వాడుకరి:Arjunaraoc/వికీపీడియాతో నా అనుభవాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవంబరు 7, 2014 లో యూ ట్యూబ్ లో ప్రకటితం

అందరికీ నమస్కారం నా పేరు అర్జున రావు చెవల. నేను గత కొన్ని సంవత్సరాలుగా వికీపీడియా కు సంబంధించిన సంస్థలతో పాటు నాకు సంబంధం ఉంది. వికీపీడియాలో కూడా పనిచేస్తున్నాను కొద్దిసేపు వికీపీడియా గురించి నేను చేస్తున్న పని మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలియ చేద్దామనుకుంటున్నాను.

2007 లో నేను పర్సనల్ కంప్యూటర్ పై తెలుగు తోడ్పాటు ఉన్నటువంటి లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టంను పరిశీలిస్తున్నాను అప్పుడు తెలుగు కొన్నిసార్లు కనిపించటంలో దోషాలుండేవి, అలాగే ముద్రించడంలో కొన్ని దోషాలుండేవి. ఇవన్నీ నాకు తెలిసినవి కాబట్టి ఇతరులకు తెలియచేద్దామనుకున్నాను. దానికి రకరకాల సాధనాలు ఉన్న కూడా వికీపీడియా చూడటం తటస్థించింది. అందువల్ల వికీపీడియా గురించి రాసినట్లయితే మన తెలుగు వారందరూ కూడా వీటి గురించి తెలుసుకొని తెలుగుని ఇంకా కంప్యూటర్లో ఎక్కువ వాడటానికి వీలవుతుందనిపించింది. ఆ విధంగా నేను రెడ్ హేట్ అనే వ్యాసం మొదలుపెట్టి దాన్ని రాయడం మొదలుపెట్టాను.

ఆ తర్వాత తర్వాత నాకు 2008లో వికీపీడియా స్థాపకులైన జిమ్మీ వేల్స్ ని మరియు సూ గార్డెనర్ ని కలవడం జరిగింది. బెంగళూరులోని తన మిత్రులతో కలిసి వికీపీడియా మన భారతదేశానికి ఒక వికీపీడియా లో ఒక ఆలోచనకు కార్యరూపం ఇవ్వడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత 2011 జనవరిలో ఈ సంస్థకు అనుమతి లభించింది. ఆ సంస్థకు అధ్యక్షుని హోదాలో పని చేశాను. అలా పని చేసిన తర్వాత ఈ సంస్థ కార్యకలాపాలను, అన్ని రాష్ట్రాలలోను అన్ని భాషలకు విస్తరించడం జరిగింది. 2009లో వికీపీడియా గురించి నాకు తెలిసిన తరువాత దీని గురించి అందరికీ తెలియ చెప్పటానికి ఇంజనీరింగ్ కాలేజీలలో అలాగా శిక్షణ కార్యక్రమాలు నడిపేవాడిని. అప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ప్రయోగశాలలు వుండేవి. కాని డెస్క్ టాప్ కంప్యూటర్లు మాత్రమే అవటంతో తెలుగు ఎలా టైప్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. అయినా సరే కరపత్రాలు ముద్రించి వాటిని అందరికీ పంచిపెట్టి ఏ విధంగా టైప్ చేయడం అనేది నేను నేర్పానన్నమాట. దానికి చాలా మంది ఆసక్తి కనబరిచారు.

