వాడుకరి:Chaduvari/ఆంధ్రరాష్ట్ర ఉద్యమం గురించి
వాడుకరి:Chaduvari/నిఘంటువు పేజీలో 2005 సెప్టెంబరు 25 న చేర్చిన పాఠ్యం ఇది. ఈ పాఠ్యాన్ని అందులో చేర్చి బయటికి కనబడకుండా కామెంటు చేసిపెట్టాను. ఇప్పుడు తీసేసాను. ఆ తరువాఅత దీన్ని ప్రచురించినట్టు లేను. ఈ పాఠ్యానికి తగు మూలాలను సేకరించి సంబంధిత పేజీల్లో పెట్టాలి. ఎవరైనా పెట్టొచ్చు.
ఆంధ్ర రాష్ట్రం కొరకు సంఘర్షణ:
నేపథ్యం
[మార్చు]బ్రిటిషు పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ వివిధ ప్రాంతాల ఏలుబడిలో ఉండేది. తెలంగాణా ప్రాంతం ఇప్పటి కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో కలిసి నిజాము పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేది.
ంఅద్రాసు ప్రెసిడెన్సీలో కింది జిల్లాలి ఉండేవి. శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు.
ంఅద్రసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆసించారు. టెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – విశాలాంధ్ర - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.
బీజ దశ
[మార్చు]మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా 1912 మే లో నిడదవోలు లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిద వేసారు.
నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం 1913 మే 20న గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ విధంగా బాపట్ల సభ విశేషంగా ఇజయవంతమైంది. ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించిన చర్చలు జరిగాయి.
కాకినాడలో జరిగిన నాలుగవ ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య కలిసి భారత రాష్ట్రాల పునర్ణిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారుచేసరు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెసు వాదులకు పంచిపెట్టారు.
కాంగ్రెసుకు చేరిన ఉద్యమం
[మార్చు]1914లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశంలో మొదటి సారిగా ప్రత్యేకాంధ్ర ప్రస్తావన వచ్చింది. ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెసు విభాగం ఉంటే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని భావించి, దాని గురించి తమ వాదనను వినిపించి, దానిపై అభిప్రాయాన్ని కూడగట్టగలిగారు. ఈ సభతో ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఆంధ్ర మహాసభ నుండి, కాంగ్రెసు పార్టీ సభలోకి చేరింది. అయితే ఈ ప్రతిపాదన కాంగ్రెసు పరిశీలనకు వచ్చినా, దానిపై నిర్ణయం తీసుకోడానికి మరో నలుగేళ్ళు పట్టింది. కాంగ్రెసు పెద్దల వ్యతిరేకతను అధిగమించి, 1918 జనవరి 22 న ఆంధ్రకు ప్రత్యేకంగా కాంగ్రెసు విభాగాన్ని ఏర్పాటు చేయించడంలో ఆంధ్ర నాయకులు కృతకృత్యులయ్యారు.
చట్ట సభల్లో చర్చ
[మార్చు]1918లో ప్రత్యేకాంధ్రోద్యమం మరో మెట్టెక్కింది. Fఎబ్రూర్య్ 6 న మద్రాసు శసనసభలో భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్ర స్థాపన గురించి బి ఎన్ శర్మ ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టాడు. ఆ ప్రతిపాదన ఇది:
విభజించు, పాలించు అనే బ్రిటిషు వారి సూత్రానికి భాష ప్రాతిపదికపై ప్రజలు ఏకమవడం సహజంగానే రుచించక, ఆ ప్రతిపాదన వీగిపోయింది.
ఆంధ్రుల్లో అనైక్యత
[మార్చు]అయితే, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి రాలేదు. అభ్వృద్ధి విషయంలో కోస్తా జిల్లాల కంటే వెనకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ప్రత్యేకాంధ్ర మరింత వెనకబడి పోతుందనే ఉద్దేశ్యంతో, తమకూ ప్రత్యేక కాంగ్రెసు విభాగం కావాలనే ప్రతిపాదనను 1924 లో రాయలసీమ నాయకులు లేవదీసారు.
ఈ అపోహలకు, అనుమానాలకు తెరదించుతూ 1937 లో చారిత్రాత్మకమైన శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులో కుదిరిన ఈ ఒప్పందంతో రాయలసీమ నాయకులు సంతృప్తి చెందారు.
1939 లో కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలూ విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘం గా ఏర్పడ్డాయి. 1939 అక్టోబర్ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఆంధ్ర శసనసభ్యులను కోరింది.
స్వాతంత్ర్యం తరువాత
[మార్చు]1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చినపుడు, తమ చిరకాల వాంఛ తీరుతుందని ఆసించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు, ఉప ప్రధాని వల్లభ్‌భాయి పటేల్‌కు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది.
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన దార్ కమిషను అటువంటి రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఈ కమిషను నివేదికతో ఆందోళన చెందిన ఆంధ్రులను బుజ్జగించడానికి కాంగ్రెసు పార్టీ నాయకులు, నెహ్రూ, పటేల్, భోగరాజు పట్టాభి సీతారమయ్య లతో ఒక అనధికార సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఝె.వి.పి సంఘంగా పేరొందిన ఈ సంఘం 1949 ఏప్రిల్‌లో కాంగ్రెసు వర్కింగు కమిటీకి కింది సూచనలు చేసింది.
- భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్ళు వాయిదా వెయ్యాలి.
- కాని ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చయ్యాలి – కాని ఒక నిబంధన మీద..
- నిబంధన: మద్రాసును ఆంధ్రులు వదులుకోవాలి
మద్రాసును వదులుకొనేందుకు ఇష్టపడని ఆంధ్రుల్లో ఈ నివేదిక అలజడి సృష్టించింది.
ఈ పరిస్థితుల మధ్య అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి, కుమారస్వామి రాజా నాయకత్వంలో ఒక విభజన సంఘం ఏర్పాటయింది. ఆంధ్రుల తర్పున టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాల రెడ్డి, కళా వెంకట రావు, నీలం సంజీవ రెడ్డి ఈ సంఘంలో సభ్యులు. ఈ సంఘం ఒక నిర్దుష్ట ఒప్పందానికి రాలేకపోయింది. ప్రకాశం మిగిలిన సభ్యులతో విభేదించి, అసమ్మతి లేవనెత్తారు. ఆయన అసమ్మతిని అవకాశంగా తీసుకొని కేంద్రప్రభుత్వం మొత్తం వ్యవహారాన్నే అటకెక్కించింది.
దీనితో అసంతృప్తి చెందిన ప్రముఖ గాంధేయవాది, స్వామి సీతారాం (గొల్లపూడి సీతారామ శస్త్రి) ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. దీంతో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తరువాత, 1951 సెప్టెంబర్ 20న ఆచార్య వినోబా భావే అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించాడు. ఈ దీక్ష వలన ప్రజల్లో తమ నాయకుల పట్ల, కేంద్రప్రభుత్వం పట్ల అపనమ్మకం పెంచడం మినహా మరేమీ సాధించలేక పోయింది.
1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెసును ఓదించి, ఆంధ్రులు వారిపై గల తమ అసంతృప్తి వెలిబుచ్చారు. ంఅద్రాసు శసనసభ లో ఆంధ్ర ప్రాంతం నుండి ఉన్న 140 స్థానాలలో కాంగ్రెసు 43 మాత్రమే పొందగా, కమ్యూనిస్టులు పోటీ చేసిన 60 స్థాల్లోను 40 ని గెలుచుకున్నారు. మొత్తం శసనసభలో కాంగ్రెసు బలం 152 కాగా, కాంగ్రెసేతర సభ్యులు 164 మంది. వీరంతా ఐక్య ప్రజాస్వామ్య ఫ్రంటు గా ఏర్పడి టంగుటూరి ప్రకాశాన్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే అప్పటి గవర్నరు, రాజాజీ ని శసన మండలికి నామినేట్ చేసి, మంత్రివర్గ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాడు.
