వాడుకరి:Vijayiiitn/ప్రయోగశాల
Jump to navigation
Jump to search
గోదావరి తీరంలో అరలాడుతున్న క్షేత్రం "శ్రీ చక్ర మేరు యంత్రాలయం". స్థానికులు ఏనుగుమహల్ గుడి అని కూడా పిలుస్తారు . ఇక్కడ "లలితా మహా త్రిపుర సుందరి " అమ్మ వారు యంత్ర స్వరూపిణిగా భక్తులకు అభయమిస్తున్నారు . ఈ క్షేత్రం తెలుగు రాష్ట్రాలలో ఏకైక మేరు శ్రీ చక్ర ఆలయం . 1983 లో ఆధ్యాత్మిక శాత్రవేత్త పద్మశ్రీ గ్రహీత శ్రీ ప్రణవానంద గురువు గారు తన తపశ్శక్తి ని ధారబోసి శ్రీ చక్రం ప్రతిష్టించారు . శ్రీ చక్ర లఘు పూజా విధానం , నవారణ పూజా విధానం , శ్రీ చక్రం పై 400 పేజీల సమగ్ర గ్రంధాన్ని శ్రీ ప్రణవానంద స్వామిజి రచించారు .
తూర్పు గోదావరి జిల్లా , కొత్తపేట మండలం , రావులపాలెం నుండి 8 కి.మీ దూరంలో , మందపల్లి గ్రామ సమీపాన ఆలయం కొలువు అయివుంది .
ఆలయ పూజా విధానం :
సాధారణంగా 16 ఉపచారాలు చేస్తారు కానీ ఇక్కడ 64 ఉపచారాలు చేయడం ప్రత్యేకత . దసరా ఉత్సవాలు ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతాయి . దసరా ఉత్సవాలు లో భాగంగా నిత్యం నవావరణ అర్చన , పంచామృత అభిషేకం , లలిత సహస్రనామ కుంకుమార్చన , నిత్యం భాగవత , సుందరకాండ పారాయణం జరుగుతాయి .
Vijayiiitn (చర్చ) 10:24, 27 జూన్ 2021 (UTC)