వాడుకరి:Veera.sj/sandbox/మొహమ్మద్ షమీ పై అక్రమ సంబంధాల ఆరోపణలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ సాంఘిక అనుసంధాన వేదికలలో మరియు ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలలో, వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని చేసిన పోస్టులతో దుమారం రేగినది. [1].

ఈ అక్రమ సంబంధాలే కాక, షమీ అతని కుటుంబ సభ్యులు తనని మానసికంగా/శారీరకంగా వేధించేవారని, ఎన్నటికైనా తనలో మార్పు వస్తుందని వేచి చూశానని, రాకపోవటంతోనే అతని బండారం బయటపెట్టవలసి వచ్చినదని, న్యాయవాదులను ఆశ్రయించవలసివచ్చినదని హసీ జహాన్ తరఫు వకీలు జాకీర్ హుసేన్ తెలిపాడు. అయితే షమీ వీటన్నిటినీ ఖండించాడు. తన పై కుట్ర పన్నబడినదని, తన ఆటను చెరచటానికే ఈ అభియోగాలు మోపబడుతోన్నవని షమీ తెలిపాడు. [2].

షమీని వివాహమాడే ముందు హసీన్ జహాన్ అదివరకే విడాకులు తీసుకొన్నది. పూర్వపు వివాహంలో హాసీన్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, వారిలో ఒకరు షమీ-హసీన్ లతోనే నివసించేది. [3] [4].


షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ సిద్దిఖీ, షమీ బహు సిగ్గరి అని హసీన్ జహాన్ ఆరోపణలు అబద్దాలని షమీకి వత్తాసు పలికాడు. [5]. ఈ విమర్శలతో BCCI తమతో ఒప్పందం కుదుర్చుకొన్న ఆటగాళ్ళ జాబితా నుండి షమీ పేరును తొలగించివేసినది. షమీ తనను హత్య చేయాలని చూశాడని, మ్యాచి ఫిక్సింగు లకు పాల్పడ్డాడని, ఒక బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్ళాడదలచుకొన్నాడని తెలిపినది. తాను ఫిక్సింగుకు పాల్పడినట్లు ఋజువైతే తనను ఉరి తీయమని షమీ కన్నీటి పర్యంతమయ్యాడు. [6]. షమీ తన సోదరుడు హసీబ్ ఉండే గదిలోకి తనను నెట్టివేసేవాడని, సోదరుడి లైంగిక వాంఛలని తీర్చమని బలవంతపెట్టేవాడని, తను గట్టిగా కేకలు వేస్తే గానీ తలుపు తీసేవాడు కాదని ఆరోపించినది. అయితే షమీ ఈ ఆరోపణలను కొట్టి పడేశారు. తాను నిర్దోషి అని, తన అమాయకత్వాన్ని నిరూపించే ఆధారాలు తన వద్ద ఉన్నవని, షమీ తెలిపాడు. తన భార్యతో కలసి ఉండే ఆశ, దీనితో చనిపోయిందని షమీ తెలిపాడు. [7]. షమీ ఫోన్ తన చేతికి చిక్కకుంటే, తాను ఉత్తర్ ప్రదేశ్ పారిపోయేవాడని, తనకు ఈ పాటికి విడాకుల నోటీసు పంపి ఉండే వాడని ఆరోపించినది. [8].

హసీన్ జహాన్ లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదుల ఆధారపరచుకొని షమి, అతని కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల పై కోల్కతా జాదవ్ పూర్ పోలీసులు సెక్షను 498 ఏ (స్త్రీ పై భర్త/అతని కుటుంబ సభ్యుల క్రౌర్యం), సెక్షను 307 (హత్యాయత్నం), సెక్షను 323 - కావాలని గాయపరచటం, సెక్షను 376 - మానభంగం, సెక్షను 506 - బెదిరింపుల క్రింద కేసులను నమోదు చేసారు. [9]

