వాడుకరి:THAMMUDU-THANDU/మంచిమాట
మంచిమాట
[మార్చు]పెద్దలు మనకు ఎన్నో విషయాలు, వారి అనుభవాలను మంచి మాటల రూపంలో చెపుతుంటారు. బాధల్లో ఉన్నవారికి మందుగా మన పెద్దలు చెప్పే మాట "అంతా మన మంచికే" అని అనుకోమనడం. నిజంగా ఇది ఎంత మంచిమాటంటే...దీని గురించి వాడుకలో ఉన్న చిన్న కథను మనం తెలుసుకోవాలి. అన్ని కథల్లాగానే ఈ కథ కూడా "అనగనగా ఒక రాజుండేవాడు" అంటూనే మొదలవుతుంది.
కథ
[మార్చు]ఒక రోజు ఆ రాజు కత్తితో పండును కోస్తుండగా అదుపు తప్పి అతడి బొటనవేలు తెగిపోయింది. రాణి గారు లబోదిబోమంటూ రక్తం ఆగడానికి గుడ్డ కడుతుండగా అది చూసి మంత్రివర్యులు "అంతా మన మంచికే" అన్నాడు. దాంతో రాజు గారికి కోపం వచ్చింది. "మా వేలు తెగి మేము బాధపడుతుంటే మీరు అంతా మన మంచికే అంటారా..? ఎవరక్కడ... ఈ మూర్ఖుడిని చెరసాలలో బంధించండి" అని ఆజ్ఞాపించారు. అప్పుడు కూడా మంత్రి "అంతా మన మంచికే" అన్నాట్ట. రాజు గారికి ఏమీ అర్థం కాలేదు. "శీఘ్రమే ఈ మూర్ఖుడిని ఇక్కడ నుండి తీసుకుపోండి" అన్నారు. భటులు మంత్రిని చెరసాలలో బంధించారు. కొద్దిరోజులు గడిచాక రాజు గారు వేటకు అడవికి కొంతమంది భటులతో వెళ్ళారు. ఒక అడవి మృగాన్ని తరుముతూ చాలా దూరం వెళ్ళిపోయారు. వెనుతిరిగి చూస్తే భటులు కనిపించలేదు. రాజు తానెక్కడ ఉన్నాడో తెలుసుకునేలోపే ఆ అడవిలో నివసిస్తున్న కోయ ప్రజలు రాజును బంధించారు. వారి గూడెంలో అడవి తల్లి జాతర జరుగుతోంది. జాతరలో అమ్మ వారికి బలివ్వడానికి రాజును సిద్ధం చేశారు. డప్పుల హోరులో రాజు తల నరకడానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. రాజు భయంతో వణికిపోతున్నాడు. తాను చేసేదేమీ లేక కళ్ళు మూసుకున్నాడు. ఆ వ్యక్తి కత్తి వేటు వేసేయబోతుండగా ఇంతలో వారి నాయకుడు ఆపండని సంజ్ఞ చేశాడు. "ఇతగాడు బలివ్వడానికి పనికిరాడు. ఎందుకంటే ఇతని బొటన వేలు మొండిది. అతడిని వదిలేయండి" అని ఆజ్ఞాపించాడు. రాజుకు ఇదంతా నమ్మ బుద్ధి కాలేదు. అప్పుడు మంత్రి అన్న మాట గుర్తొచ్చింది. "ఔను మంత్రివర్యులు అన్నమాట నిజమే.ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. వెంటనే వెళ్ళి మంత్రి గారిని చెరసాల నుంచి విముక్తులను చేయాలి" అనుకొని రాజ్యానికి వెళ్ళారు. జరిగినదంతా చెప్పి మంత్రికి క్షమాపణలు చెప్పి పశ్చాత్తాపడ్డారు. అప్పుడు కూడా మంత్రి "అంతా మన మంచికే" అన్నాడు. అప్పుడు రాజు "అదేంటి మంత్రివర్యా..! నేను మిమ్ములను అకారణంగా చెరసాలలో బంధించి బాధపెట్టాను. అలాంటిది మీరు అంతా మన మంచికే అంటారేమిటి..?" అని ప్రశ్నించారు. అప్పుడు మంత్రి ఇలా అన్నాడు "రాజా..! మీరు గనుక నన్ను చెరసాలలో బంధించి ఉండకపోతే నేనూ మీతో పాటు అడవికి వచ్చేవాడిని. అప్పుడు ఆ కోయ వాళ్ళు మిమ్ములను, నన్ను బంధించేవారు. బొటన వేలు లేని మిమ్ములను విడిచి నన్ను చంపి ఉండేవారు. మీరు చెరసాలలో నన్ను బంధించబట్టే కదా నేను అడవికి రాలేదు. అందుకే కదా నేను ప్రాణాలతో ఉన్నాను. అందుకే మహారాజా.. అంతా మన మంచికే అన్నాను" అని వివరించారు. దాంతో రాజు గారికి జ్ఞానోదయమైంది. అప్పటి నుంచి రాజు గారు కూడా ఆ సూత్రాన్నే పాటిస్తూ హాయిగా కాలం గడిపారు.
