Jump to content

వాడుకరి:Kiran kumari mandela

వికీపీడియా నుండి

మనము నిన్నటి వారమే మనకు సమయము తెలియదు భూమి మేర మనము దిమము మనకు నీడవలే వున్నాము ఎక్కడ వున్నది

                    ఉపోద్ఘాతము
                1.  సృష్టికర్తయగు దేవుడు - రక్షకుడు
                2.  దేవుని రక్షణ శృంగము
                3.  శరీరధారియైన క్రీస్తు
                4.  నిబంధన రక్తము
                5.  నీతి-విశ్వాసము
                6.  నిరీక్షణ
                7.  దేవుని పిలుపు
                
                
                
                                                             ఉషోధ్ఘాతము
                ఈ పుస్తకములోని సారాంశము ఏమనగా, మరణము చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండ తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? కీర్తన 89:48. మనుష్యుడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును ఈ లోకములో తాను ప్రయాసపడి చేసికొనిన దానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు కాని అతని క్రియలు అతని వెంటనే వుండును అతను వచ్చిన ప్రకారముగానే మరల పోవును. అయితే మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అందుచేత దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడైయున్నాడు. అయితే    మానవుడు తన పాపములకు పరిహారము చెల్లించలేడు కారణము మానవుడు పరిశుద్దుడు కాదు అందుచేత దేవుడు మానవాళిని రక్షించాలని  పతనమైన మానవ ఆత్మ రక్షణకై సృష్టికర్తయగు దేవుడు వారి కొక రక్షణ శృంగమును ఏర్పరచెను. నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. నిర్గమకాండము 9:16.  అని దేవుడు మన కొరకొక రక్షణ శృంగమును నియమించెను ఈ రక్షణ శృంగము  వెల చెల్లించి తన ప్రజల పక్షముగా రక్షకునిగా, విమోచకునిగా పాపపరిహారార్దబలిగా అర్పింపబడి భూదిగంత ప్రజలకు రక్షణ తెచ్చినది. మరణము ద్వారా వచ్చే నరకమును తప్పించే ప్రయత్నము. ఈ రక్షణ మనలను రక్షించుట అనేది దేవుని యొక్క ప్రణాళికలో ప్రాధమిక ఏర్పాటు కాబట్టి తన రక్షణలోనికి మనలను ఎన్నిక చేసి పిలిచెను ఈ రక్షణ శృంగము మన రక్షణకు ఎంతో భద్రతను చేకూర్చింది. ఈ రక్షణ ద్వారా మన యెడల దేవుని కున్న ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది కాబట్టి ఈ రక్షణలోనికి నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. క్రీస్తు రక్తము ఆయనయందు విశ్వాసముంచిన వారిని పరలోకములోనికి చేర్చు వరకు పరిశుద్దముగా వుంచుతుంది. దేవుని రక్షణ శాశ్వతమైనది. ఈ రక్షణ శరీరానుసారమైన జీవితము నుండి ఆత్మానుసారమైన జీవితములోనికి నిన్ను రూపాంతరపరచును గనుక నీవు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడి తండ్రి యెదుట నిర్దోషిగా పరిశుద్దుడిగా సంపూర్ణ పురుషుడిగా దేవుడు అనుగ్రహించిన మహిమను ధరించినవాడవై నిత్యత్వము లోనికి నీవు ప్రవేశించెదవు. కాబట్టి ఇప్పటి నుండి ఒకని జన్మ దినము కంటె మరణదినమే మేలు అని సంతోషించుము.


                                        1.  సృష్టికర్తయగు దేవుడు --రక్షకుడు     
        
         నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు                                                                                    
         సైన్యముల కధిపతియగు యెహోవా అని అయనకు పేరు
         ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు
         సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.               
                                                                   యెషయా 54:5.
                                                                    
         యెహోవా తన పరిశుద్దాలయములో ఉన్నాడు 
         యెహోవా సింహాసనము ఆకాశమందున్నది
         యెహోవా ప్రళయజలముల మీద ఆసీనుడైయున్నాడు
         యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.
                                              కీర్తన 11:4, 29:10. 
       
              

సృష్టికర్తయగుదేవుడుసెలవిచ్చుచున్నదేమనగా, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు నేను నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యెహోవా అను నామము గల సృష్టికర్త ప్రకటించినదేమనగా, భూమిని కలుగజేసినవాడను నేనే దాని మీద నున్న నరులను నేనే సృజించితిని. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించినవాడను కాబట్టి నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుటకు పాపము నుండి మరణము నుండి నిన్ను విమోచించుటకు నీ కొరకొక రక్షణ శృంగమును అనగా విమోచకుడను పంపుచున్నాను.

                                               2. దేవుని రక్షణ శృంగము     

నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరని యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు. యెషయా 51:5, 52:10. అందుచేత మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూడవలెనని వారి కన్నులు పరిశుద్ద దేవుని లక్ష్యపెట్టవలెనని ఆయన వారి నిమిత్తము శూరుడైన రక్షకుని పంపును అతడు వారిని విమోచించును. భూదిగంత నివాసులందరికి దేవుడు కలుగజేయు రక్షణ ఏమిటి? పరిశుద్ద దేవుడైన యెహోవా ఏర్పరచిన నీతి ఏమిటి? యెహోవా బయలు పరచిన రక్షకుడు ఎవరు? ఆయన ఎవరనగా,

                         నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ద దేవుడే.    యెషయా 41:14.  

రక్షణ అనునది దేవుని ఆలోచన, రక్షణ కార్యము దేవుని చేత ప్రారంభించబడినది. నిత్యత్వపు భూతకాలములో అనగా లోకము పుట్టకమునుపే దేవుని చేత నిర్ణయించబడి తన ప్రజలను తన కుమారునిలో స్వాస్ధ్యముగా ఉండునట్లు మనలను ముందుగానే నిర్ణయించి ఏర్పరచి పిలుచుకొనెను.విమోచకుడును,రక్షకుడునైన పరిశుద్ద దేవునిని ఎవరును, ఎప్పుడైనను చూచి యుండలేదు కారణము

         ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు
         అమరత్వము గలవాడైయున్నాడు.     1తిమోతి 6:16.

అందుచేత సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు తన మహిమను చూడలేని మానవుల కొరకు తన మహిమను వారి యొద్దకు తీసికొని వచ్చి వారిని తన మహిమా స్వారూప్యంలోనికి రూపాంతర పరచి నిత్యత్వములోనికి చేర్చుకొనవలెనని మన ద్వారా తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మానవులు తమ్మును సృష్టించిన వానివైపు చూచుటకు మన కొరకు ఒక రక్షకుని ఏర్పరచెను.పరిశుద్ద దేవుడైన యెహోవా తన మహిమ యొక్క తేజస్సును,తత్వము యొక్క మూర్తిమంతమును ధరించిన తన కుమారుని తన ప్రణాళికలో ఒక భాగముగా తన స్వారూప్యంలో నిర్మించుకొని సర్వ మానవాళి రక్షణకై విమోచకునిగా తన పక్షముగా నియమించెను కాబట్టి ఇశ్రాయేలు విమోచకుడైన పరిశుద్ద దేవుడు తన ప్రతిబింబమైన కుమారుని కలుగజేసెను. ఏలయనగా, నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనెను. పరిశుద్ధదేవుడు ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. హెబ్రీయులకు 1:1-5. ఈ ప్రపంచము సృష్ఠింపకముందు సృష్టికి మూలద్రవ్యాలైన పంచభూతాలైన ఆకాశము, కాలము, భూమి,నీరు,అగ్ని, వాయువు లేవు. విశ్వంగా సృష్టింపబడక ముందు సర్వము నిరాకారముగా ఉండేది. అప్పుడు కాలము ఉద్భవించలేదు, సూర్య చంద్రుడు లేవు గనుక పగలు రాత్రులు లేవు. అనాదిలో ప్రళయస్ధితి మాత్రమే ఉండేది. ఆ మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు, యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసినుడైయున్నాడు. కీర్తన 29:10. అని దావీదు ఆత్మలో పాడెను.యెహోవా హస్తము యాజకుడునగు యెహేజ్కేలునపై వచ్చెను అప్పుడు దేవుని గూర్చిన దర్శనము కలిగెను ఆ దర్శనములో ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను. చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. అని గ్రహించెను యెహెజ్కేలు 1:26-28. ఆ ప్రళయములో నుండి ఒక స్వరము పలికెను ఆ శబ్ధము నుండి వచ్చిన వాక్యము అదృశ్య దేవుని శక్తి. ఈ శక్తియే సర్వసృష్టికి ప్రారంభము ఆ శక్తి నుండి ప్రణవించిన ప్రణవము, నాలుగు దిక్కులా వ్యాపించసాగింది. దీనివల్ల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాదులైన-దిక్కులు పుట్టినాయి. ఇదియే ఆకాశము, ఖాళీ ప్రదేశమైన విశ్వాకారమైన ఆకాశములో దేవుడు- పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశవిశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా సృష్టి కార్యములను గూర్చి ఆదికాండము 1,2 అధ్యాయములు చదువవలెను, సామెతలు 8:22,23,35. వాక్య భాగములో చదివినట్లయితే పరిశుద్ధ దేవుని మహిమ, మూర్తిమంతముతో(అహింస, ప్రేమ, సత్యము, సమాదానము, త్యాగము, బలిదానము) నియమింపబడిన కుమారుడు తన గూర్చి సాక్ష్యమిచ్చినదేమనగా, పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రధమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును అనెను. పరిశుద్ద దేవుడు తన కుమారుని యెడల కలిగియున్న ప్రణాళిక ఏమనగా, దేవుడైన యెహోవా పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును తన కుమారుని యందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. తన మహిమ యొక్క తేజస్సు తన తత్వము యొక్క మూర్తిమంతమునై యున్న తన కుమారుని యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు భూలోకమందున్నవైనను, పరలోకమందున్నవైనను వాటినన్నిటిని తన కుమారుని ద్వారా తనతో సమధానపరచుకొనవలెననియు తండ్రియైన దేవుని అభీష్ఠమాయెను అనగా దేవుని చిత్తము. అందుచేత, కుమారుడు అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడైయున్నాడు ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవిగాని, అవి సింహసనములైనను, ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును దేవుని కుమారుడైన వాని యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడెను. దేవుని కుమారుడు అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు దేవుని కుమారుడే సమస్తమునకు ఆధారభూతుడు.

