Jump to content

వాడుకరి:Purushotham9966/ప్లాసిబో ఎఫెక్ట్

వికీపీడియా నుండి

ప్లాసిబో ఎఫెక్ట్ అనే మాట వైద్యంలో, వైద్య పరిశోధనల్లో తరచూ వినిపిస్తుంది. కొత్త మందులు ప్రయోగం దశలో ఉన్న సమయంలో ఆ మందులను స్వచ్ఛందంగా ప్రయోగాలకు అంగీకరించిన వ్యక్తులమీద వాడి పరీక్షలు చేస్తారు. కొంతమందికి మందు బిళ్ళలు మింగిస్తారు, కొంతమందికి మందు ఇవ్వకుండా చక్కెర బిళ్ళలు మింగిస్తారు. ఎవరికి ముందు ఇచ్చింది, ఎవరికి చక్కెర బిళ్ళలు ఇచ్చినది వైద్యులకు తప్ప మరెవరికీ తెలియదు. ప్రయోగం పూర్తయిన తర్వాత వైద్యులు, శాస్త్రవేత్తలు పరీక్షలు చేసి మందు ఎంత శక్తివంతంగా పనిచేసిందో అంచనా వేస్తారు.

ఒక్కోసారి చక్కెర బిళ్ళలు మింగిన వారికి కూడా రోగం నయం కావచ్చు. రోగికి తాను మాత్రలు మింగుతున్నానని, తనకు రోగం నయం అవుతుందని గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటుంది. దానితో శరీరం కూడా తనంతట తాను పోరాడి రోగంనుంచి విముక్తి పొందవచ్చు. మందుకన్నా ఆరోగి విశ్వాసం, వైద్యులపట్ల నమ్మకం, ముందుమీద నమ్మకం ఎక్కువగా పనిచేసి స్వస్థత చేకూరుతుంది. ఇటువంటి సందర్భంలో "ప్లేసిబో ఎఫెక్ట్" అనే మాట వాడుతారు.

ఢిల్లీ ఎయిమ్స్ కు ఒక రోగి మొండి వ్యాధితో వచ్చాడు. వైద్యులు పరీక్షలు చేసి చేటంత ప్రిస్క్రిప్షన్ రాసి మందులు వాడి, నలభై రోజుల తర్వాత రమ్మన్నారు రోగిని.

అతను చెప్పినట్టు చేసి నలభై రోజులు గడిచిన తర్వాత ఎయిమ్స్ కు వచ్చి చూపించుకోగా పూర్తిగా రోగవిముక్తి పొందినట్లు పరీక్షల్లో తెలిసింది. ప్రిస్క్రిప్షన్ చూపించమంటే, రోగి " మీరేగదా నలభై రోజులు వాడుకోమన్నారు. నలభై ముక్కలు చేసి రోజూ ఒక ముక్క మీరు చెప్పిన విధంగానే సేవించాను" అని అతను సమాధానం ఇవ్వగానే విస్తుపోవడం వైద్యులవంతైంది.

అప్పుడు వైద్యులు చర్చించి "ప్లాసిబో ఎఫెక్ట్" ఈ కేసులో పనిచేసి ఉంటుందని తీర్మానించారు. ఇది కట్టకథ కాదు. కొన్నేళ్ళ క్రితం హిందూలో వివరంగా కేసు గురించి రాశారు.

కేన్సర్ లాంటి జబ్బల్లో కూడా రోగి మనోనిశ్చయం పనిచేస్తుంది. జీవితాశ లేకపోతే ఎంత మంచి వైద్యం అందించినా బ్రతకక పోవచ్చునట.

మూలాలు:placebo Effect | NCCIH National Center for Complementary and Integrative Health (.gov) https://www.nccih.nih.gov › Health Information The placebo effect is a beneficial health outcome resulting from a person's anticipation that