వాడుకరి:Veera.sj/sandbox/ఆయేషా మీరా హత్య
డిసెంబరు 2007 లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీం పట్నంలో హాస్టల్ లో ఉండి ఫార్మసీ కోర్సు చేస్తున 19 ఏళ్ళ ఆయేషా మీరా బలాత్కరించబడి హతమార్చబడినది. అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించినది.
ఉదంతం
[మార్చు]తన ప్రేమను కాదన్నందుకే ఆయేషాకి ఈ గతి పట్టించానని హంతకుడు శవం వద్దే ఒక లేఖ వదిలి వెళ్ళాడు.
పర్యవసానాలు
[మార్చు]సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొంటూ ఆగష్టు 2008 న అతనిని మొదటిసారిగా అదుపులోకి తీసుకొనటం జరిగినది. ఆ రాత్రే పోలీసులు భోజనం ఏర్పాట్లు చేసుకొంటుండగా సత్యంబాబు తప్పించుకు పారిపోయాడు. కొద్ది గంటలకే మళ్ళీ సత్యం బాబును అదుపులోకి తీసుకొనటం జరిగినది.[1]
విమర్శలు
[మార్చు]సత్యం బాబు బంధువులు, మానవ హక్కుల సంఘాలు అసలైన నేరస్తులను తప్పించటానికే సత్యం బాబును బలిపశువు చేశారని తెలిపారు. నరాల బలహీనత గల సత్యం బాబు సరిగా నడవను కూడా నడవలేడని తెలిపారు. NIMS వైద్యులు పరీక్షలు చేసి సత్యం బాబు నరాల బలహీనత వాస్తవమేనని తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు కూడా సత్యం బాబు నిర్దోషి అనే తెలిపారు.
తీర్పు
[మార్చు]విజయవాడ మహిళా కోర్టు హత్యకు గాను 302 సెక్షను క్రింద 14 ఏళ్ళ జైలు శిక్ష, మానభంగానికి గాను 376 సెక్షను క్రింద 10 ఏళ్ళ జైలు శిక్ష విధించినది.[2]
31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబు ను నిర్దోషిగా ప్రకటించినది. నిష్కారణంగా ఒక నిర్ధోషిని 8 ఏళ్ళు జైలులో ఉంచినందుకు పోలీసు యంత్రాంగానికి మొట్టికాయలు వేస్తూ లక్ష రూపాయలను నష్టపరిహారం విధించినది.