Jump to content

వాడుకరి:Po.indicwiki/ప్రయోగశాల/ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
సిఈపీటీ యూనివర్సిటీ
సిఈపీటీ
నినాదంనైపుణ్య యువత రూపకల్పన
రకంప్రైవేట్
స్థాపితం1972
మాతృ సంస్థ
సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (CEPT)
బడ్జెట్ప్రైవేట్ నిధులు
అధ్యక్షుడు డాక్టర్ బిమల్ పటేల్
చిరునామఅహ్మద్ నగర్ గుజరాత్, అహ్మద్ నగర్, గుజరాత్, 380009, ఇండియా

పరిచయం‌

[మార్చు]

[1] సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (CEPT) భారతదేశం లోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఉన్న ఒక ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం. ఎన్ .ఐ .ఆర్. ఎఫ్ 2020 ర్యాంకింగ్ ప్రకారం 4వ స్థానంలో ఈ విద్యాలయం ఉంది.

కోర్సులు

[మార్చు]

ఇక్కడ యు.జీ ఐదు సంవత్సరములు, పీ.జీ రెండు సంవత్సరములు కోర్సులు ఆఫర్ చేస్తారు .ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక ఫీజు సహకారం అందిస్తారు.2018-2019 సమాచారం ప్రకారం యు .జీ ఐదు సంవత్సరముల కోర్సులలో 319 విద్యార్థులు చదువుతున్నారు .ఇందులో 135 మంది అబ్బాయిలు కాగా, 184 మంది అమ్మాయిలు .అదే విధంగా పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల విభాగంలో, పీ. జీ రెండు సంవత్సరముల కోర్సులలో 157 విద్యార్థులు చదువుతుండగా, ఇందులో 60 మంది అబ్బాయిలు కాగా, 97 మంది అమ్మాయిలు. ప్రతి కోర్సులో అమ్మాయిల, అబ్బాయిల నిష్పత్తి సూ మారు 1:0.69 ఉండడం గమనార్హం .విశ్వవిద్యాలయంలో 24 మంది విద్యార్థులు పీ హెచ్ డీ చేస్తుండగా, అందులో 0 మంది పార్ట్ టైం విద్యార్థులు.

ఉద్యోగ నియామకాలు ఉన్నత చదువులు

[మార్చు]

2018-2019 సంవత్సరంలో యు .జీ ఐదు సంవత్సరములు కోర్సుల వారి మధ్య స్థాయి వార్షిక వేతనం 4.5లక్షలు. ఉద్యోగ నియామకాలకు చూస్తున్న విద్యార్థులలో 55% సఫలం అయ్యారు. అదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల విభాగంలో, పీ .జీ రెండు సంవత్సరములు కోర్సుల వారి మధ్య స్థాయి వార్షిక వేతనం 4.9కాగా,79 శాతం మంది ఉద్యోగం సంపాదించడంలో సఫలీకృతులు అయ్యారు .అన్ని కోర్సులలో మునుపటి సంవత్సరంలో మధ్య స్థాయి వార్షిక వేతనం పెరగడం గమనార్హం.2018-2019 సంవత్సరంలో యు .జీ ఐదు సంవత్సరములు విద్యార్థులలో 45 శాతం,పీ. జీ రెండు సంవత్సరములు విద్యార్థులలో 3 శాతం, మంది పై చదువులకు వెళ్లారు.

వ్యయం

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయుల వార్షిక వేతనాలు ఇతర కాలేజీలకంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయి.2018-19 సంవత్సరంలో ఉపాధ్యాయులు ఇంకా మిగతా కార్యాలయ ాలయ సిబ్బంది వేతనాలకై 10.62కోట్లు ఖర్చు చేశారు ఈ విశ్వవిద్యాలయం వారు .అలాగే వర్క్‌షాప్‌లు, సెమినార్లు, పరిశోధనా సమావేశాలకు ఇక్కడ ఎక్కువ అధిక ప్రాధాన్యమిస్తారు .2018-19 లో వీటి కొరకు 14.22లక్షలు ఖర్చు పెట్టారు .గ్రంథాలయాన్ని, ప్రయోగశాలలను ఎప్పటికి అప్పుడు నవీకరిస్తూ ఉంటారు.2018-19 లో వీటి కొరకు 14.39లక్షలు ఖర్చు పెట్టారు.


వికలాంగులకు సౌకర్యాలు

[మార్చు]

ఇక్కడ శారీరక వికలాంగులకు సహాయపడే సౌకర్యాలు ఉన్నాయి.60 శాతంకంటే ఎక్కువ భవనాలలో ఎలివేటర్ ఇంకా ర్యాంప్‌లు ఉన్నాయి .ఒక భవనం నుండి మరో భవనానికి వెళ్ళడానికి వీల్ చైర్ వంటి వసతులు కూడా ఉన్నాయి.


మూలాలు

[మార్చు]

https://www.nirfindia.org/nirfpdfcdn/2020/pdf/Architecture/IR-A-U-0127.pdf

  1. "http://cept.ac.in/about/establishment". http://cept.ac.in/about/establishment. {{cite web}}: External link in |title= and |website= (help)CS1 maint: url-status (link)