వాడుకరి:Purushotham9966/జేమ్స్ ఏ. మిఛ్నర్ నవల సయొనారా
స్వరూపం
సయొనారా జేమ్స్ ఏ. మిఛ్నర్ నవల. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంనాటి పరిస్ధితుల నేపథ్యంలో రచయిత ఈనవలను రాశారు. మేజర్ గ్రూవర్ తండ్రి లాగే సైన్యంలో పనిచేయాలనే అభిలాషతో జపాన్ కు వస్తాడు.
ఉద్యోగధర్మం నిర్వహిస్తూ హన్నా ఓగి అనే జపాను యువతిని ప్రేమిస్తాడు. రోమియో జూలియట్ల జంట వలె వీరిప్రేమకథ సాగుతుంది. విభిన్న సంస్కృతులకు చెందిన ఈ ఇద్దరిమధ్య ప్రేమ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలం నాటి జాతిభావనలమీద కొత్త వెలుగు ప్రసరింపజేస్తుంది.
రెండు భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, పరాజితులు, జయించిన జాతుల నడుమ ప్రేమ కథ..1953లో రాయబడిన నవల, ఇప్పటికీ మంచి ప్రేమగాథగా పాఠకుల హృదయాలను చూరగొంటూనే ఉంది. సయొనారా నవల హాలీవుడ్ సినిమాగా విజయవంతమైంది.
Source: sayonara, a novel by James A Michener, 1953 publication.