వాడుకరి:Rithwik Ponnam/ప్రయోగశాల/1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇండియన్ ఆర్మీ - భారత సైన్యం

[మార్చు]

ప్రభుత్వం, సాయుధ బలగాల నియామకాన్ని తిరిగి చేపట్టాలని డిమాండ్ చేసే నిరసనలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని తన ఇంటి నుంచి దేశ రాజధానికి ఢిల్లీకి చేరుకునేందుకు 50 గంటల పాటు పరుగెత్తానని గతవారం 23 ఏళ్ల ఒక వ్యక్తి చెప్పారు.

సురేశ్ భిచర్, జాతీయ జెండాను పట్టుకొని 350 కి.మీ దూరం పరుగెత్తి ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్మీలో చేరడం తనకు ఎంతో ఇష్టమని ఆయన చెప్పారు. కానీ, రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు నిలిచిపోవడంతో ఆశావహులంతా వయస్సు రీత్యా అనర్హులుగా మారిపోతున్నారని అన్నారు. ఆర్మీలో సైనికునిగా చేరడానికి గరిష్ట వయస్సు 21.

14 లక్షల మంది సభ్యులున్న భారత ఆర్మీ... దేశంలో, ప్రపంచంలోనే ఒక అగ్రస్థాయి నియామక సంస్థగా ఉంది. భారత్‌లోని చాలామంది యువకులకు సైన్యంలో చేరడం ఒక గౌరవపూర్వకమైన, భద్రతతో కూడిన ఉద్యోగం. ప్రతీ ఏడాది ఆర్మీ నుంచి దాదాపు 60 వేల మంది సైనికులు రిటైర్ అవుతుంటారు. వారిని భర్తీ చేయడానికి 100 నియామక ర్యాలీలను నిర్వహిస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నియామక ప్రక్రియ ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు