾਇਆ[3]

https://economictimes.indiatimes.com/news/sports/simranjit-kaur-wanted-to-be-a-teacher-but-her-mother-nudged-her-towards-boxing/articleshow/66756972.cms?from=mdr [4]

Pushed into boxing by her mother, Simranjit Kaur packs a punch on world championship debut [5]

Boxing federation of India [6]

https://timesofindia.indiatimes.com/sports/boxing/boxer-simranjit-kaur-finally-gets-her-due-reward-from-punjab-govt/articleshow/77873691.cms (7)

  1. 1.0 1.1 Kaur, Simranjit; Arun, Priti; Singh, Sukhwinder; Kaur, Damanjeet (2018-12). "EEG Based Decision Support System to Diagnose Adults with ADHD". 2018 IEEE Applied Signal Processing Conference (ASPCON). IEEE. doi:10.1109/aspcon.2018.8748412. ISBN 978-1-5386-6686-9. {{cite journal}}: Check date values in: |date= (help)
  2. Kaur, Simranjit; Arun, Priti; Singh, Sukhwinder; Kaur, Damanjeet (2018-12). "EEG Based Decision Support System to Diagnose Adults with ADHD". 2018 IEEE Applied Signal Processing Conference (ASPCON). IEEE. doi:10.1109/aspcon.2018.8748412. ISBN 978-1-5386-6686-9. {{cite journal}}: Check date values in: |date= (help)
  3. Chaudhary, Amit. "Simranjit Kaur wanted to be a teacher but her mother nudged her towards boxing". The Economic Times. Retrieved 2021-02-18.
  4. Siwach, Vinay. "Pushed into boxing by her mother, Simranjit Kaur packs a punch on world championship debut". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
  5. 5.0 5.1 Siwach, Vinay. "Pushed into boxing by her mother, Simranjit Kaur packs a punch on world championship debut". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
  6. Sep 1, IANS /; 2020; Ist, 18:41. "Boxer Simranjit Kaur finally gets her due reward from Punjab govt | Boxing News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)