Jump to content

వాడుకరి:Purushotham9966/వేయిల్ మరాంగళ్ మలయాళ సినిమా

వికీపీడియా నుండి

2020 లో విడుదలయిన వేయిల్ మరాంగళ్ మలయాళ సినిమా చాలా కలవరపెడుతుంది, ఆలోచింపజేస్తుంది. కథాశం, పేదలను పనివాళ్ళుగా, దాసీలుగా, తోటమాలులుగా ఒకప్రదేశంనుంచి వందలవేల కిలో మీటర్ల దూరప్రదేశాలకు తీసుకుని వెళతారు. వాళ్ళకు ఆ వాతావరణం కొత్తది, అక్కడి భాషరాదు. యజమానులు నెలనెలా జీతాలు చెల్లించకపోతే ఆకలితో మాడిచావాల్సిందే తప్ప అడగలేరు. జీవితం ఛిద్రమైపోతుంది.

కేరళలో ఎక్కడో ముంపు ప్రదేశంలో ఇళ్ళల్లో జీవించే దళిత కుటుంబాలలో ఒక కుటుంబం భార్యా, భర్త, 13ఏళ్ళ కుమారుడు కాయకష్టంతో బ్రతుకు సాగిస్తూ, ఆ యేడు రుతుపవనాలకు వరదపొంగి నిరాశ్రయులయి, కొద్ది రోజులు ప్రభంత్వం ఏర్పాటు చేసిన కేంపులో తలదాచుకొని, తర్వాత ఉపాధికోసం టౌన్ కు వెళతారు, పోలీసులు అమాయకులను వేథిస్తారు. చివరకు ఓక బ్రోకర్ వలలో పడి, హిమాచల్ ప్రదేశ్ లో యాపిల్ తోటలో కావలికి కుదురుకుంటారు. ఆ(దంపతులు, పదిహేనేళ్ల కుమారుడు)కుటుంబానికి, రుతువులు మారి దట్టమైన మంచు వాతావరణానికి తగిన బట్టలు కాని, సరైన నివాసం కానీ ఉండవు. పిల్లవాడు అడవిలో దారితప్పి గుంటలో పడి కాలు విరగ్గొంటుకుంటాడు. ఎవరో నాటువైద్యుడు వైద్యం చేస్తాడు కానీ కాలు సరిగ్గా అతుక్కోదు. యజమాని జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో సరైన తిండి కూడా ఉండదు. నా అనేవాళ్ళుండరు. భర్త అతిశైత్యానికి జ్వరపడి ఎట్లాగో తట్టుకుంటాడు. ఆపరిస్థితుల్లో యజమాని మరొక నిర్భాగ్యుణ్ణి ఇంకా తక్కువ జీతానికిపనికి కుదుర్చుకుని వీళ్ళను పంపించివేస్తాడు. అక్కడ నుంచి ఎక్కడ కుపోవాలో, ఎక్కడ తలదాచుకోవాలో తోచదు. ఆదుకొనే నా అనేవాళ్ళుండరు. అప్పుడు కూడా అతను "పోందాం పదండి వలస పక్షులకు చోటేదొరకదా" అనడం తో సినిమా ముగుస్తుంది.

సినిమా చాలా విజువల్ గా, సంభాషణలు అతి తక్కువగా. మొదట్లో కొంచం నెమ్మదిగా నడుస్తుంది గాని చివరి అరగంట ఆనిస్సహాయ స్థితిలోకి నెట్టబడిన కుటుంబ పరిస్థితికి చలించిపోతారు ప్రేక్షకులు.

ఇందులో ప్రత్యక్షంగా ఎవరూ వారిని పీడిస్తున్నట్టుండదు. దుర్మార్గపు దోపిడీ వ్యవస్థ దర్శకుడు చక్కగా వ్యక్తంచేశాడు.


అమెరికా పత్తి పొలాల్లో ఆఫ్రికా నుంచి దిగుమతి చేసిన ఆఫ్రికన్ బానిసలచేత పనిచేయించారు. ఇదే గల్ఫ్ దేశాలలో పనిచేసే బంగ్లాదేశ్, నేపాలీల పరిస్థితి. సహజ జలపాతాలతో, జీవనదుల పక్కనే జీవించేవారిని ఎడారిదేశాల్లో పనివాళ్ళుగా పెట్టుకోడం ఇటువంటిదే.

వేయిల్ మరాంగళ్ ఆలోచింపజేసే సినిమా, మానవులు ఎంతదుర్భర పరిస్థితుల్లో కి నెట్టబడతారో సెన్సిటివ్ గా చూపించారు.