వాడుకరి:C.Chandra Kanth Rao/తెవికీ కవిత
Appearance
- 2003లో తెవికీ ప్రారంభమయ్యేనయా
- వెన్న నాగార్జున దీన్ని ప్రారంభించేనయా
- చావా, వాకాలు తొలితరం సభ్యులయా
- చదువరి, వైజాలు అభివృద్ధి చేసేరయా
- శతసంఖ్య వ్యాసాలు 2005లో పూర్తయ్యేనయా
- గ్రామవ్యాసాలు వైజాబాటు ఘనతనయా
- మండల బొమ్మలు ప్రదీపు చేర్చేనయా
- బాటుతో ముఖ్య పనులు చేసింది ఇతనేనయా
- దేశభాషా వికీలలో నొకప్పుడు ప్రథమంబునయా
- హిందీ భాషావికీ మనల్ని దిగజార్చేనయా
- ప్రథమ స్థానంకై మళ్ళీ కృషి చేద్దామయా
- మనవెనకున్న వికీలపై ఒక కన్ను వేద్దామయా
- 2008 తెవికీకి స్వర్ణయుగంబునయా
- ఈనాడు పుణ్యాన ఇది సాధ్యమయ్యేనయా
- ఎందరో సభ్యులు అప్పుడు చేరారయా
- తర్వాత అందరూ కనుమరుగు అయ్యారయా
- గ్రామవ్యాసాలు తెవికీలో అతిముఖ్యమయా
- పట్టుపట్టి ఈ వ్యాసాలను పొడిగించాలయా
- ఎందరెందరికో ఇది ప్రయోజనకరమయా
- అప్పుడు తెవికీ పేరు మారుమ్రోగునయా
- పత్రికలలో మన వ్యాసాలు వచ్చాయయా
- గుర్తింపు మాత్రం మాకు ఇవ్వలేదయా
- బొమ్మలు సైతం వాడుకున్నారయా
- సున్నం మాత్రం మాకు మిగిల్చారయా
- ప్రపంచవ్యాప్తంగా సభ్యులున్నారయా
- రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారయా
- తెలుగులో వ్యాసాలు రచిస్తున్నారయా
- భాషాభిమానుల మన్ననలు పొందుతున్నారయా
- ప్రతిపేజీకి ఒక చర్చా పేజీ ఉంటుందయా
- సందేహాలుంటే అందులో రాయవచ్చునయా
- పేజీని కొత్త పేరుతో తరలించవచ్చునయా
- తొలిగింపు పని మాత్రం నిర్వాహకులదేనయా
- సభ్యుల మధ్య ఘర్షణలు మామూలేనయా
- అవి మరచి తెవికీని అభివృద్ధి చేద్దామయా
- చిన్న వ్యాసాలపై పెదపెద్ద చర్చలు వద్దయా
- చర్చలు తగ్గించి వ్యాసాలు పెద్దవి చేద్దామయా
- సినిమా వ్యాసాలపై కృషి కాసుబాబుదయా
- పురాణ వ్యాసాల ఘనత సుజాతదయా
- పుణ్యక్షేత్రాల రచనలు బ్లాగేశ్వరుడిదయా
- ఇస్లాంమత వ్యాసాలు నిసార్ భయ్యాదయా
- అధికారుల సంఖ్య నాలుగేనయా
- నిర్వాహకుల సంఖ్య పద్దెనిమిదయా
- సభ్యుల సంఖ్య వేలల్లో ఉందయా
- చురుకైన వారు మాత్రం కొందరేనయా