Jump to content

వాడుకరి:Rajasekhar1961/యమపాశం (సీరియల్)

వికీపీడియా నుండి
===========
[మార్చు]

యమపాశం! =======================


***ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు కేవలం కల్పితాలు మాత్రమే!***

యమధర్మరాజు అనగానే ప్రాణాలను బలితీసుకునే కసాయి వాడు అని అనుకుంటారు. ఎందుకో నాకు ఆయనతో ఆడుకోవాలనిపించింది. అలా మెదలైనదే ఈ యమపాశం!


గమనిక :దయచేసి భాషలోపాలు మరేదైనా ఉంటే క్షమించగలరూ....

*******************


1st Episode............monthly serial

యమధర్మరాజు : చిత్రగుప్తా... ..... నాకు తెలియకుండా నా సిస్టమ్ లో ఏం మాయ చేసావే సినిమా యెవరు చూసారు.....చెప్పు చిత్రగుప్తుడు : నాకు తెలియదు ప్రభో అయినా నీ సిస్టమ్ పాస్ వర్డ్ నాకు యెలా తెలుస్తుంది ప్రభో...

యమధర్మరాజు: అరె అది "యమాహ123" రా ఇటీవలే నరపాపులు ఆ వాహనంపై యెక్కువగా బలవుతున్నారు అందుకే ఆ పేరు పెట్టా. నా సిస్టమ్ వాడిన వాడి గురించి నాకు తెలియాలి చిత్రగుప్తా.... నాకు తెలియాలి.... నాకు తెలియాలి.....

చిత్రగుప్తుడు : అటులనే ప్రభూ...ఆధునిక పరిజ్ణానంతో ఆ దోషిని గుర్తించవచ్చు..... నేను ఇక్కడ సి.సి కెమరాలు అమర్చాను ప్రభో... అందులో మనం ఆ దృశ్యాలను కల్లార చూసి తెలుసుకోవచ్చు . ఇది నరులు భూలోకంలో ఉపయోగిస్తారు

యమధర్మరాజు : అయితే వాటిని చూపుడు...

చిత్రగుప్తుడు అటులనే మహప్రభో.....సెలవియ్యండి .... దొరికారు ప్రభో...అతని పేరు నిత్యానందా.... మన సిస్టమ్ ని భూలోకం నుండి నెట్ సౌకర్యంతో పాస్ వర్డ్ ని బ్రేక్ చేసి మన సమాచారాన్ని లీక్ చేస్తున్నడు ప్రభూ అతను దైవాశ సంభూతుడిని అంటూ చెప్తూ రాసాలీలలు సాగిస్తుంటాడు ప్రభూ...వాడిని వదలకండి ప్రభూ....

యమధర్మరాజు : అటులనా.... వాడి రాస లీలల కార్యకలాపాలు... మనం చూసే జనన మరణాలను వాడు కూడా తెలుసుకొని, ఇలా అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్నమాట.... వదల నిత్యానందా...వదలా....... నిన్ను నా చెప్పుదెబ్బలతో ఛీ ఛి కొట్టిస్తా.... వస్తా తప్పక వస్తా నీ దగ్గరికి వస్తా నీ అంతు చూస్తా

చిత్రగుప్తుడు కాని ప్రభూ..... వాడికి నెట్ పరిజ్ణానం తెలుసు HTML, XHTML, JAVA, C, C++ PYHTHON, అవలీలగా రాయగలడు మీరుకూడా ఆ లాగ్వేజెస్ నేర్చుకోండి ప్రభూ

యమధర్మరాజు : అయితే ఆ నిపుణునుడిని సంప్రదింపుడు . ------------------------------------ 2nd Episode........Monthly serial

చిత్రగుప్తుడు : చిత్తం ప్రభో, పది లాంగ్వేజ్ లు సైతం ఒకే సారి రాయగలిగే యోధుడు, పంది లాగ తినే బకాసూరుడు, రోజుకి 20 గంటలు పడుకునే పోరంభోకు యెదవా ఉన్నాడు ప్రభూ... వాడే మన పాపులలో ఒకడైన "చెప్పుదెబ్బల చెంచెయ్య".

యమధర్మరాజు: అయితే నేటి నుండే వాడిని రమ్మనుడు... వానికి కోంత శిక్ష తగ్గిచెదము. నరులు భూలోకంలో 30 రోజులలో ఇంగ్లీష్ ఏలా నేర్చుకుంటారో... నేను 15 రోజులలో సకల కంప్యూటర్ భాషా పరిజ్ఞానము సంపాదించి గిన్నీస్ వాల్డ్ రికార్డ్ సృష్టిస్తా

చిత్రగుప్తుడు: అటులనే ప్రభూ... ఆ చెప్పుదెబ్బల చెంచెయ్యని రమ్మని ఇప్పుడే ఆయన మొబైల్ కి మెస్సేజ్ పంపాను.

యమధర్మరాజు: ఓరి పాపి...నాకు నీ అవసరము పడినదిరా...తీర్చెదవా?

చేంచెయ్య: అయితే రెండు షరతులు.... ఒకటి నేను వచ్చే జన్మలో సమంతకి ప్రియుడిగా పుట్టాలి రెండు లక్షల కోట్ల వారసుడిగా వర్ధిల్లాలి.అలాగైతేనే నేను మీకు చెప్తా.

యమధర్మరాజు : ఆ...హా...ఏమిరా కుర్ర పాపి... నీకు సమంత భార్య యగుటయా? మా వీక్ నెస్ లతో ఆడుకుంటుంన్నారు కదరా ఈ నరపాపులు ఇంతే. అటులనే కానిమ్ము... చిత్రగుప్తుడు : ప్రభో నాకు బ్రహ్మలోకం నుండి బ్రహ్మ మైల్ పంపాడు ప్రభూ....

యమధర్మరాజు : ఏమని పంపాడురా జెఫ్ఫా నా జెఫ్డా...

చిత్రగుప్తుడు : జనన మరణాలలో మనం తప్పుడు లెక్కలు చూపించామని కుంబకోణం జరిగిందని ...కోర్టులో కేసు వేసారు ప్రభూ... తక్షణమే కోర్టుకి హాజరు కావాలని.. లేకుంటే రేశన్ కార్డు రద్దు చేస్తారంటా ప్రభూ.....

యమధర్మరాజు : అరె జెఫ్ఫా ఇప్పుడు రేషన్ కార్డు కాదురా... కొత్తగా అధార్ కార్డు వచ్చింది ..... నేను విధేశాలలో ఉన్నానని చెప్పి రిప్లె ఇవ్వు...... ఆయనకు ఫోన్ చేస్తే కలవడంలేదని చెప్పు చిత్రగుప్తా..

చిత్రగుప్తుడు : అటులనే ప్రభూ ..... ప్రభూ...ప్రభూ....నెట్ సౌకర్యం స్తంభించనది ప్రభూ....

యమధర్మరాజు: అరే గూట్లే....మనది లిమిటెడ్ నెట్ రా....ప్రాక్సీ చేంజ్ చెయ్యిరా

చిత్రగుప్తుడు : ఆ ప్రభూ ఇప్పుడు మన సందేశం భ్రహ్మ లోకం చేరినది

యమధర్మరాజు : ఏమిటి చిత్రగుప్తా... ఆ నరలోక పాపి కంప్యూటర్ శిక్షణ బోధించడానికి ఇంకా రాలేదు...కారణం ...

చిత్రగుప్తుడు : ప్రభూ మాటలలోనె వచ్చాడు .....

యమధర్మరాజు : ఏమిరా పాపి ఆలస్యం ఏలరా? --------------------------------------------------

3nd Episode............monthly serial....

యమధర్మరాజు : ఏమా అహంకారం నిర్ధిష్ట కాలంలో రావాలని యెరుగవా???

చెంచెయ్య: లేదు యమధర్మరాజా దారిలో వస్తుంటే ... నా బైక్ కి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అందుకే ఈ ఆలస్యం.క్షమించండి..

యమధర్మరాజు : ఆ...ఆ... ఇక మన పాఠాలను ప్రారంభించరా పాపి

చెంచెయ్య: గీవ్ రెస్పెక్ట్ ఆండ్ టేక్ రెస్పెక్ట్ ఆమ్ యూర్ టీచర్. నా మెదటి ప్రశ్న "సీ.." లాంగ్వేజ్ అనగానేమి? చెప్పు చూద్దాం !

యమధర్మరాజు: "సీ...see"అనగా చూడడం, అంటే మాట్లాడే భాష కాంకుండా చూసే భాష అని అర్ధం

చెంచెయ్య: ఓరి నీ తెలివి తగలయ్యా....అదికాదురా సీ అంటే "కంప్యూటర్ లాంగ్వేజ్" అని అర్ధం. నీకు ఈ మయధర్మరాజు జాబ్ యెవ్వరు ఇచ్చారురా నిన్ను ఇంటర్వూ ఎవ్వరు చేసారురా??? నిన్ను మా భూలోకంలో నీలాంటి వాళ్లకు చిప్పలు కడిగే ఉద్యోగం లభిస్తుంన్నది.