ఆ తర్వాత వికీపీడియాలో పనిచేసే వాళ్లు చాలా తక్కువ మందిగా ఉన్నారు. వీరిని వృద్ధి చేయటానికి వికీపీడియా గురించి మరింత చెప్పటానికి ఇతర వికీపీడియన్లతో సంప్రదించి రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ వికీపీడియా లో పని చాలా చురుకుగా జరుగుతుంది. వికీపీడియాలో ప్రాజెక్టు లనేవి ఉంటాయి. వికీపీడియా చర్చలలో చాలా మంది పాల్గొంటారు. దానిలో వున్న మంచిపద్ధతులన్నీకూడా తెలుగు వికీపీడియాకు తీసుకురావాలని, ఇంటర్నెట్ రిలేచాట్లు, అలాగే ముఖాముఖి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటి ఫలితాలుగా 2013, 14 లో పెద్ద ఎత్తున హైదరాబాదులో ఒక సమావేశం, తర్వాత విజయవాడలో ఇంకొక సమావేశం దశాబ్ది ఉత్సవాలు జరపడం జరిగింది. వీటి ద్వారా మరింత మంది తెలుగు వికీపీడియాకు పరిచయమయ్యారు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి రకరకాలుగా తోడ్పడుతున్నారు.

ఈ మధ్య కాలంలో అంటే దాదాపు రెండేళ్ల కిందట ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి మార్కెట్లోకి రావడం మొదలైంది. వీటి ద్వారా మనం వికీపీడియాలో పనిచేయటం ముఖ్యంగా మన భారతీయ భాషల్లో మరి తెలుగులో పని చేయడం చాలా సులభం. ఎందుకంటే మన ఇంగ్లీష్ కీబోర్డ్ వాడే బదులుగా తెలుగు కీబోర్డే స్మార్ట్ ఫోన్ మీద కనపడుతుంది. మన తెలుగు అక్షరాలు చాలా స్పష్టంగా మనం టైప్ చేయటానికి, అలాగే తెలుగు చాలా స్పష్టంగా మనము చదువుకోవటానికి చాలా సౌకర్యంగా వుంటుంది. మీకందరికీ అనిపిస్తుంది.ఇదంతా మనం మన తీరిక సమయాల్లో చేస్తున్నాము కాని దీని వల్ల మనకి మనకి ఏమిటి లాభం అని.

వికీపీడియా లో పనిచేయటంవలన మనకి చాలా లాభాలున్నాయి. వికీపీడియా అనేది, మనకు తెలిసిన ఏదైనా కొత్త సమాచారం తెలుసుకున్న అప్పుడు అది ఇతరులకు చెప్పడానికి, దాని వనరులతో సహా చెప్పడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనం వికీపీడియాతో చేసేటప్పుడు, రకరకాల మనుషుల తోటి, రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల దేశాల నుంచి కూడా మనం సంబంధాలు పెట్టుకోగలుతాము. అలాగే మన భావప్రసరణ నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. అలాగే వికీపీడియాకు సంబంధించి పని చేసేటప్పుడు మన నాయకత్వ లక్షణాలు కూడా పెంచుకోవచ్చు. అలాగే వికీపీడియా సమావేశాలు: దేశంలో జరిగే సమావేశాలు, లేక అంతర్జాతీయంగా జరిగే సమావేశాల్లో కూడా స్కాలర్ షిఫ్స్ పొంది ఆ సమావేశాలకు హాజరు అవటం కూడా వీలవుతుందనమాట. మనం వికీపీడియాలో పని చేస్తుంటే మనం సాంకేతికంగా అభివృద్ధి చెందవచ్చు. అలాగే మన సమాచార పరంగా మనం ఏ సబ్జెక్టు చెందినవారయినా సరే, ఒక మెడిసిన్ కావచ్చు, ఒక ఇంజినీరింగ్ కావచ్చు, ఒక తెలుగు భాషకు సంబంధించినది కావచ్చు, తెలుగు సంస్కృతికి సంబంధించినది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వికీపీడియాని వాడుతుంటారు, మామూలుగా చదువుతుంటారు, చదవటమేకాదు, దానిలో వున్న సమాచారాన్ని, మన అందరం మనమే సమాచారం చేర్చగలం, సమాచారం మార్చగలం అని అందరికీ తెలియాల్సి ఉంది. మీరు అందరూ దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని అలాగే వికీపీడియా చాప్టర్ మరియు ఇతర ఇతర సంస్థలతో సభ్యత్వం తీసుకొని వికీపీడియా అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు