Jump to content

వాడుకరి:శరత్ బాబు/1

వికీపీడియా నుండి

కువైట్ సిటీ ( Arabic ) కువైట్ అనేది ఆ దేశానికి రాజధాని నగరం. అతి పెద్దది కూడా. అది పెర్షియన్ గల్ఫ్‌లోని కువైట్ బే ప్రాంతానికి సంబంధించింది. దక్షిణ ఒడ్డున దేశం నడిబొడ్డున ఉంది. ఎమిరేట్ పరంగా రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగానూ ఉంటున్నది. ఇందులో కువైట్ సీఫ్ ప్యాలెస్, ప్రభుత్వ కార్యాలయాలు, పలు కార్పొరేషన్లు- బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు సైతం ఉన్నాయి.

2018 నాటికి, నగరంలో సుమారు 3 మిలియన్ల (30 లక్షల) మంది నివాసులు ఉన్నారు (ఇది దేశ జనాభాలో70 % కు పైనే). ఈ నగరానికి పరిపాలనా సంబంధ హోదా లేదు. దేశంలోని మొత్తం ఆరు గవర్నరేట్లు- నగర సముదాయంలోని కొన్ని భాగాలను కలిగి ఉన్నాయి, ఇవి అనేక ప్రాంతాలలో ఉప విభజన జరిగి ఉన్నవే. కువైట్ నగరం ప్రధానంగా అక్కడి చారిత్రాత్మక కేంద్రానికి సూచిక వంటిది.అంతేకాక, రాజధాని గవర్నరేట్‌లో ఒక భాగం. పక్కనే ఉన్న పట్టణ ప్రాంతాలతో విలీనమై ఉంది.

కువైట్ నగరం వాణిజ్య, రవాణా అవసరాలను తీర్చే సంస్థలు కొన్ని ఉన్నాయి.అవి: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం, మినా అల్-షువైక్ (షువైక్ పోర్ట్), మినా అల్ అహ్మది (అహ్మదీ పోర్ట్).

చరిత్ర

[మార్చు]

ప్రారంభ చరిత్ర

[మార్చు]

1613 వరకు పట్టణంగా ఉన్న కువైట్ ఆ తర్వాత ఒక ఆధునిక నగరంగా రూపుదిద్దుకుంది.1716లో బని ఉటబ్స్ కువైట్‌లో స్థిరపడ్డారు. వారి రాక సమయంలో, కువైట్ లో కొద్దిమంది మత్స్యకారులు నివసించేవారు.అప్పుడు అదంతా ప్రధానంగా ఒక మత్స్యకార గ్రామం .[1] పద్దెనిమిదవ శతాబ్దంలో, కువైట్ మరింత అభివృద్ధి చెందింది. భారతదేశం, మస్కట్, బాగ్దాద్ , అరేబియా మధ్య వస్తువుల రవాణాకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. [2] [3] 1700 ల మధ్యనాటికి, కువైట్ అప్పటికే పెర్షియన్ గల్ఫ్ నుంచి అలెప్పో వరకు ప్రధాన వాణిజ్య మార్గంగా స్థిరపడింది. [4]

1775-1779 మధ్య పెర్షియన్ ముట్టడి సమయంలో, ఇరాకీ వ్యాపారులు కువైట్‌లో ఆశ్రయం పొందారు. పడవల నిర్మాణంతో పాటు వాణిజ్య కార్యకలాపాల విస్తరణలో కొంత మేరకు కీలక పాత్ర పోషించారు. [5] ఫలితంగా, కువైట్ సముద్ర వాణిజ్యం విస్తరిం చింది. అదే కాలంలో బాగ్దాద్, అలెప్పో, స్మిర్నా, కాన్స్టాంటినోపుల్‌తో భారత వాణిజ్య, తదితర మార్గాలు కువైట్ వైపు మళ్లాయి.. [4] [6] ఈస్ట్ ఇండియా కంపెనీని 1792 లో కువైట్ వైపు మళ్లించారు. [7] అదే సంస్థ కువైట్, ఇండియా, ఆఫ్రికా తూర్పు తీరాల మధ్య సముద్ర మార్గాల వాణిజ్యాన్ని దక్కించుకుంది. 1779 లో పెర్షియన్ మాగీ బాస్రా నుంచి వైదొలిగిన అనంతరం,కువైట్ బాస్రా నుంచి వాణిజ్యాన్ని ఆకర్షించుకోవడం కొనసాగించింది. [8]







1990 లో కువైట్‌లో చమురు మంటలు, ఇరాక్ సైనిక దళాలు కువైట్ నుంచి వెనక్కి తగ్గిన అనంతర స్థితి.


కువైట్ ఉపగ్రహ చిత్రం


వాతావరణం

[మార్చు]
కువైట్ నగరం లోని వైమానిక దృశ్యం


శీతోష్ణస్థితి డేటా - Kuwait City
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
[ఆధారం చూపాలి]
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం


. [9]


ఇది కూడా చూడు

[మార్చు]
  • ఆసియా # కువైట్ లోని జంట పట్టణాలు; సోదర నగరాల జాబితా

ప్రస్తావనలు

[మార్చు]

  [[వర్గం:Coordinates on Wikidata]]

  1. Constancy and Change in Contemporary Kuwait City: The Socio-cultural Dimensions of the Kuwait Courtyard and Diwaniyya. 2009. p. 64. ISBN 9781109229349. {{cite book}}: |work= ignored (help)
  2. Bell, Sir Gawain (1983). Shadows on the Sand: The Memoirs of Sir Gawain Bell. C. Hurst. p. 222. ISBN 9780905838922. {{cite book}}: |work= ignored (help)
  3. ʻAlam-i Nisvāṉ – Volume 2, Issues 1–2. p. 18. Kuwait became an important trading port for import and export of goods from India, Africa and Arabia.
  4. 4.0 4.1 Constancy and Change in Contemporary Kuwait City. 2009. p. 66. ISBN 9781109229349. {{cite book}}: |work= ignored (help)
  5. Bennis, Phyllis; Moushabeck, Michel (31 December 1990). Beyond the Storm: A Gulf Crisis Reader. Olive Branch Press. pp. 42. ISBN 9780940793828. {{cite book}}: |work= ignored (help)
  6. Lauterpacht, E; Greenwood, C. J; Weller, Marc (1991). The Kuwait Crisis: Basic Documents. p. 4. ISBN 9780521463089.
  7. Constancy and Change in Contemporary Kuwait City. 2009. p. 67. ISBN 9781109229349.
  8. Thabit Abdullah (2001). Merchants, Mamluks, and Murder: The Political Economy of Trade in Eighteenth-Century Basra. p. 72. ISBN 9780791448076.
  9. 2015 FIBA Asia Championship – Kuwait Roster, FIBA.com, accessed 16 February 2016.