నీతి
[మార్చు]చూశారా అంతా మన మంచికే అనుకోవడంవల్ల లాభం ఏమిటంటే మనకు కష్టం కలిగిందన్న బాధ ఉండదు. అంతే కాదూ భవిష్యత్ లో మంచి జరుగుతుందనే భావంతో ఉంటాం కాబట్టి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన జీవితంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి దోహదపడుతుంది కూడా.
ఇలాంటి మంచిమాటలు మనం ఇప్పుడు తెలుసుకుందాం...
సూక్తులు
[మార్చు]1. తల్లికి మీరేమిచ్చినా తక్కువే. ఎందుకంటే ఆమె మీకు జీవితాన్ని ఇచ్చింది మరి.
2. తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత.
3. వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు.
ఆత్మవిశ్వాసమునకు సంబంధించినవి
[మార్చు]4. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.
5. ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించగలం. అందుకే మనం చేసే పని మీదే పూర్తి ఏకాగ్రత ఉంచాలి.
6. ఆలోచనలలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటలలో వివేకం, జీవితంలో సేవా భావం ఎప్పుడూ కలిగి ఉండాలి.
7. మహాత్ములు మనోబలాన్ని కలిగి ఉంటారు. దుర్భల మనుషులు కోరికలను మాత్రమే కలిగి ఉంటారు.
8. ఆత్మవిశ్వాసం అనేది అదృష్టం కన్నా గొప్పది. పట్టుదల గల మనిషి అదృష్టం కోసం ఎదురుచూడడు.
9. . నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీవు సాధించగలిగిందేమీ ఉండదు. విజయపథంలో సాగాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి- స్వామి వివేకానంద
10. నీవు కావాలన్నది సాధించాలనుకుంటే నీలో ఉన్న శక్తిని విశ్వసించాలి- రాబర్ట్ ఆంథోని
11. భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపాలి. అప్పుడు భయం పారిపోతుంది- మార్టిన్ లూథర్ కింగ్
12. విజయం మన అకుంఠిత విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.
13. బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు. ధీరులెప్పుడూ కార్యకారణ సంబంధాన్నే విశ్వసిస్తారు.
14. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైనా అవుతుంది లేక అజ్ఞానమైనా అవుతుంది.
15. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు. అందుకోలేని శిఖరాలూ లేవు.
కోపానికి సంబంధించినవి
[మార్చు]16. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే జయించగలం- గౌతమ బుద్ధుడు
17. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత- అరిస్టాటిల్
18. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతితో పట్టుకోవడంలాంటిది. దానిని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది- గౌతమ బుద్ధుడు
19. కోపం రంగప్రవేశం చేయగానే వివేకం తెర వెనక్కు వెళ్ళిపోతుంది.
20. మంచి మనుషుల హృదయాల్లో క్రోధం ఎక్కువ సేపు ఉండలేదు.
ఎంతో విలువైన కాలానికి సంబంధించినవి
[మార్చు]21. బలోద్రేకాల కంటే ఉన్నతమైనవి సహనమూ...కాలమూ- లాఫాంటిన్
22. మనం గతాన్ని మార్చలేము. కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మన వర్తమానాన్ని పాడు చేస్తుంది- పార్కర్
23. కాలమే జీవితం. కాలం వృథా చేయటం అంటే జీవితాన్ని వృథా చేయటమే.
24. ఏ పనైనా మూడు గంటలు ముందైనా పూర్తి చేయొచ్చుగాని, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు.
25. మనకెప్పుడూ తగినంత కాలం ఉండనే ఉంటుంది. కానీ అది జాగ్రత్తగా వినియోగించికోవాలంతే.
26. చెయ్యవలసిన పని ఆలస్యంగా చేయడం అమాయకత్వం కాని చెయ్యకూడని పని ముందుగానే చేయడం మూర్ఖత్వం.
27. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే సాఫల్యానికి రాచబాట.
28. కొన్ని సమయాల్లో నష్టపోవడమే గొప్ప లాభం- హెర్బర్ట్
29. మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. ప్రతిభ గల వారు సమయాన్ని స్సద్వినియోగం కోసం ప్రయత్నిస్తారు.
30. రోజులు నేర్పజాలని పాఠాలు సంవత్సరాలు నేర్పగలవు- ఎమర్సన్
31. తేలికయిన హృదయం చాలా కాలం జీవిస్తుంది- స్వామి వివేకానంద
లక్ష్యం
[మార్చు]32. లక్ష్యం చేరడం కష్టమైనా అసాధ్యం కాదు. ధైర్యంతో ముందుకు సాగాలి.
33. ఉత్సాహంతో ఏ పని చేసినా లక్ష్యసాధనలో మనం విఫలమయ్యే ప్రసక్తే ఉండదు- వాల్మీకి
34. చిన్న చిన్న లక్ష్యాలతో ప్రయత్నాలు మొదలు పెడితేనే భారీ లక్ష్యాలు సాధ్యమవుతాయి- విలియమ్ షేక్ స్పియర్
35. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ, దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది.
36. జీవితానికి ఒక లక్ష్యమంటూ ఒకటి ఉండాలి. లేకపోతే గమ్యం లేని నదివలె ఎటు ప్రవహించాలో తెలీదు.
37. మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు. నడిచే మార్గం కూడా సరైనది కావాలి- నెహ్రూ
38. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడం నేరం.
39. మనం సాధించాలి అనుకున్న విషయాన్ని మర్చిపోవడమే మనం చేసే అతి పెద్ద నేరం- పాల్
40. వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది- జపాన్ సామెత
విజయానికి సంబంధించినవి
[మార్చు]41. . అపజయాన్ని కఠినమైన శ్రమ ద్వారా తునాతునకలు చేయవచ్చు- లేమన్
42. సాధిందిన దానితో సంతృప్తి పొందడం ప్రారంభిస్తే అక్కడితో అభివృద్ధి ఆగిపోయినట్టే- స్టెఫ్ కెట్టరింగ్
43. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి- ఠాగూర్
44. అసాధ్యం అనే పదం ఎంతో జాగ్రత్తగా వాడే వారే విజయవంతమయ్యే వారు.
45. ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితంలో అనేక విజయాలు సాధిస్తాడు.
46. విజయానికి రహదారి ఎప్పుడూ నిర్మాణంలోనే ఉంటుంది- ఆర్నాల్డ్ పాల్కర్
47. సుఖ దుఃఖాలపైన ఆధిపత్యం సంపాదించిన వ్యక్తి జీవితంలో విజయానికి చేరువవుతాడు- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
48. మనిషి ఆశావాదంతో జీవించాలి. కృషి ఉంటే ఎవరికైనా, ఎప్పటికైనా విజయం వరిస్తుంది. చీకటిని నిందిస్తూ కూర్చునే కంటే ఓ కొవ్వొత్తిని వెలిగించే చొరవ తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించే నేర్పు అలవడుతుంది- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
కష్టే ఫలి
[మార్చు]49. స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి దగ్గర అదృష్టం గురించి మాట్లాడలేము.
