వాడుకరి:Purushotham9966/జిందగీ తమాషా పాకిస్తాన్ సినిమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాకిస్తాన్ లో తీయబడిన ఈ సినిమా జిందగీ తమాషాలో  హిందీ, పంజాబీ  రెండు భాషలలోను సంభాషణలు సాగుతాయి. వృద్ధులను చిన్న సంఘటనలో, మనసమాజంలో పొరబాటుగా అర్థం చేసుకొని, కేటాగా పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తుందో, అతనితో కుటుంబ సభ్యలు కుడా యెంత అన్యాయంగా వ్యవహరిస్తారో జిందగి తమాషా చక్కగా చూపుతుంది.

సినిమా కథ రాహత్ ఖ్వాజా అనే 70 ఏళ్ళు పైబడిన వృద్ధునిచుట్టూ తిరుగుతుంది. అతను డలారి, ఇళ్ళ స్థలాలు అమ్మిపెట్టి ఆ కమిషన్ తో కుటుంబ పోషణ. భార్య మంచంపట్టి ఉంటుంది. తనే వంటపని, ఇంటిపనులు చేసి భార్యను ప్రాణప్రదంగా చూచుకొంటూ ఉంటాడు. కూతురు సాదత్, అల్లుడు వేరుగా ఉంటారు. కూతురు అప్పుడప్పుడు వచ్చి తల్లిని, తండ్రిని చూచి పోతూ ఉంటుంది. ఆమె లాహోర్ స్థానిక టివి ఛానల్ లో ప్రొడ్యూసర్, కాస్త మేథావి వర్గానికి చెందినదని భావించవచ్చు. రాహత్ బాగా మతవిశ్వాసాల ప్రకారం జీవించే వ్యక్తి. అవకాశం దొరికినప్పుడల్లా మసీదులో, మత సమావేశాల్లో మహ్మద్ ప్రవక్తపైన సన్నుతిగీతాలు శ్రావ్యంగా పాడుతాడు. అతను ఉండే మొహాల్లాలో సజ్జనుడని మంచి పేరుంది. రాహత్ పరిచయస్తుల పెళ్లికి హాజరైనపపుడు అతని సమవయస్కులు పెళ్ళి మండపంలో పిచ్చాపాటి మాట్లాడుతూ, "నీవు బాల్యంలో బాగా నృత్యం చేశేవాడివి కదా, గుర్తుందా, మర్చిపోయావా" అని అడుగుతారు. "ఏది నాలుగు అడుగులు వేసి అభినయించి చూపు" అని అతన్ని బలవంతపెడతారు. తప్పించుకోను వీలుపడక, పెళ్ళి మంటపంలో ఒక వృత్తి గాయకి పాడుతున్న విషాదగీతం జిందగీ తమాషాకు రాహత్ అభినయం చేసి చూపుతాడు. ఎవరో అతని అభినయాన్ని విడియో తీసి ఇంటర్ నెట్ లో పెట్టడంతో అది వైరల్ అయి, "ఈ ముసలోడికి ఇదేంపోయేకాలం, వృద్ధుడు నృత్యం చేయడం విడ్డూరంగా ఉంది" అని పాకిస్థానీ సంకుచిత, మతతత్వ సమాజంలో కలకలం రేగుతుంది. ఆరోజు నుంచి రాహత్ కష్టాలు ఆరంభం. వీధిలో ఎవరూ పలకరించరు. మొహల్లాలో పిల్లలు బూతు మాటలతో దూషిస్తారు. ఈద్ పండుగ రోజుల్లో కథజరుగుతుంది. వీరింటి తినుబండారాలు ఇరుగు పొరుగు తిరస్కరిస్తారు. ఆఖరుకు కన్న కూతురు సాదత్ కూడా తండ్రిని అపార్ధం చేసుకుంటుంది. కరుడుకట్టిన మతసమాజంలో, ఒక సాధారణ పౌరుడు కొన్ని పరిస్థితుల్లో మతాచరణకు విరుద్ధంగా నృత్యం చేయడం ఒక మహా ఘోరమైన తప్పిదమవుతుంది. రాహత్ మెజారిటీ మతానికి చెందినవాడయినా, ఆ సమాజంలో ఒక అల్పసంఖ్యాక వర్గంలోకి నెట్టబడతాడు. అతని పరిస్థితిని సానుభూతితో అర్ధం చేసుకొన్న వ్యక్తి ఆ మొహల్లాలో నివసించే third gender 'కిన్నెర్' మచంలో ఉన్న భార్య మాత్రమే. హాస్యం పొరవెనుక మనుషుల వేదన, బాధ దర్శకుడు చూపించారు.

ఈ సినిమా పాకిస్థాన్ లో నిషేధానికి, అనేక ఇబ్బందులకు గురై, విడుదలకు నోచుకోలేదు. చివరకు 2019లో దర్శకుడు Utube లో ఉచితంగా విడుదల చేయవలసి వచ్చింది. పాకిస్థాన్ ప్రభుత్వం సినిమా విడుదల కాకుండా అడ్డంకులు కల్పించి, ఆస్కార్ పురస్కారం పోటీకి ఈ సినిమా పేరును ప్రతిపాదించడంలో దాని ద్వంద్వ నీతి బయటపడింది. బూసన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బహుమతి అందుకున్న తర్వాత 2020లో ఈ సినిమా యూట్యూబ్ లో అందరికి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది, కానీ సినిమా దర్శకుడు ప్రేక్షకులను దయతలిచి తనకు ఆర్థికంగా సహాయపడమని అర్థించవలసి వచ్చింది.