వాడుకరి:Purushotham9966/అయాన్ రాండ్ నవల ఫౌంటెన్ హెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 అయాన్ రాండాఆమే కలంపేరు, అసలుపేరు ఆలిస్ ఒకోనార్, 1905 లో రష్యా సెయింట్ పీటర్స్ బుర్గ్ లో జన్మించింది. 1926 లో అమేరికాలో స్థిరపడింది.

1943 లో ఆమె నవల ఫౌంటెన్ హెడ్ అసామాన్య విజయం పొందింది. ఆయాన్ రాండ్ వ్యక్తివాది, ఉదారవాదాన్ని వ్యతిరేకించింది. ఆమె నవలల కాపీలు కోటి పయిగానే అమ్ముడుపోయాయి. ఫౌంటెన్ హెడ్ నవల: ఫౌంటెన్ హెడ్ నవలను అమెరికన్ నవలారచయిత్రి అయాన్ రాండ్ షుమారు 1958 ప్రాంతంలో రచించింది. మార్మికవాదం, మార్క్సిజం, కలెక్టివిజం వంటి భావనలను వ్యతిరేకిస్తూ ఆమె ఆబ్జెక్టివిజం తత్వాన్ని ఈ నవల ఫౌంటెన్ హెడ్.లొ ప్రతిపాదించింది. వ్యక్తి ప్రతిభను ఎవరూ అణచి పెట్టలేరని, రోర్కు వంటి ప్రతిభావంతుడైన భవన నిర్మాణశిల్పి అనేక అననుకూల పరిస్థితులను ఎదుర్కొని అంతిమంగా గొప్ప నిర్మాణ శిల్పిగా, ఇంజనీరుగా పేరుతెచ్చుకుంటాడు. అది అమెరికా మహానగరాలలో ఆకాశహర్మ్యాలు నిటారుగా ఆకాశాన్ని చుంబిస్తూ తలయెత్తుకొంటున్న సందర్భం. 1962 లొ ఆమె న్యూయార్కలొ మరణించింది.

అల్ప ప్రగ్ఞావంతులైన పీటర్ కీటింగ్ వంటి నకిలీ ఇంజనీర్లు మొదట పత్రికలు, భజనపరుల సహకారంతో పైకివచ్చినా, చివరన వారి స్వస్వరూపం బయటపడి అపఖ్యాతి పాలవుతారు.

టుహి వంటి అసూయాపరులైన జర్నలిస్టులు ఏమార్గంలోనైనా ప్రథానపాత్ర రోర్కు పైకిరాకుండా సర్వశక్తులు ఒడ్డుతారు.

వైనాండ్ తన ధనబలం, పత్రికల బలంతో ఏమైనా సాధించగలనన్న పెట్టుబడిదారు. చివరకు మంచివైపు నిలబడినా, ఆత్మబలంలేక అల్లరిమూకల దాడికి భయపడి తలవంచి, పేరును, భార్య డోమినిక్ ను పోగొట్టుకుంటాడు. నవలలో ప్రకృతి వర్ణనలు, పాత్రల వేషభాషలు తరచు ప్రతీకాత్మకంగా అనిపిస్తాయి. 850 పుటల నవల.

ఈనాటి మన సమాజానికి ఈ నవలకు ఎన్నో పోలికలు, పత్రికాధిపతులు సమాజంలో అవిద్యావంతులైన ప్రజలకు నీచాభిరుచులను, నేరాలు ఘోరాలు పతాకశీర్షికలలో వండి వడ్డిస్తున్నారు, ప్రజల అభిరుచులను ఇచ్చవచ్చినట్లు మరల్చి ఆడ్డుకొగుతున్నారు.

ఈ పుస్తకం ముఖపత్రం మీద ఉదయించే సూర్యుడు మనిషి అజేయుడని చెప్పడానికి ప్రతీక! మానవ సృజనాత్మక శక్తిమీద గొప్ప నమ్మకం కలిగించే నవల.

డాక్టర్ రెంటాల వెకటేశ్వరరావు ఈ నవలను తెలుగులోకి అనువాదం చేసాడు.