వాడుకరి:Meena gayathri.s/Kamma (caste)
కమ్మ కులం దక్షిణ భారతదేశానికి చెందిన ఒక కులం. వీరు తమ పేరు వెనుక నాయుడు అని పెట్టుకోవడం కూడా పరిపాటి.[1] ఈ కులం పై తరగతి కులంగా గుర్తించబడింది.
కొన్ని లెక్కల ప్రకారం ఎక్కువ మంది కమ్మ కులస్తులు ఉద్యోగ, వ్యాపారావసారాల కోసం అమెరికాకు వలస వెళ్ళినట్టు అంచనా.
మధ్యయుగ చరిత్ర
[మార్చు]కమ్మ కులం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని కమ్మనాడు ప్రాంతానికి చెందిన రైతు కుటుంబాల నుండి వచ్చినట్టు చెబుతారు.
కాకతీయుల కాలానికి పూర్వం
[మార్చు]చరిత్రకారుల ప్రకారం కాకతీయుల కాలానికి ముందు వెలమ కులంతో పాటు కమ్మ కులం కాపు కులం నుంచి ఉద్భవించింది. మద్రాస్ ప్రభుత్వ మ్యూజియంకు సూపరింటెండెట్ గా పనిచేసిన ఎడ్గర్ తర్స్టన్ ప్రకారం బెల్తి రెడ్డి ఆఖరి కుమారుడు ఒక మంత్రి దగ్గర నుండి తన తల్లి చెవి కమ్మలను తెలివిగా తెచ్చాడు. అప్పట్నుంచీ అతని వారసుల్ని కమ్మవారు అని పిలవడం ద్వారా కమ్మ కులం పుట్టింది. బెల్తి రెడ్డి ఇతర కుమారుల ద్వారా ఇతర కులాలు పుట్టాయని ఎడ్గర్ ప్రతిపాదన.[2]
విజయనగర సామ్రాజ్య కాలం
[మార్చు]శ్రీకృష్ణదేవరాయుల కాలంలో విజయనగర రాజధానిలో 37 గోత్రాలకు చెందిన కమ్మవారు నివసిస్తుండేవారు. విజయనగర సైన్యానికి ముఖ్య నాయకులుగా ఎదిగిన కమ్మ నాయకులు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో గవర్నర్లుగా పని చేశారు. కృష్ణదేవరాయల సైన్యానికి పెమ్మసాని రామలింగ నాయుడు ముఖ్య సేనాధిపతిగా పని చేశాడు. ఆఖరి హిందూ రాజ్యమైన విజయనగర చరిత్రలో అతని కృషి ప్రముఖమైనది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Kumari, A. Vijaya; Bhaskar, Sepuri (1998). Social Change Among Balijas: Majority Community of Andhra Pradesh. M. D. Publications. p. 89. ISBN 978-8-17533-072-6.
- ↑ Talbot, Austin Cynthia (2001), Pre-colonial India in Practice: Society, Region, and Identity in Medieval Andhra, Oxford University Press, p. 206, ISBN 978-0-19803-123-9
- ↑ Jackson, William (2005). Vijayanagara Voices. Ashgate Publishing. p. 124. ISBN 0-7546-3950-9.