వాడుకరి:Ashokachit/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రజ్యోతి
రకంప్రతిదినం
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యంకె.ఎల్.ఎన్.ప్రసాద్ (తొలి దశ), ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్(మలిదశ)
ప్రచురణకర్తవేమూరి రాధాకృష్ణ
సంపాదకులుకె.శ్రీనివాస్
స్థాపించినది1960-07-01
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, 2002-10-15(కొత్త నిర్వహణ)[1]
ముద్రణ నిలిపివేసినది2000-12-30 నుండి 2002-10-14
కేంద్రంహైదరాబాద్,ఆంధ్రప్రదేశ్,ఇండియా
జాలస్థలిhttp://andhrajyothy.com

ఆంధ్రజ్యోతి [1][2] ఆంధ్రజ్యోతి ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, నాటి ఔత్సాహిక పారిశ్రామికవేత్త కేయల్ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్ తరఫున 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది.

ప్రారంభం:[మార్చు]

మొదట నార్లతో విద్వాన్ విశ్వం, నండూరి రామమోహనరావు సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత సంపాదకులుగా పనిచేసినవారిలో ముఖ్యులు నండూరి రామమోహనరావు, తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్‌గా, నండూరి రామమోహనరావు ఎడిటర్‌గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి సంపాదకత్వం స్వీకరించారు. నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత ఇనగంటి వెంకట్రావు సంపాదకులయ్యారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడింది.

పునఃప్రారంభం (2002):[మార్చు]

పాత ఆంధ్రజ్యోతిలో సీనియర్ రిపోర్టరుగా పనిచేసిన వేమూరి రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టరుగా, కె.రామచంద్రమూర్తి సంపాదకులుగా అక్టోబరు 15, 2002వ తేదీన పత్రిక తిరిగి ప్రారంభమైంది. 2008 నుండి కె.శ్రీనివాస్ సంపాదకుడిగా ఉన్నారు. కొత్త యాజమాన్యం నేతృత్వంలో ఈ పత్రికకు అనుబంధంగా ABN ఆంధ్రజ్యోతి టివి ఛానల్, ఆంధ్రజ్యోతి.కామ్ పోర్టల్, నవ్య వారపత్రిక నడుస్తున్నాయి. పాత్రికేయ రంగానికి నూతన పాత్రికేయులను అందించేందుకు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలను ఆంధ్రజ్యోతి సంస్థ నిర్వహిస్తోంది.

ఎడిషన్లు:[మార్చు]

ఆంధ్రజ్యోతి దినపత్రిక 2002లో 9 ప్రచురణ కేంద్రాలతో పునఃప్రారంభమైన తరువాత క్రమంగా 21 ప్రచురణ కేంద్రాలకు విస్తరించింది. అవి: హైదరాబాదు, మహబూబ్ నగర్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురము, కరీంనగర్, తాడేపల్లిగూడెం, వరంగల్, గుంటూరు, కర్నూలు,  నెల్లూరు, శ్రీకాకుళం, కాకినాడ, ఖమ్మం, కడప, ఒంగోలు, నల్లగొండ, నిజామాబాదు, బెంగుళూరు (కర్ణాటక), చెన్నై (తమిళనాడు) కేంద్రాల నుండి ప్రచురితమవుతోంది. ఇంకా... జిల్లాలు, జోన్లు, మండలాలలోని స్థానిక సమాచారానికి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 44 జిల్లాలతో పాటుగా తిరుపతి, విశాఖపట్టణం, విజయవాడ, అమరావతి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పట్టణాలకు ప్రత్యేకంగా టాబ్లాయిడ్లను ప్రచురిస్తున్నారు.

ప్రయాణం:[మార్చు]

తెలుగు పత్రికారంగం 21వ దశాబ్దంలోకి ప్రవేశించిన తరువాత చోటు చేసుకున్న కీలక పరిణామం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని తెలంగాణ జిల్లాలలో 'ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం'... విభజన వద్దని సీమాంధ్ర జిల్లాలలో 'సమైక్య ఉద్యమం'... ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో విభజన తథ్యమని ఆంధ్రజ్యోతి ముందుచూపుతో గ్రహించింది. సమైక్యాంధ్ర పేరిట ఉద్యమాలు చేయడానికి బదులుగా సీమాంధ్రకు ఏం కావాలో కోరి సాధించుకుంటే ప్రజలకు మేలు చేసినవారవుతారని సీమాంధ్ర ప్రాంతంలో ప్రజా ఉద్యమ నాయకత్వానికి ఆంధ్రజ్యోతి పిలుపునిచ్చింది. ఈ సమయంలో పలు సభలు, సమావేశాలను ఏర్పాటు చేసి రాష్ట్ర విభజన అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు, పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా పలు చర్చాకార్యక్రమాలను నిర్వహించింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొద్ది రోజులకే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాశారనే ఆరోపణలతో సుమారు రెండేళ్ళ పాటు ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ఏబీఎన్‌పై నిషేధం కొనసాగింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యాయపోరాటం చేసి సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఈ నిషేధాన్ని అధిగమించి తెలంగాణలోనూ తన వార్తా స్రవంతిని కొనసాగించింది.