50. నువ్వెంత కష్టపడి పని చేస్తావో చెప్పొద్దు. ఎంత పని పూర్తయిందో చెప్పు- బెర్నార్డ్ షా
51. పనిలో కష్టం కూడా సుఖాన్నిస్తుంది- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
52. కష్టపడి పని చేసినవాడే విశ్రాంతిని పూర్తిగా అనుభవించగలడు.
53. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి.
54. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవడమే వివేకం.
55. మీకు ఇష్టమైన దాన్ని అందుకోవడానికి కృషి చేయకపోతే అందుబాటులో ఉన్నదాన్నే ఇష్టపడాల్సి వస్తుంది.
56. ఒక శాతం ప్రేరణను, తొంభైతొమ్మిది శాతం శ్రమను ప్రతిభ అంటారు- రోస్ పాల్
57. కష్టపడి పనిచేయడం+ ఆత్మవిశ్వాసం+ నిరంతర సాధన+లక్ష్యం వైపే పయనం= విజయం.
58. పని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరుచుకోవాలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతి గొప్ప పాఠం- స్వామి వివేకానంద
59. బద్ధకంలో దారిద్ర్యం ఉంది. కృషిలో ఐశ్వర్యం ఉంది.
60. సోమరితనం ఒక రాచపుండు వంటిది. ఒకసారి సోకిందంటే ఆ వ్యక్తి ఇక బాగుపడలేడు.
సహనం
[మార్చు]61. ఓర్పు చేదుగానే ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది- రూసో
62. ఇతరుల తప్పులను క్షమించడానికి మొదటి మెట్టు, వాటిని భరించగలగడం.
ఓటమికి అర్థం
[మార్చు]63. నీ ప్రయత్నం నువ్వు చేయి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోంచించకు. ఎందుకంటే అది మంచైనా సరే, చెడైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడితే మళ్ళీ ప్రయత్నం చేయాలి. లేకపోతే పతనం తప్పదు.
64. ఓటమి అంటే ఆ పనిని అంతటితో ఆపివేయమని కాదు దాని అర్థం. ఆ పనిని మరింత పట్టుదలతో, నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం.
65. ఓడిపోగానే ఒక వ్యక్తి చరిత్ర ముగిసిపోదు. పారిపోయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది- రిచర్డ్ నిక్సన్
66. జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవచ్చు- ఠాగూర్
67. ఓటమి కుంగిపోవలసింది కాదు, మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి పనికివచ్చే నిచ్చెన అది.
68. అపజయం వల్ల నిరాశకు గురికావచ్చు. కానీ మళ్ళీ ప్రయత్నం చేయకపోతే పతనం తప్పదు- బెవర్లీ సిల్స్
69. జీవితంలో విఫలమైన వారు ఓడిపోరు, మధ్యలో వదిలేస్తారంతే- పాల్.జె.మేయర్
70. గెలవాలంటే ఓటమికి కారణాలు తెలియాలి- నెహ్రూ
71. కష్టపడకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెదకడం లాంటిది.
72. ఒక పెద్ద పనీని అసంపూర్ణంగా చేయడం కన్నా ఒక చిన్న పనిని పరిపూర్ణంగా చేయడం ఉత్తమం.
ఆలోచన ఆవశ్యకత ఏమిటంటే
[మార్చు]73. వివేకం ఉత్తములను నడిపిస్తుంది. అనుభవం మధ్యములను నడిపిస్తుంది. అవసరం అధములను నడిపిస్తుంది.
74. అజ్ఞానం కన్న నిర్లక్ష్యం ఎక్కువగా కీడు చేస్తుంది.
75. మనిషికి నిజమైన పెట్టుబడి డబ్బు కాదు. సరైన ఆలోచన.
76. వివేకవంతుడు ముందు ఆలోచించి తరువాత మాట్లాడుతాడు. అవివేకి ముందు మాట్లాడి తరువాత ఆలోచిస్తాడు- డెవిలే
77. జరిగిపోయిన దాని గురించి బాధపడకూడదు. జరిగిన దాని ద్వారా జరగబోయే దాని గురించి ఆలోంచించాలి.
78. ఏదైనా ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్నాక ఆ