వాడుకరి:YVSREDDY/లియాండ్రా బెకెర్రా లుంబ్రెరాస్
స్వరూపం
ప్రపంచంలోనే అత్యధిక వయస్కురాలు లియాండ్రా బెకెర్రా లుంబ్రెరాస్. 1887, ఆగస్టు 31 న పుట్టిన ఈమె 2014, ఆగస్టు 31 న 127వ పుట్టినరోజును జరుపుకుంది. ఈమె మెక్సికోలోని జాపోపస్ పట్టణానిని చెందినది. బామ్మలకే బామ్మగా గుర్తింపు పొందిన ఈమె రెండు ప్రపంచయుద్ధాలతో సహా ఎన్నో చారిత్రక ఘట్టాలను చూసింది. 1910-1917 మధ్య మెక్సికన్ విప్లవంలో భర్తలతో పాటు కదనరంగంలోకి దిగిన "అడెలిటాస్" మహిళా బృందానికి ఈమె స్వయంగా నాయకత్వం కూడా వహించింది. 127వ పుట్టిన రోజు నాటికి ఈమెకు వారసులైన ఐదుగురు పిల్లలు, 20 మంది మనవలు, మనవరాళ్లు మరణించగా ప్రస్తుతం 73 మంది మనవలు, మనవరాళ్లు, 55 మంది మునిమనవలు, మనవరాళ్లు ఉన్నారు.
మూలాలు
[మార్చు]- సాక్షి దినపత్రిక - 01-09-2014 - (బామ్మలకే బామ!)
[[వర్గం:]]