యమధర్మరాజు : ఏమిరా నా మేధా శక్తినే పరీక్షించుటయా... అహా ...అహా... ఏమిరా నాకు ఈ పరీక్ష, ఓ నీచ మానవుని చేతిలో భంగ పడుటయా.....ఛీ ఛీ..... దీనికి తగిన పరిష్కారం మా గురువుగారైన బ్రహ్మదేవుడిని అడిగెద చిత్రగుప్తా..చిత్రగుప్తా...భ్రహ్మదేవునికి ఫోన్ చెయ్యి...మాట్లాడెదము


చిత్రగుప్తుడు: ప్రభూ...మెబైల్ లో బ్యాలెన్స్ అయిపోయినది... కేవలం ఒక్క రూపాయి మాత్రమే మిగిలి ఉన్నది ప్రభూ... మిస్సిడ్ కాల్ కి పనికి వస్తుందని ఉంచా

యమధర్మరాజు : ఏంత పని చేస్తివి చిత్రగుప్తా..... పోని మెస్సేజ్ ఆఫర్ కూడా లేదా ...

చిత్రగుప్తుడు: అది కూడా లేదు ప్రభూ, నిన్న ఇంద్రలోకంలొ రంభా, ఊర్వశీ, మేనక, తిలోత్తమలతో "డ్యాన్స్ ప్రోగ్రాం ఛాలెంజ్-5" జరిగింది వాల్లకి "వోటింగ్ "చేసాను ప్రభూ... అందుకే మెస్సేజ్ బ్యాలెన్స్ అయిపోయింది.

యమధర్మరాజు: అయితే నేనే వెళ్లి అడిగెద... నన్ను ఇంటర్వూ చేసింది ఆ బ్రహ్మే కాబట్టి ఆయనతోనే తేల్చుకుంటా... చిత్రగుప్తా....కాగితము,కలము పట్టుకరమ్ము...లీవ్ లెటర్ రాసి వెళ్లెద.

చిత్రగుప్తుడు: మరి ప్రభూ మీరు లేకుండా ఎలా ఈ సామ్రాజ్యాన్ని యెవరూ పాలిస్తారు....

యమధర్మరాజు : తొక్కలో సామ్రాజ్యం, దొంగ వెదవలు...పనికిమాలిన పాపులు, రాక్షస ముఖరవిందాలు యేమిన్నది చిత్రగుప్తా..... ఒక ఆటా? పాటా?.... యెప్పుడు వాన్ని కొట్టుడు,వీన్ని కొట్టుడు స్వర్గం అంటే ఇంద్రుడిది మన దెగ్గర ఏమున్నది తిట్లు తప్ప ప్రతి వెదవా నన్నే తిట్టుకుంటుంన్నాడు చిత్రగుప్తా...


చిత్రగుప్తుడు: చెప్పండి ప్రభూ.....తక్షణ కర్తవ్యం

యమధర్మరాజు : అయితే తక్షణమే న్యూస్ పేపర్లో "తాత్కాలికంగా పనిచేయడానికి " "అసిస్టెంట్ యమధర్మరాజుని"" రమ్మని భహిరంగ ప్రకటన చేయండి" వచ్చిన పిమ్మటే ఆ వ్యక్తిని పనిలో పెట్టుకోండి... నేను రావడానికి కనీసం యేడు రోజులు పట్టును....

చిత్రగుప్తుడు:అటులనే ప్రభూ......

-------------------------------------------------------------------- 4th Episode........Monthly serial

బ్రహ్మాలోకంలో...యమధర్మరాజు.....

బ్రహ్మలొకంలోని రక్షక భటులు: యెవరు నీవు...హు ఆర్ యు రే???

యమధర్మరాజు: నేను యమధర్మరాజుని...

బ్రహ్మలొకంలోని రక్షక భటులు: షో ..మి యూర్ "వీసా కార్డ్,ఐడి కార్డ్ , పాస్ పోర్ట్" .

యమధర్మరాజు: మరచిని....క్షమించండి.... తక్షణమే వాటిని ఫ్యాక్స్ లో జిరాక్స్ పంపించమని మా చిత్రగుప్తునికి చెప్పినాను...క్షణాల్లొ వచ్కును.

బ్రహ్మలొకంలోని రక్షక భటులు: అయినా నీ దగర ఉన్న కరెన్సీ ఇక్కడ చెల్లదు దానిని మార్పిడి చేయగలరు...

యమధర్మరాజు: అటులనే కానిమ్ము....

బ్రహ్మలొకంలోని రక్షక భటులు: ఆ అన్నీ సరిగ్గానే ఉన్నాయి వీసా కార్డ్,ఐడి కార్డ్ , పాస్ పోర్ట్... ఇతనిని బ్రహ్మ దగ్గరికి పంపండి.

యమధర్మరాజు: మే ఐ కమ్ ఇన్ సర్

బ్రహ్మ : నో...వైట్ ఫర్ సమ్ టైమ్..... స్వర్గలోకంలో "దోమల నివారణకు "సంభంధించిన మీటింగ్ జరుగుతుంది...ఆగుము..

యమధర్మరాజు: వాకే సార్ ..వాకే ....

బ్రహ్మ : ఆ ...ఆ ...కమ్ ఇన్ మై డియర్ సన్,కమ్

యమధర్మరాజు: సార్ నేను ఇంటర్వూలో యేలా పాస్ అయ్యాను సార్... నా క్వాలిఫికేషన్ యేమిటీ?

బ్రహ్మ : నీకు యేమి రాదు నాయనా... యేదో..."రికమెండేషన్ "ద్వారా నీకు ఆ యమధర్మరాజు జాబ్ ఇప్పిచ్చాను పండగచేస్కపో....

యమధర్మరాజు: అట్టనా..... మరేమో నాకు తెల్వదాయె... మరి మంచిది....ఆరోగ్యం జాగ్రత్త టైమ్ కి మందులు వేసుకోండి.... పోని మీ పోస్టుకి రిటైర్మెంటు తీసుకోండి అంటే వినరూ... సార్....సెలవు . వెలుతున్నా....వెలుతున్నా...వెళ్లాలని లేకున్నా వెలుతున్నా

-------------------------------------------------------------------

5th Episode........Monthly serial

యమలోకంలో మాయాజాలం .....

యమలోకంలో "కొత్త అసిస్టెంట్ యమధర్మరాజు " ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ శ్రీ "పిసినారి పాపారాయుడుకి" జై...జై...

పిసినారి పాపారాయుడు: పాపులనుద్దేశించి...ప్రసంగం ప్రియమైన పాపులారా... నేను మీకు ఈ విధంగా సేవచేస్తానని కలలోకూడా అనుకోలేదు. పోని జీతం కూడా తక్కువే ఇస్తారంటా కేవలం పది వేలు మాత్రమే అది నా మెబైల్ బ్యాలెన్స్ కే సరిపోదు. మీకు ఎల్లవేలలా సేవలుచేస్తూ ... శిక్ష తగ్గిస్తూ.... తోడుంటా.... చిత్రగుప్తా...నూతన పాపులను ప్రవేశపెట్టుడు.

చిత్రగుప్తుడు : తమరి ఆజ్ఞ ప్రభూ.... ఇతని పేరు "మల్లడుగు పిచ్చయ్య" ఇతను చాలా నేరాలు చేసాడు ప్రభూ.. చిన్నపిల్లల చాక్లెట్లు దొంగిలించడం,ఇతరులపై చాడీలు చెప్పడం వీడి తప్పులు ప్రభూ....

యువ యమధర్మరాజు : చివరగా పిచ్చయ్య ఆఖరి కోరిక యేమైనా ఉన్నదా?

పిచ్చయ్య : ఓ యమధర్మరాజా, నాకు హైదరాబాద్ బిర్యాని కావాలి

యువ యమధర్మరాజు : సరె, ఇప్పుడే భూలోకంనుండి పార్సల్ తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చాము, ఎవరక్కడ.... ఈ పాపిని పది మాసాల పాటు చెఱసాలలో భంధించి చిత్రహింసలు పెట్టండి.

యమ భటులు: అటులనే ప్రభూ....

యువ యమధర్మరాజు: మరో పాపిని ప్రవేశపెట్టండి....

చిత్రగుప్తుడు : పాపం చాలా అమాయకుడు ప్రభూ... అనుకోకుండా ఒక రోజు సినిమా చూద్దామని బాలక్రిష్ణ "పరమవీరచక్ర" సినిమాకి వెళ్లి ఆయన విన్యాసాలను చూసి చనిపోయాడు ప్రభూ...

యువ యమధర్మరాజు: ఓరి బాలక్రిష్ణా ఎంత పని చేస్తివిరా... అమాయక ప్రజలని ఇలా బలి తీసుకుంటావా.... అయితె ఈ పాపిని, ఏ.సీ రూములో ఉంచి,తను కోరిన ఆహారాని ఇవ్వండి

యువ యమధర్మరాజు: మరో పాపిని ప్రవేశపెట్టండి....

