వాడుకరి చర్చ:Vijayiiitn

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]
Vijayiiitn గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Vijayiiitn గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 08:41, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యెనుగుల మహల్ - మేరు శ్రీ చక్ర ఆలయం

[మార్చు]

గోదావరి తీరంలో అరలాడుతున్న క్షేత్రం "శ్రీ చక్ర మేరు యంత్రాలయం". స్థానికులు ఏనుగుమహల్ గుడి అని కూడా పిలుస్తారు . ఇక్కడ "లలితా మహా త్రిపుర సుందరి " అమ్మ వారు యంత్ర స్వరూపిణిగా భక్తులకు అభయమిస్తున్నారు . ఈ క్షేత్రం తెలుగు రాష్ట్రాలలో ఏకైక మేరు శ్రీ చక్ర ఆలయం . 1983 లో ఆధ్యాత్మిక శాత్రవేత్త పద్మశ్రీ గ్రహీత శ్రీ ప్రణవానంద గురువు గారు తన తపశ్శక్తి ని ధారబోసి శ్రీ చక్రం ప్రతిష్టించారు . శ్రీ చక్ర లఘు పూజా విధానం , నవారణ పూజా విధానం , శ్రీ చక్రం పై 400 పేజీల సమగ్ర గ్రంధాన్ని శ్రీ ప్రణవానంద స్వామిజి రచించారు .

తూర్పు గోదావరి జిల్లా , కొత్తపేట మండలం , రావులపాలెం నుండి 8 కి.మీ దూరంలో , మందపల్లి గ్రామ సమీపాన ఆలయం కొలువు అయివుంది .

ఆలయ పూజా విధానం :

  సాధారణంగా 16 ఉపచారాలు చేస్తారు కానీ  ఇక్కడ 64 ఉపచారాలు చేయడం ప్రత్యేకత . దసరా ఉత్సవాలు ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతాయి . దసరా ఉత్సవాలు లో భాగంగా నిత్యం నవావరణ అర్చన , పంచామృత అభిషేకం , లలిత సహస్రనామ కుంకుమార్చన , నిత్యం భాగవత , సుందరకాండ పారాయణం జరుగుతాయి .

Vijayiiitn (చర్చ) 13:55, 20 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం : How can i add new telugu article.Please provide help page

[మార్చు]

YesY సహాయం అందించబడింది

How can i add new telugu article.Please provide help page—Vijayiiitn (చర్చ) 10:17, 27 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Vijayiiitn గారు, తెవికీలో రచనలు ప్రారంభించినందులకు సంతోషం. కొత్త వ్యాసం ప్రారంభించేముందు,ఒక 100 దిద్దుబాట్లు ఇప్పటికే వున్న వ్యాసాలను అభివృద్ధి చేయడం మంచిది. ఆ పనిలో మీకు తెవికీ వ్యాసాలగురించి మరింతగా తెలుసుకోగలుగుతారు. పై స్వాగతం సందేశంలోని విలువైన సమాచారానికి లింకులున్నాయి. అవి అధ్యయనం చేయండి. సందేహాలుంటే మరల అడగండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 06:41, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]