Jump to content

వాడుకరి:Sivunnaidu yegireddi/ప్రభుత్వ పాఠశాలలే మేలు!

వికీపీడియా నుండి
ఎలిమేంటరి పాఠశాల

ఉపోద్ఘాతం

[మార్చు]

"ప్రభుత్వ పాఠశాలలు వ్యాపారాత్మకంకాదు,జ్ఞానాత్మకం కోసం, ప్రభుత్వ పాఠశాలలు పైపై మెరుగుల కోసం కాదు, విజ్ఞానం కోసం". దేశంలో ప్రజాస్వామ్యం ఒక జీవన విధానం సమానత్వం,స్వేచ్ఛా, న్యాయం, రాజ్యాంగం మనకు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన విలువలు. వాటి పునాదులు ప్రభుత్వ పాఠశాలలనుండే ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యత,శాస్త్రీయత, పిల్లల సమగ్ర వికాసాభివృద్ధికి దోహదపడగలవు.ప్రభుత్వ పాఠశాలలో పట్టుదలతో చదువుకునే మహనీయులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వారిలో అతి నిరుపేద కుటుంబాల వారున్నారు. వారు కష్టపడి చదివి నాయకులుగా, పారిశ్యామికవేత్తలుగా, విద్యావేత్తలుగా, సంఘ సంస్కరణకర్తలయ్యారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్య

[మార్చు]

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులుకు తన అర్హత బట్టి తనకు విద్యాభ్యాసం చేస్తారు. ఇందులో ఒత్తిడికి లోను కాకుండా పిల్లలకు ఇష్టమైన పనులు (బొమ్మలను చూపించడం,గేయాలను పాడించడం,ఆటలు ఆడించడం)చేయిస్తారు. వీటి ద్వార పిల్లలకు విఙ్ఞానాన్ని కలిగిస్తారు. కాని ప్రభుత్వేతర పాఠశాలలో మూడు సంవత్సరాలకే సాంకేతిక విద్యాబోదన వల్ల విద్యార్ధులు మానసిక,శారీరక ఒత్తిడులకు లోను అవుతారు. చిన్నప్పుడే కంప్యూటర్ వంటి సాంకేతికపరికరాలు వల్ల ఆరోగ్య సమస్యలు(దృష్టి లోపాలు... వంటివి) వస్తాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు స్వేచ్చ ఇవ్వబడుతుంది. అదే ప్రభుత్వేతర పాఠశాలలో అయితే ఎక్కువ ఒత్తిడి చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు కొత్త విషయాలు గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ప్రభుత్వేతర పాఠశాలలో అయితే మార్కులే ప్రధానంగా విద్యార్ధులు పై ఎక్కువ ఒత్తిడి కలిగిస్తారు.ఒత్తిడి వలన విద్యార్ధి కొత్త విషయాలను ఆలోచించడు.దానివల్ల పాఠశాల పట్ల,చదువు పట్ల చేదు భావం కలుగుతుంది.ప్రభుత్వ పాఠశాలలో ఒత్తిడి ఉండదు కనుక విద్యార్ధులు అన్ని విషయాల (పాఠ్యంశాలు, క్రీడారంగంలో,ప్రాథమిక నైపుణ్యాలు ,నైతికవిలువలు)పై దృష్టి కేంద్రికరిస్తారు.

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు

[మార్చు]

ఉపాధ్యాయులు విషయానికి వస్తే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుకు , ప్రభుత్వేతర ఉపాధ్యాయులు కంటె అర్హత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుకు పాఠ్యాంశాలపై ఎక్కువ అవగాహన కలిగివుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉపాధ్యాయులగా నియమితులు అవ్వాలంటే వారు చాలా ప్రవేశ పరిక్షలు ఎదుర్కోవాలి. అలాగే విద్యార్ధులుకు ఎలా పాఠాలు నేర్పించాలో,దానికి కావల్సిన పద్దతులను తెలుసుకోని పూర్తి అవగాహనతో కోంత కాలం శిక్షణ ముగించుకొని వారు బోధన బాధ్యతలను ప్రారంభిస్తారు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుకు పాఠ్యాంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. ప్రైవేటు స్కూల్లో అయితే మంచి బోధన కలిగిన టీచర్లు ఉండరు. ప్రభుత్వేతర పాఠశాలలు ఎటువంటి శిక్షణ మరియు పాఠ్యాంశాలలో అవగాహనలేకుండానే బోధన చేప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఆ అంశం పై ఉన్న అర్హత ఉంటే చాలనిఅనుకుంటారు తప్ప,వాళ్లకు బోధించడం వచ్చా ! రాదా! అనే అంశాన్ని పట్టించుకోరు.

ప్రభుత్వ పాఠశాలలు వల్ల లాభాలు

[మార్చు]

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు చదువుతుండగా వారు చాలా స్కాలర్ షిప్(ఉదా:ఎన్.ఎమ్.ఎమ్.ఎస్ .....మొదలైనవి) లకు వారు అర్హత సాధిస్తారు.పాఠశాల విద్యా పూర్తి అయిన తరువాత ప్రభుత్వ పాఠశాల విద్యార్ధికి విద్యా అవకాశాలు(ఉదా:ఐ.ఐ.ఐ.టి ...మొదలైనవి) చాలా మెరుగ్గాఉంటాయి.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు ఆడుకోవడానికి మంచి మైదానం,ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పాఠశాల చుట్టు మొక్కలు,చెట్లు ఉంటాయి. ఇందులో గదులు సంఖ్య ఎక్కువగా ఉండి, విశాలంగా ఉంటాయి.అదే ప్రభుత్వేతర పాఠశాలలో అయితే తన లాభం కోసం పిల్లలు ఎక్కువయిన గదులు మాత్రం తక్కువగా,చిన్నవిగా ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో ఎవరైన చదువుకోగలరు.ఇవి పేద విద్యార్ధులు చదువుకోవడానికి ముఖ్య ఆదారం. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మ స్థయిర్యం నింపడంతో పాటు నైతిక విలువలు గల ఉత్తమ విద్యను నేర్పుటకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు కావలిసిన ప్రోత్సహం ప్రభుత్వం నుండి లభిస్తుంది.అంటే వారికి కావలిసిన పరికరాలు,పుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలోచదివిన పేద విద్యార్ధులకు వసతి సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది.

ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలు

[మార్చు]

సమగ్ర వికాసానికి దోహదపడే కార్యకలాపాలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరుగు తాయి. పాఠశాలలో ఎన్.సి.సి(నేషనల్‌ క్యాడెట్‌క్రాప్‌) ,ఎన్.ఎస్.ఎస్ ,ఎన్.జి.సి...మొదలైన కార్యక్రమాలు చేపడతారు. ప్రతి జాతీయ పండగలకు(స్వాతంత్ర దినోత్సవం ,గణతంత్ర దినోత్సవం....మొదలైనవి) విద్యార్ధులకు పోటీలను(వ్యాస రచన,బొమ్మలు గీయడం...మొదలైనవి) నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ వేర్ , సైన్స్ పార్క్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. మండల,జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించి విద్యార్ధుల సామర్ధ్యాలను పరిక్షిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మార్కులు వచ్చినవారికి ప్రోత్సహం ఎక్కువగా ఉంటుంది.

ప్రభుత్వపాఠశాలలు అభివృధ్ది కావాలంటే

[మార్చు]

ప్రభుత్వపాఠశాలలు అభివృధ్ది చెందాలంటే ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వేతర పాఠశాలలుకు కాక ప్రభుత్వ పాఠశాలలుకు పంపించాలి. రాజకీయనాయకులు,ప్రభుత్వ ఉద్యోగులు( కలెక్టర్ , వి.ఆర్.ఓ, డి.ఇ.ఓ ) తమ పిల్లలను ప్రభుత్వేతర పాఠశాలలుకు కాక ప్రభుత్వ పాఠశాలలుకు పంపిస్తే ప్రభుత్వ పాఠశాలలు అభివృధ్ది చెందుతాయి. ఉపాధ్యాయులు తమ విధులను(ప్రతిరోజు పాఠశాల సమయానికి రావడం, పాఠాలు విద్యార్ధులుకు సక్రమంగా బోదించడం...వంటివి ) సక్రమంగా నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాల అభివృద్ది చెందాలి అంటే ప్రభుత్వం విద్యార్ధులకు,పాఠశాలకు తగిన వసతులు కల్పించాలి. ప్రభుత్వం విద్యార్ధులకు సరియైన ప్రోత్సాహం అందించాలి. ప్రభుత్వ పాఠశాలల పట్ల పిల్లల యొక్క తల్లిదండ్రులుకు అవగాహన కలిగించాలి.

yegireddi sivunnaidu (చర్చ)

YEGIREDDI SIVUNNAIDU B.TECH SECOND YEAR , RGUIIIT, NUZVID(village), NUZVID(mandal), KRISHANA(Dt) , A.P.