రాజాజీ మిఖ్యమంత్రి అయ్యాక, కృష్ణా-పెన్నా ప్రాజెక్టు కట్టి, కృష్ణా నీళ్ళను తమిళ ప్రాంతాలకు మళ్ళించే ఆలోచన చేసాడు. ఆ ప్రాజెక్టు కడితే తమ నోట మన్నే అని గ్రహించిన ఆంధ్రులు ఆందోళన చేసారు. సమస్య పరిశీలనకై కేంద్రప్రభుత్వం ఎ.ఎన్ ఖోస్లా నాయకత్వంలో ఒక నిపుణుల సంఘాన్ని నియమించింది. ప్రాజెక్టును ప్రతిపాదిత స్థలంలో కట్టకూడదనీ, నందికొండ (ఇప్పటి నాగార్జున సాగర్ ఉన్న ప్రదేశం) వద్ద కట్టాలనీ ఈ కమిటీ సూచించింది. రాజాజీ ప్రభుత్వం తమపై సవతి ప్రేమ చూపిస్తున్నదనే ఆంధ్రుల భావన మరింత బలపడింది. ంఅద్రాసు రాష్ట్రం నుండి వేరు పడాలనే ఆంధ్రుల భావన మరింత బలపడసాగింది.
ఈ సమయంలో 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు అనే గాంధేయవాది, ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపినా, కాంగ్రెసు నాయకులు, కేంద్రప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 1952 డిసెంబర్ 15న 56 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు. ఆఅయన మృతి ఆంధ్రుల్లో ఉద్రిక్తత రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్‌సభలో 1952 డిసెంబర్15న ప్రకటించాడు. 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయి.
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్.ఎస్ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రష్ట్రంలో కలిపేసారు.
1937 నాటి శ్రి బాగ్ ఒడంబడిక ననుసరించి ఖొత్త రాష్ట్రానికి కర్నూలు ముఖ్యపట్టణం అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యడు. సి ఎం త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం కొంత ఫలించింది. ఇక తెలుగు మాట్లాడే మిగత ప్రాంతాలైన నైజాముతో కలిపి విశాలాంధ్ర ఏర్పడటమే తరువాయి.
హైదరాబాదుపై పోలీసు చర్య
[మార్చు]1946 1948ల మధ్య హైదరాబాదు రాష్ట్రమ్ళొ నెలకొన్న పరిస్థితుల పట్ల ఆంధ్రులు కలత చెందారు. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆసిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాము ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖసిం రజ్వి ద్వారా దీన్ని సాధించాలని నిజాము ప్రయత్నించాడు.
రాష్ట్రానికి చెందిన అధిక శతం ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలని ఉద్యమం మొదలుపెట్టారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రెసు నాయకులు ఉద్యమంలో పాలుపంచుకునారు. రాష్ట్ర కాంగ్రెసును నిజాము నిషేధించడం చేత, ఈ నాయకులు విజయవాడ, బొంబాయి వంటి ప్రదేశాల నుండి ఉద్యమాన్ని నడిపించారు. రజాకార్ల దాడులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టులు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసారు.
భారత ప్రభుత్వానికి నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు. ంఅజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మరియు రాజాకార్ల కార్య కలాపాలు శాంతికి, సామరస్యానికి భంగకరంగా తయారయ్యాయి. వాస్తవ పరిస్థితిని నిజాముకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, 1947 నవంబర్ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. విదేశాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి, హైదరాబాదుకు దొంగతనంగా తరలించే సమయం పొందడమే ఈ ఒప్పందంతో నిజాము ఉద్దేశ్యం. ఈలోగా పరిస్థితిని ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా సమితికి నివేదించడానికి నిజాము ఒక బృందాన్ని పంపించాడు.