       పరిశుద్ధ దేవుడైన యెహోవా చేత సృజింపబడిన సమస్తమునకు ముందుగానే పరిశుద్ధ దేవుడు తన స్వారూప్యంలో తన కుమారుని నియమించెను. ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవుని చేత సృజింపబడిన సమస్తమునకు వారసునిగా నియమించెను. దేవుని సృష్టిలో సమస్తమును తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడైన వాని ద్వారా కలిగెను. కుమారుడు లేకుండా ఏమియు కలుగలేదు.
                                                         వాక్యమైయున్న దేవుడు  
                                                       
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగ  లేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగై యుండెను.      యెహను 1:1-4. సమస్త సృష్టికి కారణమైన వాక్యము దేవుని యొద్ద యుండెను. దేవుడైన యెహోవా యొద్ద ఉన్న వాక్యము దేవుడైయుండెను. దేవుని మహిమ నుండి దేవుని తత్వము నుండి బయలు వెళ్ళిన దేవుని స్వరము నుండి ఆవర్భించిన దేవుని వాక్యము దేవుని యొక్క తేజస్సును దేవుని మూర్తి మంతమును దరించుకొనెను. ఆ వాక్యమైయున్న దేవునిలో జీవము ఉండెను. ఆ వాక్యము దేవుని జీవము కలిగివుండి శరీరధారియై వచ్చెను.
       ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొ
       నలేదు గాని. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు
       ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపి
       నవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.  ఫిలిప్పీయులకు 2:6-8.                                                              దేవుడైన యెహోవా నరుల యొక్క అక్రమము విస్తరించుట చేత వారి ప్రవర్తన మార్చబడాలని మంచి నడవడిని నేర్పు మాటలను తానే వారికి నీతి మార్గము బోధించుటకు ఆయన ఆత్మ చేత ఆది నుండి అనేక ప్రవక్తలను ఏర్పరచి నరులతో మాటలాడుచుండెను. ఆ ప్రకారమే ఇశ్రాయేలీయ ప్రజలు మంచి ప్రవర్తన కలిగి జీవించునట్లు దేవుని ఆజ్ఞలు, కట్టడలను అనుసరించునట్లు దేవుడు వారికి ధర్మశాస్త్రమిచ్చెను. కాబట్టి పరిశుధ్ద గ్రంధములోని ప్రతి లేఖనము దేవుని చేత పలుకబడియున్నది గనుక ఆ వాక్యములోనే దేవుని జీవము కలదు కాబట్టి  ఆ వాక్యము శక్తి గలదై తన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును, అత్యధికములునైన వాగ్ధానములను, అనుగ్రహించియున్నాడు. మన యెడల తనకున్న ఆలోచనలను, ఆయన పధకాలు నెరవేర్చుటకు దేవుని వాక్యము జీవముగలదై మన జీవితాల్లో ఆయన దైవశక్తి, జీవనమునకును దైవభక్తికిని కావలసిన అంతరంగ దృఢత్వాన్ని పెంపొందింపజేస్తుంది. కాబట్టి వాక్యమైయున్న దేవుని చేత అనగా క్రీస్తు యేసునందుంచిన విశ్వాసము ద్వారా రక్షణార్ధమైన జ్ఞానములోనికి సంపూర్ణముగా రూపాంతరపరచబడిన వారముగా దేవ స్వభావమునందు పాలివారమగునట్లుగా దేవుని రాజ్యంలో మన జీవితాన్ని ఆరంభిస్తాము.
                                                      జీవమైయున్న దేవుడు

నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకును మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి. ద్వితియోపదేశకాండము. 30:20. జీవము కలిగియున్న దేవుని స్వరము యొక్క వాక్ శక్తిని కీర్తనకారుడైన దావీదు ఆత్మావేశముతో కీర్తన వ్రాసెను. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహ జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. కీర్తన 29 ఆదికాండము 1:2 వాక్యములో వ్రాయబడినదేమనగా, దేవుని ఆత్మ జలములపైన అల్లాడు చుండెను. మహా ప్రళయ జలముల మీద ఆసీనుడైన దేవుడైన యెహోవా స్వరము నుండి బయలు వెడలిన వాక్యము దేవుడైన యెహోవా మహిమ యొక్క తేజస్సును దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునై దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్ఠికి ఆది సంభూతుడై యున్నాడు. ఆ కుమారుని గూర్చిన ఒక సాక్ష్యము పేతురు వ్రాసెను. అదేమనగా, ఆయన మహత్మ్యమును మేము కన్నులారా చూచినవారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహదివ్యమహిమనుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు,తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండినవారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి అనెను. కాబట్టి తండ్రియైన దేవుడు యేలాగు తనంతట తానే జీవము గలవాడైయున్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై యుండుటకు తండ్రియైన దేవుడు కుమారునికి అధికారము అనుగ్రహించెను. అందుచేత వాక్యమును, జీవమునై యున్న దేవుడు కృప, సత్యమును తన శరీరమందు ధరించుకొని శరీరధారియై సర్వమానవాళికి రక్షణ కలుగజేయుటకు దేవుని యొద్ద నుండి బయలుదేరివచ్చెను. కృపయు సత్యమును తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారునిగా యేసు క్రీస్తు ద్వారా కలిగెను. యెహాను 1:17 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీయులకు 4: 4.

      మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన పతనము అయ్యెను అందుచేత మానవుడు తన ప్రాణములో దేవుని జీవము కోల్పోయిన వానిగా మిగిలిపోయెను. అందుచేత శరీరమందు భౌతికమైన జీవమును, మనస్సులో మానసికపరమైన జీవమును మాత్రమే కలిగియున్నారు. కాబట్టి మానవుడు శరీరానుశారముగా, వారి మనస్సుకు నచ్చినట్లుగా జీవిస్తున్నారు వారి ఆత్మకున్న జీవము మాత్రము దేవుని మహిమను కోల్పోయినది. గనుక మానవుని ఆత్మ నిత్యత్వమునకు చేరు పరిశుధ్దతను కోల్పోయినది. కుమారుని ద్వారా జీవమును ఇచ్చుటకు పతనమైన ఆత్మను జీవింపచేయుటకు దేవుడు తిరిగి తన కుమారుని ద్వారా జీవము తెచ్చెను.                                                                   
                                                                           లోకమునకు వెలుగు 


       భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను అని పరిశుద్ద దేవుడునగు యెహోవా తన కుమారుని గూర్చి ప్రవక్తల ద్వారా నానా సమయములలో ప్రకటించుచువచ్చెను. ఆ ప్రకారము  ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని జీవము గల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు  గబ్రియేలను దేవదూత గలిలైయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్తుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి-దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి-ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత- మరియా, భయపడకుము;  దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు  సింహసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్ధులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై  యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ- నేను పురుషుని ఎరుగనిదాననే;  యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత—పరిశుద్ధాత్మ నీమిదికి  వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. లూకా 1: 26-35.  పురుషుని ఎరుగని కన్యకయైన మరియ  సర్వోన్నతుని శక్తి కమ్ముకొనుటవలన గర్భము ధరించి సర్వోన్నతుడైన దేవుని కుమారుని జన్మనివ్వగలదో కొన్ని వాక్యములు చదివి తెలుసుకుందాము. షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు అర్ధమిచ్చునట్టి షాలేము రాజని అర్ధము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళి  లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. హెబ్రీయులకు 7:3. ఇచ్ఛట దేవుని యాజకుడైన మెల్కీసెదెకు తల్లి,తండ్రి లేనివాడుగా ఉన్నాడు  అనగా ఈయన రక్తమాంసములు లేనివాడు. జీవితకాలమునకు ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయున్నాడు. అనగా పుట్టుక,మరణము లేనివాడునైయున్నాడు. ఒక నరుడు రక్తమాంసములతొ పుట్టుటకు తల్లితండ్రి అవసరము రక్తమాంసములతొ పుట్టిన నరునిని పాపము, మరణము ఏలుతుంది. గనుక మానవుడు పాపమునకు,మరణమునకు దాసుడు. అయితే మెల్కీసెదెకు తల్లితండ్రి లేనివాడు,అనగా శరీరము లేనివాడు. జీవితకాలమునకు ఆదియు అంతము లేనివాడుగా ఉన్నాడు గనుక తల్లితండ్రి నుండి వచ్చే కర్మ అనగా పాప ఫలము లేదు, మరణము లేదు. గనుక దేవుని కుమారుడు కూడా మెల్కీసెదెకు యొక్క క్రమములో  పాపము లేని వానిగా పుట్టుట కొరకై  సృష్టికర్తయగు దేవుడు కన్యకయైన మరియ గర్భము తెరెచెను. కాబట్టి స్వయంభవునిగా శరీరం తల్లి గర్భములో ఏర్పడుతుంది ఈరీతిగా దేవుని కుమారుడు శరీరధారిగా జన్మించెను. ఆయన సర్వోన్నతుని శక్తి వలన జన్మించెను గనుక ఆయనలో పాపము లేదు ఆయనలో దేవుని పరిశుద్ధాత్మ మాత్రమే కలదు గనుక తన సంకల్పము చేత ఏమి చేయదలచుకున్నాడో అది చేయుటకు జన్మించెను గనుక ఆయన జననం కర్మబద్దంకాదు. అదృశ్య దేవుని స్వరూపములో సృజింపబడినవాడై దేవుని మహిమ కలిగినవాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని రక్తమాంసములు ధరించుకొని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని తన్నుతానే తగ్గించుకొనెను. దేవుని స్వరూపియైన కుమారుడు దేవుని మహిమను ధరించుకొని దేవుని గూర్చిన జ్ఞానము గలవాడై దేవుని యొక్క పరిశుధ్ధాత్మ చేత దావీదు వంశమందు కన్యకయైన మరియకు జన్మించెను. ఇక్కడ గమనించవలసినదేమనగా,  దేవుని శక్తి ఆత్మా స్వరూపి  ఆయన సాకారుడు, నిరాకరుడు రెండునూ  అందుచేత ఆయన ఆకారమును ధరించగలడు అది రూపమే గాని జీవరాశిలోని జీవుడు మాత్రం కాదు. అందుకొక వాస్తవం అదేమనగా,అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చునియున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రాహాము కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. మరియొక సందర్భములో యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అనగా దేవుని ఆత్మ మనుష్యులకు కనబడవలసి వచ్చినప్పుడు ఒక మనుష్యునిగా కనబడుచుండెను గాని జీవరాశిలోని జీవుడు మాత్రము కాదు. మరియొక సందర్బములో యేసు బాప్తిస్మము తీసుకొనిన వెంటనే ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురమువలె వ్రాలి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక స్వరము ఆకాశము నుండి పలికెను. మత్తయి 3:16,17. కాబట్టి దేవుని కుమారుడు పాపరహితుడుగా జన్మంచి పాపమనే చీకటిలో ఉన్నమనలను పాప దాస్యము నుండి విడిపించుటకు వెలుగుగా రక్షణగా వచ్చెను. యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా , చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచూచున్నారు. మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును. అన్న ప్రవచనము ప్రకారము  చీకటిని వేరుపరచుటకు వెలుగు కలిగెను.   ఆ వెలుగును గూర్చి భక్తి పరుడైన సుమోయోను అను ప్రవక్త ప్రభువు యొక్క క్రీస్తునుచూచిఆత్మవశుడైప్రవచించినదేమనగా,                                                                                                   అన్యజనులకునిన్నుబయలుపరచుటకువెలుగుగాను,                                                                                                                                             నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను,                                                                                                                                 నీవు సకల ప్రజల యెదుట సిద్ద పరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని దేవునిని స్తుతించెను.                                                                                                                                                                                        లూకా2:32.  చీకటిలోను మరణచ్చాయలోను కూర్చున్నమనకు వెలుగిచ్చుటకు ఆయన తన మహా వాత్సల్యమునుబట్టి ఆయన సన్నిధినుండి మనకు తనకుమారుని ద్వారా వెలుగును ఉదయింపజేసెను. కాబట్టి జీవమైయున్న కుమారుడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆయన వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. శరీరధారిగా జన్మించిన కుమారుడు లోకములోని ప్రతి మనుష్యుని వెలిగిచ్చుటకు వచ్చెను. అనగా పాప దాస్యమనే చీకటి నుండి విడిపింపబడి, మన జీవితకాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. తన ప్రజలకు రక్షణజ్ఞానము అనుగ్రహించునట్లు నేను లోకమునకు వెలుగును నన్నువెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండును.    యోహాను 8:12.                                                      
        జీవము గల దేవుడు మనలను అంధకారసంబంధమైన అధికారములో నుండి అనగా పాపము,మరణము నుండి విడుదలచేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేయుటకు యుగయుగములు ఏలుటకు ఆ కుమారునియందు మనకు విమోచనము, పాపక్షమాపణ కలుగచేయుటకు ప్రతిమనుష్యుని చీకటిలోనుండి మరణచ్ఛాయలోనుండి విడిపించుచు రక్షణ అను వెలుగులో మనలను ప్రకాశింపజేయుటకు మన హృదయములో ప్రకాశించుటకు దేవుని చేత పంపబడెను.మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. 1యోహాను 4:8. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము దేవుని స్వరూపియైయున్న  కుమారునియందు వెల్లడిపరచుటకు రక్షణ ప్రకాశము మన హృదయములో ప్రకాశించెను.                       తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది.  2పేతురు 1:19.
                                                                        3. శరీరధారియైన క్రీస్తు
          సమీపింపరాని తేజస్సులో అనగా మహాదివ్యమహిమలో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు. 1తిమోతి 6:16.                                                         అందుచేత దేవుడు తన ఉనికిని తన మహిమను గూర్చిన సత్యమును విశ్వ వ్యాప్తం చేయుటకు తన ప్రణాళికలో ఒక భాగముగా దేవుడు తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి  మానవునిని దేవుడు తన స్వారూప్యంలో సృజించెను. ఈ మానవుడు శరీరము,ప్రాణము,ఆత్మ కలిగియున్నాడు. ఈ శరీరము భూసంబంధమైనది గనుక భౌతిక సంబంధమైన వాటిని పొందుకొంటుంది. ప్రాణము అనునది శారీరక శక్తి, మానసిక శక్తి. ఆత్మ, జీవము కలిగి యున్నది గనుక జీవింపజేయు శక్తి ఆత్మ యొద్ద నుండి అనుగ్రహింపబడుతుంది. ఆత్మ మహిమ గలది ఇది దేవునిది దేవుని యొద్ద నుండి  మానవునికి అనుగ్రహింపబడినది. అయితే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన పాపము వచ్చెను ఆ పాపము తన ఆత్మలోని దేవుని జీవమును కోల్పోవునట్లు చేసెను. అందుచేత మానవుడు ఆత్మ విషయమై చచ్చిన స్తితిలోనే ఉన్నాడు. పాపము మానవుని ఏలునంతకాలము  మానవుడు మరణమునకు దాసుడు. పాపము మానవ దేహమును,మనస్సును,ఆత్మను పాడుచేస్తుంది, దేవుని నుండి వేరుచేస్తుంది. పాపము మనుష్యుని ఏలునంతకాలము దేవునిచేత ఇవ్వబడిన ఆత్మకు జీవము రాదు గనుక మానవుడు మరణిస్తాడు. అందుచేత దేవుడు అనాది సంకల్పాన్ని తన కుమారుని ద్వారా నెరవేర్చుటకు శరీరధారిగా పంపెను.                                                          దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలస్సయులకు 2:9.