చిత్రగుప్తుడు : ప్రభో...ఇతనిపేరు...మైకెల్ కామకేశవ


యువ యమధర్మరాజు: ఇతను చేసిన తప్పు ఏమిటి చిత్రగుప్తా.....

చిత్రగుప్తుడు : క్షమించండి ప్రభూ...నా సిస్టమ్ లో చార్జింగ్ అయిపోయింది.... మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను ప్రభో.... మన యమలోక ప్రభుత్వం కరంటు కోత విధించింది ... మరో మూడు గంటల వరకు కరంటు రాదు. మీరు కొంత విశ్రాంతి తీసుకోండి ప్రభూ....

------------------------------------------------------------------------- 6th Episode........Monthly serial

యమలోకంలో రక్షక భటుల సందేశం :

హలో...హలో....Mr చిత్రగుప్తుల వారు మీ యమలోకంలోకంలొ యెవరో "బాంబు "పెట్టారంటా... మా ఇంటలీజెంన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఇరవై నాలుగు గంటలలో మీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తామని... ఆల్ కైదా సంస్తలు హెచ్చరిస్తున్నాయి...జాగ్రత్తా...

చిత్రగుప్తుడు: అయితే ఈ శుభవార్తను మా యువయమధర్మరాజుకి విన్నవించాలి ... ప్రభో...ప్రభో..మన లోకంలో పెద్ద బాంబు పెట్టారంటా... త్వరగా అన్ని సద్దుకోండి ప్రభూ....ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోదాం ... ప్రభూ మీకు వీసా పాస్ పోర్ట్ ఉందా???

యువయమధర్మరాజు: అరె మూస్కోర భై... ఏం మాట్లాడుతున్నావ్...జెర్ర ఆగు....చెప్తా.... హలో...హలో...యమలోకం నుండి మాట్లాడుతున్నా.... అది భూలోకమేనా...ఆ.ఆ. సరే... మీ భూలోకం నుండి యెవరైనా తీవ్రవాది చనిపోయారా???


భూలోక వాసి : ఆ ఆ ఓ పెద్ద తీవ్రవాది... ప్రపంచాన్ని గడ గడలాడించిన "ఒసామా బిన్ లాడేన్" చనిపోయాడు .


యువయమధర్మరాజు: సరే...నాకు ఇక్కడ రోమింగ్ పడుతుంది... నేను తరువాత టాక్ తా.... చిత్రగుప్తా.....తక్షణ కర్తవ్యం !

చిత్రగుప్తుడు: ప్రభూ...భూలోకం నుండి అమెరికా సైన్యాన్ని తీసుకొని ఒబామాని సహయం అడుగుదాం ప్రభూ...

యువయమధర్మరాజు: ఛీ ఛీ ...ఓ మానవునిని అడుగుటా ..అసాధ్యం ... నేనే ఆ ఒసామాతో మాట్లాడెదా.... ఓరి ఒసామా...రా.రా..రా..నా సరసకు రా.రా...

ఒసామా: నేను రాను...రా..నేను రానురా.....రాను

యువయమధర్మరాజు: చిత్రగుప్తా....వాడు రానంటున్నాడు....ఎలా.... అయినా ఈ పనికిమాలిన లోకంలో యేమున్నది... నల్లధనం కూడ యెరుగం.... ఇక్కడ చెప్పుకోవలసిన సంపద కూడా లేదు....

చిత్రగుప్తుడు: ప్రభూ...ఆయన డిమాండ్స్ ఏమిటో అడగండి ప్రభూ....

---------------------------------------------------------------

7th Episode.....Monthly serial....

యువయమధర్మరాజు: ఓరి ఒసామా యేమిరా....నీ ప్లాను..... మా దెగ్గర యేమున్నదిరా....

ఒసామా: నేను మళ్లీ బ్రతకాలి..... ఆ ఒబామాని చంపాలి...అదే నా ధ్యేయం .... లేకుంటే ఈ యమలోకం నిమిషంలో స్మాష్ అయిపోతుంది... ఒక్క భటన్ నొక్కితే చాలు.... అంతా శ్మశానం.... హా హా హా...


యువయమధర్మరాజు: అరే అంత పని చేయకురా భై.... మా ప్రభుత్వంతో మాట్లాడి నీకు న్యాయం చేస్తా.... చిత్రగుప్తా.....మీటింగ్ కి రమ్మని అందరికి కాల్ చెయ్యి అలాగే ఫ్యాక్స్ పంపు... ఈ కోర్ కమిటీలో నిర్ణయం తీసుకుందాం... లేకుంటే టీ.వీ , ఫ్.ఎమ్ రేడియోలో ప్రకటించండి.

చిత్రగుప్తుడు : వో....ఎస్....ఐ విల్ డు....రే....

యువయమధర్మరాజు: హలో..బ్రహ్మ దేవా... ఇక్కడ మా యమలోకంలో ఒసామా అనే వ్యక్తి బాంబ్ పెట్టాడు.... ఏంచెయ్యలి... అయనని మళ్లీ బ్రతికించాలంటా...లేకుంటే.. మిమ్మల్ని కూడా చంపేస్తారంటా....చెప్పండి బ్రహ్మ దేవా....

అసలే మొన్న మెన్న డ్యూటీలో జాయిన్ ఐనా.... నెల జీతం కూడా నా చేతికి రాలేదు...ఏమిటీ అగ్ని పరిక్ష.....

బ్రహ్మాదేవుడు: సరె నీ బాధ అర్ధం అయ్యిందిర భై .... మరో రెండు సంవత్సరాల తరువాత మళ్లీ భూలోకంలో పుట్టి ఆ ఒబామాని ఆయన సైన్యాని ఇంకా.... రెండు మూడు వందల అంతస్తుల బిల్డింగ్ ని కూల్చేస్తావ్ అని ఆ ఒసామాకి చెప్పి ఒప్పిచండి... నేను నా కంప్యూటర్లో ఫీడ్ చేసుకున్నా.... ఇప్పుడు చెప్పిన డాటా అంతా...

నాకు లంచ్ కీ టైమ్ అవుతుంది......భై భై...

యువయమధర్మరాజు: విన్నావ్ తమ్మి బ్రహ్మదేవుడేం చెప్పిండో..... మళ్ళీ పుడుతవంటా మళ్లీ అమెరిక పని పడుతవంటా.... ఈ రెండు సంవత్సరాలు...మంచిగ ఏ.సీ రూములో కూసోమని... చికెన్ బిరియాని మటన్ బిరియాని పెట్టమని మాకు మా ప్రభుత్వం జీ.వో పాస్ చేసింది.

ఒసామా: సరె మరి చూస్తా లేకుంటే అంతే మరి.....స్మాష్

యువయమధర్మరాజు:

అరే నీ దండం పెడ్త, పోయి రెస్ట్ తీస్కపో... నీ భాధకి రిజైన్ చేసివెల్లిపోతా..... అసలే నెల జీతం కూడా తీసుకోలే.... ఆ జీతంతో మంచి బైక్ కొనుక్కుందామనుకున్నా ...ఈ యెదవ జీవితం.......

చిత్రగుప్తుడు : ప్రభూ...ప్రభూ..మన సినియర్ యమధర్మరాజు.... రాకడ తప్పినది.... ఆయన వారంరోజులలో వస్తానన్న ఆయన ఇంకా తిరిగి రాలేదు....ఏం చేద్దాం.... అయన దున్నపోతు వాహనం హ్యాండ్ ఇచ్చిందా... ఒకసారి గూగుల్ ఎర్త్ ఓపన్ చేసి చూడండి....

యువయమధర్మరాజు: తెలియడం లేదు చిత్రగుప్తా...నాకు సైట్ ఉంది..... అయినా గుర్తించడం చాలా కష్టం చిత్రగుప్తా.....

చిత్రగుప్తుడు : ప్రభూ....టీవీలో న్యూస్ పేపర్లో, ఫ్.ఎమ్ లో యమధర్మరాజు కనబడుట లేదు అని ప్రకటన ఇద్దాం ఆచూకీ తెలిపిన వారికి తగిన నజరానా ప్రకటిస్తామని ప్రకటిద్దాం


యువయమధర్మరాజు: అటులనే కానిమ్ము...చిత్రగుప్తా....

------------------------------------------------------------------------ 8th Episode........Monthly serial

సీనియర్ యమధర్మరాజు యమలోకానికి రాకడ......

చిత్రగుప్తుడు : ప్రభూ...చేతికి యేమైనది ప్రభూ.... కాలు విరిగినట్టున్నదీ...యేమైనది ప్రభూ....

యమధర్మరాజు : ఏమిలేదు చిత్రగుప్తా...స్వర్గలోకంలోని ఉద్యానవనంలో ఉన్న గడ్డిని తినాలని నా దున్నపోతు (వాహనం )మారాం చేసింది వద్దని చెప్పా ఒక్క సారిగా ఆకాశంలో ఉన్న నన్ను ఎత్తేసింది దీనితో ఒకటే నొప్పులు కాలు విరిగింది, చేతికి గాయం అయ్యిది.

దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో చూపించుకొని వచ్చా....

ఎలా ఉన్నది మన యమలోకం .


చిత్రగుప్తుడు : ఏమున్నది ప్రభూ... మీరు వెళ్లినప్పటి నుండి...మాకు అన్ని కష్టాలే..... వరద బాధితుల్లా అయిపోయాం ప్రభూ... అయినా మీరు వెళ్లిన పని యేమైది ప్రభూ.... మీరు ఎలా ఇంటర్వూలో పాస్ అయ్యారు లేక ఇంకా ఏమైన ఉన్నదా???

యమధర్మరాజు : లేదు చిత్రగుప్తా....ఆ బ్రహ్మదేవుడు కావాలనే నన్ను ప్రమోట్ చేసాడంటా..... ఒక సాధారణ మానవుని దగ్గర మోసపోవలసి వచ్చింది. అతను చెప్పినట్టు నాకు ఏమి రాదు చత్రగుప్తా...... తక్షణమే సకల శాస్త్రములను చదివి నా టాలెంట్ చూపించి ఫస్ట్ ర్యాంక్ కొడుతా.

చిత్రగుప్తుడు : ఆల్ ద బెస్ట్ ప్రభూ... అయితె నేటి నుండే మళ్లి మీ విద్యాభ్యాసాన్ని కొనసాగించండి ప్రభూ...

చెప్పుదెబ్బల చెంచెయ్య అరె నేను అప్పుడే చెప్పిన విన్నవా యమధర్మరాజా... ఓ పెద్ద ధీరుడిలా వెళ్లి..దెబ్బలు తగిలిచ్చుకొని వచ్చారు... సరె ఇప్పటికైనా నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యండి లేకుంటే ఆ నిత్యానందా మళ్ళీ మీ సమాచారాన్ని భూలోకంలో లీక్ చేస్తడు తరువాత మీ ఇష్టం.

యమధర్మరాజు : సరె కానిమ్ము......

చెప్పుదెబ్బల చెంచెయ్య

మెదట మీరు A,B, C,D....Z వరకు నేర్చుకోండి.... సాధారణంగా చిన్నపిల్లలు ఐతే వారం రోజులలో నేర్చుకుంటారు... కాని నువ్వు నీ మట్టి బుర్రకు నెలరోజులవరకు సమయం పడుతుంది. అలాగే హోం వర్క్ చెయ్యండి

యమధర్మరాజు : నేను నిజాయితితో నేర్చుకుంటా..... *************** యమ టీవి కి స్వాగతం సుస్వాగతం....

మీరు చూస్తున్నారు....యమ టీవి... వార్తలు చదువుతున్నవారు...

"వెర్రి వెంగలప్ప"....బ్రేకింగ్ న్యూస్....

యమలోకంలో ఎ బీ సీ డీ లు నేర్చుకుంటున్న యమధర్మరాజు....

మరింత సమాచారానికి మా ప్రతినిధిని "మతిమరుపు మల్లన్న" అందిస్తారు .

చెంప్పండి మతిమరుపు మల్లన్న ఏం జరుగుతోంది.... ఆ యమలోకంలో అసలు ఆయన ఆ ఏ బీ సీ డీ లు యెందుకు నేర్చుకుంటుంన్నారు... దీని గురించి చుట్టు పక్కల పాపులు, యమభటులు చిత్రగుప్తులవారు ఏమనుకుంటుంన్నారు...


------------------------------------------------------------------

9th Episode........Monthly serial

రిపోర్టర్ : అందరూ యమధర్మరాజుని చూసి నవ్వుకుంటుంన్నారు అఖిల్... అసలు దీనికి అంతటికీ కారణం ఆ నిత్యానంద అని మన సర్వేలో తెలింది.

స్టుడియో నుండి :

చెప్పండి,"మతిమరపు మల్లన్న" గారు... ఈ విషయం ఇతర లోకాలకు తెలిసిందా.... అసలు వారు యేమి అనుకుంటారని మీరు భావిస్తున్నారు....

రిపోర్టర్ :

చూడు అఖిల్... ఇంత వరకు యెవ్వరికీ తెలియదు.... మన యమ tv కొత్తగా ప్రవేశపెట్టిన ప్రోగ్రాం "తందాం తన్నిచ్చుకుందాం"పసిగట్టింది . BBC న్యూస్ కి కూడా తెలియదు ఎక్లూసివ్ గా మనం చూస్తున్నాం అఖిల్ ఇంకా అందరూ... ఈ యమధర్మరాజుకి ఎలిమెంటరీ స్కూలు నుండి నేర్పించవలసి వస్తుందని ఆయన గుర్వుగారైన "చెప్పుదెబ్బల చెంచెయ్య" ప్రత్యేకంగా మన యమ టీ వీ కి వివరించారు అఖిల్.

ఓవర్...టు అఖిల్.... ధన్యవాదాలు మతిమరపు మల్లన్నగారు...

చివరగా ..... ఇప్పుడు....ప్రజల పోలింగ్...

యమధర్మరాజు ఏ.బీ, సీ, డీ లు చదవడం మీరు యేకీభవిస్తారా???

అవును ....ఐతె.... వై అని కాదు .....ఐతే... సై అని మెస్సేజ్ టైప్ చేసి

100 నెంబర్ కి సెండ్ చేయగలరూ.....

నేటితో ఈ "తందాం తన్నిచ్చుకుందాం" అనే ఈ కార్యక్రమానికి స్వస్తి..... మళ్లీ వచ్చే వారం కలుసుకుందాం శుభం !


-------------------------------------------------------------

10th Episode........Monthly serial

యమధర్మరాజు: చిత్రగుప్తా నేను అన్ని పదాలు ఒకే రోజులో నేర్చుకున్నాను ఏ నుండి జెడ్ వరకు అడుగుము చెప్పెదను ....

చిత్రగుప్తుడు : ఏమిటి ప్రభూ... మీరు ఇంతత్వరగా నేర్చుకుంటారని నేను కలలోకూడా అనుకోలేదు...... ఇప్పుడు మిమ్మల్ని "చెప్పుదెబ్బల చెంచెయ్య" చూస్తే చాలా మెచ్చుకుంటాడు ప్రభూ...

చెంచెయ్య : నీవు ఇలాగే కష్టపడి చదివితే ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతావ్ గాడ్ బ్లెస్స్ యు మై డియర్ యమా.... ఆల్ ద బెస్ట్ ......

యమధర్మరాజు: ఏం చెప్ప మంటారు నా బాధ.... పరువు గంగలో కలిసింది.. దీనంతటికీ కారణం ఆ "పాస్ వర్డ్ బ్రేకర్ నిత్యానందా... వదల నిత్యానందా వదలా"... వస్తా...వైట్ ఫర్ సమ్ టమ్....

చిత్రగుప్తుడు : ప్రభో ఈ మాసంలో చాలా మంది పాపులు వచ్చు చుంటిరి.... అందులో తెలంగాణా కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బలి చేసుకున్నారు ప్రభూ.....

తక్షణమే మీరు వారిని అదుపు చేయాలి... ఇక్కడ ఉండడానికి అన్ని జైల్లు నిండిపోయాయి.... వారిని దశల వారిగా రమ్మని సెలవియ్యండి అలాగే.. ప్రభూ మన స్టాఫ్ ని పెంచండి, పాపులు యెక్కువ పాలకులు తక్కువగా ఉన్నారు ప్రభూ లేకుంటే యమలోకంలో పాపులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రతిపక్షాలు....ఇతర దేవతలు తిట్టుకుంటారు ప్రభూ...

యమధర్మరాజు: అటులనే కానిమ్ము.....దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుందాం చిత్రగుప్తా మనం కూడా కొన్ని స్కీమ్ లు పెడదాం..... యమగృహప్రవేశ పథకం శ్రమధానం ఉచిత నీళ్ల సరఫరా ఉచిత గాలి సరఫరా ఉచిత కరెంట్ సరఫరా విద్య వైద్య సరఫరా పలు కార్యక్రమాలు చేద్దాం.....వచ్చే పార్లమెంట్ సమావేషాలలో బడ్జెట్ ని ఆమోదిద్దాం చిత్రగుప్తా....

చిత్రగుప్తుడు : బాగున్నవి ప్రభూ...అమలు పరచండి....

చెంచెయ్య : ఓ యమధర్మరాజా తరువాత రెండవ విభాగంలో మీరు లెక్కలు నేర్చుకోండి..... చెప్పండి ...... నాలుగు ఏళ్ళు యెంత? 4*7=???

యమధర్మరాజు: చిత్రగుప్తా ... నా "క్యాల్కులెటర్ "పట్టుకొని రమ్ము... చూసి చెప్పెదా...