దినపత్రికగా ఆంధ్రజ్యోతి వార్తా ప్రచురణకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలను కూడా చేపట్టింది. వ్యవసాయ రంగంలో ఒడిదుడుకుల వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకు, రోగపీడితులకు, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు పత్రిక ద్వారా ఆర్థిక సాయం చేసింది..

Audit Bureau of Certification (ABC) ప్రకారం ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక సర్క్యులేషన్ 24 శాతం మేర వేగంగా పెరుగుదలను నమోదు చేసుకుంది. 2016-18 (జనవరి నుంచి జూన్) మధ్య కాలంలోని గణాంకాలలో ఈ వృద్ధి నమోదైంది. పాఠకాదరణ  విషయానికి వస్తే 2015-17 మధ్య ఆంధ్రజ్యోతి 84 శాతం వృద్ధితో ముందడుగు వేసినట్లు Indian Readership Survey (IRS) నివేదిక ప్రస్తావించింది.

ఎడిట్ పేజీ:[మార్చు]

పత్రిక హృదయాన్ని ప్రతిబింబించే ఎడిట్ పేజీలో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై నిపుణులైన వ్యాసకర్తలతో వివిధ శీర్షికల పేరిట విశ్లేషణను అందిస్తున్నారు. వారిలో కొందరు.

రచయిత – శీర్షిక

వేమూరి రాధాకృష్ణ - కొత్త పలుకు

కె. శ్రీనివాస్ - సందర్భం

ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఎ కృష్ణారావు – ఇండియాగేట్

రాజ్‌దీప్ సర్దేశాయ్ – దీపశిఖ

భరత్ ఝన్ ఝన్ వాలా - భరత వాక్యం

వివిధ:[మార్చు]

సాహిత్యానికి అగ్రస్థానం కల్పిస్తూ ప్రతి సోమవారం 'వివిధ' పేరిట ప్రత్యేక పేజీని ఆంధ్రజ్యోతి అందిస్తోంది. సాహితీ వ్యాసాలు, సాహిత్యాంశాలపై చర్చలు, కార్యక్రమాలు, సభలు, పుస్తకావిష్కరణల వంటి పలు విషయాలపై లోతైన అంశాలకు ఈ పేజీలో చోటిస్తున్నారు.

ప్రత్యేక శీర్షికలు[మార్చు]

ఆంధ్రజ్యోతి దినపత్రిక రోజువారీగా అందించే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, సినిమా, బిజినెస్ సమాచారంతో పాటుగా సమాజంలోని విభిన్న వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా పలు ప్రత్యేక ఫీచర్ పేజీలను 'నవ్య' పేరిట అందిస్తోంది. ప్రతిరోజూ వెలువడే నవ్య ప్రధాన పేజీలో ఫ్యాషన్, సమకాలీన పరిణామాల విశేష కథనాలు, ఘనతలు సాధించిన విజేతల వివరాలు ఇలా పలు అంశాలను ప్రచురిస్తుంటారు. వీటిలో కొన్ని రోజువారీగా, మరికొన్ని వారానికొకమారు పాఠకులను అలరిస్తున్నాయి. అవి...

శీర్షిక, విశిష్టత[మార్చు]

