Jump to content

వాడుకరి:Chaduvari/sandbox2

వికీపీడియా నుండి

క్రొత్త వాడుకరి స్వాగత సర్వే గోప్యత ప్రకటన

[మార్చు]

ఈ ప్రకటన వికీమీడియా సర్వేలో పాల్గొనేవారి నుండి మేము అందుకున్న సమాచారాన్ని ఎలా, ఎప్పుడు సేకరిస్తామో, ఉపయోగిస్తామో, పంచుకుంటామో తెలియజేస్తుంది. ఈ గోప్యతా ప్రకటన యొక్క అసలు ఆంగ్ల మూలానికి, అనువాదానికీ మధ్య అర్థంలో గాని, లేదా వ్యాఖ్యానంలో గానీ ఏవైనా తేడాలు ఉంటే, ఆంగ్ల మూలానికే ప్రాధాన్యత లభిస్తుంది.

సర్వే ఉద్దేశ్యం

[మార్చు]

మీ సూచనలు, అభిప్రాయాలకు మేం కృతజ్ఞులం! క్రొత్త వినియోగదారులు వికీపీడియాలో ఏం సాధించటానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి, వారికి తగిన సహాయం అందించడానికీ, వారి అభిప్రాయాలను సూచనలనూ పరిగణించి క్రొత్త విశేషాలను రూపొందించడానికీ ఈ సర్వే మాకు సహాయపడుతుంది.

ఏ సమాచారాన్ని సేకరిస్తాం

[మార్చు]

ఈ సర్వే మేం అడిగిన ప్రశ్నలకు మీ సమాధానాలను సేకరిస్తుంది; ఇందులో రెండు రకాల సమాధానాలు ఉన్నాయి: ముందే నిర్వచించిన స్పందనలు, స్వేచ్ఛా స్పందనలు. మేము మీ వాడుకరిపేరును, మీరు ఉపయోగిస్తున్న వికీపీడియా భాషనూ ఆటోమాటిగ్గా సేకరిస్తాం. మీ ఈమెయిలు చిరునామాను ఇవ్వాలని మీరు ఎంచుకుంటే, అది మీ ఖాతా అభిరుచులలో చేరుస్తాం. అంతేగానీ ఈ సర్వేకు మీరిచ్చే సమాధానాలతో కలిపి దాన్ని నిల్వ చేయం.

సమాచారాన్ని పంచుకోవడం, వెల్లడి

[మార్చు]

ఈ సర్వే ఫలితాలు ఈ క్రింది విధంగా బహిరంగంగా పంచుకుంటాం. ముందే నిర్వచించిన స్పందన ప్రశ్నల గురించి మొత్తం డేటాను, స్వేచ్ఛా స్పందన ప్రశ్నలకు అనామక ముడి సమాధానాల నమూనాను మీడియావికీ.ఆర్గ్‌లో ప్రచురిస్తాం. ఈ కారణం వలన, ఏదైనా స్వేచ్ఛా స్పందన ప్రశ్నలకు మీరిచ్చే సమాధానంలో మీ అసలు పేరు, వాడుకరిపేరు, ఈమెయిలు చిరునామా, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వవద్దని గట్టిగా సూచిస్తున్నాం. దిద్దుబాటు గురించి సహాయం కోసం సంప్రదించాలని మీరు ఎంచుకుంటే, వికీమీడియా ఫౌండేషన్ దాని కోసం మాత్రం ఈమెయిలు ద్వారా మిమ్మల్ని సంప్రదించవచ్చు.

ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయాల్సిన వికీమీడియా సిబ్బంది, కాంట్రాక్టర్లు, వాలంటీర్లకు మాత్రమే ముడి డేటాను అందజేస్తాం. వీరంతా సమాచారాన్ని బహిర్గతం చేయకూడని ఒప్పందాలకు లోబడి ఉంటారు. దిగువ వివరించిన పరిస్థితులు ఇందుకు మినహాయింపు.

చట్టరీత్యా అవసరమైనప్పుడు, మీ అనుమతి ఉన్నప్పుడు, మా హక్కులను, గోప్యతను, భద్రతను, వినియోగదారులను, సాధారణ ప్రజలనూ రక్షించవలసి వచ్చినపుడు, మా వినియోగ నిబంధనలను గాని లేదా మరే ఇతర వికీమీడియా విధానాన్ని గానీ అమలు చేయవలసి వచ్చినపుడు సేకరించిన సమాచారాన్ని మేము బహిర్గతం చేయవచ్చు.

సర్వే స్పందనల లైసెన్సింగు

[మార్చు]

స్వేచ్ఛా స్పందన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారంటే దానర్థం, మేము మీ సమాధానాలను రికార్డు చేయవచ్చని మీరు అంగీకరిస్తున్నట్లు, క్రియేటివ్ కామన్స్ జీరో 1.0 నిబంధనల ప్రకారం వాటిని పబ్లిక్ డొమైన్‌ లోకి విరాళంగా ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు. (పూర్తి పాఠాన్ని https://creativecommons.org/publicdomain/zero/1.0/ వద్ద చూడవచ్చు).

ముఖ్యమైన సమాచారం

[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్ అనేది స్వేచ్ఛా బహిరంగ జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్న ప్రపంచ సంస్థ. మీ ప్రతిస్పందనను సమర్పించే క్రమంలో, వికీమీడియా ఫౌండేషన్‌కు బదిలీ చేయబడిన సమాచారాన్ని ఈ గోప్య ప్రకటనలో వివరించిన విధంగా సేకరించబడుతుంది, బదిలీ చేయబడుతుంది, నిల్వ చేయబడుతుంది, ప్రాసెస్ చేయబడుతుంది, బహిర్గతం చేయబడుతుంది, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉపయోగించబడుతుంది అని మీరు అర్థం చేసుకుంటున్నారు. పైన పేర్కొన్న ప్రయోజనాలు, లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ సమాచారం అమెరికా నుండి, మీ దేశం కంటే భిన్నమైన లేదా తక్కువ కఠినమైన డేటా రక్షణ చట్టాలున్న ఇతర దేశాలకు బదిలీ చేయబడుతుందని మీరు అర్థం చేసుకున్నారు.

వికీమీడియా, వాడుకరుల గోప్యత యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుంది. ఈ కారణంగా, మేము నిర్వహించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చెయ్యడం లేదా ఉపయోగించడం నుండి మా వినియోగదారులను రక్షించడానికి మేము కృషి చేస్తాం. ఈ సర్వేలో సేకరించిన డేటాను ఒక సంవత్సరంలోపు తొలగించడమో, అనామకపరచడమో, కలిపెయ్యడమో జరుగుతుంది. మరింత సమాచారం కోసం మా డేటా ధారణ మార్గదర్శకాలను చూడండి.

ఈ సర్వే గురించి సందేహాల కోసం, bevellin@wikimedia.org ని సంప్రదించండి.

మీ సూచనలు, అభిప్రాయాలకు మళ్ళీ ధన్యవాదాలు!

వికీమీడియా ఫౌండేషన్