వాడుకరి:Purushotham9966/భట్టారం రామకృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుప్రసిద్హ జర్నలిస్ట్ దంపూరు వెంకటనరసయ్య ఏకయిక కుమారుడు రామకృష్ణయ్య 11ఏప్రిల్, 1888, నాలుగేళ్ళ కుమారున్నినరసయ్య తన వితంతు సోదరి మీనాక్షమ్మకు దత్తత ఇచ్చాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం, కోర్ట్ వ్యవహారాలూ చూచుకోడంలోనే రామకృష్ణయ్య బాల్యం గడచిపోయింది. తండ్రివద్ద రాతకూతల్లో త్రిఫీడుపొంది సలహాలివ్వగలిగిన స్థాయికి ఎదిగాడు. మైనారిటీ తీరగానీ కొన్నినెలలు కోడూరు గ్రామ మునిసిఫ్ గా పనిచేసాడు. కోర్ట్ వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చిన తరవాత, వేంకటగిరి టౌన్ ఆర్.వి.ఎం హై స్చూల్లో చదువుతూ వెంకటగిరిలో పీపూల్స్ ఫ్రెండ్ ఆంగ్ల పత్రిక, పీపూల్స్ ఫ్రెండ్ ప్రెస్ కొనసాగిస్తూ, 24 వ ఏట భ్రమరాంబ అనే చిన్న నవల రాసి ప్రచురించాడు. "భ్రమరాంబ ఇది కేవలము కథకాదు,అట్లని పెద్ద నవలయు కాదు. సాంఘికమైన నవల. భ్రమరాంబ anu నాయిక చరిత్ర ఇందు వర్ణించబడెను." రామకృష్ణయ్య విద్యార్థిగా ఉంటూ, ప్రజామిత్ర ప్రచురణ సంస్థ నెలకొల్పి, A Manual of Mathamatics, మనుచరిత్ర ముడాశ్వాసాలకు నోట్స్ రచించి ప్రచురించాడు. రామకృష్ణయ్య ట్రైనింగ్ పూర్తిచేసి వేంకటగిరి ముద్దుకృష్ణయ్య హై స్కూల్ ల్లో ఉపాధ్యాయుడుగా స్థిరపడ్డాడు. ప్రయివేటుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఎ పాసయినాడు. ఇంగ్లీష్ సాహిత్యం చక్కగా చదువుకొన్న పండితుడని, మితభాషి అని, లవుకిక వ్యవహారాల్లో గట్టివాడని పేరుతెచ్చుకొన్నాడుచాలాకాలం వేంకటగిరి టౌన్ లో ఉంది, హిందూ, స్వతంత్ర, స్వరాజ్య పత్రికలకు విలేకరిగా పనిచేసాడు. ఈయన తండ్రి ప్రభావంలో మూడనమ్మకాలకు దూరంగా ఉన్నాడు. 1949లొ 60 పుట్టినరోజే మరణించాడు.

మూలాలు:1. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం రచన "ఇంగ్లీష్ జర్నలిజంలో తోలివెలుగు దంపూరు నరసయ్య",సొసైటీ ఫర్ సోషల్ చేంజ్, నెల్లూరు ప్రచురణ , 2007, 2.భట్టారం రామకృష్ణయ్య 1912.1922 దినచర్యలు.