ణిజాము చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం ఐదు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది. 1949 సెప్టెంబర్ 18న నిజాము లొంగిపోయాడు. ఆతని ప్రధానమంత్రి మీర్ లయిక్ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖసిం రజ్వీ అరెస్టయ్యారు.
సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భరతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించారు. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నారు. 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి ని ముఖ్యమంత్రి అయ్యాడు, నిజామును రాజ్ ప్రముఖ్ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణా రావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ
[మార్చు]1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై వత్తిడి పెరిగింది. హైదరాబాదు ప్రజలు తమ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విడగొట్టాలని కోరుతుండంతో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ కలిపి విశాలాంధ్ర స్వప్నం నిజమయే రోజు దగ్గరపడింది. ఒరిస్సా, మధ్య ప్రదేశ్, మైసూరు, మద్రాసు రాష్ట్రాలలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో విశాలాంధ్ర ఏర్పడాలని ఆంధ్రులంతా ఆసించారు.
1953 డిసెంబర్ లో సయ్యద్ ఫజల్ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటునులోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. దీని నివేదిక తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శసనసభలో అధిక శతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు.
కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్ధించి, ఆంధ్ర తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. ఒప్పందం లోని నియమాలు ఇలా ఉన్నాయి:
- తెలంగాణా సర్వతోముఖాభివృద్ధి కొరకు ప్రాంతీయ మండలి ఏర్పాటు చెయ్యాలి.
- ఏకీకృత రాష్ట్రానికి ఆంధ్ర ప్రదేశ్ అని పేరు ఉంటుంది, హైదరాబాదు దీనికి రాజధాని.
1956 నవంబర్ 1న నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించింది. నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న రామకృష్ణా రావుకు కేరళ గవర్నరు పదవి లభించింది. సి.ఎం. త్రివేది ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు అయ్యాడు.
- తరువాతి కాలంలో మరో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆవి: 1970 లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979 లో విజయనగరం జిల్లా. వీటితో కలిపి మొతం 23 జిల్లాలయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి అయిన సంజీవ రెడ్డి, అఖిల భారత కాంగ్రెసు కమిటీ కి అధ్యక్షుడవడంతో 1960 జూన్ 10న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు. తరువాత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. 1962 సార్వత్రిక ఎన్నికల తరువాత సంజీవ రెడ్డి మళ్ళీ 1962 మార్చి 12న ముఖ్యమంత్రి అయ్యడు. కర్నూలు రవణ వ్యవస్థ జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో, నైతిక బాధ్యత వహిస్తూ 1964 లో ఆయన రాజీనామా చేసాడు. ఆయన తరువాత కాసు బ్రహ్మానంద రెడ్డి 1964 ఫిబ్రవరి 29న ముఖ్యమంత్రి అయ్యాడు. ఏడునరేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడాయన. ఆయన కాలంలోనే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వచ్చింది.
1969, 1972 ల నాటి రాజకీయ ఉద్యమాలు
[మార్చు]1969, 1972 సంవత్సరాల్లో ఆంధ్ర ప్రదేశ్ రెండు రాజకీయ ఉద్యమాలతో అట్టుడికి పోయింది. ఆవి తెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాలు. రాష్ట్రం ఏర్పాటుకు దోహదపడిన పెద్దమనుషుల ఒప్పందాన్ని అతిక్రమించారన్న భావనతో 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొదలైంది
కోస్తా ప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చి స్థిరపడటంతో సామాజికంగా ఉద్రిక్తత ఏర్పడింది. వారు తమను అణగదొక్కుతున్నారనే భావన తెలంగాణా అధికారుల్లో, నిరుద్యోగ యువతలో కలిగింది. పెద్దమనుషుల ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలుపరచాలని జనవరి 1969 లో ఖమ్మంలో ఒక విద్యార్ధి నిరాహార దీక్ష చేపట్టడంతో వారిలోని అసంతృప్తి బయటపడింది. కాలం గడిచే కొద్దీ ఉద్యమం హైదరాబాదుకూ, తెలంగాణా లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఒప్పందంలోని అంశాలను అమలు పరచాలనేది ఉద్యమం ప్రారంభ లక్ష్యమైనా తరువాత అది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గా రూపు దిద్దుకుంది.
