Jump to content

వాడుకరి:శాస్త్రి/ప్రయోగశాల1

వికీపీడియా నుండి

ర్యాలి రాజమండ్రి కి 40 కి.మి.కాకినాడ కు 74 కి.మి. అమలాపురం కి 34 కి.మి. దూరం లొ వసిష్ఠ, గౌతమి అనేగోదావరి ఉప పాయ ల మధ్య కలదు. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ఒకరికోకరు ఎదురెదురుగా ఉండడం.

స్థల పురాణం

[మార్చు]

శ్రీ మహాబాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలొ అమృతం ఉద్బవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్ధం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లొ మహాశివుడు జగన్మోహిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ పలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు.మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి అని ర్యాలి అనే పదాని అర్థం అని చెబుతారు. (ర్యాలి=పడడం)

ఆలయ నిర్మాణం

[మార్చు]

11 వ శతాబ్దం లొ ఈ ప్రాంతానికి అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేట కై వచ్చి అలసి ఒక పెద్ద పోన్న చెట్టు క్రింద సేద తీరి నిద్రపోతాడు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యెక్క మేకు క్రింద పడిన ప్రదేశం లొని భూగర్భం లొ తన క్షేత్రం ఉందని పల్కుతాడు. ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఆ ప్రదేశాన్ని త్రవ్వించగా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయట పడుతుంది. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. 1936 సంవత్సరం లొ ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి.

దేవాలయ విగ్రహాలు

[మార్చు]

5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. విగ్రహం ముందు భాగం మహావిష్ణువు పుష్ఠభాగం జగన్మోహిని ,పాదపద్మాల నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది.(విష్ణు పాద్బోవీం గంగా). శ్రీ మహావిష్ణువు తూర్పు వైపు ఉండగా ఆయనకు ఎదురుగా శ్రీ మహేశ్వరుడు పశ్చిమ ముఖమై ఉన్నాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలం చే పావనం చేయబడినందున ఇక్కడి శివలింగాన్ని ఉమా కమండలేశ్వరుడు అని పిలుస్తారు. ఈఆలయ ప్రాంగణలో శ్రీ దేవి, భూదేవి, నారదుడు, తుంభుర,రంభ,ఊర్వశి,కిన్నెర,కింపురుష,గోవర్ధనగిరిశుడై న శ్రీ కృష్ణుని, ఆదిశేషుని,గరుడుని,గంగా విగ్రహాలు చూస్తే శిల్పకళాచాతుర్యం ప్రకటితమైతుంది.

పండుగలు

[మార్చు]

జగన్మోహిని కేశవ కళ్యాణం - చైత్ర శుద్ద నవమి
శ్రీ రామ సత్యనారాయణ కళ్యాణం - విశాఖ శుద్ద ఏకాదశి
వేణు గోపాలస్వామి కళ్యాణం - జేష్ఠ శుద్ద ఏకాదశి
శ్రీ కృష్ణజన్మాష్టమి - శ్రావణ బహుళ అష్టమి
కార్తీక శుద్ద ఏకాదశి
ముక్కోటి ఏకాశి
భీష్మైకాశి
దేవినవరాత్రులు