వాడుకరి:Purushotham9966/జీవనది, ఆరు ఉపనదులు, ఒకతల్లి ఆత్మకథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాణిక్యాంబ ఆత్మకథ " జీవనది ఆరు ఉపనదులు"

ఈ ఆత్మకథ ఒక సోషల్ డాక్యుమెంటు. 1940 నుంచి దాదాపు రచయిత్రి నాలుగు దశాబ్దాల జీవితాన్ని, జ్ఞాపకాలను ఇందులో రికార్డు చేశారు.

మాణిక్యాంబ గారికి ఆరుగురు పుత్రికలు. ఆరుగురు చదువుల సరస్వతులు. ముగ్గురు డాక్టరేట్ చేశారు, ఒకరు అనెస్థటిస్టు అయ్యారు. ఒకరు రిజర్వు బ్యాంకిలో ఉన్నతోద్యోగం చేశారు. ఒకరు సాఫ్టువేర్ ఉద్యోగం లో అమెరికాలో స్థిరపడ్డారు. మాణిక్యాంబ భర్త వేతనశర్మ, చిరుద్యోగి, నిలకడ లేకుండా నిరంతరం బదిలీలు. పరిస్థితులేమైనా మాణిక్యాంబ పట్టబట్టి తన పిల్లలందర్నీ ఉన్నత విద్యావంతుల్ని చేసింది, ఎవరికి ఏ విద్య సరిపోతుందో నిర్ణయించి పిల్లలను ప్రోత్సహించింది. ఆరోజుల్లో ఆడపిల్లకు ఉన్నతవిద్య చెప్పించడమే కాలానికి ఎదురీత. ఆమె వాళ్ళ చదువులకోసం ఎన్నెన్నో త్యాగాలు చేసింది. పిల్లలు ఇంటిపనులు చేస్తే చదువు మీద శ్రద్ధ పోతుందని పిల్లకేమీ పనులు పెట్టలేదు. పూర్ణగర్భిణి కుమార్తెచేత పబ్లిక్ పరీక్షలు రాయించింది. ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల చూచి ప్రతి ఒకరూ సహకరించారు. ఆడవారు చదివి ఎవరిని ఉద్ధరించాలి అనే భావజాలం బలంగా ఉన్నరోజుల్లో ఎవరినీ లెక్క పెట్టకుండా మాణిక్యాంబ అమ్మాయిలందరినీ ఉన్తవిద్య చదివించింది. మాణిక్యాంబ ఏడవ సంతానం రవిప్రకాష్ ఐఎఎస్. ఆడపిల్లల చదువులు ఈ ఆత్మ కథలో కేంద్ర బిందువు కనక కుమారుడి మీద ఫోకస్ తగ్గింది. పిల్ల పెళ్ళిళ్ళవిషయంలో కొంత సద్దుబాటుకు అంగీకరించింది. నాకన్నా పెద్దచదువు, ఉద్యోగం ఉన్నవాడు అల్లడైతే అతనిముందు నేను వినయంగా ఉండాలి అని పెద్దల్లుడన్నపుడు అతని భావాలను గౌరవిస్తుంది మాణిక్యాంబ. ఆమెలో మతభావాలు, అశాస్త్రీయ విషయాలమీద నమ్మకం వంటి తిరోగమన భావాలు కూడా ఉన్నాయి. నడివయసులో జాతకాలు చదివి చెప్పేవిద్యను స్వయంకృషితో అభ్యసిస్తుంది, జోస్యులవద్ద పడిగాపులు గాయలేక. జీవితాంతం ఇంగ్లీషు మీద పట్టుకు కృషికృషిచేస్తూనే ఉంటుంది. ఇవి అందరూ అనుసరించదగిన మంచివిషయాలు.


మూలాలు: జీవనది, ఆరు ఉపనదులు, ఒకతల్లి ఆత్మకథ. రచయిత్రి: ఆకెళ్ళ మాణిక్యాంబ