వాడుకరి:Chaduvari/ఇతర భాషల వికీలు
స్వరూపం
వివిధ భారతీయ భాషల వికీపీడియాల మధ్య పోలికలను వివరిస్తూ ఒకపేజీ తయారు చెయ్యాలనే సంకల్పం ఇది. కానీ ఎదుగూ బొదుగూ లేకుండా ఆగిపోయింది. ఇక ఈ పేజీకి ఇంతటితో స్వస్తి. ఇకపై ఈ విషయంపై చేసే చేర్పులన్నీ వికీపీడియా గణాంకాల పేజీల్లోనే నేరుగా చేరుస్తాను.
తెలుగు హిందీ వికీల గణాంకాలను పోల్చి చూస్తే ఒక విషయాన్ని గమనించాను. ఈ గణాంకాలను 2019 ఏప్రిల్ 19 న సేకరించాను
మొత్తం పేజీల సంఖ్య నిష్పత్తి
అంశం | తెలుగు | హిందీ | తెలుగు కంటే హిందీ ఎంత శాతం |
---|---|---|---|
మొత్తం విజ్ఞాన సర్వస్వ పేజీలు | 70,709 | 1,30,605 | తెలుగు కంటే 84% ఎక్కువ |
విజ్ఞాన సర్వస్వ పేజీల్లోని మొత్తం పదాల సంఖ్య | 3,51,43,448 | 3,90,55,554 | తెలుగు కంటే 11% ఎక్కువ |
పై అంకెలను బట్టి చూస్తే హిందీలో మొలకలు ఎక్కువగా ఉన్నట్టు గమనించాను. ఈ మొత్తం పదాల సంఖ్య బెంగాలీ, తమిళ, కన్నడ, మలయాళ వికీల కంటే తెలుగులోనే ఎక్కువ!
హిందీలో మొలక పేజీల గురించిన కొంత సమాచారం ఇక్కడ:
హిందీ వికీలో మొలకలు:
- श्रेणी:सभी_आधार_लेख - మొత్తం 43,723 పేజీలున్నాయి. (ఈ పేజీల్లో आधार అనే మూస ఉంది)
- श्रेणी:आधार మొత్తం 17,904 పేజీలున్నాయి. (ఈ పేజీల్లో आधार అనే మూస ఉంది) ( ఈ పేజీలు పై వర్గంలో కూడా ఉండి ఉండవచ్చు)
- श्रेणी:भारत_के_गाँव_आधार - మొత్తం 18,693 పేజీలున్నాయి (ఈ పేజీల్లో भारत के गाँव आधार అనే మూస ఉంది)
ఇవి కాక ఆఫ్రికా ఆధార్ వంటి మొలక వర్గాలు కూడా చాలానే ఉన్నాయి. 1,3 వర్గాలను మాత్రమే తీసుకుంటే హిందీలో 62 వేలకు పైనే మొలకలు ఉన్నట్టు తెలుస్తోంది.