శీర్షిక విశిష్టత
దృశ్యం: సినిమా రంగంలోని ఆసక్తికర కథనాలు, ఇంటర్వ్యూలు, సంచలన పరిణామాలతో వారానికొకరోజు దృశ్యం పేజీ ప్రచురితమవుతోంది.
స్మార్ట్ డిజిటల్ కార్యకలాపాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కంప్యూటర్స్, మొబైల్స్, సాఫ్ట్‌వేర్స్, గాడ్జెట్స్‌కు సంబంధించిన పలు కథనాలతో వారానికొకరోజు స్మార్ట్ పేజీ ప్రచురితమవుతోంది.
డాక్టర్ ఆరోగ్య పరిరక్షణకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో వైద్య రంగం పరిణామాలు, చికిత్సలు, ఫిట్‌నెస్ తదితర అంశాలతో వారానికొకరోజు డాక్టర్ పేజీ ప్రచురితమవుతోంది.
యంగ్ వివిధ రంగాలలో దూసుకెళుతున్న నేటి యువతరానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, యువతరం విజయాలు, ఫ్యాషన్ తదితర అంశాలతో వారానికొకరోజు యంగ్ పేజీ ప్రచురితమవుతోంది.
యాత్ర సువిశాల భూప్రపంచంలో ఉన్న సందర్శనీయ ప్రదేశాలను పరిచయం చేసేందుకు వారానికొకరోజు యాత్ర పేజీ ప్రచురితమవుతోంది.
నివేదన భారతీయ సమాజంలో దైవం పట్ల ఉన్న భక్తి విశ్వాసాలను స్పృశిస్తూ భిన్న మతాల వారి కోసం వారానికొకరోజు నివేదన పేజీ ప్రచురితమవుతోంది.
లిటిల్స్ బాలల కోసం వారానికొకరోజు ప్రచురించే ఈ పేజీలో విజ్ఞానదాయక అంశాలు, బాల విజేతలు, వారి మేధస్సుకు పరీక్షపెట్టే పలు పజిల్స్ వంటివి ఉంటాయి.
సకల మానవ జీవితంలోని పలు వ్యక్తిగత కోణాలను స్పర్శిస్తూ ఈ శీర్షిక రూపొందింది.
వంటలు నవ్య పేజీలలో ప్రచురించే పలు ఫీచర్లతో పాటు వంటల కోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించారు. ఇందులో పలు ప్రాంతాలలో పేరొందిన సరికొత్త రుచులను పరిచయం చేస్తుంటారు.
అనేక ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకునే వింత, విచిత్ర, వినోదాత్మక అంశాలకు చోటిస్తూ 'అనేక' పేజీ ప్రధాన సంచికలో ప్రచురితమవుతోంది.
దిక్సూచి విద్యార్థులు, ఉద్యోగార్థులకు అవసరమైన విద్య, ఉద్యోగాలు, పరీక్షల సమాచారంతో రోజువారీగా దిక్సూచి పేజీ ప్రధాన సంచికలో ప్రచురితమవుతోంది.
బిజినెస్ ప్లస్ వ్యాపార రంగంలో చోటు చేసుకుంటున్న విభిన్న పరిణామాల, సాధారణ ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రత్యేక కథనాలుగా ఇస్తూ ఈ పేజీని ప్రధాన సంచికలో ప్రచురిస్తున్నారు..


ఆదివారం ఆంధ్రజ్యోతి మేగజైన్:

ఆంధ్రజ్యోతి దినపత్రికకు అనుబంధంగా ప్రతి ఆదివారం పాఠకులకు 'ఆదివారం ఆంధ్రజ్యోతి' పేరిట మేగజైన్ అందిస్తున్నారు. వారపత్రిక మాదిరిగా ఇందులో ప్రధాన కథనంతో పాటు పలు ఫీచర్లు, విశేష కథనాలు, పిల్లల కోసం బాలజ్యోతి, ఆధ్యాత్మిక విషయాలు, కొత్త పుస్తకాలు, సినిమా అంశాలు, రాశిఫలాలు, డాక్టర్ సలహాలు ఇంకా మరెన్నో ఉంటాయి.

ఆంధ్రజ్యోతి ఆన్‌లైన్:[మార్చు]

ఆంధ్రజ్యోతి ఆన్‌లైన్ సంచిక వివిధ రూపాల్లో లభ్యమవుతున్నది. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబిఎన్ టీవీ చానెల్‌లో ప్రచురించిన, ప్రసారమైన వార్తలు, కథనాలతో పాటు రోజంతా జరిగే వార్తా విశేషాలను www.andhrajyothy.com ద్వారా ఎప్పటికప్పుడు చూడవచ్చు.

ఏ రోజుకారోజు ముద్రించే ఆంధ్రజ్యోతి పత్రికను యధాతథంగా గ్రాఫిక్ రూపంలో epaper.andhrajyothy.com ద్వారా చదువుకోవచ్చు. ఇందులోనే నవ్య వీక్లీ, ఆదివారం ఆంధ్రజ్యోతి మేగజైన్లను చదువుకోవచ్చు. పాత కాపీలు కూడా అందుబాటులో ఉంచారు. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అంధ్రజ్యోతి.కామ్‌కు అనుబంధంగా ప్రత్యేక పోర్టల్స్‌ ఉన్నాయి. విదేశాల్లోని తెలుగువారి కోసం nri.andhrajyothy.com, విద్య–కెరియర్ పట్ల ఆసక్తి ఉన్నవారికి edu.andhrajyothy.com, సాహిత్యాభిలాషుల కోసం lit.andhrajyothy.com, ఆరోగ్యం సమాచారం కోసం health.andhrajyothy.com, ఆహారప్రియులకు  http://www.andhrajyothy.com/Pages/cooking.aspx పేజీ... ఇలా ప్రత్యేక పోర్టల్స్ ఉన్నాయి.

ఆంధ్రజ్యోతి సమాచారాన్ని మొబైల్ ద్వారా అందుకోదలచినవారి కోసం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యుజర్లకు విడివిడిగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాప్ అందుబాటులో ఉంది..

జర్నలిజం కళాశాల:[మార్చు]

ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల 2002లో ప్రారంభమైంది. పాత్రికేయరంగంలోకి ప్రవేశించదలచిన యువతరానికి పత్రిక, టీవీ, వెబ్ మీడియాలలో శిక్షణనిచ్చి వారికి ఆంధ్రజ్యోతి సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు..

  1. 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 412–413.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  2. ఆంధ్రజ్యోతి