చెంచెయ్య: ఎదవ ట్రిక్కులు ప్లే చెయ్యకు రేయ్ నువ్వు ఈరోజు ఎలాగైనా... "పది ఎక్కములు "నేర్చుకొని రావలే లేనిచో.... గోడ కుర్చి వేయించెదా.....


యమధర్మరాజు: నాకు సమ్మతమే..... ఈ యమధర్మ రాజు "ఒక్కసారి చదివితే.....పది సార్లు చదివినట్టు లెక్క" అడుగుము టక టకా చెప్పెదమూ.....

చెంచెయ్య: మంచిది నీకు ఆంగ్లము, గణితము రెండూ వచ్చినవి ఇప్పుడు మూడవ విభాగంలో స్ప్రోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం.....యేమంటావు యమధర్మరాజా..... ----------------------------------------------------------------------- 11th Episode........Monthly serial

యమధర్మరాజు : నేను సిద్ధమే...నేర్చుకునెదను.... చెంచెయ్య: వీరి వెరి గుడ్ బాయ్, దీని తరువాత మనం సీ లాంగ్వేజ్, నేర్చుకుంటే సరిపోతుంది... యమధర్మరాజు : ఇంతేనా , దీనితో ఆ నిత్యానందకి మూడింది. త్వరలో ఆ భూలోకానికి వస్తా నీ భరతం పడతా...

చిత్రగుప్తుడు.. ప్రభో, నాదొక చిన్న విన్నపం, మన లోకంలో ఈ పాపులకు గుర్తింపు కార్డుID మంజూరు చేయండి ప్రభూ... అలాగే యూనిఫాం కూడా ఇవ్వండి. మన పాలకులు గుర్తించలేకున్నారు..

యమధర్మరాజు : అటులనే, దానికి తగిన ఏర్పాటు చూడండి చిత్రగుప్తా...

యమభటుడు : యమధర్మరాజుగారికి పోస్ట్ ....

యమధర్మరాజు : నాకా... యెవరిదా ఆహ్వానం..... చదువుము చిత్రగుప్తా...

చిత్రగుప్తుడు: బ్రహ్మ వ్రాయునది.....


2012 లో వచ్చే "యుంగాంతం "గురించి మాట్లాడటానికి అన్ని లోకాల అధిపతులు ప్రతినిధులు హజరు కాగలరూ.... లేనిచో ...మీ జీతంలో వారం రోజుల జీతం ఇవ్వబడదు.

హెచ్చరిక... వచ్చేటప్పుడు రెండు దుప్పట్లు, స్వెటర్, తెచ్చుకోగలరూ....ఇక్కడ చాలా చలిగా ఉంది.

ఇట్లు మీ బ్రహ్మా , ధైవలోక అధ్యక్ష్యమండలి చేర్మెన్ .

యమధర్మరాజు : చిత్రగుప్తా నేను వెళ్లెదను లేకుంటే వారంరోజుల జీతం పోవును.....

చిత్రగుప్తుడు: ప్రభూ...జాగ్రత్తా......మీ దున్నపోతు పై వెల్లకండి ప్రభూ...విమానంలో వెళ్లండి... యమధర్మరాజు :

అటులనే చిత్రగుప్తా......పొయి వచ్చెదా.......

"భ్రహ్మలోకంలో యుగాంతం 2012 మీటింగ్ " బ్రహ్మ...........

వెల్ కమ్ టు ఆల్...... టు డే వి ఆర్ డిస్కసింగ్ అబౌట్.....వాట్.....

దేవతలో ఒకడు : సార్...తెలుగులో ఏడ్వండి .... నేను తెలుగు పాఠశాలో చదివితినీ... నేను ఇంగ్లీషులో చాలా ఈకు.....

బ్రహ్మ : సరె...అందరి కోరిక మేరకు.... అరె తమ్మీ....ఇయ్యాల్ల మనం యెందుకు కల్కున్నమంటే..... యమలోకంలో జాగ లేదని ,అన్ని జైల్లు నిండిపోయాని..యమధర్మరాజు చెప్పిండు.... పోని ఇంకా యెక్కడైనా ఇద్దామంటే.... పాపుల సంఖ్య పెరిగిపోతోంది. రియల్ యేస్టేట్ భూములు భాగా పెరిగాయి.... అందుకని.....మేము అందరం కలసి... 2012 ని మరో ఇరవై సంవత్సరాలు 2032 వరకు పొడిగించాలని దైవలోక నిర్మాతల మండలి నిర్ణయించింది.


అందరికీ అంగీకారమేనా???? సరే....ఇక్కడ అందరూ సంతకాలు చేసి.... కూకురే చిప్స్ తినుకుంటూ మీ మీ లోకాలకు వెళ్ళగలరు...

-----------------------------------------------------------------------

12th Episode........Monthly serial

యమధర్మరాజు : చిత్రగుప్తా...ఒక మంచి శుభవార్త... చిత్రగుప్తుడు : ఏమిటి ప్రభూ....అదీ... యమధర్మరాజు : అదే మరో ఇరవై సంవత్సరాలు మన లోకంలో పాపుల సంఖ్య మందకోడిగా సాగును... జరిగిన మీటింగ్ లో యుగాంతం 2012 నుండి 2032 వరకు పొడిగించారు ఈ సుభసందర్భంలో అందరికీ పార్టీ ఇస్తాను చిత్రగుప్తా...

చిత్రగుప్తుడు : ప్రభూ నాకు కింఫ్ ఫిషర్ 500 బీర్ కావాలి ప్రభూ....

యమధర్మరాజు : అటులనే...చిత్రగుప్తా

చెప్పుదెబ్బల చెంచెయ్య: అరె ఏంరా... యమా , నీ సదువు ఎంతవరకు అయ్యింది. పార్టి తరువాత ముందు చదువు బే ...

యమధర్మరాజు : అదికాదు సార్.....

చెంచెయ్య: ఏది కాదురబై ఆ నిత్యానందా నీ పాస్ వర్డ్ నే కాకుండా బ్రహ్మకు కూడ బొక్క పెడుతుండంట నాకు నిన్ననే తెలిసింది.. అన్ని సీక్రేట్స్ తెలుసుకుంటుండంటా..మరి మీ ఇష్టం!

యమధర్మరాజు : చిత్రగుప్తా ..."ఆ నిత్యానందకి ఆయుషు ఎంతవరకు ఉన్నదీ"

చిత్రగుప్తుడు : ప్రభూ...వాడికి 150 సంవత్సరములు, చాలా విచిత్రంగా ఉన్నది... ఇంకా ఈ మానవుడు 105 సంవత్సరాలు జీవిస్తాడు...ప్రస్తుతం 45 సంవత్సరాలు మాత్రమే .

యమధర్మరాజు : ఐతె మనం త్వరగా చివరి" సీ లాంగ్వేజ్ "నేర్చుకోని భూలోకానికి వెళ్లి వాని పని పడదాం. సరె, చివరి అధ్యాయం ప్రారంభించండి గురుదేవా.... చెంచెయ్య: మెదట మీరు "Let us C" బుక్ చదవండి ఏమైన అర్దం కాకుంటే నన్ను అడగండీ.... "learning by doing process"

ఇటీవలే మా భూలోకంలో ట్రిపులైటీ విద్యార్ధులు దీనినే అభ్యసిస్తున్నారు. మెదట మీరు బుక్ చదవండి ఏమైన అర్దం కాకుంటే నన్ను అడగండీ. -------------------------------------------------------------------- 13th Episode........Monthly serial

యమధర్మరాజు : అటులనే కానిమ్ము.... గురుదేవా....సీ లాంగ్వేజ్ లో అరే(array) అనగానేమి??? చెంచెయ్య: ఏం లెద్ భై..... మా భూలోకంలా దొస్త్ గాల్లను అరే ...అంటరూ కాని ఈ సీ లాంగ్వేజ్ ల కూడ అట్టనే కాని "మనం ప్రోగ్రాం చేసే టప్పుడు పిలిచే డేటాని అరే అని రాస్తూ...పిలుస్తరు" అంతే సమజ్ అయ్యిందా???

యమధర్మరాజు : మస్త్ చెప్పినవ్ తమ్మీ... సాఫ్ట్ వేర్ అనగానేమి?

చెంచెయ్య: సాఫ్ట్ గ ఉంటూ ...కంప్యూటర్ తో కనక్షన్ ఉంటది.... పనికొచ్చెటివి పనికిమాలిన సమాచారం, అంతా అల్లపడేసి తాళం వేసి ఉంటది. అదే సాఫ్ట్ వేర్ .

యమధర్మరాజు : మరి హార్డ్ వేర్ అనగానేమి???

చెంచెయ్య: ఏమిరా డౌట్లు ..భాగా వస్తున్నవీ....సరే.... సింపుల్....ఇప్పుడు నువ్వు యెలా బ్రతుకుతున్నావ్... శరీరంరో మస్తు మిశిన్లు ఉంటయ్...అందులో గుండె, మెదడు, కాళ్లు చేతులు ఇలా ఇవ్వన్నీ యెలా ఉంటాయో అదే విధంగా "కంప్యూటర్ పని చేయడానికి ఉండే వాటినే హార్డ్ వేర్" అంటారు.

