Jump to content

వాడుకరి:Bvprasadtewiki/కె.వి.యస్.వర్మ

వికీపీడియా నుండి
కె.వి.యస్.వర్మ
జననంకె.వి.యస్.వర్మ
1950 అక్టోబరు, 15
భారతదేశం తూర్పు గోదావరి జిల్లా, కైకవోలు
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లువర్మ
వృత్తిసీనియర్ పాత్రికేయుడు(ఈనాదు, అంధ్రభూమి, వార్త, ఐ న్యూస్, వనిత టీవీ )
ప్రసిద్ధిరచయిత
మతంహిందు
భార్య / భర్తపూర్ణ
పిల్లలురజనీకాంత్, తేజ
తండ్రికలిదిండి రాజన్ రాజు
తల్లిసుభద్రయ్యమ్మ
పురస్కారాలు[[]], [[]]

కె.వి.యస్.వర్మ ప్రముఖ రచయిత, వ్రుత్తి రీత్యా సీనియర్ జర్నలిస్టు. పూర్తి పేరు కలిదిండి వెంకట సుబ్రహ్మణ్య వర్మ, వారి తల్లిదండ్రులు కలిదిండి రాజన్ రాజు, సుభద్రయ్యమ్మ, స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాలూకా పెనుమళ్ల, పుట్టిన ఊరు కైకవోలు, భార్య పూర్ణ, కుమారులు రజనీకాంత్, తేజ డిగ్రీ కామర్స్ చదివారు.

బాల్యం

[మార్చు]

పూర్తి పేరు కలిదిండి వెంకట సుబ్రహ్మణ్యవర్మ. మొదటి కథ ‘స్త్రీ హ్రుదయం’ ప్రముఖ రచయిత విశ్వప్రసాద్ సంపాదకత్వంలో వెలువడిన సుహాసిని మాసపత్రిక 1968 మే సంచికలో ప్రచురితమైంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం వియస్ యం కాలేజీలో పియుసి చదువుతున్నప్పుడు 17-18 ఏళ్ల వయసులో కె.వి.సుబ్రహ్మణ్య వర్మ పేరుతో ఆ కథ అచ్చయింది. ఆ తర్వాత కె.వి.యస్.వర్మగా వందకు పైగా కథలూ, అయిదు వందలకు పైగా ఫీచర్స్, నలభై పైచిలుకు కవితలూ, వందలాది సమీక్షలూ వ్యాసాలూ రాశారు. సమకాలిక సమాజాన్ని ప్రతిబింబిస్తూ, వస్తు వైవిధ్యాన్ని చూపిస్తూ బాధితుల పక్షాన నిలిచి, ఆర్థిక సుఖాన్ని అందరూ సమానంగా అనుభవించే రోజు రావాలని తన రచనలు సాగిస్తున్నారు.

వ్రుత్తి

[మార్చు]

వ్రుత్తి జర్నలిజం... ఈనాడు (13 ఏళ్లు)చీఫ్ సబ్ ఎడిటర్ గా, ఆంధ్రభూమి(2ఏళ్లు) న్యూస్ ఎడిటర్ గా, వార్త దినపత్రిక(17ఏళ్లు) డిప్యూటీ ఎడిటర్ గా, ఐ న్యూస్, వనిత టీవీల్లో(8ఏళ్లు‘ అసోసియేట్ ఎడిటర్ గా నలభై ఏళ్లకు పైగా పని చేసి, 2020లో రిటైరయ్యారు. ఆంధ్రభూమిలో కథాకళి, వార్తలో ప్రతిధ్వని కాలమ్స్ లో వారం వారం 500కు పైగా ఫీచర్స్. వార్తలో 40 మంది ప్రముఖల తొలి కథల రచన. ప్రస్తుతం మరికొన్ని ప్రముఖుల తొలి కథల పరిచయం స్వాతి మాసపత్రికలో ధారావాహకంగా ఏప్రిల్ 2022 నుంచి మొదలయ్యాయి.

రానున్న పుస్తకాలు

[మార్చు]

మూడావుల ముచ్చట్లు(ఫీచర్స్), మందు విం(చి)0దులు, ధ్వంస ద్రుశ్యం కథల సంపుటి, సుమతీ, వేమన శతలక పద్య కధలు, అలనాటి ఓ మాణిక్యం నవల, వ్యాసాలు, సమీక్షల పుస్తకం, తన పుస్తకాలపై వచ్చిన సమీక్షలపై సెబాస్ సంపుటి వగైరా.

రచనలు

[మార్చు]