గనుక క్రీస్తు మన పాపములకు శాంతికరమై యున్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకమునకును శాంతికరమై యున్నాడు. కాబట్టి పాపములను తీసివేయుటకై క్రీస్తు శరీరధారిగా ప్రత్యక్షమయ్యెను అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తియైన వాయు మండల సంబంధమైన అధిపతియైన అపవాది క్రియలననుసరించి మన మందరమును శరీరము యొక్కయు, మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి, యీ ప్రపంచ ధర్మము చొప్పున ప్రవర్తించుచు శాశ్వతమగు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు అనగా నశించిపోయెడి మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించుచు అవిధేయులమై దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయితే రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుటకై పూర్వము నుండి ప్రతి మనుష్యుడు చేయుచున్న పాపములను దేవుడు ఓర్పుతో సహించుచు వచ్చెను. కారణము,

                సమస్త ప్రజలు పాపమునకు లోనైయున్నారు
                నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు.
        ఏ భేదమును లేదు అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచుండుట వలన కరుణా సంపన్నుడైన దేవుడు మన అపరాధముల చేత దేవునికి దూరస్ధులమైన మనము దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను దేవునికి సమీపస్తులుగా చేయుటకై కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగించాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన కుమారుని యందు స్వాస్ధ్యముగా ఏర్పరచెను. ప్రతి మనుష్యుడు క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడి దేవుని యెదుట నిలువబడవలెనని దేవుని చిత్తం. తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్ధోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో అనగా ఆయన కుమారుని ద్వారా మనలను ఏర్పరచుకొనెను. ఎఫేసీయులకు 1:4-6.
         సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప క్రీస్తు ద్వారా ప్రత్యక్షమైనది అది ఏమనగా, దేవుడు తన కుమారుడు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రకటించెను. ఆ ప్రకారమే యేసు క్రీస్తు శరీరధారియై అందరి రక్షణ కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే శ్రమపొందుటకు అప్పగించుకొనెను.
                             ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను
                             బొచ్చు కత్తిరించు వాని యెదుట
                             గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో
                             ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.   శ్రమపొందుచు ఆయన మౌనముగా ఉండుటకు గల కారణమును గూర్చి యేసు చెప్పినదేమనగా,  నా ప్రజల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎవడును నాప్రాణము తీసికొనడు నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు. నా ప్రాణము తిరిగి తీసికొనుటకును నాకు అథికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిననెను.  యెహాను 10:15-19. అందుచేత యేసు శ్రమపడుటకు మనుష్యులచేతికి అప్పగింపబడినప్పుడు యేసు వారితో చెప్పినదేమనగా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు; నా రాజ్యము ఈలోక సంబంధమైనదైతే నేను మనుష్యులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. యోహాను 18:36. కాబట్టి కుమారుడుగా చేయుటకు తనకు తండ్రి అప్పగించిన రక్షణ కార్యమును నెరవేర్చుటకు లోకమునకు తండ్రిచేత పంపబడెను. యేసు క్రీస్తు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ద పరచుటకై శ్రమ పొందెను. తండ్రి అప్పగించిన పనిని తన శరీరమందు సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద తండ్రిని మహిమ పరచెను. 
       ఎవరికైతే తండ్రియైన దేవుడు (సైన్యములకధిపతియగు సృష్టికర్తయగు దేవుడైన యెహోవా) తెలియదో వారికి తన ద్వారా తండ్రి నామము తెలియజేసెను. లోకము పుట్టక మునుపు దేవుని యొద్ద తనకున్న మహిమను తిరిగి పొందుటకు యేసు క్రీస్తు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగించి తన కోసము మనలను తన రక్తము ద్వారా పవిత్రపరచుకొని మనలను తన మహిమ స్వరూపములోనికి మార్చుటకు తన్ను తానే మనకొరకు శ్రమ నొందుటకు ప్రాణము పెట్టుటకు అర్పించుకొనెను.
       ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము.  మార్కు 14:24. 

అనెను. తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తమును నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని తన స్వరక్తముతో మన పక్షముగా ఒక్కసారే దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు(పరిశుధ్దస్ధలము)లో ప్రవేశించెను.

                                                     4.   నిబంధన రక్తము (కృప) 
                                                               
                                                               పాపము
       ఆదాము అను ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించెను. ఆలాగుననే మనుష్యులందరు పాపము చేయుచున్నందున మరణము అందరికి సంప్రాప్తమాయెను. ఆదాము అను మొదటి మనుష్యుడు చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడ ఆదాము మొదలుకొని నేటివరకు మనుష్యులను మరణ మేలుచుండెను. ఒకని అపరాధము వలన అనేకులు చనిపోవుచున్నారు. పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగినట్టు అనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. పాపము సకలవిధములైన దురాశలను పట్టించుచుండెను గనుక మనము పాపమునకు అమ్మబడి శరీర సంబంధులమై యున్నాము. ఇందును గూర్చి అపోస్తులుడైన పౌలు భక్తుడు వ్రాసినదేమనగా,
       నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది. కాని, మేలు చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను చేయునది నేనెరుగను నేను చేయ నిచ్చయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాను. కాబట్టి  శరీర విషయములో పాప నియమమునకు దాసుడనైయున్నాను. మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవరు విడిపించును.
                                                              దేవుని ప్రేమ
      దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు, ఎట్లనగా మన మింకను పాపులమై యుండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులమును పాపులమైన మన కొరకు చనిపోయెను.  
        ధర్మశాస్త్ర ప్రకారము సమస్తమును శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి ఈయన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఈ ఒక్క అర్పణచేత  ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. ఎట్లనగా యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడియున్నాము. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. మానవుల పాపము పరిహరింపబడుటకు రక్తము ఎందుకు అవసరము. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీ కిచ్చితిని అనెను. లేవియకాండము 17:11.  రక్తము దానిలో నున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన పాపము వచ్చినది. పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ పాపము దేవుని నుండి మనుష్యులను వేరుచేస్తుంది. మనము చేసిన దోషములు మనకిని మన దేవునికిని అడ్డముగా వచ్చెను. కాబట్టి మన దోషములన్నిటిని పరిహరించటానికి మనకొరకు ఈ శిక్షను యేసు తన రక్తాన్ని చిందించడం ద్వారా మన స్తానంలో మరణించడం ద్వారా ఆయన మనలను నిర్ధోషులుగా చేయుచున్నాడు. క్రీస్తు తన రక్తాన్ని చిందించి మన కొరకు సిలువపై ఒకేసారి ప్రాయశ్చిత్తం చేసాడు. యేసు మన కొరకు ప్రతిష్టించిన మార్గమున, అనగా నూతనమైనదియు

జీవముగలదియు అయిన ఆయన శరీరము అను తెర ద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుధ్ద స్ధలమునందు ప్రవేశించుటకు ఈ క్రీస్తు ప్రధాన యాజకుడై యున్నాడు. ఈ సృష్టిలో మరి ఎవని వలనను రక్షణ కలుగదు.దేవుని కుమారుడగు యేసు క్రీస్తు నామముననే మనము రక్షణ పోందవలెను గాని ఆకాశము క్రింద మనష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అపోస్తలపల కార్యములు 4:10. ఎందుకనగా దేవునితో సకల ప్రజలు నివసింపవలెనని ఆయన సిలువ రక్తముచేత సంధిచేసుకొనెను. దేవుడు మనలను ప్రేమించి అంధకారసంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేసెను ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనలను నీతిమంతులుగా తీర్చి రాబోవు ఉగ్రత నుండి తప్పించెను.

     కాబట్టి క్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
                                                                                                రోమా 5:9,10. 
     అపరాధము కలిగినట్టు కృప కలుగలేదు. ఒకని అపరాధము అనగా పాపము వలన మానవులు మరణిస్తు ఉండగా దేవుని కృప సత్య సంపూర్ణతను ధరించిన యేసు క్రీస్తు అను దేవుని కుమారుని ద్వారా (కృప చేతనైన దానమును) అనేకులకు విస్తరింపజేసెను. యేసు క్రీస్తను ఒకని మంచి కార్యము ద్వారా మానవులు జీవమును పొందుకొనుచున్నారు. అదెట్లనగా దేవుడు తెచ్చిన రక్షణ అను పుణ్యకార్యము వలన ఇట్టి కృపాదానము మనుష్యులందరికిని జీవప్రధమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. క్రీస్తు యొక్క విధేయత వలన మనుష్యులందరికి నిత్యజీవము కలుగుటకై, నీతి ద్వారా (రక్షణ) కృపయు (దేవుని ప్రేమ) మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనలను ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. రోమా5:21.

అందుకొక ఉదాహరణ పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని చెప్పెను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి- నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను. లూకా7:36-50.

        యేసు క్రీస్తు ద్వారా కృప వచ్చినది కదా అని పాపములు చేస్తు ఉండకూడదు. ప్రభువు తెచ్చిన రక్షణ వలన పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు పాపములోనే జీవించుదుము.


                                                                బాప్తిస్మము

క్రీస్తు రక్షణ తెచ్చిన తరువాత మనము క్రీస్తు ద్వారా నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు మనము యేసు క్రీస్తులోనికి బాప్తిస్మము తీసుకొనవలెను. యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందినవారు, పాపము శరీర సంబంధమైనది గనుక మన పాపములను ఆయన శరీరముపై వేసికొని ఆయన పొందియున్న మరణము లోనికి బాప్తిస్మము పొందితిమి. అనగా క్రీస్తు మన పాపము, మరణమును తన దేహముపై మోసుకొని వాటిని సమాధి చేసి తాను మృతులలో నుండి లేపబడి నీ ఆత్మకు జీవము తెచ్చెను. కాబట్టి బాప్తిస్మము ద్వారా మనము కూడా మృతులలో నుండి లేపబడి మనమును క్రీస్తు ద్వారా వచ్చిన నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై క్రీస్తుతో కూడ పాతిపెట్టబడితిమి. అనగా బాప్తిస్మము ద్వారా మన యొక్క విస్తార పాపములు క్షమించబడి క్రీస్తుతో కూడా నూతన జీవితము జీవించునట్లు మనలోనికి నూతన జీవము తెచ్చెను

     ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల, ఆయన పునరుత్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. దేహము ఉన్నంతవరకే వ్యక్తిపై పాపము ఏలుతుంది చనిపోయిన తరువాత ఆత్మకు పాపము ఏలలేదు గనుక చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొందియున్నాడు. మనము క్రీస్తుతో కూడ చనిపోయిన యెడల అనగా బాప్తిస్మము తీసికొనుట ద్వారా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము చేయలేదు. అదే రీతిగా బాప్తిస్మము తీసుకొనిన యెడల ఇకను నీవు చనిపోవనియు ( అనగా నీ ఆత్మ నిత్యనరకమును పొందదని ) నీపై మరణమునకు ప్రభుత్వము లేదని నీవు క్రీస్తులో నూతన జీవము పొందుట ద్వారా నీలో పునరుత్ధాన శక్తి వచ్చెను గనుక ఇకపై జీవించునది నీవు కాదు నీలో ఉన్న క్రీస్తు తెచ్చిన నూతన జీవము ఆయనతో కూడా జీవించునట్లు నిన్ను జీవింప జేయుచున్నాడు.
    ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై ఒక్క మారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు.       రోమా 6:10.
       కాబట్టి మనుష్యులను పాపము విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను చేసెను. కాబట్టి మనుష్యులను పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులనుగాను చేసెను. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. ఎందుచేతనంటే మీరు దేవుని కృపకే గాని మీరు తీర్పునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
                                                         దేనికి దాసులు
     పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది మరణము నిమిత్తముగా పాపమునే గాని, లేదా నీతి నిమిత్తము దేవునికి విధేయత చూపుటకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు. మీ శరీర బలహీనతను బట్టి మీరు పాపమునకు దాసులై యుంటిరి. అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను పాపమునకు దాసులుగ అప్పగించితిరో, శరీర కార్యములను నెరవేర్చితిరో అలాగే క్రీస్తు ద్వారా వచ్చిన రక్షణకు హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. కాబట్టి పరిశుద్ధత కలుగుటకై పాపము చేయకుండునట్లు యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అప్పుడు ఆత్మఫలము ఫలించెదవు.
   మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు అనగా శరీర సంబంధులమై యుండినప్పుడు మరణార్ధమైన ఫలమును ఫలించుటకై పాపాచ్ఛెలు మన అవయవములలో కార్య సాధకములై యుండెను గనుక మీరు రక్షణ లేనివారుగా అనగా నీతివిషయమై నిర్భంధము లేని వారుగా వున్నారు. కాబట్టి మీ పాప క్రియల వలన మీకు కలిగిన ఫలము మరణము. అయితే మీరు దేవుని కృప (రక్షణ) ద్వారా పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత అనేది మీకు కలిగిన ఫలము. పరిశుద్ధతలో ఫలించుటకై ఆత్మ ఫలము మన అంతరంగము నందు కార్యసాధకములై యుండెను.మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును చేరుటకై మనము ఆయన శరీరము ద్వారా అనగా రక్షణ ద్వారా వీటి చేత నిర్బంధింపబడియున్నామో వాటి విషయమై చనిపోయినవారమై నిర్భంధింపబడిన వాటి నుండి విడుదల పొందిన వారమై ప్రాచీన స్ధితి కలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్ధితి గలవారమై జీవించుచున్నాము. కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసు నందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించెను. ఎట్లనగా శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచు కొను మన యందు నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహరము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. క్రీస్తు మీలో నున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఈ ఫలము యొక్క అంతము నిత్యజీవము.
      ఏలయనగా, పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసు నందు నిత్య జీవము.       రోమా 6:23.




                                                          ఇశ్రాయేలునకు రక్షణ
       ఇశ్రాయేలీయులరా, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టిత జనము, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము కలిగియున్నాడు. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటె విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు తక్కువే గదా! అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తన ఘనమైన  నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు తాను మీ తండ్రులకు  చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములోనుండియు ఐగుప్తు రాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను. ద్వితియోపదేశకాండము 7:6-8,14:2.  అయినను ఇశ్రాయేలీయులు రెండు నేరములు చేసియున్నారు. ఇందును గూర్చి దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి దుంఖపడుచున్నదేమనగా,జీవజలముల ఊటనైన నన్ను   విసర్జించియున్నారు,తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు. అనగా తమ్మును సృజించిన దేవునిని మరచి బయలు దేవతలను ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరిస్తున్నారు. యిర్మియా 2:12-37. 18:15-17.  వారి హేయక్రియలనుబట్టి దుంఖించుచున్న దేవుడు వారికి మారుమనస్సును, పాపక్షమాపణ దయచేయుటకై వారిని విమోచించుటకై ఒక రక్షకుని పంపెదనని వాగ్ధనము చేసెను. ఆ ప్రకారమే సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగజేయుచున్నాడు అదేమనగా,
      నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు  నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను.  యెషయా 46:13. ఆ ప్రకారమే ఇశ్రయేలును విమోచింపబోవువాడునగు క్రీస్తును ఇశ్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలముచేత హెచ్చించియున్నాడు. విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులోనుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలును సృజించిన సృష్ఠికర్తయైన దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

ఆ ప్రకారమే,

           ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను.
       తన సేవకుడైన దావీదు వంశమునందు రక్షణ శృంగమును కలుగజేసెను.
       ఆయన సన్నిదిని పరిశుధ్దముగాను నీతిగాను ఆయనను  సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుధ్దప్రవక్తల నోట పలికెను. 

అదేమనగా,

       అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నిచ్చుటకు అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. ఇందును గూర్చి మోషె యిట్లనెను-ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను  మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను. మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తకులకును, దేవుడు అబ్రాహాముతో – నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను.      అపోస్తలుల కార్యములు 3:18-26. 
                                                                      
                                                     
                                                      అన్యజనులకు రక్షణ 
      
     భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లు ఆయన దూరముగా నున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తెను. కీర్తన 67:1. అనగా అనాది కాలము నుండి తన ప్రవక్తల ద్వారా రక్షణ సువార్త ప్రకటింప ప్రారంభించెను. 

అదేమనగా, భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. యెషయా45:22. అని దేవుడైన యెహోవా ప్రకటించిన రీతిగా, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణ ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. కాబట్టి, దేవుని నామము పరిచయము లేని ప్రజలు ఆయన ఇచ్చు రక్షణ పొందుకోవాలని దేవుని చిత్తము. పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఆయన కుమారుని గూర్చి సెలవిచ్చినదేమనగా,

         భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై
         అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను.     యెషయా 49:6.                                         అందుచేత దేవుడైన యెహోవా అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహామునకు ఒక ఆశీర్వాదము నిచ్చెను. అదేమనగా, 
              భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును.  ఆదికాండము 12:3

మరియు, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఆదికాండము 26:4. అందుచేత, సమస్తమైన అన్యజనులు దేవుడిచ్చు రక్షణకు విధేయులగునట్లు అనాది కాలము నుండి ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడినది. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా చెప్పబడినది.

      ఆ మర్మము ఏమనగా,
      అన్యజనులు అనగా దేవుడైన యెహోవాను గూర్చిన సమాచారము ఎవరికి తెలియబడలేదో, దేవుని యొక్క మహిమ గల కార్యములను గూర్చి ఎవరికి వినబడలేదో వారు దేవుని రక్షణను చూడవలెనని వారికి సువార్త ప్రకటింపబడెను. అదేమనగా,  దేవుని చేత వాగ్ధానం పొందిన అబ్రాహాము సంతానమైన యూదులతో పాటు సమాన వారసులును ఒక్క శరీరమందలి సాటి అవయవములవలె అనగా దేవుడు అబ్రాహమునకు ఇచ్చిన వాగ్ధానములో అన్యజనులు కూడా వారసులై యున్నారు. సర్వమానవాళిని ప్రేమించే దేవుడు అనాదికాలము నుండి ప్రవక్తల ద్వారా మాటలాడుచున్న దేవుడు. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. భూదిగంతనివాసులందరు నా రక్షణ చూచెదరని ప్రకటించెను. ఆ ప్రకారము దేవుని వలననైన యీ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడియున్నది.
          ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అను దేవుని మాట ప్రకారము,

నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడ నట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. అని యెషయా ప్రవక్త ప్రవచించిన రీతిగా, దేవుని చేత పంపబడిన సేవకుల ద్వారా రక్షణ శృంగమును గూర్చి అనగా క్రీస్తు తీసుకొని వచ్చిన విమోచన గూర్చి సువార్త ద్వారా ప్రజలకు సమీపముగా తీసుకొని వచ్చెను. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక భూదిగంత నివాసులందరి పాపముల నిమిత్తమైన దేవుని ఉగ్రతను తన శరీరముపై భరించడానికి తద్వారా మన పాపాలకు క్షమాపణ కలుగజేయటానికి మరియు నిత్యజీవ ప్రవేశము దయ చేయటానికి పునరుత్ధానపు శక్తిని తీసికొని వచ్చెను.

