వాడుకరి:Purushotham9966/కృష్ణ బభిని దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృష్ణ బభిని దాస్ (Krishnabhabini Das,1864-1919)పెళ్ళైన తర్వాత ఆరేళ్ళ కుమార్తె ను తల్లదండ్రులకు అప్పగించి భర్తవెంట లండన్ వెళ్ళిపోయింది. ఆమె భర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బంధువర్గంలోనివాడు. ఆమె విద్యావంతులైన మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఇగ్లండు వెళ్ళేముందే ఆదేశభాష, వేషం అలవాటు చేసుకొన్నది. భర్త ICS పాసైనా వయోపరిమితి దాటిపోవడంవల్ల ఉద్యోగంరాలేదు. అతను ICS చదివే విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ ఇంగ్లండ్ లో ఉన్నాడు. ఆసమయంలో వారి పాపకు ఇండియాలో పెళ్ళికూడా చేశారు. భర్త అకాలమరణంతో కృష్ణ భబిని బాలికావిద్య, సంస్కరణ మొదలైన రంగాలలో పనిచేసి, జీవిత చరమాంకంలో ఆధ్యాత్మికంగా గడిపింది. ఆమె భర్త వెంట లండన్ వెళ్ళిన తర్వాత, ఓడ ప్రయాణం, లండన్ జీవితాన్ని గురించి వంగభాషలో రాసి తనవారిచేత ఆ యాత్రాచరిత్రను, లండన్ అనుభవాలను రచయిత్రి పేరు లేకుండా(అనానమస్)గా ప్రచురింపజేసింది. తర్వాత ఈపుస్తకం ఇంగ్లీషు లోకి కూడా అనువదించబడింది. తన పుస్తకం ఆరంభంలో ముగింపులో ఆమె వంగభాషలో కవిత్వంలో ఆమె దేశభక్తి, రాజకీయ అవగాహన వ్యక్తమయింది.

మూలాలు:1.A Bengali Lady in England by Krishnabhabini Das (1885)2. ఇంగ్లీషులో లభ్యమవుతున్న కృష్ణబభని దాస్ మీద వ్యాసాలు