ఇంత వరకూ అయిదు కథా సంపుటాలు - యుద్ధం(1984), నేను నేనే-రావిశాస్త్రికి ఆరు కథల నివాళి(1999), ఫీనిక్స్ (2000), మరొకడు, మరికొన్ని కథలు(2005), కథ మంచికి(2018) [1]వెలువడ్డాయి. ‘ఎంత గొప్పవాడివిరా‘ ఫీచర్స్(2001), కనకమహాలక్ష్మి-సింహాచలం‘ ఫీచర్స్ (2007) పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ‘మహాకవీ...చిరంజీవి మానవుడా’ శ్రీశ్రీపై రాసిన కవిత, వ్యాసాల సంపుటి(2017), ‘నువ్వే చెప్పు’ కవితా సంపుటి (2021) వెలువడ్డాయి.విపుల కథల పోటీల బహుమతి పొందిన ‘ప్రయాణం’, హిందీ, కన్నడ భాషల్లోకీ, ‘నువ్వులేని నేను ’ కథ తమిళంలోకీ, మార్గం కవిత హిందీలోకీ అనువాదం అయ్యాయి. ‘మూడావుల ముచ్చట్లు’ ఫీచర్స్, ‘మందు వి(చి)oదులు‘ కథకాని కథలు, ‘ధ్వంస ద్రుశ్యం‘ కథల సంపుటి, ‘పేరు ఒకటే, కథలు వేరు’ సినిమా వ్యాసాల పుస్తకం,సుమతీ శతక, వేమన శతక పద్య కథల సంపుటి, వార్త డైలీలో వచ్చిన 40 ప్రముఖుల తొలి కథలతోపాటు స్వాతి మంత్లీలో వస్తున్న మరికొన్ని కలిపి ఒక సంపుటి రానున్నాయి. మొదటి కథ 1968 సుహాసిని మాసపత్రిక (సుప్రసిద్ధ డిటెక్టివ్ రచయిత విశ్వ ప్రసాద్ ఎడిటర్ ) కాలేజ్ దశనుండి కథలు రాస్తున్న వర్మ తొలికథ 1966 మే సుధాగిన మునపత్రికలో అచ్చయింది. అంతే కాదు తను కథకుడిగా ఉన్న తొలి రోజులలోనే ఉత్తమ సాహిత్యానికి గీటు రాయి, గ్రేటురాయి అయిన 'సృజన' మాసపత్రికలో వర్మ కథలు ప్రచురణ పొందాయి. జన ప్రయోజన సాహిత్యానికి నిబద్ధుడైన వర్మ, ఎంతో విస్తృతంగా రాశారు. ఎంతో విశ్లేషణతో రాశారు. ఎన్నో కథలూ, కబుర్లే కాదు, కొన్ని కవితలూ, మినీ కవితలూ కూడా రాశారు. విశాఖపట్నం 'ఈనాడు' దినపత్రికలో చీఫ్ సబ్-ఎడిటర్గా బతుకుతెరువు ప్రారంభించిన వర్మ తరువాత 'ఆంధ్రభూమి' దినపత్రికలో న్యూస్ ఎడిటర్ గానూ, ఆ తరువాత 'వార్త' దినపత్రికలో డిప్యూటీ ఎడిటర్గానూ పనిచేశారు. 'వార్త' దినపత్రికలో 'అనంతం' పేరున సాహిత్య కళారంగాలపై ఓ శీర్షిక నిర్వహించారు. ఆ తరువాత 'చినుకు' మాసపత్రికలో 'ప్రతిధ్వని' పేరుతోనూ మరో శీర్షిక నిర్వహించారు. ప్రస్తుతం 'ఎన్.టి.వి గ్రూపు వనితా టీవీలో అసోసియేట్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. తినేవారు', 'తినబడేవారు'అనే రెండు వర్గాలున్నాయి. అందులో 'తినబడేవారి' గురించి రాసినందుకు శ్రీ వర్మను అభినందిస్తున్నాను" అంటూ రావిశాస్త్రి అభినందనలూ.. “వర్మకథలు చదివితే చాలా డిస్టర్బ్ అవుతాం. నేను చాలా డిస్టర్బ్ అయ్యాను... కెవియస్. వర్మ తన చుట్టూవున్న రోగిష్టిమారి సమాజాన్ని చూసి, పరిశీలించి, మతి చెడగొట్టుకుని, వ్యాకులపడి రాసి, తన వ్యాకుల పాటునంతటినీ, తన డిస్టర్బెన్స్ అంతటినీ పాఠకులకు ట్రాన్స్ఫర్ చెయ్యడంలో నూటికి నూరుపాళ్ళూ కృతకృత్యుడైనాడు" అంటూ పెద్దిభొట్ల సుబ్బరామయ్య ప్రశంసలు పొందారు

కథల సంపుటాలు

[మార్చు]
  • యుద్ధం కథల సంపుటి (1984)[2]
  • నేను నేనే కథల సంపుటి (1999- రావిశాస్త్రికి ఆరు కథల నివాళి)
  • ఫీనిక్స్ కథల సంపుటి (2000)
  • మరొకడు, మరొకొన్ని కథల సంపుటి (2005)
  • కథ మంచికి ... మినీ కథల సంపుటి(2018)[3]
  • ఫీచర్స్: ఎంత గొప్ప వాడివిరా (2001) సంపుటి
  • ఫీచర్స్: కనకమహాలక్ష్మి-సింహాచలం(2007) సంపుటి
  • మహాకవీ, చిరంజీవి మానవుడా: కవిత,వ్యాసాలు, సమీక్షల సంపుటి[4]
  • నువ్వే చెప్పు: కవితా సంపుటి(2021)[5]

మూలాలు

[మార్చు]
  1. https://anchor.fm/sudhakar-korrapati/episodes/1973-eumpfl. {{cite web}}: Missing or empty |title= (help)
  2. http://www.anandbooks.com/index.php?route=product/search&search=%E0%B0%AF%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%82%20%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%20%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%BF. {{cite web}}: Missing or empty |title= (help)
  3. https://lit.andhrajyothy.com/upcomingsahithyakaryakramalu/katha-manchiki-book-inauguration-23526. {{cite web}}: Missing or empty |title= (help)
  4. http://www.anandbooks.com/Mahakavee..-Chiranjeevi-Manavudaa..-Telugu-Book-By-KVS-Varma?tag=%E0%B0%95%E0%B1%86.%E0%B0%B5%E0%B0%BF.%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C.%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE. {{cite web}}: Missing or empty |title= (help)
  5. https://www.eenadu.net/telugu-article/sunday-magazine/book-reviews-in-eenadu-sunday-magazine/18/322000178. {{cite web}}: Missing or empty |title= (help)