షమీ స్వస్థలంలో వారు మాత్రం ఒక కల చెదిరినట్లు భావించారు. తమ ముందు ప్లాస్టిక్ బాల్ తో క్రికెట్ ఆడిన కుర్రాడు, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించటం, అందాల యువరాణిని పెళ్ళి చేసుకుని తమ ఊరికి తీసుకురావటం, భార్యను తన బైక్ పై ఎక్కించుకొని ఊరిలోని ముఖ్యప్రదేశాలను షమి ఆమెకు చూపించటం, ఇవన్నీ తమ కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయని, ఇంతలోనే ఇలా జరగటం బాధాకరంగా ఉందని తెలిపారు. ఊరి పొలిమేరలో షమీ ఒక పెద్ద ప్లాటు కొన్నాడని, దాని పేరు హసీ ఫాం హౌస్ అనీ, తమ ఇంటిని వారు అందులో నిర్మించుకోవాలనుకొన్నారని తెలిపారు. వారు చాలా అన్యోన్యంగా ఉండేవారని, ఊరు ఊరంతా హసీన్ ను రాజకుమారిగా పరిగణించేవారని, దంపతులకు మర్యాదలు చేసేవారని షమీ సమీప బంధువొకరు తెలిపారు. షమీ పై అభియోగాలు నమ్మశక్యంగా లేవని, హసీన్ ఆధునిక దుస్తులు ధరించినపుడు సోషల్ నెట్వర్కులో షమీ తీవ్ర విమర్శలనెదుర్కొన్నా, హసీన్ ను పల్లెత్తు మాట అనలేదని షమీ స్నేహితుడు ఒకరు తెలిపారు. షమీ ఇల్లు పాతపద్ధతులలో నిర్మించినా, అందులో అన్ని ఆధునిక హంగులూ ఉన్నట్లు టైంస్ ఆఫ్ ఇండియా తెలిపినది. హసీన్ కు ప్రత్యేకంగా ఒక గది కేటాయించామని, వారు కోల్ కటా నుండి ఎప్పుడు వచ్చినా, హసీన్ కు కావలసినవి ఏవీ కొరవడకుండా ఉండాలని తాము తాపత్రయపడేవారమని, మరొక బంధువు టైంస్ ఆఫ్ ఇండియాకు వివరించారు. [10]

హసీన్ తన మొదటి వివాహం గురించి తన వద్ద దాచినదని షమి ఆరోపించారు. [11] మొదటి వివాహంలో కలిగిన సంతానం తన సంతానం కాదని, చనిపోయిన తన అక్క పిల్లలని చెప్పినట్లు షమి తెలిపారు.

తనకు షమీ కి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవని, షమీకి ఉన్న లక్షలాది అభిమానులలో తాను కూడా ఒకరిని అని, ఈ విషయం స్పష్టం చేయటానికి తాను ఎక్కడికైనా రావటానికి సిద్ధం అని పాకిస్థాన్ కు చెందిన అలిష్బా తెలిపినది. దుబాయి లో ఒక సాయంత్రం షమీని అభిమానిగా తాను కలిసిన మాట వాస్తవమే కానీ, ఆ రాత్రి అతనితో గడపలేదని, షార్జాలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్ళినదని తెలిపినది. అయితే మరునాడు ఉదయం షమీని అల్పాహార విందుకై కలిసానని తెలిపారు. షమీకి మొహమ్మద్ భాయ్ నుండి అలిష్బా ద్వారా పెద్దమొత్తంలో ధనం ముట్టజెప్పే ఆరోపణలు అవాస్తవమైన్ తెలిపారు. [12]

తాను జీవితంలో చేసిన ఒకే ఒక్క అతి పెద్ద నేరం, హసీన్ ను వివాహమాడటమే నని, దేశం కోసం తాను ప్రాణాలు ఇవ్వగలను గానీ, ద్రోహం చేయలేనని షమి తెలిపారు. గడచిన కొద్ది రోజులు ఈ నిరాధార ఆరోపణలతో తాను మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని, వేళకు భోంచేయలేకపోతున్నాని, ఇక క్రికెట్ ప్రాక్టీసు పూర్తిగా నిలిచిపోయినదని తెలిపాడు. మాటిమాటికీ తన పై వేసిన ఆరోపణలను క్షుణ్ణంగా విచారణ జరిపించవలసిందిగా కోరినట్లు షమీ తెలిపాడు. [13]

నేనేమిటో నా జట్టుకు తెలుసు - షమీ [14]


తమపై నమోదైన కేసులను ఛేదించటానికి ఉత్తర్ ప్రదేశ్ లోని అంరోహా లో గల తమ నివాసానికి వచ్చిన పోలీసులకు షమీ, అతని కుటుంబ సభ్యులు పూర్తిగా సహాయ సహకారాలను అందించారు. హసీన్ నాపై వేసిన నిరాధార ఆరోపణలలో సగానికి సగం నిరూపించలేకపోయినది. ఇంకా ఆమె ఎంత దూరం వెళ్ళదలచుకొందో వేచి చూడాలి. దీనిని పరిష్కరించుకోవాలన్న తన ప్రయత్నాలని బూడిదలో పోసిన పన్నీరే అయినదని, చట్టపరంగా ఎదుర్కోవటం తప్పితే తనకు కూడా వేరే గత్యంతరం లేదని తెలిపాడు. [15]

