వాడుకరి:T.HEPSYBA/ప్రయోగశాల
పరిచయం
[మార్చు]20,000(హెర్ట్జ్) అనగా శ్రుతిగ్రాహ్యపౌనఃపున్య వ్యాప్తి కన్నా ఎక్కువ పౌనఃపున్యం గల థ్వని తరంగాలను గురించి చర్చించే భౌతికశాస్థ్ర విభాగము అతిధ్వనులు.సాధారణ మానవుడి శ్రుతిగ్రాహ్యపౌనఃపున్య వ్యాప్తి 20హెర్జ్ట్ నుండి 20,000హెర్ వరకు ఉంటుంది.
కాగా,ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ఒక వస్తువు ప్రయాణిస్తున్నప్పుడు అ దృగ్విషయాన్ని చర్చించే విభాగం సుపర్ సోనిక్స్. భౌతిక,రసాయన శాస్త్రాలలోను మరియు సాంకేతిక,వైద్య రంగంలొోను అతిధ్వనులు అనేక అనువర్తనలను కల్గి ఉన్నాయి. సాధారణంగా అతిధ్వనులను పీడనవిద్యుత్ పదార్థం ఉన్న శక్తి రుపాంతరిణి ద్వారా గాని లేదా అయస్కాంత విరూపణ పద్దతి ద్వారా గాని ఉత్పత్తి చేస్తారు. కుక్కలు,గబ్బిలలు అతిధ్వనులను ఉత్పత్తి చేయగలవు మరియు వినగలవు.
ఈ అధ్యాయంలో అతిధ్వనుల ధర్మాలు,పీడనవిద్యుత్ మరియ అయస్కాంత విరూపణ పద్థతుల ద్వారా అతిధ్వనుల శోధనమ మరియు అతిధ్వనుల అనువర్తనాలను వివరించడం జరిగింది.
అతిధ్వనుల్ ధర్మాలు:
[మార్చు]అధిక పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను అతిధ్వనుల పౌనఃపున్యం 20,000హెర్ట్జ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. కొన్ని జంతువులు అతిధ్వనులను గుర్తించగలవు. కాని మనం అతిధ్వనుల్ని ప్రత్యక్షంగా గుర్తించలేము. అతిధ్వని తరంగాలు ఈ క్రింది ధర్మాల్ని కల్గి ఉంటాయి. 1.అతిధ్వనులకు అధిక శక్తి ఉంటుంది. 2.అతిధ్వనుల ప్రసార వేగం వాటి పౌనఃపున్యంతో పాటు పెరుగుతు౦ది. 3.అతిధ్వనుల తరంగదైర్ఘ్యం చాలా తక్కువ కావడం వల్ల ఇవి అతి తక్కువగా వివర్తనం చెంధుతాయి. కావున వీటిని ఎక్కువ శక్తి నష్టం లేకుండా అథిక దూరాలకు ప్రసారం చేయవచ్చును. ఈ ధర్మం కారణంగా అతిధ్వనులను ప్రతిధ్వని పద్థతిలో సముద్రాల లోతును కనుగొనడానికి ఉపయోగిస్తారు. 4.అధిక తీవ్రత గల అతిధ్వనులు ద్రవాలలో అలజడికి సృష్టీంచి,బుడగలను ఏర్పరుస్తాయి. 5.ద్రవ యానకంలో స్థిర అతిధ్వని తరంగాలు ఏర్పడినప్పుడ తరంగాల ప్రసార దిశలో ద్రవ సాంద్రత మారుతూ ఉంటుంది. స్ఫటికాలు
ఏక్స్-కిరణాలు వివర్తనం చెందించినట్లు, ఈ స్థితిలో ద్రవ యానకం కాంతిని వివర్తనం చెందిస్తుంది.
అతిధ్వనుల ఉత్పత్తి:
[మార్చు]అతిధ్వనులను ఈ క్రింది రె౦డు పద్థతుల ద్వారా ఉత్పత్తి చేయవచ్చును; 1.పీడనవిద్యుత్ ఉత్పాదకము, 2.అయస్కాంత విరూపణ పద్థతి.
1.పీడనవిద్యుత్ ఉత్పాదకము:
[మార్చు]కొన్ని అసొష్టవస్పటికాలు పీడనవిద్యుత్ ఫలితాన్ని ప్రదర్శీస్తాయని 1880 సంవత్సరములో క్యురీ సోదరులు కనుగొన్నారు. దీని ప్రకారం,క్వార్ట్జ్,టార్మాలిన్ మెు" స్పటికాలను ఒక అక్షం(యాంత్రిక అక్షం) వె౦ట సాగదీసీనా లేదా
సంకోచి౦పచేసినా ఆ అక్షానికి లంబ దిశలో ఉండే అక్షం(విద్యుత్ అక్షం) దిశలో విద్యుత్ సంభావ్య భేదం ఏర్పడుతుంది.ఈ పీడనవిద్యుత్ ఫలితానికి విపర్యయ ఫలితాము కూడా సంభవమే.దీని ప్రకారం,విద్యుత్ అక్షం దిశలో ఏకాంతర సంభవ్య తేడాని ప్రయోగించినప్పుడు,యాంత్రిక అక్షం దిశలో స్ఫటికంస్థితిస్థాపక కంపనాలను చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని పటం 1.1లో చూపించారు.