వాడుకరి:Lakshmoji
అయ్యా/అమ్మా, నాపేరు సూరపనేని లక్ష్మోజి నేను కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఘంటసాలపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రములో 1990 అక్టోబర్ 25 వ తేదీ నుండి పనిచేయుచున్నాను.నేను 2000 జూలై 7 వ తేదీన స్టాటిస్టికల్ అసిస్టెంటుగ ప్రమోషన్ పొంది కృష్ణాజిల్లా,వైద్య ఆరోగ్య శాఖ,మచిలీపట్నంలో చేరినాను మళ్ళీ 2006 అక్టోబర్ 5 వ తేదీన ఉప గణాంకాధికారిగ ప్రమోషన్ పొంది మచిలీపట్నం పురపాలకసంఘంలో చేరినాను.రెండు నెలలు కాకమునుపే నామీద వ్యక్తిగత కక్షతో కొంతమంది కౌన్సిలర్లు వారి స్థాన బలముచే(వారు చెప్పిన పనులు కొన్ని చట్టమునకు వ్యతిరేకముగా వున్నవని చేయుటకు నిరాకరించినందు వలన)నన్ను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసి ఆక్రమములోమానసిక స్థైర్యము కోల్పోయి చీసిన కొన్ని చిన్నచిన్న పొరబాటులను వారి రాజకీయాధికారంతో భూతద్దంలో చూపించ,మునిసిపల్ ఛైర్పర్సన్,మరియు 25 మంది కౌన్సిలర్లు కలెక్టరు గారిని కలిసి నామీద తీవ్రమైన అభియోగములు మోపి నన్నుఆ కార్యాలయమునుండి పంపించి వేయమని కోరియున్నారు.జిల్లా కలెక్టరుగార్కి వారిచ్ఛిన వినతిపత్రము ద్వారా నన్ను మా డిపార్టుమెంటు వారు అక్కడి నుండి వేరే ప్రదేశమునకు మార్పు చేసినారు.దీనిపై నాకు తీవ్ర అన్యాయము జరిగినది.చేయనిపాపానికి బలైపోయినాను.నాకు ఎవరైనా న్యాయం చేయగలరా?నాకు సహాయం చేస్తే నిజాయితీకి చేసినట్లే.నిజాయితీకి రాజకీయ అధికారానికి మధ్య పోటీగా నేను ఈ ఆపదను స్వీకరింఛినాను.నావృత్తిలో ఆర్ధికపరమైన లావాదేవీలు ఏమీ వుండవు.వివిధ గణాంకములు తయారుచేయుట మాత్రమే వుండును. లక్ష్మోజి యం.ఐ.జి-179, ఎ.పి.హెచ్.బి.కాలని. మచిలీపట్నం కృష్ణాజిల్లా ఆంద్రప్రదేశ్