ఒక అమ్మాయి ఇంట్లో ఎవరి కంటాపడకుండా రహస్యంగా ఒక పురుషుడిని బయట కలిసి ఒకే గదిలో ఉంటూ ఒక చెడ్ద పని చేస్తే ఆ అమ్మాయిని అభిమాని అనరని, గర్ల్ ఫ్రెండ్ లేద వేశ్య అంటారని హసీన్ జహాన్ ఆరోపించినది. షమీ ఇక ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోకుండా అతనికి బహిరంగంగా దేహశుద్ధి చేయాలని హసీన్ మీడియా సమక్షంలో తన ఆక్రోశాన్ని వెల్లడించినది. [16]

22 మార్చి 2018 న షమీ ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడలేదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (COA) తేల్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుండి షమీ విముక్తుడు కావటంతో BCCI షమీ తో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒప్పందం కుదుర్చుకొంది. [17]

మూలాలు

[మార్చు]
  1. సాంఘిక మాధ్యమాలలో తన భర్త మొహమ్మద్ షమీ అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని పోస్టు చేసిన హసీన్ జహాన్ (ద హిందు - 7 మార్చి 2018)
  2. తనపై ఆరోపణలను ఖండించిన షమి (ద హిందు - 7 మార్చి 2018)
  3. ఎస్ కే సైఫుద్దీన్ హసీన్ మొదటి భర్త (డెక్కన్ క్రానికల్ - 11 మార్చి 2018)
  4. అదివరకే పూర్వపు వివాహంలో విడాకులు తీసుకున్న హసీన్, పూర్వపు వివాహంలో కలిగిన ఇద్దరు కుమార్తెలలో ఒకరు హసీన్ వద్దే (డెక్కన్ క్రానికల్ - 10 మార్చి 2018)
  5. షమీ కి కోచ్ వెన్నుదన్ను (డెక్కన్ క్రానికల్ - 13 మార్చి 2018)
  6. ఫిక్సింగు ఋజువైతే నన్ను ఉరి తీయండి - షమీ (ఈనాడు - 16 మార్చి 2018)
  7. హసీన్ తో ఇక నేను కలిసి జీవించలేను - షమీ (డెక్కన్ క్రానికల్ - 16 మార్చి 2018)
  8. తన ఫోన్ నా చేతికి చిక్కకుంటే ఉత్తర్ ప్రదేశ్ పారిపోయి నాకు విడాకుల నోటీసు ఇచ్చి ఉండేవాడు - హసీన్ జహాన్ (డెక్కన్ క్రానికల్ - 13 మార్చి 2018)
  9. షమి పై నమోదైన కేసులు (ద హిందు - 9 మార్చి 2018)
  10. హసీన్ ను యువరాణిగా చూసుకొన్న గ్రామస్తులు, హసీన్ కు అన్ని వసతులు అమర్చిన షమీ (టైంస్ ఆఫ్ ఇండియా - 11 మార్చి 2018)
  11. మొదటి పెళ్ళి, పిల్లలు, విడాకుల గురించిన వివరాలను దాచిన హసీన్ (డెక్కన్ క్రానికల్ - 15 మార్చి 2018)
  12. నేను కేవలం షమీ అభిమానిని మాత్రమే - అలిష్బా (డెక్కన్ క్రానికల్ - 19 మార్చి 2018)
  13. నా పై వేసిన ఆరోపణలను విచారణ చెయ్యండి (డెక్కన్ క్రానికల్ - 19 మార్చి 2018)
  14. నేనేమిటో నా జట్టుకు తెలుసు - షమీ (డెక్కన్ క్రానికల్ - 17 మార్చి 2018)
  15. యుద్ధం శరణం గచ్ఛామి - షమీ ((డెక్కన్ క్రానికల్ - 19 మార్చి 2018)
  16. [షమీ కి దేహశుద్ధి చేయండి - హసీన్ (డెక్కన్ క్రానికల్ - 20 మార్చి 2018)]
  17. షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడలేదని తేల్చిన COA (ద హిందూ - 22 మార్చి 2018)