Jump to content

వాడుకరి:Purushotham9966/మునియా పిట్టలు

వికీపీడియా నుండి

మునియా పిట్టలు తేలికపాటి బూడిదరంగులో, రంగుతోక, గట్టి ముక్కు కలిగి ఉంటాయి. ఇవి నివసించే ప్రదేశాన్ని బట్టి రంగు అటూ ఇటూగా ఉంటాయి. ఇవి లొంకురా(Lonchura genus)జాతికి చెందిన పిట్టలు. వీటిలో మేనికిన్లు, మునియాలు చేరి ఉన్నాయి. భారతదేశం, బంగ్లాదేశ్, ఇండోనేషియా,దానికి తూర్పున ఫిలిపీన్సు, పాపువా న్యూగినియా వరకు కనిపిస్తాయి. ఈ పిట్టలు ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫించ్ జాతి పిట్టలకు సంబంధించినవని కుడా అంటారు. ఇంగ్లీషులో మునియాలను mannikin అంటారు. middle Duch నుంచి ఈ పేరు వచ్చింది. mannikin ఆంటే డచ్ భాషలో లిటిల్ మాన్ లేదా బుల్లి మనిషి అని అర్థం. ఈ బుల్లి పిట్టలు సంఘజీవులు, సాధారణంగా 50 లేక 60 పక్షులు గుంపుగా సంచరిస్తాయి, ఒంటరిగా కనిపించవు. మునియాలు గింజలు, ధాన్యం, గడ్డి విత్తులు,కీటకాలను భుజిస్తాయి. మునియా పెద్ద శిఖరం వంటి గూటిని గడ్డితో కట్టుకొని అందులో పదిదాకా తెల్గటిగుడ్లు పెడుతుంది. వీటిలో కొన్ని తెగల పిట్టలు రాత్రివేళ సామూహికంగా విశ్రాంతి తీసుకోడానికి గూళ్ళు కట్టుకొంటాయి.