యమధర్మరాజు : [printf()]ప్రింట్ ఎఫ్ అనగా నేమి???

చెంచెయ్య: నువ్వు ఏమైన ప్రోగ్రాం రాసినవన్కో... వాటిని ప్రింట్ తీకుస్కోని పోయి దాచిపెట్టుకోవడాన్ని ప్రింట్ ఎఫ్ అంటరు.

యమధర్మరాజు : మరి [scanf()]స్కాన్ ఎఫ్ అనగా.... చెంచెయ్య: [x-ray]ఎక్స్ రే లో మనబాడీలా ఏమన్న లోపం ఉంటె తెలుస్తది.... అలాగే....ప్రోగ్రాంలో ఏమైనా తప్పులు ఉంటె చెప్తది అదే స్కాన్ ఎఫ్ .

యమధర్మరాజు : (loop)లూప్...అనగానేమి. చెంచెయ్య: అరె ఏంరో...దొరికిందే చాన్స్ అన్నట్టు అన్ని నన్నే అడుగుతున్నవ్.... ఇదే లాస్ట్ ఆంన్సర్ , లుప్ అంటే.... ఒకటే స్టేట్ మెంట్ లో ఉండీ కావలినప్పుడు మల్ల మల్ల రిపీట్ అవుతాయి..... ఉదాహరణకు మా భూలోకంలో A.T.M లాగా కావలసినప్పుడల్లా డబ్బు తీసుకోవచ్చు

యమధర్మరాజు : చివరగా.... ఫంక్షన్ (function)అనగానేమి...

చెంచెయ్య:

సాధారణంగా పండగ అని అర్ధం, కాని ఇక్కడ పండగ కు అయితే అందరు బంధువులు ఒక దెగ్గరికి ఎలా వస్తరో... రాసిన ప్రోగ్రాం అంతా ఒక దెగ్గరికి రావడాన్ని ఫంక్షన్ అంటారు.

అరె అక్కడ మా ఫ్రెండ్స్ వైటింగ్...నేను పోతున్నా.... హోం వర్క్ చెయ్యి......లేకుంటే చిన్నపిల్లలతో ముక్కు చెంపలు వేయిస్తా

--------------------------------------------------------------------- 14th Episode........Monthly serial

యమధర్మరాజు : సరె...హోం వర్క్ చేస్తాలే..... చిత్రగుప్తా ..చాల తలనొప్పిగా ఉన్నది కొంచె "జెండుం బామ్" తీసుకురా .

చిత్రగుప్తుడు : లేదు ప్రభూ "విక్స్" వేసుకోండి త్వరగా తగ్గును.నిమిషా ల్లొ మటుమాయం.

యమధర్మరాజు : చిత్రగుప్తా ఆ నిత్యానందని చూడాలని నాకు కుతూహలంగా ఉన్నది. కాని ఏం చేద్ద్దాం, ఎలాగైనా వాడి పని చేయాలి చిత్రగుప్తా....

చిత్రగుప్తుడు :

అటులనే కానిమ్ము ప్రభూ మెదట మీరు ఈ డిగ్రీ పాస్ అవ్వండి. యమధర్మరాజు : అటులనే చిత్రగుప్తా..... పరిక్షా సమయం సమీపించుచున్నదీ.... ఉదయం 4 గంటలకు లేపండి చదువుకోవాలి చిత్రగుప్తుడు : సరె యమధర్మరాజా ...

యమధర్మరాజు : ఏమిటి చిత్రగుప్తా మంచి కలలో నేను రంభా మాట్లాడుకుంటుండగా లేపెదవు....

చిత్రగుప్తుడు : ప్రభూ ఈ రోజు మీకు పరీక్ష ఉన్నది మరచితిరా...వెళ్లండి ఏమిటీ హాల్ టికెట్ మరిచితిరీ తీసుకొని పొండి....

పరిక్షను దొంగలా కాకుండా దొరలా రాయండి "ఆల్ ద బెస్ట్ "

యమధర్మరాజు : చిత్రగుప్తా నేనే ఫస్ట్ ర్యాంక్ కొట్టాను....నేనే ఫస్ట్ ర్యాకు కొట్టాను.

చిత్రగుప్తుడు : కంగ్రాచ్యులేషన్ ప్రభూ....నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలో నాకు ఒక బీరు కింగ్ ఫిషర్ పానియం ఇప్పించండి ప్రభూ.... ఇక మన పేరు ప్రతి లోకంలోనూ మ్రోగుతోంది ...


--------------------------------------------------------------------- 15th Episode........Monthly serial

**********

యమ స్టూడియే నుండి ....

తందాం తన్నిచ్చుకుందాం వార్తలకి స్వాగతం....సుస్వాగతం..... మీరు చూస్తున్నది యమ టీ.వీ వార్తలు చదువుతున్నది అఖిల్...

ఇక వార్తల్ల్లొకి వెళ్లితే..... యమ లోకంలో యమధర్మరాజు ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు.... దీనికి మరింత సొల్లు చెప్పడానికి మా పోరగాడు మతిమరుపు మల్లన్న అందిస్తాడు.

చెప్పండి మతిమరపు మల్లన్న గారు...యమధర్మరాజు ఫస్ట్ ర్యాంక్ కొట్టాడా

మతిమరుపు మల్లన్న:

నాకు కూడా డౌటు గానే ఉంది వెంగలప్ప... యేదేమైనా ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఇప్పుడు ఈ యమలోకంలో పండగగా అందరూ జరుపుకుంటుంన్నారు... ఇంకా ఇంద్రలోకంలో శివుని చేతులమీదగా ఆయనకు సన్మాన కార్యక్రమంతో పాటు డిగ్రీ ప్రధానం చేస్తారు. అలాగే ఆయనకు హై కమాండ్ పెద్ద ఉద్యోగం ఇచ్చే యోచనలో ఉన్నట్టు వినికిడి వెంగలప్ప

స్టుడియో నుండి..

చెప్పండి మల్లన్న గారు.... అసలు ఆ పరిక్ష పత్రం ఎవరు తయారు చేసారు? ఎలా ఉంది? దాని నిర్వహణ అధికారులు యెవరు?

మల్లన్న: ఈ ఎక్సామ్ పేపరు చెప్పుదెబ్బల చెంచెయ్య తయారు చేసాడు ... ఇది భూలోకంలో టిపులైటీ విద్యార్ధులు రాసే మాదిరిగా ఉన్నది. ఇందులో అన్ని బిట్ క్వచ్చన్స్ మాత్రమే ఉన్నయి... మళ్లీ అందులో ఆన్ లైన్ ఎక్సామ్ కాబట్టి కొంత డాటా తప్పుగా కూడా వచ్చింది అఖిల్.... సుమరుగా అరవై మార్కులకు...ముప్పై మార్కులు తప్పుగా ఉన్నాయని ఉన్నత విద్యా మండలి వివరించింది.

ఎవరైతే వాటిని అటెంప్ట్ చేస్తారో వారికి ఫుల్ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు అఖిల్:

మల్లన్న మిగతా ముప్పై మార్కులు యమధర్మరాజు యెలా సాధించారని మీరు అనుకుంటుంన్నారు?

మల్లన్న:

యేమి లేదు అఖిల్.... ఎక్సామ్ హాల్ లో దూరం దూరం కూర్చోపెట్టక పోవడం వల్ల.... అందులో ఆయన పక్కన మంచి టాపర్స్ పడటం వల్ల ఈ ఘనత సాధించాడని చెప్పుకోవచ్చు అఖిల్... ఇంకా కాపి కొట్టడానికి చాలా సులభంగా ఉంటుంది ఇది కూడా చెప్పు దెబ్బల చెంచెయ్య ప్రణాళిక అని మనకు తెలుస్తుంది అఖిల్

అఖిల్: దీని గురించి చెప్పుదెబ్బల చెంచెయ్య ఏమంటున్నారు???

మల్లన్న: చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాడు.... పాపులలో ఒక్కడైన చెంచెయ్యను అందరూ అభినందిస్తున్నారు తన పాపాలను అన్ని మాఫీ చేసామని మరో వారం రోజులలో ఈ యమలోకం నుండి విడుదల అని ఇంకా తనకు కాబోయే భార్య సమంత అని తెగ సంబరపడిపోతున్నడు అఖిల్

మెత్తానికి ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది అఖిల్... ఇప్పుడిప్పుడే అందరూ ఆ యమధర్మరాజు కలుసుకొని అభినందిస్తున్నారు ఇంకా తన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ యెక్కుతుందని సమాచారం...అఖిల్

అఖిల్: మల్లన్న గారు...యమధర్మరాజు.....భవిష్యత్త్ లో ఇంకా యేమైనా చదవాలనుకుంటున్నాడా???

