వాడుకరి:Janardhan36

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ కేశవయ్య స్కూల్ , అనంతపురం , ఆంధ్ర ప్రదేశ్

Sri KESAVAIAH School , Anantapur AP


అనంతపురం లో శ్రీ భాస్కర కేశవయ్యగారు సుమారు 1950 నుండీ ఒక ప్రాథమిక పాఠశాల నడిపినారు ఆ పాఠశాలను " శ్రీ కేశవయ్య స్కూల్ " అని పిలిచేవారు. ఈ పాఠశాలలో ఐదవ తరగతి వరకూ ఉండేది. ఈ పాఠశాలకు ప్రభుత్వపు సహాయము ( గ్రాంటు ) ఉండేది. ఈ పాఠశాల , సాయినగర్ లో ఉండేది. శ్రీ కేశవయ్యగారు తమ ఇంటి ఆవరణలోనే రెండు పాకలను కట్టి పాఠశాల నడిపేవారు. దానికి పక్కనున్న ప్రభుత్వ బంగళాలో సమాచార పౌర సంబంధ శాఖ వారి కార్యాలయము నడిచేది. ఇప్పటి స్టేటు బ్యాంక్ ఆఫ్ ఇండియా , సాయినగర్ బ్రాంచి ఉన్న వీధిలోనే దానికి దగ్గరే ఉండేది. సుమారు 1970 వరకూ నడచిన తరువాత ఆ పాఠశాలను ప్రభుత్వపరం చేసినారు. అప్పట్లో స్త్రీ సంక్షేమం కోసం శ్రమించిన శ్రీ కేశవయ్యగారు తమ పాఠశాలలో ఆడవారికే ఉపాధ్యాయినులుగా ఉద్యోగము ఇచ్చినారు. వారి కూతుర్లు కూడా ఆ పాఠశాలలోను , ఇతర పాఠశాలలలోను ఉపాధ్యాయినులుగా పనిచేసేవారు.

ప్రభుత్వ పరము చేసినతరువాత ఆ పాఠశాల ఇప్పటికీ నడుస్తున్నదని తెలిసింది. కానీ ఇప్పుడు ఆ పాఠశాల పేరు మార్చినా , ఇంకా కొందరు ఆ పాఠశాలను " శ్రీ కేశవయ్య స్కూల్ " అనే పిలుస్తారు. ఆ పాఠశాలను ప్రభుత్వము ఇంకో చోటికి మార్చింది. అయితే ఎక్కడున్నదీ నిర్ధారించవలసి ఉన్నది.

ఆ పాఠశాలలో చదివిన అనేకులు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినవారే, ఇప్పుడు కూడా అనేకులు ఇంకా ఉద్యోగాలలో ఉన్నారు.

ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు దయ చేసి ఇక్కడ తమకు తెలిసిన సమాచారము పంచుకోగలరు