వాడుకరి:Sujini.indicwiki/ప్రయోగశాల
దర్శి సుభద్రమ్మ
[మార్చు]దర్శి సుభద్రమ్మ దర్శి చెంచయ్య సతీమణి.
బాల్యం
[మార్చు]దర్శి సుభద్రమ్మ ఉన్నత వంశంలో జన్మించింది. ఆమె బాల్యం నుంచే ఎన్నో ఉద్యమాలను నడిపిన ఉద్యమకారిణి. విద్యలోనేకాక నైతిక, అధ్యాత్మిక విషయాల్లో, సంగీత సాహిత్యాలలో, లలితకళలలో ప్రావీణ్యత కలిగిన ఆదర్శ గృహిణి. బాల్యంలోనే క్రూరమైనటువంటి సాంప్రదాయాలను ప్రతిఘటించింది.
స్త్రీ అభ్యున్నతకు కృషి
[మార్చు]భర్తృవియోగాన్ని పొందిన స్త్రీకి జుట్టు తీయడాన్ని సహించలేకపోయింది. ఈమె కులభేదాలను ఎన్నడు పాటించలేదు. గాంధీజీ 1932లో ప్రారంభించిన దళితజనోద్యమం మద్రాసుశాఖకు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు. సంఘసంస్కరణలో పనిచేయడానికి అహింస, ప్రేమలు గొప్ప సాధనాలనీ, వాటితో నిర్మించిన సంఘం శాంతిబధ్రతలను కలిగి ఉంటుందన్న గొప్ప విషయాన్ని ఈమె గ్రహించింది. పాతికేళ్ళ వయసులోనే మద్రాసు అఖిలభారత మహాసభలో కార్యనిర్వాహక సభ్యురాలిగా పదవీ బాధ్యతలను చేపట్టింది. స్త్రీసమస్యలపై ఎంతో కృషి చేసింది. స్త్రీ ఓటుహక్కు, ఉద్యోగాలు, హానరరీ మేజిస్ట్రేట్ గా ఉండటానికి, శాసనసభ సభ్యులు కావడానికి, స్త్రీల ఆస్తిహక్కు కోసం ఎంతో పాటు పడింది. బహుభార్యా నిషేధ విషయంలో కూడా ఈమె పాలుపంచుకుంది. 1932-1934 లో మద్రాసులో ముట్టు లక్ష్మీరెడ్డి, మిసెస్ కజిన్స్, మిస్ చ్యారీలతో కలిసి మాంటిసోరి (రెస్క్యూ హోమ్) పాఠశాలను స్టాపించి కార్యనిర్వహణ కమిటీలో బాధ్యత తీసుకుంది. 1934-1935లో అఖిల భారత మహియాసభ మద్రాసు స్టాండింగ్ కమిటీలో సభ్యురాలిగా పని చేసింది. ఈమె 'ఆంధ్ర మహిళ' మాసపత్రికలో పిల్లల మనస్తత్వాలను, నవీన శాస్త్రీయ దృక్పథాన్ని గూర్చి మూడు సంవత్సరాలపాటు నెలకు రెండు చొప్పున వ్యాసాలు రాశారు.
భారత స్త్రీల ప్రస్తుత స్థితి
[మార్చు]సుభద్రమ్మ 'భారత స్త్రీల ప్రస్తుత స్థితి' అనే ఉపన్యాసాన్నిస్తూ నేటి స్త్రీలు బానిసత్వం, దారిద్ర్యంలో చిక్కుకుని సమాజంలో అణగారిపోతున్నారని, ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో వెనకబడి ఉన్నారన్, ఉన్నత కుటుంబీకులకన్నా కూలి-నాలీ చేసుకొని బ్రతికే స్త్రీలకే స్వేచ్చా ఎక్కువ అని ఆమె గ్రహించారు. స్త్రీల పరిస్తితి దాదాపు అన్నీ దేశాలలో ఇంతేననీ, స్త్రీల సమస్యలు కూడా మానవ సమస్యలేననీ, స్వరాజ్య సాధన దీనికి తరుణోపాయమనీ భావించారు.ఈ విధంగా దర్శి సుభద్రమ్మ స్త్రీలకోసం, బిడ్డలకోసం, అనాథలకోసం, దళితులకోసం కృషి చేసిన ఆర్త పరాయణురాలు. ఆమె మార్గ దర్శకత్వం ఎందరికో ఆదర్శం.