మల్లన్న:


ఆయన చాలా బిజీగా ఉన్నాడు అఖిల్. ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పుడు ప్రస్తుతం B.B.C న్యూస్ చానల్ కి ఇంటర్వూ ఇస్తున్నారు అఖిల్

ఓవర్ టు అఖిల్

అఖిల్: ధన్యవాదాలు మతిమరుపు మల్లన్న గారు....

నేటి ప్రజల ప్రశ్న...

అసలు యమధర్మరాజు ఈ ఎక్సాము పాస్ అయ్యాడు అని మీరు భావిస్తున్నారా????

అవును ఐతె.... సొల్లుగాడు అని, కాదు ఐతే....సుద్దమెద్దు అని టైప్ చేసి...


100 అనే నెంబర్ కి మీ సందేశాన్ని తెలియజేయగలరూ....

ఇంతటితో ఈ తందాం తన్నిచ్చుకుందాం కార్యక్రమం సమాప్తం....

సెలవు.... ------------------------------------------------------------------ 16th Episode........Monthly serial


స్వర్గలోకంలో సన్మానం ............

యమధర్మరాజుకి సన్మానం ...యమధర్మరాజు ఉపన్యాసం ! యమధర్మరాజు:

వేదికను అలంకరించిన పెద్దలకు, నా హృదయపూర్వక పాదాభివందనాలు డీయర్ ఫ్రెండ్స్ ఈ ఘనత ఆ నిత్యానందకు దక్కుతుంది ఎందుకంటే...అయన నా సిస్టమ్ పాస్ వర్డ్ బ్రేక్ చేయడం దానిలో భాగంగా నేను ఈ ఫస్ట్ ర్యాంకు కొట్టడం జరిగింది అందరూ నన్ను ఆదర్శంగా తీసుకోని చదివి పైకి రావాలని కోరుకుంటుంన్నాను.... ఇక నా తక్షణ కర్తవ్యం భూలోకం వెళ్ళడం ఆ నిత్యానంద అంతు చూడడం.

చిత్రగుప్తుడు : ప్రభు మీ బంగారు ఆభరణాలు ఆ వజ్రాలు ఇవ్వండి ఇక్కడే దాచెదను భూలోకంలో దొంగలు నీచ మానవులు ఉండెదరు

యమధర్మరాజు: సరె తీసుకో...

చిత్రగుప్తుడు : ప్రభూ... బట్టలు...కావలసిన సామాన్లు.అన్నీ సద్దాను ఇక వెళ్ళెదమా? ప్రభూ....మన లోకాన్ని ఎవరు చూసుకుంటారు....

యమధర్మరాజు: డోంట్ వర్రి...మన అసిస్టెంట్ యమధర్మరాజు ఉన్నాడుకదా , పదా...

చిత్రగుప్తుడు : నా దొక చిన్న విన్నపం మన యమ భటులకు కత్తులకు బదులు తుపాకులు ఇప్పించండి ప్రభూ.....సంతోషించెదరూ

యమధర్మరాజు: సరె కానిమ్ము జాగ్రత్త నా ప్రియమైన పాపులారా.... ఆ నిత్యానందకి అంతం ఉంది. నా చేతులోనే ఉంది. ఏమైన అవసరం అనిపిస్తే టోల్ ఫ్రీ నెం 121 కి కాల్ చేసి మాట్లాడండి. మేము వెళ్లున్నాం భై భై సీ యూ...టా టా.

వదల నిత్యానందా వదలా వదలా.... పగ పగ నా సిష్టమ్ పాస్ వర్డ్ బ్రేక్ చేసినందుకు పగ వస్తున్నా...వస్తునా నీ కోసం వస్తున్నా.... ----------------------------------------------------------------- 17th Episode........Monthly serial


భూలొకంలో యముడు...

యమధర్మరాజు : యేమిటీ చిత్రగుప్తా....ఇప్పుడు మనం ఎక్కడ ల్యాండ్ అవ్వలీ... మనల్ని ఎవ్వరు రిసీవ్ చేసుకుంటారు. ఆ నిత్యానంద స్వస్తలం ఎక్కడ?

చిత్రగుప్తుడు : నాకు కూడ ఏం తెలియదు ప్రభూ... ఆయనకి చాలా మంది భక్తులు ఉన్నారు ప్రభూ... దక్షణ భారతదేశంలో గొప్ప వ్యక్తిగా అవతరించాడు.

యమధర్మరాజు : అయితే మనం అంద్రప్రదేశ్ లో దిగెదము.. ఆ తరువాత ఆయనని కలుసుకునెదము అక్కడ మంచి మంచి సుందరాంగులు..హీరోలు, హిరోయిన్లు ఉండెదరు పదా

చిత్రగుప్తుడు : ప్రభూ....ఈ హైద్రబాద్ నగరం చాలా బాగున్నది.... మనం ఫోటొలు దిగుదాం మన లోకంలో గొప్పగా చెప్పుకోవచ్చు ప్రభూ...అటు చూడుము...ఆ నీటి మధ్యలో భుద్ధుని విగ్రహం ఎలా పెట్టారంటావ్ ...

యమధర్మరాజు : ఇది కూడా తెలియదా....మెదట ఆ బుద్ధుని విగ్రహం కట్టీ ఆ తరువాత నీటిని తెచ్చారు.

చిత్రగుప్తుడు : దీనిని ఏమనదెరు ప్రభూ.... మనం కూడా ఇటువంటి కట్టడాన్ని యమలోకంలో కట్టమని మన ఇంజనీర్ కి చెప్పుదాం ప్రభూ...

యమధర్మరాజు : దీనిని చార్మినార్ అంటారు. నైజాం నవాభు కట్టించాడు.

చిత్రగుప్తుడు : మీకెలా తెలుసు ప్రభూ...ఇవ్వన్ని....

యమధర్మరాజు : వచ్చేటప్పుడు నెట్ లో సర్చ్ చేసాను.

చిత్రగుప్తుడు : మీరు కేక బాబాయ్.....కేక ప్రభూ...ఏమిటీ ఆ సుందరాంగులు గోడలపై అలా ఉన్నారు....

యమధర్మరాజు : సినిమా పోస్టరు తెలియదా ....నేను కూడా అప్పుడప్పుడు నా సిస్టమ్ లో చూస్తాను. మనం కూడా వెళ్లి చూద్దాం పదా ఐమాక్స్ థియేటర్ లో...

చిత్రగుప్తుడు : ప్రభూ మన కరెన్సీ ఇక్కడ చెల్లదు....ఐనా క్రెడిట్ కార్డ్ తెచ్చారా ప్రభూ

యమధర్మరాజు : తెచ్చితినిరా నా జెఫ్ఫా ..పదా.....

చిత్రగుప్తుడు : ప్రభూ...ఆగుము ఆ హీరో ఎవరో తెలుసా "బాలక్రిష్ణ" మనదగ్గర చచ్చిన పాపుల వాళ్లలో యెక్కువగా ఈయన సినిమా చూసి వచ్చిన వాళ్లే . వద్దు ప్రభో....వద్దు.... నేను రాను .

యమధర్మరాజు : అటులనా ,ఐతే వద్దు.... నేను కూడా వెళ్లను మరి ఈ సినిమా టికెట్లు యెవ్వరికి ఇద్దాం... ---------------------------------------------------------------- 18th Episode........Monthly serial

చిత్రగుప్తుడు :: బ్లాక్ లో అమ్మేయండి ప్రభూ....

యమధర్మరాజు : చిత్రగుప్తా... చిత్రగుప్తా..... ఇతను నన్ను జైల్లో పెట్టడానికి తీసుకెల్తున్నాడు. ఇక్కడ బ్లాక్ లో అమ్మితే నేరం అంటా....ఎలా

చిత్రగుప్తుడు : కంగారు పడకండి ప్రభూ... నేను లాయర్ ని పిలిపించి బైల్ తీసుకొస్తా.... ఒక లక్ష రూపాయలు ఇప్పించండి మై హు..నా, డోంట్ వర్రి....

యమధర్మరాజు :

అబ్బ ...చిత్రగుప్తా.... అదేదో థార్డ్ డిగ్రీ అంటా కొట్టిన చోట కొట్టకుండా బాదారు... మన లోకంలో పాపులను చూసి కనికరిస్తాం కాని ఈ నరులకు కనికరం ఎరుగరు..వెదవలు.

చిత్రగుప్తుడు : ఏదేమైనా ప్రభూ....నాకు చాలా అకలిగా ఉన్నది.... కొంత అమృతంలాంటి బీర్ తాగి... హైద్రాబాద్ బిర్యాని తిందాం ప్రభూ.....

యమధర్మరాజు : అటులనే కానిమ్ము దగ్గరలో....తాజ్ బంజారా హోటల్ ఉన్నది అక్కడికి వెళ్దాం పదా....

చిత్రగుప్తుడు : నిజంగా ప్రభూ....సుఖం అంటే నరులదే... ఇక మనం పడుకోవడానికి సరైన స్వస్తలం ఎక్కడ

యమధర్మరాజు : లాడ్జీలో పడుకుందాం. ఉదయాన్నే లేచి ఆ నిత్యానంద గురించి వెతుకుదాం

చిత్రగుప్తుడు : ప్రభూ....సూర్యోదయం సమీపించినదీ. లేచి బ్రష్ వేసుకొని జలకాలాడండి ప్రభూ....