       ఇదియే అనాది కాలము నుండి ప్రకటింపబడుచున్న దేవుని రక్షణ శృంగము.  
        
                                                      ఉభయులు ఏకశరీరము
      శరీరవిషయములో సున్నతి లేని  ప్రజలు ఇశ్రాయేలుతో సహ పౌరులుకాక, పరదేశులును, వాగ్ధాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండగా క్రీస్తు యేసు తన రక్తము వలన విధి రూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును, తన శరీరమందు కొట్టివేయుటచేత అనగా సున్నతిగలవారు,సున్నతిలేనివారు అన్న మధ్యగోడను పడగొట్టి, సున్నతిగల ఇశ్రాయేలియులను,సున్నతిలేని అన్యజనులను కీస్తు తన రక్తము ద్వారా దూరస్ధులైన వీరిద్దరిని సంధిచేయుచు, ఈ యిద్దరిని తన శరీరమందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన  సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, తన సిలువ మరణము ద్వారా వీరిద్దరిని అనగా ఇశ్రాయేలియులను, అన్యజనులను ఏకశరీరముగా చేసి అనగా వీరిద్దరిలో క్రీస్తు రక్తము వలన సమాధానమును తీసికొనివచ్చి దేవునితో సమాధానపరచవలెనని దేవుని యొద్దనుండి వచ్చి దూరస్ధులైన అన్యజనులకు, సమీపస్తులైన ఇశ్రాయేలియులకు రక్షణ తెచ్చెను. క్రీస్తు ద్వారానే ఉభయులను అనగా వీరిద్దరిని ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేర్చెను. కాబట్టి అన్యజనులు పరజనులును పరదేశులునైయుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్ధులును దేవుని ఇంటివారునైయున్నారు. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తులో ఇశ్రాయేలియులతోపాటు అన్యజనులు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసస్ధలమైయుండుటకు కట్టబడుచున్నారు.
   ఈ మర్మమేదనగా,
                           అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు,యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారునై  యున్నారనునదియే.   ఎఫేసీయులకు 3:6.


                                                         5. నీతి-విశ్వాసము
        పూర్వమునుండి ప్రతి మనుష్యుడును చేయుచున్న పాపములను దేవుడు ఓర్పుతో సహించెను. కారణము,
                                 సమస్త ప్రజలు పాపమునకు లోనైయున్నారు
                                    నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు.

ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. అందుచేత నీతిమంతుడైన దేవుడు మనుష్యులలో దేవుని నీతిని కనబరచవలెనని తన కుమారుడను కరుణాధారముగా బయలుపరచెను. కాబట్టి మానవాళి పాపముల నిమిత్తమై క్రీస్తు యేసు విమోచన క్రయధనముగా రక్తము చిందించి ఆ రక్తముతో దేవుని యొద్దకు వెళ్శి తన ప్రజల పక్షముగా తన రక్తమును విమోచనక్రయధనముగా దేవుని యెదుట అర్పించి వారిని దేవునితో సమాదానపరచి దేవుని యెదుట వారిని నీతిమంతులుగా చేయు అధికారము పొందెను. అందుచేత క్రీస్తునందు విశ్వసించినవారిని నీతిమంతులుగా ఎన్నికచేయుచున్నాడు. కాబట్టి , ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏమనుష్యుడును దేవుని దృష్ఠికి నీతిమంతుడని తీర్చబడడు. భూదిగంతనివాసులందరికి దేవుడు ఒక్కడే ఆయన ఇశ్రాయేలీయులకు, అన్యజనులకు రక్షకుడైయున్నాడు గనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఉచితముగా నీతిమంతులనుగా తీర్చుచున్నాడు.

      యేసు క్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.
                                                                                      రోమా 3:22.

యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా దేవుడు ఉచితముగా మనుష్యులను నీతిమంతులుగా తీర్చుచున్నాడు. నీతి అనేది ధర్మశాస్త్రము వలన అనగా మనసొంత క్రియల వలన రక్షణ వస్తే ఆ పక్షమందు క్రీస్తు చనిపోవలసిన అవసరము లేదు. క్రీస్తు చనిపోవటము నిష్ ప్రయోజనము అవుతుంది.

                                                            విశ్వాసము
        మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడరని యెరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలమున కాక క్రీస్తునందలి విశ్వాసమువలననేనీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసముంచియున్నాము.  ధర్మశాస్త్రగ్రంధమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.ధర్మశాస్త్రముచేత ఎవరును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్ఠమైనది. నీతి క్రీస్తు నందు విశ్వాసముంచుట వలన కలుగుతుంది. ఒక వ్యక్తిని జీవింపజేయగల శక్తి ధర్మశాస్త్రమునకు ఇయ్యబడి ఉంటే ధర్మశాస్త్ర సంబంధమైన విధులు నిర్వర్తించటం వలన ఆ మనుష్యునికి నీతి కలుగుతుంది. కాని ధర్మశాస్త్రము వ్యక్తిని పాపములోనే బంధించి యుంచెను. ధర్మశాస్త్రము మనుష్యుని రక్షించలేకపోతుంది.
          కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు  
      ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.         గలతీయులకు. 3:24.

యేసు క్రీస్తు నందు విశ్వాసముంచు వారందరు దేవుడు అనుగ్రహించిన ఉచిత రక్షణ ద్వారా దేవుని కుమారులైయున్నారు. ఒక వ్యక్తి తన క్రియల వలన కాని ధర్మశాస్త్రము వలన కాని దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడలేరు గాని దేవుడు ఏర్పరచిన రక్షణ అను కృప చేత ఉచితముగా నీతిమంతులుగా చేయబడుచున్నారు.

      మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన
      స్నానము(భాప్తిస్మము) ద్వారాను పరిశుధ్ధాత్మ(సత్య స్వరూపియగు ఆత్మ) మనకు నూతన స్వభావము కలుగ
      జేయుట ద్వారాను మనలను రక్షించెను.                 తీతు 3:5.
                                                క్రియను కనపరచు విశ్వాసము
     విశ్వాసమనునది నిరీక్షీంపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై
     యున్నది.    హెబ్రీయులకు 11:1.

అనగా,

     ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అదేమనగా, 

యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ఆయన విశ్వాస్యత తరతరములు ఉండును. ఆయన యొక్క విశ్వాసమునకు ఉదాహరణ ఆయన చేతులు ఆకాశములను విశాలపరచి వాటి సర్వసమూహమునకు ఆజ్ఞ ఇయ్యగా అవి కలిగెను. దేవుని కార్యములు దేవుని యొక్క విశ్వాసము చేత అవి సృజింపబడినవి గనుక అవి కంటికి కనబడేవిగా ఉన్నవి. కాబట్టి గ్రహించవలసినదేమనగా, దేవుడు కలుగజేసిన సమస్తమునకు మూలము విశ్వాసము. అవిశ్వాసముగా దేనిని కలుగునుగాక అని పలుకలేదు. ఆది యందు దేవుడు కలుగజేసిన సమస్తమును నేటి వరకు అదే క్రమములో స్ధిరపరచబడియున్నది అంటే ఆయన విశ్వాసము యొక్క బలమును చూడగలుగుచున్నాము. పరిశుద్ద గ్రంధములోని కొందరి విశ్వాసులను గూర్చి

1.       అబ్రాహము అను వ్యక్తిని దేవుడైన యెహోవా-నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము అని దేవునిచేత పిలువబడినప్పుడు తాను అంతకుముందు ఎరుగని ఆ దేవుని పిలుపునకు లోబడి దేవుని వాగ్దానమునందు విశ్వాసముంచి ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక పోయినప్పటికి తన దేశమైన హరానును విడిచి తాను స్వాస్ధ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. అబ్రాహము దేవుని నమ్మెను గనుక ఆ విశ్వాసమును నీతి క్రియగా యెంచి అతనిని నీతిమంతునిగా ఎంచెను మరియు దేవుని స్నేహితుడని దేవుని చేత పిలువబడెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవునియందు విశ్వాసముంచి దేవుని యొద్దనుండి గొప్ప కార్యములు చూసినవారు ఎందరో కలరు. వారి విశ్వాసమును గూర్చి క్లుప్తంగా హెబ్రీయులకు 11:1-40. లో వ్రాయబడెను.

2. సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక యున్నప్పుడు మనలో ఎవరైన వారికి కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, తృప్తి పోందండి అని చెప్పిన యెడల వారికి ఏమి ప్రయోజనము. దీనిని బట్టి దేవునిపై నీవు చూపించె విశ్వాసము వ్యర్ధము కాబట్టి దేవుడు ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు చేయుటకై మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడునట్లు క్రియలలో చూపించగల విశ్వాసము కలిగియుండవలెనని దేవుడు కోరుచున్నాడు. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియలు చేయకుండా ఎవరైన నాకు దేవునిపై విశ్వాసము ఉన్నదని చెప్పినంతమాత్రాన ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము నిన్ను రక్షింపగలదా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించవలసి వలసి వచ్చినప్పుడు మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని విశ్వసించి తన ఏక కుమారుని బలి అర్పించుట ద్వారా క్రియల మూలముగా అబ్రాహాము యొక్క విశ్వాసము పరిపూర్ణమైనది. అబ్రాహాము దేవుని నమ్మెను గనుక ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని మనము తెలిసికొనవలెను.

       ప్రాణము లేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు2: 26. 
       ఇద్దరు వ్యక్తులలో ఒకరు నీకు దేవుని మీద విశ్వాసమున్నది, నేను క్రియలు చేసెదను. నీవు క్రియలు చేయకపోయిన నాకు నీ విశ్వాసమును కనపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనపరతునని చెప్పుకొనుచుండెను. అయితే ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా, ఒక వ్యక్తి యొద్ద విశ్వాసము ఉండి, మరియొకని యొద్ద క్రియలు ఉన్న యెడల ఆ వ్యక్తులు రక్షింపబడలేరు. ఎందుచేతనంటే దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు ఆలాగు నమ్ముట మంచిదే దయ్యములును నమ్మి వణకుచున్నవి గదా!  వాటికిని మనకును తేడా ఏమిటి?  అదేమనగా, క్రీస్తు ద్వారా మనకొక నిరీక్షణ  ఏర్పడినది దాని యొక్క నిజ స్వరూపము చూచుటకై మనము భూమి మీద పరదేశులమును యాత్రికులమై యున్నామని గ్రహించుకొని దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో, పునాదులుగల దేవుని పరిశుద్ద పట్టణము కొరకు విశ్వాసముతో కనిపెట్టుకొనవలెను. అందుకొరకే దేవుడు నీకు తన కుమారుని ద్వారా రక్షణ తెచ్చెను మరియు ఆయన కృప ద్వారా నీతిమంతునిగా తీర్చెను. నిన్ను మహిమ లోకమునకు ఏర్పరచుకొనెను.  
                                                                                                                          
                                                               6. నిరీక్షణ
     దేవుని చేత సృష్టింపబడిన మొదటి మనుష్యుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడిచ్చిన మహిమను  కోల్పోవుట వలన ఆదాము నుండి పాపము, మరణము మానవులలో ప్రవేశించెను. నేటి వరకు ఆదాము పొందిన మరణము మనుష్యులను ఏలుచున్నది. గనుక ప్రతి వారును మరణము పొందుచున్నారు. మనము పాపులముగా ఉండుటవలన క్రీస్తు యుక్తకాలమున మన నిమిత్తము రక్తము చిందించి మన కొరకు చనిపోయెను తన మరణము ద్వారా మనలను దేవునితో సమాధాన పరచెను. మృతులను సజీవులనుగా చేయువాడును లేనివాటిని ఉన్నట్టుగా పిలుచు వాడునైన దేవుడు క్రీస్తును లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపెను. నిద్రించిన వారిలో ప్రధమఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు. మొదటి మనుష్యుడైన ఆదాము భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు అనగా ప్రకృతి సంబంధియైనవాడు అతను జీవించు ప్రాణి అతని అవిధేయత ద్వారా పాపము మరణము వచ్చెను గనుక  మనయెడల శాశ్వత ప్రేమ గల దేవుడు అనాది కాలము నుండి ప్రకటించుచున్న ప్రకారము  దేవుడు తన కుమారుని మనకొరకు అనుగ్రహించెను. క్రీస్తు పరలోక సంబంధి అవుట వలన ఆయన పరిశుద్దుడు. ఈయన జీవము గలవాడు అనగా జీవింపజేయు ఆత్మ. శరీరధారిగా వచ్చిన క్రీస్తు మృతిపొంది మూడవ దినమున లేపబడుట వలన క్రీస్తు ద్వారా మృతుల పునరుత్ధానము ప్రారంభమాయెను ఆదాము మొదలుకొని మానవులందరు ఎలాగు మృతిపొందుచున్నారో , అలాగుననే క్రీస్తుద్వారా అందరు పునరుత్ధానము పొందుదురు. మొదటిగా క్రీస్తు పునరుత్ధానుడై తండ్రియైన దేవుని కుడి పార్శ్వమున సింహసనాసీనుడైయున్నాడు.
      మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేచుటవలన తండ్రి వాగ్ధాన ప్రకారము క్రీస్తునందు విశ్వాసముంచిన మనము లేపబడతాము అను నిరీక్షణ మనకు కలుగునట్లు క్రీస్తు ద్వారా మొదటిగా మనలను క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుటకొరకు రక్షించెను. దేవుడు ఆత్మ గనుక క్రీస్తు జీవింపజేయు ఆత్మగా ఉన్నాడు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన లేవు గనుక పరలోక సంబంధియైన క్రీస్తు ఆత్మయైయున్నాడు గనుక పరలోక సంబంధియైన క్రీస్తు యెట్టి వాడో మనము పరలోక సంబంధి పోలికను ధరించుకొనవలెను. శరీరము క్షయమైనది అనగా నశించిపోయేది క్షయమైనదిగా ఉన్న శరీరము అక్షయతను ధరించుకొనవలెను అనగా ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ఆత్మ సంబంధమైనశరీరముగా లేపబడవలెను.
       ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది. 1కొరింది. 15:44.

మనము మంటి నుండి పుట్టిన మొదటి మనుష్యుడైన ఆదాము పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధియైన క్రీస్తు పోలికను ధరించెదము.

      ఎట్లనగా,
     మనమందరము నిద్రించముగాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే ప్రభువునందు నిద్రించుచున్నవారు అనగా ప్రభువునందు మృతిచెందిన మృతులు అక్షయులుగా అనగా ఆత్మసంబంధమైన శరీరము గలవారుగా లేపబడతారు. యేసుక్రీస్తు వారిని వెంటబెట్టుకొని ఆర్భాటముతోను ప్రధానదూత శబ్ధముతోను దేవుని బూరతోను పరలోకమునుండి దిగివచ్చును.
             సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.   ఫిలిప్పీయులకు. 3:21  అప్పుడు సజీవులముగా ఉన్న మన క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడెను. అని వ్రాయబడిన లేఖనము   నెరవేరును1కొరిందీయులకు. 15:54. 

అక్షయులముగా మార్చబడిన మనము లేపబడిన వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు,కలిసికొనుటకు ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడి ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. అనగా క్రీస్తునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయన ఎదుట కూర్చుండబెట్టును. తేజోవాసులైన పరిశుద్దుల స్వాస్ధ్యమును పొందుటకు ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్య నివాసులనుగా చేసెను. కొలస్సియులకు 1:13.

          మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించి పోవును. అటు తరువాత సమస్తమును నూతనమైనవిగా అనగా, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని కలుగజేయును సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దేవాలయమైయున్నారు. ఆ దేవాలయములో సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు దేవుని మహిమయే పట్టణములో ప్రకాశించును జనములు తమ మహిమను ఘనతను దేవుని పట్టణములోనికి తీసికొని వచ్చెదరు ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దేవుని పట్టణములో ఉండదు ఆయన దాసులు ఆయనను సేవించుచు దేవుని ముఖదర్శనము చేయుచుందురు దేవుని నామము వారి నొసళ్ళయందు వ్రాయబడియుండును.  దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును క్రీస్తే దీపము జనములు దేవుని వెలుగునందు సంచరింతురు.   దేవుని రాజ్యములో దేవుని సింహసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించెదము సింహసనాసీనుడైన వాడు తానే తన గుడారములో మనలను చేర్చుకొనును. ఇక మీదట ఆకలియైనను దాహమైనను ఉండదు సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను మన ఆత్మలను తాకదు.
      ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
        ఏలయనగా, సింహసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు వారికి కాపరియై, జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి భాష్ఫబిందువును తుడిచి వేయును.     ప్రకటన 7:17. 

మరియు స్ఫటికమువలె మెరయు నట్టి జీవజలములనది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమద్యను ప్రవహించుచుండెను. ఇక్కడ జీవనది అగ్నిస్వరూపుడైన దేవుని సన్నిధి నుండి, జ్ఞాన స్వరూపియగు దీపమై యున్న క్రీస్తు సన్నిధి నుండి ప్రవహిస్తున్నది. జీవనదిలోని నీరు నిరంతరం ప్రవహిస్తుఉన్నది. కాబట్టి జీవనదిని ఆశ్రయుంచువారి జ్ఞాన దీపము ఎప్పటికి ఆరిపోదు. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దేవుని రాజ్యములో ఉండదు.దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము పరలోకరాజ్యంలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఎవని పేరైనను జీవగ్రంధమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రకటన 20:15.

