వాడుకరి:Purushotham9966/జూలియా మెయిట్లాండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 ఆమె పేరు జూలియా మెయిట్లాండ్, పెళ్ళికాక మునుపు ఆమె జూలియా ఛార్లెటి బ్యారేట్(Julia charaltte Barret), ఇంగ్లడులోని రిచ్మండ్ సన్నీప్రాంతంలో october 21st 1808న జన్మించింది. జూలియా, ఆమె చెల్లెలుహెట్టి కౌమారదశలోనే క్షయరోగం బారిన పడ్డారు. తల్లి వైద్యంకోసం ఇటలి, ఫ్రాన్స్ తీసుకొని వెళ్ళింది కానీ జులియాకు స్వస్థత కలిగింది గాని , హెట్టి జీవించలేదు. జులియా ఇద్దరు మేనత్తలు ఫానీ బర్నీ, సారా బర్నీ కాస్త పేరున్న నవలాకారిణులే, వారి ఉత్తరాలవల్ల జూలియా అందమయిన యువతి అని తెలుస్తూంది. 

పెద్దమేనత్త కుమారుడు జులియాను ఇష్టపడి పెళ్ళాడాలని అనుకొన్నా ఆమె కుటుంబ సభ్యుల అభిమతాన్ని లెక్క పెట్టకుండా, విధురుడు, బిడ్డల తండ్రి, వయసులో తనకన్నా చాలా పెద్దవాడు అయిన జేమ్సు థామస్ ను ఇష్టపడి పెళ్ళాడింది.

జేమ్సు థామస్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నతోద్యోగి. 1836లో గర్భవతి జూలియా ఒంటరిగా ఇండియాకు ఓడలో బయలుదేరింది. ఆమె సోదరుడు ఫ్రాంక్ గుడ్ హోప్ వరకు ఆమె వెంట వచ్చి, వీడ్కోలు పలికాడు. ఆమె ఒంటరిగా ప్రయాణించి మద్రాసులో దిగింది. ప్రసవం అయిన తర్వాత థామస్ దంపతులు మద్రాసు నుంచి విశాఖపట్నం వరకు ఓడలో ప్రయాణించి అక్కడినుండి పల్లకీలో రాజముండ్రి చేరారు. 

థామస్ రెండేళ్ళు రాజముండ్రిలో జడ్జిగా పనిచేశాడు. అక్కడే ఈ దంపతులకు కేంబ్రిడ్జి అనే కుమారుడు కలిగాడు. రెండేళ్ళ తర్వాత జడ్జి థామస్ కి రాయలసీమకు బదలీ కావడంతో థామస్ కుటుంబం పల్లకీలో బెంగుళూరు చేరారు. కుమార్తె ఎట్టా అనారోగ్యంవల్ల, జూలియా బిడ్డలను తీసుకొని ఇంగ్లండు వెళ్ళవలసివచ్చింది.

జూలియా భర్త అనారోగ్యంతో 1840లో మరణించగా, ఆమె మెయిట్లాండ్ అనే మతప్రచారకున్ని పెళ్ళిచేసుకొని ఇంగ్లండులో స్థిరపడింది. ఆమె బాలసాహిత్య కారిణిగా పేరుతెచ్చుకొంది. ఆమె లభ్య రచనలు:1. Historical Chardes(1843), 2.The Doll and her friends or Memories of lady Serphina(1852), 3.Cat and Dog or the Memories of Puss and the Caption, a story founded on fact(1854)4.Letters from Madras during the years 1836-1839. జూలియాకు చిత్రలేఖనంలో కూడా ప్రవేశం ఉంది. ఆమె వేసిన బొమ్మలను అమెరికా మ్యూజియంలో భద్రపరిచారు. జూలియా 29th january 1864లో క్షయవ్యాధితో మరణించింది. జూలియా భారత దేశం నుంచి రాసిన 27 ఉత్తరాలలో బారతీయ సమాజం గురించిన అనేక విషయాలు ప్రస్తావించింది. ఆమె లెటర్స్ ఫ్రమ్ మద్రాస్ ను పెన్నేపల్లి గోపాలకృష్ణ, కాళిదాసు పురుషోత్తం తెలుగులోకి అనువాదం చేశారు. మూలాలు: ఆమె లేఖలు తెలుగు అనువాదం:పెన్నేపల్లి గోపాలకృష్ణ, కాళిదాసు పురుషోత్తం, ఎ.పి. చరిత్ర సభలు, ఎమేస్కో సంయుక్త ప్రచురణ, హైదరాబాదు,2022.,2. Letters from Madras during the years 1836-1839.














0