వాడుకరి:Purushotham9966/శేషం మైకిల్ ఫాతిమా మలయాళ సినిమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శేషం మైకిల్ ఫాతిమా మలయాళం సినిమా, తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. 2023 నిర్మాణం, దర్శకుడు మను సి.కుమార్. సరదా సినిమా అనిపిస్తూ ఒక యువతి తన ఆశయ సాధనలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న అడ్డంకులు అన్నింటినీ అధిగమించడానికి చెసిన కఠోర తపస్సును హాస్యంపొర వెనుక మరగుపరచి చూపించాడు, దర్శకుడు మను సి.కుమార్.తననకు ఇది తొలి సినిమా. ఫాతిమా నూర్జహాన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, విద్యాధికురాలై తనకిష్టమైన ఫుట్ బాల్ క్రీడా వ్యాఖ్యాతగా స్థిరపడాలని చేసిన ప్రయత్నాలే సినిమా కథాంశం. ఫాతిమా కేరళ ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి యవ్వనంలో ఫుడ్ బాల్ ఆడిన వాడే. ఫాతిమా ఇద్దరు అన్నలూ ఆమెను ప్రోత్సహిస్తారు. యాదృచ్ఛికంగా ఫాతిమా స్థానిక ఫుట్ బాల్ మ్యాచ్ కి కామెంటరి చెప్పవలసి వస్తుంది. దాంతో తాను వ్యాఖ్యాతగా స్థిరపడాలని ఆమె సంకల్పిస్తుంది. అన్నలు ప్రోత్సహిస్తారు. ఆశయ సాధన కోసం ఫాతిమా కొచ్చిన్ కు వెళ్లి ప్రయత్నాలు చేస్తుంది. కొచ్తిచిన్ లో ఫాతిమాను ఆమె సీనియర్ రమ్య తనతో ఉంచుకుని ఆమెకు సహాయపడుతూ ఉంటుంది. స్నేహితురాలి సహాయంతో కేరళ ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు జయేష్ నాయర్ ను కలిసి సహాయం అర్ధిస్తుంది. రెండేళ్లు ఆటనుంచి సస్పెండ్ చేయబడిన సాల్మన్ అనే సాకర్ క్రీడాకారుడు, జయేష్ నాయర్ ను కలవడానికి ఆమెకు తోడ్పడతాడు. జయేష్ ఆమెను అవమానపరుస్తాడు. కేరళ ఫుట్ బాల్ వ్యాఖ్యాతగా ప్రసిద్ధి పొందిన శివనాయర్ ను కలిస్తే తనకు అవకాశం రావచ్చని ప్రయత్నం చేస్తుంది కానీ జయేష్ ఆమె అవకాశాలను చెడగొడతాడు. ఫుట్ బాల్ క్రీడాకారుడు సాల్మన్ జయేష్ నాయర్ ను చితకబాదుతాడు. జయేష్ నాయర్ ను కొట్టిన వ్యక్తి సాల్మన్ అనే సస్పెండ్ అయిన ఫుట్ బాల్ ఆటగాడు అని ఫాతిమా పొరబాటున పత్రికల వారికి చెబుతుంది. దాంతో సాల్మన్ ను మరి రెండేళ్ళు ఫుట్ బాల్ సంఘం ఆటనుంచి సస్పెండ్ చేయడంతో సాల్మన్ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఫాతిమా ఆస్పత్రిలో సాల్మన్ని కలిసి ఆవిషయం పత్రిక వారికి తానే చెప్పానని, క్షమాపణ కోరుతుంది. ఫాతిమా ఈ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, మాటలపుట్ట, వాగుడుకాయ అయిన కారణంగా ఎదురయ్యే సమస్యలతో ఆమె స్థిరపడలేక పోవడతో, తండ్రి పెళ్ళిచూపులు ఏర్పాటు చేయడం, నిస్సంకోచంగా మాట్లాడే తత్వం వల్ల పెళ్లి చూపులు చెడిపోవడం, నాయనమ్మ, తండ్రి ఆమెమీద కోపగించుకోడం, తల్లి ఎటూ మాట్లాడలేక నలిగిపోవడం వంటి సంఘటనలు చక్కగా చిత్రీకరించబడినవి. సినిమాలో మరింత లోతుగా సమస్యను విశ్లేషించలేదని విమర్శకులు అంటారు. సాధారణ ప్రేక్షకులు బాగా ఆనందిస్తారు. కాస్త జాగ్రత్తగా సినిమా కథను రాసుకుని ఉంటే సినిమా కళాత్మకంగా ఉండేది. ఫాతిమాగా కల్యాణి ప్రియదర్శన్ చక్కగా నాటించింది. చివరకు ఫాతిమా ఒక సాధారణ ఫుట్బాల్ మ్యాచ్ కి కామెంటరి చెప్పినప్పుడు, ఒక యువతి ఆమెకు చాక్లెట్, దాంతోపాటు శివ నాయర్ చిరునామా కార్డు ఇస్తుంది. ఆమె శివనాయర్ను కలిసినప్పుడు తానే కుమార్తె ద్వారా పిలిపించానని, ఆమె కామెంటరీ చెప్పిన విడియో చూశానని, ఫుట్ బాల్ సంఘం పెద్దలతో ఇంటర్వూ ఏర్పాటు చేస్తాడు. ఆమె వ్యాఖ్యానం నచ్చినా అఖిల భారత స్థాయిలో జరిగే పోటీల్లో ఈమెచేత వ్యాఖ్యానం చెప్పించడం రిస్కేమో అని సందేహించి మరుసటి ఏడు పోటీల్లో చేప్పిస్తామని అంటారు. ఇంతలో ఫుట్ బాల్ క్రీడకు సంబంధించి ఏదో సాంకేతిక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఫాతిమా వాగుడకాయ స్వభావం వల్ల, ఆమె ఆ విషయంపైన అనర్గళంగా వ్యాఖ్యానించడంతో, ఆమె వాగ్ధాటి, క్రీడాపరిగ్జానానికి అందరూ ముగ్ధులవుతారు. ఆవిధంగా ఫాతిమా జీవితాశయం, క్రీడా వ్యాఖ్యాతగా స్థిరపడడం నెరవేరుతుంది.