వాడుకరి:Purushotham9966/స్కేటర్ గరళ్ సినిమా
స్కేటర్ గరళ్ సినిమా. రాజస్థాన్ లో ఒక కుగ్రామానికి లండన్ నుంచి 34ఏళ్ల జస్సికా అనే యువతి వచ్చి, అక్కడి చిన్న పిల్లతో స్నేహం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాల తప్ప ఆవూళ్ళో మరేమీ ఉండదు. చిన్న పిల్లవాడు అంకుశ్ చెక్కకు చక్రాలు తగిలించి లాగుతూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఆబాలుడి 13 సంవత్సరాల అక్క ప్రేరణ. ఆమెకు బడికి పోను సరైన గుడ్డలు కూడా ఉండవు. ఆమె తండ్రి చిన్న అంగడి పెట్టుకొని జీవిస్తూ, కుమార్తెను ఇంటిపనుల్లో పెట్తాడు, ప్రేరణ ఈడు వాళ్ళంతా బడికి వెళుతూంటే. ఆ అమ్మాయి నిస్పృహతో ఇంటిపనుల్లో నిమగ్నమై ఉంటుంది. జెస్సికా ఆవూరి పిల్లకు స్కేటింగ్ బోర్డులు తెచ్చి ఉచితంగా పంచుతుంది. పిల్లలందరూ బడిమానుకొని వాటితో ఆడుకొంటారు. స్కూలు మాస్టర్, కొందరు గ్రామీణులు జెస్సికా మీద పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. ఆమె ఎలాగైనా పిల్లలు స్కేటింగ్ ప్రాక్టీస్ చెయ్యడానికి ఒక రింక్ ఏర్పాటు చేయాలని సంకల్పించి మానవతా గుణం కలిగిన సంపన్నురాలి ఔదార్యంతో ఆ కుగ్రామంలో స్కేటింగ్ రింక్ కట్టించింది. పల్లెలో పిల్లలంతా అక్కడ విరామ సమయం అంతా ప్రాక్టీస్ చేస్తూ గడుపుతారు. పల్లెలో భయంకరమైన కులతత్వం, వివక్ష ఉన్నా, పిల్లలు దాన్ని మరచిపోయి అక్కడ కలిసి ఆడుతారు. జెస్సికా మిత్రుడు ఎరిక్ స్కేటింగ్ పిచ్తోళ్ళను ఆవూరికి రప్పిస్తాడు. వాళ్లు పిల్లలకు స్కేటింగ్ లో శిక్షణ ఇస్తొరు.
అంకుశ్ అక్క ప్రేరణకు స్కేటింగ్ ఒక పిచ్చి, పాషన్ అవుతుంది. ఆ గ్రామంలో ఆడపిల్లలమీద ఉన్న కఠిన నిబంధనల మధ్యే ప్రేరణ తండ్రికి తెలియకుండా ప్రాక్టీస్ చేస్తుంటుంది. స్కూల్లో ఒక పైకులానికి చెందిన విద్యార్థి ప్రేరణకు సహకరిస్తుంటాడు. ప్రేరణకు పెళ్ళిచేస్తేగాని ఆమెకు స్కేటింగ్ పిచ్చి వదలదని తండ్రి ఆమెపెళ్ళి నిశ్చయిస్తాడు, భార్య మాట కూడా వినకుండా.
పెళ్ళి తతంగం ఆరంభమౌతుంది. ప్రేరణను పెళ్ళికూతుర్నిచేస్తారు. ఆరోజే ఊళ్ళో జాతీస్థాయిలో స్కేటింగ్ పోటీ జరుగుతుంది. ప్రేరణ చివరకు తమ్ముడి సహాయంతో పెళ్లి ఇంట్లోంచి పారిపోయి పోటీలో పాల్గొని విజేతగా నిలుస్తుంది.
జెస్సికాకూ ఒక కథ ఉంది. ఎన్నో ఏళ్ళక్రితం అగ్నిప్రమాదంలో ఆవూరి వాళ్ళలో ఒకదంపతులు చనిపోయారు. వారి ఏడేళ్ళ కుమారుడు అనాథను ఒక ఇంగ్లీషు కుటుంబం తమతోపాటు లండన్ తీసుకుని పోతారు. ఆ బాలుడు పెరిగి పెద్దై ఇంగ్లీషు స్రీని వివాహం చేసుకుంటాడు. జస్సికా తండ్రి స్మృతుల జాడలు పట్టుకుని ఆవూరికి వస్తుంది.
ఒక గోండ్ బాలిక స్కేటింగ్ లో సాధించిన విజయాన్నే సినిమా గా తీశారని అంటారు. దర్శకురాలు మంజరీ మఖీజాని ఆ కుగ్రామంలో కులవివక్ష, స్త్రీలపట్ల తక్కువ చూపు, ఆడపిల్లలకు బాల్యంలోనే పెళ్ళిచెయ్యడం, ఊరిపెత్తందార్లు, ప్రభుత్వం విద్య, గ్రామీణుల పట్ల చూపే నిర్లక్ష్యం వంటి అనేక అంశాలను మాటల్లో ఏమీ చెప్పకుండానే చెప్పారు. మంజరి తన తండ్రి జన్మించిన ఊరికి ఏదైనా చేయాలనే కాంక్ష కూడా ఇందులో ఇమిడి ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని దర్శకురాలు బాగా చూపారు. వహీదా రెహమాన్ జెస్సికాకు సహకరించిన ధనికురాలుగా హుందాగా కనిపించారు.