తెలంగాణ ప్రాంత శసనసభ్యులు ఉద్యమాన్ని సమర్ధించడంతో ఆందోళన కొత్త మలుపు తిరిగింది. డా. ంఅర్రి చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితి పేరిట సంస్థను ఏర్పాటు చేసి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. నవంబర్ 1969 నాటికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మద్దతు ఉద్యమానికి లేదని తెలుసుకున్న శసనసభ్యులు కొందరు బయటికి రావడంతో సమితిలో చీలిక వచ్చింది. ఉద్యమం నిదానంగా చల్లబడింది. సెప్టెంబర్ 1971 లో బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చెయ్యడంతో 1971 సెప్టెంబర్ 30న పి.వి.నరసింహా రావు తెలంగాణా ప్రాంతం నుండి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేసి, దాని సభ్యులు కాంగ్రెసులో తిరిగి చేరిపోయారు.
1972లో ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర పేరుతో ఒక ఉద్యమం మొదలైంది ముల్కీ సమస్య ఈ ఉద్యమానికి మూల కారణం. ముల్కీ సమస్యకు చాలా చరిత్ర ఉన్నది. 1919లో నిజాము జరీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం – హైదరాబాదు రాష్ట్రంలో ముల్కీ లకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశం ఉంటుంది. ముల్కీ ని ఇలా నిర్వచించారు: హైదరాబాదు రాష్ట్రం లో జన్మించిన వారు, లేదా రాష్ట్రంలో వరుసగా 15 సంవత్సరాలుగా నివసిస్తూ, తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళమని అఫిడవిట్టును ఇచ్చిన వారిని ముల్కీ అంటారు. ఆ కాలం నాటి ఆ చట్టం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక కూడా, తెలంగాణాలో ఇది అమలవుతూనే ఉంది. ఇతర ప్రాంతాల ప్రజలు దీన్ని కోర్టులో సవాలు చెయ్యడంతో హై కోర్టు నాలుగు-ఒకటి ఆధిక్యతతో ముల్కీ వ్యవస్థను రద్దు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీలు చెయ్యగా, ముల్కీ వ్యవస్థను పునరుద్ధరిస్తూ 1972 అక్టోబర్ 3న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు రాష్ట్రంలో కల్లోలం సృష్టించింది. తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ స్థాయి పౌరుల మయ్యామనే భావన కలిగింది. విడిపోతేనే తమ పరువు నిలబడుతుందని భావించి జై ఆంధ్ర ఉద్యమం మొదలుపెట్టారు.
ఉద్యమం కొనసాగడంతో 1973 జనవరి 10న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్రప్రభుత్వ జోక్యంతో ఉద్యమానికి ఒక రాజకీయ ప్రైష్కారం లభించింది. రెండు ప్రాంతాల నాయకులకు మష్య ఆరు సూత్రాలతో ఒక ఒప్పందం కుదిరింది. ఆ సూత్రాలివి:
- ముల్కీ వ్యవస్థ, తెలంగాణా ప్రాంతీయ కమిటీల రద్దు
- హైదరాబాదులో కేంద్ర విశ్వవిద్యలయం ఏర్పాటు
1973 డిసెంబర్ 10న రాష్ట్రపతి పాలన ఎత్తివేసి, జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ప్రజాప్రభుత్వం ఏర్పడింది. దీనితో రాష్ట్రంలో శాంతి స్థాపన జరిగి రాజకీయ స్థిరత్వం ఏర్పడింది. 1978 ఫిబ్రవరిలో శసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు గెలిచి, చెన్నారెడ్డి ఆరవ ముఖ్యమంత్రిగా మార్చి 6న ప్రమాణ స్వీకారం చేసాడు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తెరమరుగయ్యిందని ఆయన ప్రకటించాడు. పార్టిలోని అంతర్గత కలహాల కారణంగా ఆయన రాజీనామా చెయ్యడంతో 1980లో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. పదహారు నెలల తరువాత 1982 ఫిబ్రవరిలో ఆయనను తొలగించి భవనం వెంకట్రాం ను ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెసు అధిష్ఠానం. కొద్ది నెలల్లోనే ఆయన్నూ తొలగించి కోట్ల విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసారు. ఈ విధంగా నాలుగేళ్ళలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు.