యమధర్మరాజు : చిత్రగుప్తా...ఏమిటీ వీళ్లు ఇలా పరిగెడుతున్నారు.....

చిత్రగుప్తుడు : ప్రభూ....సమంత అనే హీరోయిన్ వచ్చినది. సినిమా షూటింగ్ జరుగుతున్నది..అందుకే ఈ గందరగోలం. మనం కూడా వెళ్లి చూద్దాం పదా ప్రభూ...

యమధర్మరాజు: మరిచితివా....నాకు కూడా చూడాలని ఉన్నదీ...కాని ఆ నిత్యానంద దొరికే వరకు ఏం చూడకూడదూ... నెలలోపల పట్టుకోకపోతే మన ఇద్దరి జాబ్ లు తీసేస్తానని బ్రహ్మ మెస్సేజ్ పంపిండు.

              .............................................కాని ఆ సమయంలో ఇలియానను చూసిన యముడు అమెతో ప్రేమలో పడతాడు.

చిత్రగుప్తుడు : అటులనే ప్రభూ...కాని ఆయనను గుర్తించడం ఎలా....

---------------------------------------------------------------- 19th Episode........Monthly serial

యమదర్మరాజు : వాడు కనిపించినప్పుడు వచ్చే వాన ఆగిపోతుంది. కుక్కలన్ని ఒక్కసారిగా ఏడుస్తాయి. ఆకాశం ఎర్రబడి ఏడుస్తుంది. వాడు నవ్వే గాడిదలా కనపడుతాడు చిత్రగుప్తా...

చిత్రగుప్తుడు : మరి మనిషిలా ఎప్పుడు కనపడుతాడు ప్రభూ....

యమదర్మరాజు : మూస్కో భే...వెదవ డౌట్లు నువ్వు.. పదా ఆన్ని పట్టుకుందాం....

చిత్రగుప్తుడు : ప్రభూ...ప్రభూ...అటు చూడండి ఆ అమాయక ప్రజలని ఎలా కొడుతున్నారొ....

యమదర్మరాజు : వారు తెలంగాణావాదులు...తెలగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు.

చిత్రగుప్తుడు : అయ్యో మరి తెలంగాణా ఇవ్వొచ్చుగా ప్రభూ....

యమదర్మరాజు : అది ఆ భూలోక ప్రభుత్వ వ్యవహారం. మనకెందుకు చిత్రగుప్త..... ఇందులో చనిపోయిన వారికి...మన వంతుగా యమలోకంలో సాయంగా కొంత శిక్ష తగ్గిద్దాం.

చిత్రగుప్తుడు : ప్రభూ.....పేపర్లో ప్రకటన ఇద్దాం ... నిత్యానంద కావలెను అయన్ని పట్టించిన వారికి కోటిరూపాయలు భహుమానం అని తెలియజేద్దాం.

యమదర్మరాజు : లేదు...టీ.వీ లో ప్రకటిద్దాం.

చిత్రగుప్తుడు : ప్రభూ...వచ్చినప్పటి నుండి మనము ఒకే జత దుస్తులతో శరీరం కంపు కొడుతోంది. కొత్తవి కొనుక్కుందాం

యమదర్మరాజు : సరే.... R.S బ్రదర్స్ లో శాపింగ్ చేద్దాం పదా....

చిత్రగుప్తుడు : వద్దు ప్రభూ....కలామందిర్ లో తీసుకుందాం అక్కడ ఇంకా బాగుంటాయి .

యమదర్మరాజు : ఎక్కడో ఒక దగ్గర ఏడుద్దాం పదా....అసలే పైసల్ తక్కువగా ఉన్నయ్....

చిత్రగుప్తుడు : ప్రభూ..ప్రభూ...నిత్యానంద దొరికాడు..... బెంగళూరులో దాక్కున్నాడంటా....పదా వెళ్దాం. ------------------------------------------------------------- 20th Episode........Monthly serial

యమధర్మరాజు : ఇప్పుడు నాకు వరల్డ్ కప్పు కొట్టినంత ఆనందంగా ఉంది.... వెళ్దాం పదా..... చిత్రగుప్తుడు : ప్రభూ ఆయనకు ఆశ్రమం ఉంది...అక్కడికి వెళ్దాం. ఇంకా మనతో పాటు సైబర్ పోలీసులను,CBI వారిని తీసుకెళ్దాం ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాను కూడా రమ్మని పిలుద్దాం సమాచారాన్ని సేకరించడానికి సులభంగా ఉంటుంది .

యమధర్మరాజు : భలా చెప్పితివి చిత్రగుప్తా.. వాడిని చూడాలని నాకు కూడా చాలా కుతూహలంగా ఉన్నది.... ఇక వాడి పని అయిపోయింది.

********

యమ టీ.వీ కి స్వాగతం , "తందాం తాన్నిచ్చుకుందాం "కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు అఖిల్ ...

బ్రేకింగ్ న్యూస్ భూలోకంలో సంచరిస్తున్న యమధర్మరాజు.

అఖిల్: దీని గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి, మతిమరుపు మల్లన్న అందిస్తారు.... హలో మల్లన్నా..హలో మల్లన్నా.... క్షమించండి, మతిమరుపు మల్లన్నకి కొంచెం మెంటల్ ఎక్కి ఎర్రగడ్డ పిచ్చి ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కాబట్టి మరో ప్రతినిధితో మాట్లాడటానికి ప్రయిత్నిద్దాం .

చెప్పండి "బ్రతకలేని బాబురావు" గారు అసలు ఆ యమధర్మరాజుకి నిత్యానంద దొరుకుతాడని మీరు అనుకుంటున్నారా? మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది

బ్రతకలేని బాబురావు:

నాకు తెలిసినంత వరకు ఆ నిత్యానంద దొరకడని నా నమ్మకం ఎందుకంటే ఇంత వరకు ఆయన ఎక్కడ ఉన్నాడో పోలీసులకు కూడా తెలియదు. ఐనా...ఈ తొక్కలో యమునికి ఎలా దొరుకుతాడు అఖిల్..

దీని గురించి ఆ యమధర్మరాజు దెగ్గరికి వెళ్లి మాట్లాడదామని వెళ్లా ఆయన స్నానం చేయక రెండు వారాలు అయ్యిందని ఇంకా ఒకటే డ్రస్సు వేసుకొని ఉండడం. మూసీ నదిలో ఉన్న స్మెల్లు అంతా తనపై ఉన్నట్టు అనిపించి నేనే సాహసించలేదు.

అఖిల్: మంచిపని చేసారు ఎంతకైనా మంచిది కోంచె దూరంగా ఉండండి బ్రతకలేని బాబురావ్...

సరే నేటి ప్రజల ప్రశ్న...

యమధర్మరాజుకి నిత్యానందా దొరుకుతాడని మీరు భావిస్తున్నారా?

అవును ఐతే...భే అని, కాదు ఐతే...ఛీ అని టైప్ చేసి

101 అనే నెంబర్ కి సెండ్ చేయగలరూ.... ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం...ధన్యవాదాలు


చిత్రగుప్తుడు : ప్రభో...ఆ నిత్యానంద ఆశ్రమం దాటి ధూమ్ బైక్ మీద చెన్నై పారిపోయాడు

              యమధర్మరాజు :
                       పద, చిత్రగుప్త పద వెళ్లి వాడి సంగతి తెల్చెదము
       ...........................ఇద్దరు చెరొక ధూమ్ బైక్ ని వేసుకొని వెళ్లిపొతారు. అప్పుడు ధూమ్ సాంగ్ వస్తుంది. చివరకు ఇద్దరు నిత్యనంద వద్దకు చెరుకుంటారు. 
              యమధర్మరాజు :
                     చుమ్మ! లక లక లక లక లక నాతొన పరాచకాలు. నీకు ఎంత దైర్యముంటే నా సిస్టమ్ లోనే ఎ మాయ చేసావె సినిమా చుస్తావా. నిన్ను వదలను చుసుకుందాం రా..రా.. 
             ..............................అప్పుడు యమదర్మ రాజుకి, నిత్యందకు కామిడి ఫైట్ జరుగుతుంది. ఇద్దరు తమ మయాజాలంతో పొటిపడతారు. చివరకు యమదర్మ రాజు తన యమపాశంను ఉపయెగించి నిత్యంద మీద విజయం సాదిస్తాడు.నిత్యంద తన తప్పును తెలుసుకొని మంచి మనిషిగా మారుతాడు. ఆ తర్వాత యముదు ఇలియానను తీసులొని యమలోకంలోకి వెళ్తాడు. 
                                    
                                         ................................................................సమాప్తం ..................................................
                                thanks to one and all
                                                        written by IIIT(NUZVID) BATCH 2011 STUDENTS.