వాడుకరి:Purushotham9966/బవందర్ హిందీ సినిమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2000లో విడుదలయిన హిందీసినీమా Bawandar( Sandstorm)

దర్శకుడు: జగ్ ముంద్రా, నాయికా నిష్టమయిన చిత్రం, నాయిక సంవారి పాత్రను నందితా దాస్, స్త్రీజనశాఖ అధికారిణి పాత్రను దీప్తి నావల్ పోషించారు. రాజస్థాన్ లో, ఒక గుజార్ల గ్రామంలో జరిగిన యాదార్థగాథ ఇది. భనవారీదేవిని గ్రామపెద్దలు బలవంతగా బంధించి, దారుణగా చెరుస్తారు, ఈ యదార్థమైనకేసు ఆధారంగా భవందర్ సినిమా తయారయింది. భనవారీదేవి పేరును సినిమాలో సంవారీగా మార్చారు.

సంవారీ కుమ్మరి గ్రామీణ యువతి, అత్త, మామ, భర్త, ఇద్దరు పిల్లలు, ముచ్చటయిన సంసారం. సంవారి దంపతులు ఊళ్ళోకి వస్తుండగా గ్రామపెద్దలు భర్తను కొట్టి, అతని కళ్ళముందే ఆమెను పాశవికంగా చెరుస్తారు ఒకరితర్వాత ఒకరు. శారీరిక, మానసిక వేదనతో పాటుగా, ఊళ్ళో గ్రామీణుల మధ్య పరువు పోవడం, చులకనయి, తలవంచుకోవాల్సి వస్తుంది. సంవారి ఏకాంస్తంగా మౌనంగా ఆక్రోశిస్తుంది, ఒక విదేశీ పత్రికా రిపోర్టర్ ఈ కథనంతా తవ్వి తీస్తుంది.

సంవారీ క్వారీలో పనిచేస్తూ తోటి శ్రామికమహిళల హక్కులకోసం, లంచగొండి సూపర్ వైజరుకు వ్యతిరేకంగా నిలబడబడిందన్న వార్త కేంద్రప్రభుత్వ అధికారిణి శోభాదేవి చెవినిబడి, ఆమె సంవారిని ఆ గ్రామంలో మూఢ విశ్వాసలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే, మహిళల స్వచ్ఛంద కార్యకర్తగా నియమిస్తుంది. సంవారి ఉద్యోగ ధర్మలో భాగంగా ఒక బాల్యవివాహాన్ని ఆపడానికి వీలుపడక పోలీసులద్వారా జరగనీకుండా చేస్తుంది. ఆమె చేసిన పని, ఆ గ్రామ పెద్దల క్రోధానికి లక్ష్యమవుతుంది. గ్రామంలో అధిక సంఖ్యాకులు గుజార్లు, సంవారీని, ఆమె కుటుంబాన్ని వెలివేసి, నిత్యావసరాలను కూడా వారికి అమ్మకుండా చేస్తారు.

ఆమె భర్తను చచ్చేట్లు కొట్టించి, గ్రామపెద్దలలో ముగ్గురు ఒకరితర్వాత ఒకరు ఆమె పైన అత్యాచారం చేస్తారు, గ్రామ పూజారితో సహా, కట్టి పడవేసిన మొగుడి కళ్ళముందే.

సంవారి పోలీసులను ఆశ్రయిస్తే, కేసు రిజిస్టర్ చేయరు, ప్రభుత్వ వైద్యుడు పరీక్షించి సర్టిఫికెట్ ఇవ్వడానికి కోర్ట్ ఆర్డరు తెచ్చుకోమంటాడు. ఆ కష్ట సమయంలో మహిళా శాఖ అధికారిణి శోభాదేవి సంవారీకి అండగా ఉంటుంది. మాజిస్ట్రేటు ఇంటి వద్దకు వెళితే భార్యామణితో క్లబ్ కో మరెక్కడికో వెళ్ళే న్యాయాధిపతికి ఆమెమొర వినే తీరిక ఉండదు. చివరకు కోర్టు ద్వారా రెండురోజుల తర్వాత స్టేషనులో కేసు రిజిస్టరవుతుంది.

స్థానిక పాలక పార్టీ సపోర్టుతో రేపిస్టులు యధేచ్చగా తిరుగుతుంటారు విజయగర్వంతో.

న్యాయస్థానంలో ఒక గుజార్ వకీలు సంవారికేసు తీసుకొంటాడుగానీ, తన కులం వారి వత్తిడివల్ల అత్యాచారం జరిపిన వారి తరఫున వాదిస్తాడు. పురోహిత్ అనే చిన్న వకీలు సంవారి తరఫున కేసు వాదిస్తాడు. కేసు వాయిదాలు పడుతూ ఉంటుంది, న్యాయాధిపతులు బదలీలమీద వెళ్లిపోతూ ఉంటారు.

సంవారి పూర్తిగా అననుకూల పరిస్థితుల నడుమ, సహకరించని కుటుంబ సభ్యులు, బంధువులు, పరిహసించే గ్రామీణులు, ధనమదంతో విర్రవీగే రేపిస్టులు, ఆమె పరిస్థితిని తమ ప్రచారానికి వాడుకొనే మహిళా సంఘాలవాళ్ళు, మీడియా వాళ్ళు, అసమర్ధ పోలీస్ ఉద్యోగులు, లంచగొండి డాక్టర్లు, అవినీతి మయమయిన న్యాయ వ్యవస్థ, గుజార్లకు వ్యతిరేకంగా చేస్తే ఎలెక్షన్ లో వోట్లు పడవని భావించే పాలకపక్షం మధ్య ఆమె తన న్యాయపోరాటాన్ని సాగించిన కథే సినిమా. అయిదేళ్ళ తర్వాత అత్యాచారం చేసిన నిందితులు నిరపరాధులని న్యాయస్థానంలో తీర్పు వస్తుంది. పోలీసు అధికారి సాక్ష్యాన్ని తారుమారు చేయడం కారణంగా.

కధనం విదేశీ రిపోర్టరు, ఆమె భారతీయ మిత్రుడు వీరి పరిశోధనల ద్వారా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. నందితా దాస్ నటీచిందనడం కన్నా తానే సంవారిగా నమ్మించింది.

సెన్సార్ నుంచి, కోర్టు కేసులనుంచి, గుజార్ల ఆక్షేపణలనుంచి ఎన్నెన్నో అడ్డంకులు అధిగమించి ఈ చిత్రం హిందీ, ఇంగ్షీషు, రాజస్థానీ భాషలలొ విడుదలయి, ఎన్నెన్నో పురస్కారాలు, అవవార్డులు అందుకోంది.

అత్యాచారం వంటి కేసుల్లో బాధితుల పరిస్థితులను సాధారణ ప్రేక్షకులనుంచి ఉన్నతవర్గాల వరకూ ఉన్న ఎన్నో అపోహలను, భ్రమలను సినిమా తొలగిస్తుంది. పైవర్గాల మహిళలు ఇటువంటి దారుణాలను ఒక వినోదంగా భావించడం, ఇన్ సెన్సిటివ్ గా వ్యవహరించడం అన్నీ స్ఫురిస్తాయి.

స్త్రీ జీవితమే ఒక మరుభూమా? యడారిలో ఇసుక తుపానా ?