వాడుకరి:Purushotham9966/నెల్లూరులో మణి బుక్ స్టాల్ స్థాపకులు మణి
నెల్లురులో మణి బుక్ స్టాల్ వ్యవస్థాపకుడు టి.పి.మణి జన్మతః కేరళీయుడు. 13 ఏళ్ళ వయసులో కాకినాడ వచ్చి ఏవేవో పనులు చేశాడు. చివరకు ఖాదీ బోర్డులో ఉద్యోగంలో చేరాడు. అక్కడ అవినీతి అతనికి గిట్టక రాజీనామా చేసి, నెల్లూరు చేరి బీడీలు, ఇతర వస్తువ్లులు చిన్న బంకులకు పంపిణీచేస్తూ జీవించాడు. 1979 ప్రాంతాలలో నెల్లూరులో హేతువాద సంఘం ఆరంభమయింది. ఆసంఘం ఏర్పాటు చేసిన ఉపన్యాసాలు విని, ప్రేరణ పొంది తెలుగు చదవడం నేర్చుకొని గొప్ప సాహిత్యం చదివాడు, హేతువాది అయ్యాడు. హైదరాబాదు బుక్ ట్రస్ట్ పుస్తకాలను పుస్తక ప్రియులకు అందిచేవాడు. అప్పుడే నెల్లూరు కో ఆపరేటివ్ బ్యాంక్ వెనుక వీధిలో సండే మార్కెట్ ఏర్పాటుచేశారు.(1984) మిత్రుల సహకారంతో మణి బుక్ స్టాల్ నెలకొల్పి, అభ్యుదయ సాహత్యం విక్రయించసాగాడు. అనేక సామజికోద్యమాలలో తను పాలుపంచుకొన్నాడు. క్రియాశీల కార్యకర్తగా పనిచేశాడు. ఎంతోమంది కార్యకర్తలకు దారిచూపిన వ్యక్తిగా పెరుతెచ్చుకొన్నాడు. బహుజనుడుగా పుట్టిన అతను ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొనవలసివచ్చింది. ఆలోచనలను ప్రేరేపించే అక్షరోద్యమాలు సాంఘిక గమనాన్ని నిర్దేశిస్తాయని ఆయన నమ్మాడు.
మణి కుమారుడు దుర్గేశ్ వైద్యుడుగా అనంతపురులో స్థిరపడిన తర్వాత ఆయన అనంతపూరు వెళ్ళాడు, అప్పటికే అయన వృద్ధుడు. అనారోగ్యంతో ఉన్నా నెల్లూరు పరిచయస్తులకు ఫోన్ చేసి విచారించేవాడు. 85వ ఏట, 16/6/2023 నాడు కుమారుడివద్ద అంతిమశ్వాస విడిచాడు.
సామాజిక ఉద్యమాలలో క్రియాశీలంగా పనిచేసిన మణి కోరిక ప్రకారం ఆయన దేహాన్ని బళ్లారి వైద్య కళాశాలకు ఇచ్చారు. మణి లెకపొయినా మణి బుక్ స్టాల్ ఇప్పడుకూదా కొనసాగుతొంది ఆయన ఆశయాల ప్రకారం.
మూలాలు: "ధిక్కార స్వరాలు", రచయిత: గౌరవ్, ప్రత్యామ్నాయ ప్రస్తాన కేంద్రం ప్రచురణ, పిఠాపురం, 2014, టి.పి.మణి తన దేహాన్ని, నేత్రాలను, ఇతర అవయవాలను వైద్య కళాశాలకు సమర్పణచేస్తూ రాసి ఇచ్చిన ప్రకటన అచ్చు ప్రతి,3. 17 జూన్ 201 3అన్ని నెల్లూరు ఎడిషన్ దినపత్రికలు.