వేమూరి రాధాకృష్ణ
స్వరూపం
వేమూరి రాధాకృష్ణ | |
---|---|
జననం | వేమూరి రాధాకృష్ణ |
వృత్తి | పాత్రికేయుడు |
Notable credit(s) | ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే |
వెబ్‌సైటు | http://vemuriradhakrishna.com/ |
వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన సంపాదకులు, మేనేజింగ్ డైరెక్టర్. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో ఇతని కార్యక్రమం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మిక్కిలి ప్రాచుర్యం పొందినది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో సాధారణ విలేఖరిగా జీవితాన్ని మొదలుపెట్టి చివరికి దాని యజమాని స్థాయికి ఎదిగాడు.
నేపథ్యము
[మార్చు]ఆంధ్రజ్యోతి దినపత్రికలో విలేఖరిగా జీవితప్రస్థానాన్ని ప్రారంభించాడు. వార్తాసేకరణకు సైకిలుపై విజయవాడ నగరంలో తిరిగేవాడు. అక్కడినుండి హైదరాబాదుకు బదిలీ అయ్యారు. 1999లో ఆంధ్రజ్యోతి ఆర్థిక కారణాలతో మూతపడేంతవరకు అందులో పనిచేశాడు.
వివాదాలు
[మార్చు]- తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగేలా కథనాలను ప్రచురించారంటూ టీఆర్‌ఎస్ శాసన సభ్యులు కె.తారకరామారావు దాఖలు చేసిన కేసులో పరువునష్టం దావా కేసుల్లో వేమూరి రాధాకృష్ణ ఆగస్టు 23, 2013 శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు అక్టోబరు 18కి వాయిదావేసింది. ఈ సందర్భంగా రాధాకృష్ణకు వ్యతిరేకంగా తెలంగాణ న్యాయవాదులు నినాదాలు చేశారు. తప్పుడు కథనాలు ప్రచురించారని, వాటిపై వివరణ ఇవ్వాలంటూ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ‘త్యాగాల సెంటిమెంట్‌తో... భోగాల సెటిల్‌మెంట్’ శీర్షికన ఈఏడాది జూన్ 20న ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని ప్రచురించిందని, ఇదే విషయాన్ని ఏబీఎన్ ఛానల్ పదేపదే ప్రసారం చేసిందని, దీంతో తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని తెలిపారు. అమెరికా మంచి ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తనపై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని ఆరోపించారు. ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు[1]
- తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైందంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పూసా నరేందర్ 2010 సంవత్సరంలో కోర్టులో కేసు దాఖలు చేశాడు. దీంతో, వేమూరి రాధాకృష్ణపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది[2].ఈ కేసులో ఖమ్మం కోర్టులో హాజరైన ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) వేమూరి రాధాకృష్ణను అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి సిబ్బంది, న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు.
ఇవీ చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-25. Retrieved 2013-08-23.
- ↑ http://www.sakshi.com/news/telangana/telangana-lawyers-try-to-stop-andhra-jyothi-md-at-khammam-179944?pfrom=home-top-story
- ↑ "పాఠశాల రుణం తీర్చుకుంటా". andhrajyothy. Retrieved 2022-03-07.