                                                         7.  దేవుని పిలుపు

భూధిగంతనివాసులారా నావైపు చూచి రక్షణ పొందుడి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొనునట్లు భూదిగంతములవరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై నేను మీకొక రక్షణ శృంగమును నియమించియున్నాను అని అనాది కాలము నుండి దేవుడు ప్రకటిస్తువచ్చెను. అయితే ప్రజలు క్రైస్తవ్యము ఒక మతముగా భావించి,(క్రైస్తవము ఒక మతము కాదు, భూదిగంత నివాసులందరికి దేవుడు కలుగజేసిన రక్షణ) సర్వ మానవాళి పాప విమోచనక్రయధనముగా అర్పింపబడి రక్షణ తెచ్చిన రక్షకుని యొద్దకు రాకుండ తమ హృదయములను కటిన పరచుకొనుచున్నారు. ఇందువలన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరచుకొనుచు మనుష్యులు కల్పించుకొనిన (సాంఘిక సంస్కృతిపరమైన ఒత్తిడులు) వాటి వలన బంధింపబడినవారై బయటకు రాలేక పోవుచున్నారు. కాబట్టి బంధింపబడినవారిని, చీకటిలో నివసించుచున్నవారిని వారున్న పరిస్తితులనుండి వెలుపలికి తెచ్చుటకు దేవుడు సువార్తను భూదిగంతములవరకు వ్యాపింపజేసియున్నాడు. సువార్త ప్రకటింపబడుట అనునది దేవుని కార్యము. నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్ధము కానేరదు. యెషయా 45:23. అందుచేత దేవుడు తెచ్చిన రక్షణ సువార్త ప్రతి స్తలమందు ప్రకటింపబడుచున్నది. ఈ రక్షణ సువార్తను నమ్మిన వారు రక్షింపబడుదురు గనుక నీవు అనేకులను దేవుని వైపునకు త్రిప్పవలెనని నిన్ను పిలుచుచున్నాడు. మహోన్నతుడగు దేవుడు క్రీస్తు నామములో నన్ను రక్షించి సత్యస్వరూపియగు ఆత్మ ద్వారా సత్యమును గూర్చి సాక్షిగా ఉండుట కొరకు యిర్మియాకిచ్చిన వాగ్ధానము నీకిచ్చుచున్నాను అని వాక్యముద్వారా మాట్లడెను అదేమనగా, పెల్లగించుటకును, విరుగగొట్టుటకును నశింపజేయుటకును, పడద్రోయుటకును,కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను, రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను. యిర్మియా 1:4-10. నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేతును. యిర్మియా 33:3 అని మాట్లడెను మరియు దేవునియెడల ప్రేమను కలిగివుండుము అని ఎఫేసీయులకు 5:2వ వచనము తెలియజేసెను. అదేమనగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళవాసనగా ఉండుటకు మనకొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను, బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కాబట్టి రక్షింపబడువారిపట్లను నశించువారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనగా ఉండుట కొరకు పిలిచెను. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క ప్రేమను ఆయన త్యాగమును, ఆయన యొక్క బీకర కార్యములను గూర్చి తెలుసుకొనాలని పరిశుధ్ద గ్రంధమైన బైబిల్ ను ప్రతి దినము చదివి ధ్యానించి వాటిని అభ్యాసము చేస్తూ సంపూర్ణ సిద్ది పొందినవారై పరిపూర్ణ వ్యక్తులుగా చేయబడాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నదేమనగా తాను తన సహోదరుల మీద గర్వించి యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకుగాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంధమును చదువుచుండవలెను. ద్వితియోపదేశకాండము 17:21,22. యెహోవా గ్రంధమును పరిశీలించి చదువుకొనుడి. అది నీ ఆత్మీయ జీవితమునకు తేనెవలె మధురముగా నుండును. ఆయన నాకు ఒక వాక్యమును తెలియజేసియున్నాడు. అదేమనగా, నీతి మార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు 12:3. అందుచేత సమస్త జనములను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు సృష్టికర్తయగు దేవుడు సత్యస్వరూపియగు ఆత్మద్వారా నాకు బోధచేయుచు దేవునితో స్నేహం అను మొదటి పుస్తకమును మరియు భూదిగంతనివాసులందరికి దేవుడు కలుగజేసిన రక్షణను గూర్చి వివరించబడిన రక్షణ శృంగము అను రెండవ పుస్తకమును రచింపజేసియున్నాడు. ఈ రచనల ద్వారా దేవుని నామమునకు కీర్తి స్తోత్రమహిమలు కలగాలని మరియు అనేకులు దేవుని నీతి మార్గము ననుసరించి నడుచుకొనవలెనని దేవుని ఉద్దేశము.నీవును అనేకులను దేవునివైపు త్రిప్పుటకు ఇష్ఠపడినయెడల ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంధమైన బైబిలెను చదవటానికి ప్రేరేపింపబడులాగున వారి మనో నేత్రములు తెరువబడినవారై దేవుని గూర్చిన జ్ఞాన ఐశ్వర్యము పొందులాగున వారి కొరకు ప్రార్ధన చేయుము. తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడియున్నారు. గనుక మనకందరికి క్రీస్తు ద్వారా కలిగెడు రక్షణను గూర్చి ప్రకటింపవలెనని మనకు ఆయన అప్పగించిన రక్షణ సువార్త బోధ చేయునిమిత్తము మీరు కూడా పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. ఎందుకనగా ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో యేలాగు శరీరము యొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, అలాగే క్రీస్తు వున్నాడు. ఏ ప్రజలైన ఏ దేశస్ధులైన, దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు పరిశుద్ధాత్మ యందే బాప్తిస్మము పొందియున్నాము. శరీరము అనగా సంఘము, సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. శరీరము ఒక్కటి ఒక అవయముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. కాబట్టి క్రీస్తు అను శరీరములోని వివిధ అవయవములుగా పనిచేయుటకు మనలను ఆయన ఏర్పరచెను. అందుచేత మీరు క్రీస్తు యొక్క శరీరమైయుండి వేరువేరుగా అవయవములుగా యున్నారు. కాబట్టి కొందరిని అపోస్తలులనుగాను కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని బోధకులనుగాను, కొందరిని అద్భుతములు చేయువారినిగాను, కొందరిని స్వస్ధపరచువారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను కొందరిని నానావిధభాషలు మాటలాడువారినిగాను నియమించెను. వీరందరిపై అధికారి క్రీస్తు. కాబట్టి శరీరములో ఒక అవయవముగా శ్రమపడినప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును కదా. ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును. కాబట్టి క్రీస్తు అను సంఘములో సంఘము క్షేమాభివృద్ధి చెందునట్లు వివిధ కృపావరములతో పనిచేయుట ద్వారా ఒకే శరీరములోని అవయవమువలవలె పనిచేయుచు ఘనత పొందునప్పుడు శరీరములోని అవయవములన్నియు దానితోపాటు సంతోషించులాగున మనము కూడా వివిధ పరిచర్యలో ఉన్నవారి ప్రయాస నిమిత్తము సంతోషించుచు క్రీస్తు శరీరము అనగా సంఘము క్షేమాభివృద్ధికై ప్రయాసపడెదము. ఆయన శరీరములోని ఒక అవయవముగా పనిచేయుటకు దేవుడు మిమ్ములను పిలుచుచున్నాడు కాబట్టి మీరు క్రీస్తుని రక్షకునిగా ఒప్పుకొని సంఘక్షేమాభివృద్ధికై ప్రయాసపడి త్వరలో రాబోవుచున్నక్రీస్తును ఎదుర్కొనుటకు సిద్ధపడుము. నిర్లక్ష్యము చేసినయెడల జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన యినుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు త్రొట్టి త్రొక్కును. ప్రకటన 19:15. కాబట్టి భూధిగంతనివాసులారా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రార్ధన:- నా కొరకు ప్రాణము పెట్టిన యేసు ప్రభువా, నేను జన్మముతో పాపము చేత పట్టబడియున్నాను. నేను చేసిన ప్రతి పాపమును నీ నామములో క్షమించి నన్ను నీ రక్తప్రోక్షణ క్రిందకు అప్పగించుచున్నాను నీ రక్తముతో నా అతిక్రమములన్నియు కడిగి నన్ను ఉచితముగా నీతిమంతునిగా చేసి నన్ను నీ నామములో నీ కుమారునిగా నన్ను స్వీకరించుమని నశించిన నా ఆత్మకు నీఆత్మ వలన జీవము తెచ్చినందుకు వందనము ఇకపై నేను జీవించే జీవితము నీ రక్తప్రోక్షణ క్రింద జీవించులాగున నన్ను బలపరచి స్ధిరపరచుమని క్రీస్తు యేసు నామమున ప్రార్ధించుచున్నాను సమస్తసృష్టికి కారణభూతుడవైన తండ్రి. ఆమెన్!

      రక్షణ శృంగము అను ఈ పుస్తకము చదువుట ద్వారా మీరు యేసు క్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీతో పాటు మీ ఆత్మీయులకు ఈ వర్తమానము ప్రకటించి సమర్ధవంతమైన నైపుణ్యముగల యోధులుగా క్రీస్తు కొరకు సిద్ధపడండి. మీ ఆత్మీయులకు ఈ వర్తమానము Mail చేయండి.

Your Beloved Sister, Kiran Kumari.

Email:- praiseprinceisbrothers@gmail.com


English

–|} =====

===

</gallery> </gallery> వాలు పాఠ్యంవాలు పాఠ్యం'