పదే పదే ముఖ్యమంత్రులను మార్చడం ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. అదే సమయంలో సినిమాల్లో నటన ద్వారా అశేష ప్రజాభిమానం సంపాదించిన నందమూరి తారక రామారావు 1982 మే లో తెలుగు దేశం పెరుతో పార్టీ పెట్టి ఆంధ్రుల ఆత్మాభిమానం నిలబెట్టుతాననే అంశంతో ప్రజల్లోకి వెళ్ళాడు. కాంగ్రెసుతో విసిగిపోయి ఉన్న ప్రజలు, రామారావు కు 1983 ఎన్నికలలో పట్టం గట్టారు. ముఖ్యమంత్రి అయిన సంవత్సరం లోనే నాదెండ్ల భాస్కర రావు అప్పటి గవర్నరు రాంలాల్ సాయంతో శసనసభ్యుల సంఖ్యను తప్పుగా చూపి రామారావును గద్దె దింపి తాను ముఖ్జ్యమంత్రి అయ్యాడు. కాని ఖచ్చితంగ నెల రోజులలోనే శసనసభ్యుల మద్దతు సమీకరించుకోలేక, సర్వత్రా వచ్చిన విమర్శల నేపథ్యంలో భాస్కర రావు తొలగిపోయాడు. రామారావు మళ్ళీ ముఖ్యమంత్రిగా 1984 సెప్టెంబర్ 16న ప్రమాణ స్వీకారం చేసాడు. 1985లో మధ్యంతర ఎన్నికలు జరిపించి, అత్యధిక స్థానాలు పొంది తనకు ప్రజా మద్దతు ఉందని నిరూపించుకున్నాడు రామారావు.
రామారావు యొక్క కొన్ని విధానాలు నచ్చని ప్రజలు 1989ం ఎన్నికలలో ఓదించి మళ్ళీ కాంగ్రెసును గెలిపించారు. తరువాతి ఐదేళ్ళలో ముగ్గురు ముఖ్యమంత్రులను కాంగ్రెసు నియమించింది. వారు: చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి. తరువాత 1994 లో జరిగిన ఎన్నికలలో కంరెసును ఓదించి, మళ్ళీ రామారావును గద్దెనెక్కించారు. 1995లో రామారావుకు స్వయానా అల్లుడు, మంత్రీ అయిన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కే చెందిన అత్యధిక శసనసభ్యుల మద్దతుతో రామారావును తొలగించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు.
ప్రాచీన చరిత్ర ( - క్రీ.శ. 7 వ శతాబ్దం వరకు)
మధ్య యుగం (8 వ శతాబ్దం నుండి 18 వ శతాబ్దం వరకు)
ఆధునిక చరిత్ర (19 వ శతాబ్దం - )
ఆంధ్ర మహాసభ శ్రీ బాగ్ ఒడంబడిక పెద్దమనుషుల ఒప్పందం ముల్కీ వ్యవస్థ తెలంగాణ ఉద్యమం 1969 జై ఆంధ్ర ఉద్యమం తెలంగాణ విముక్తి పోరాటం