వాడుకరి:Chaduvari/అనాథ వ్యాసాలను చక్కదిద్దడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనాథాశ్రమం ప్రాజెక్టుకు మూలస్థానమిది. ప్రస్తుతం ఈ పేజీ ఉపయోగమేమీ లేదు. చరిత్ర పేజీలను వెనక్కి తిప్పినపుడు ఇది ఒక జ్ఞాపకాన్ని అందిస్తుంది, అంతే.



అనాథ పేజీ అంటే వికీలో మొదటి నేముస్పేసు లోని వేరే ఏ ఇతర పేజీ నుండి కూడా లింకు (ఇన్‌కమింగు లింకు) లేని పేజీ. ఈ పేజీలు All_orphaned_articles అనే వర్గంలో ఉంటాయి. వీటిని అనాథల జాబితా నుండి తీసెయ్యడం ఎలానో కింది పద్ధతి వివరిస్తుంది.

  1. ముందు, వర్గం:All_orphaned_articles పేజీకి వెళ్ళండి. అక్కడున్న ఏదో ఒక అనాథ వ్యాసాన్ని తీసుకోండి.
  2. ఉదాహరణకు అంకుల్ టామ్స్ క్యాబిన్ తీసుకోండి. ఆ పేజీని తెరవండి. ఇదొక అనాథ పేజీ. మనం దీనికి సంబంధం ఉండే మరేదైనా పేజీని తెరిచి, ఆ పేజీలో ఇక్కడికి ఒక లింకు ఇస్తే దీన్ని అనాథల జాబితా నుండి తీసెయ్యొచ్చు.
  3. దీనికి సంబంధం ఉండే పేజీలను ఎలా కనుగొనాలి?
    1. ఈ పేజీ పేరుతో వికీపీడియాలో వెతకడం
    2. ఈ పేజీ ఏ వర్గాల్లోనైతే ఉందో అదే వర్గాల్లోని ఉన్న ఇతర పేజీలను గమనించడం
    3. ఈ పేజీ విషయానికి సంబంధించిన ఇతర పేజీలు ఏమేమున్నాయో చూడడం. ఉదాహరణకు సినిమాఅ ఆయితే, నటుల పేజీల కోసం, పుస్తకం అయితే రచయిత లేదా ప్రచురణ కర్త పేజీ కోసం, యుద్ధం అయితే సంబంధిత వైరి పక్షాల కోసమూ.. ఈ విధంగా చూడవచ్చు.
    4. ఇంకా పద్ధతులునా
  4. ఇప్పుడు అంకుల్ టామ్స్ క్యాబిన్ కోసం వికీపీడియాలో వెతకండి.
    1. ఇలా వెతికేటపుడు అక్షర క్రమాన్ని మార్చి మార్చి వెతకడం కూడా చెయ్యాలి. అంటే "అంకుల్ టామ్స్ క్యాబిన్", "అంకుల్ టామ్స్ క్యాబిను", "అంకుల్ టామ్ క్యాబిన్", "అంకుల్ టామ్ క్యాబిను", "అంకుల్ టామ్" వగైరాల కోసం కూడా వెతకాలి, మనకు ఫలితాలు దొరికేదాకా. దొరుకుతాయ్, ఎక్క డో చోట దీనికి సంబంధించిన లింకులు దొరికే అవకాశాలు బానే ఉంటాయ్. ("ఎ శివతాను పిళ్ళై" అనే పేజీకి లింకు ఇద్దామని వెతికితే Sivathanu Pillai అనే పదం దొరికింది. దాఅనికి లింకిచ్చి, పనిలో పనిగా దాన్ని తెలుగులోకి లిప్యంతరీకరణం కూడా చేసాను.)
  5. దొరికేసాయ్! బానిసత్వం, ఏడు తరాలు అనే రెండు పేజీల్లో అంకుల్ టామ్స్ క్యాబిన్ ప్రస్తావన ఉంది.
  6. వీటిలో ఏదో ఒక పేజీ తెరవండి.
  7. "సవరించు" ట్యాబుకు వెళ్ళండి.
  8. "అంకుల్ టామ్స్ క్యాబిన్" అనే పద బంధం ఎక్కడుందో పట్టుకుని, దానికి అంకుల్ టామ్స్ క్యాబిన్ లింకు తగిలించెయ్యండి. అంతే!
  9. ఇప్పుడు తిరిగి అంకుల్ టామ్స్ క్యాబిన్ పేజీకి వెళ్ళి, "సవరించు" నొక్కి, అందులోని అనాథ మూసను తీసేసి, సేవు చెయ్యండి. దాని పని అయిపోయినట్లే, అది ఇక అనాథ కాదు.

పోతే, కింది పనులు కూడా చేస్తే వికీపీడియా మరింతగా సంతోషిస్తుంది (గుడ్ టు హేవ్ అన్నమాట)

  1. ప్రతిసారీ సేవు చేసేముందు ఓ రెండు ముక్కలు దిద్దుబాటు సారాంశం పడెయ్యొచ్చు.
  2. ఒకటి కంటే ఎక్కువ పేజీలనుండి లింకులు ఇవ్వవచ్చు, ఒక్కదానితోటే సరిపెట్టనక్కరలేదు.

శుభం!