వాడుకరి చర్చ:Attem Dattaiah/ప్రయోగశాల
కథానిక గుచ్చము
[మార్చు]జీవితంలో ఏ పార్శ్వాన్ని అయినా చిత్రించి, పాఠకులచే చదివించి ఆనందింప చేసే రక్తి, ఆలోచనలో ముంచేయగల శక్తిగల పక్రియ కథ. సమాజ సమస్యలను కూడా వినోదాత్మకంగా వినిపించే ప్రయత్నం చేసేది కూడా కథనే. కథా శీర్షికావిష్కరణలోనే విశిష్టత కనిపిస్తుంది. కథను ఏ కోణంలో అర్థం చేసుకోవాలి అనే దానికి రచయిత ప్రారంభ పదాలు క దారం వలె మనను వేరే దారిలో వెళ్ళనివ్వకుండా లాగుతుంటాయి. ఇది ఒక రకమైన విమర్శ పద్ధతిలో ప్రారంభమైన కథ అని చెప్పవచ్చు. ఒక తల్లి ఏ పుత్రుని పెంచడానికై పనిలో చేరిందో ఆ పుత్రున మరిచి, వారి మాటల మోహంలో పడి, ఇదినేను తప్ప ఇంకెవరు చేయలేరను భ్రమలో తలమునకలైంది. తన సంతానానికి స్తన్యాన్ని ఇవ్వడం ఎంతముఖ్యమో సంస్కారన్ని ఇవ్వడం అంతకన్నముఖ్యం. ధనాన్ని సంపాదించి ఇవ్వడానికి పైరెండు మరచితే ఎంతిచ్చిన వ్యర్థమే. చాలా మందికి అవసరాలు ఏవేవో పనులను చేయించవచ్చు కానీ దేని అవసరనిమిత్తం చేస్తున్నామో మరచి పనిలోనె మునగడం మూర్ఖత్వం. ఇక్కడ అదే జరిగింది. భర్తకు దూరై కావడంతో కుమారున్ని కష్టపడి గొప్పగ పెంచాలనుకుని ఒక ధనవంతుని ఇంటిలో పనికి చేరుతుంది. వారి కుమారునికి సేవలు చేస్తూ ఆమె తనయున్ని మరచిపోతుంది. సంస్కారం లేకుండా పెరిగిన కుమారున్ని చూసి ఏమి చేయలేని వయస్సులో తప్పుని తెలుసుకుని మార్చలేని స్థితిలో మరణమే శరణ్యమైంది. ఎ.ఆర్.కృష్ణ రాసిన ’గాలిచేపలు‘ అనే ఈ కథ చదువుతుంటే పొట్లపల్లి రామారావు రాసిన ’సమాధి‘ కథ గుర్తుకొస్తుంది. అట్లాగే బుద్ధుని జీవిత చరిత్రకూడాను. హాస్పిటల్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన నర్సుల అజాగ్రత వల్ల ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. నవజాత శిశువలందరు రూపంలో, కదలికల్లో, చేష్టలలో ఒకే విధంగా వుంటారు. వారిని గుర్తుపట్టడానికి చేతికి ఒక పటిటవేసే విషయం తెలిసిందే. ఒక రోజు స్నానానికి తీసుకొస్తు పిల్లల పట్టీలను మరిచిపోయింది నర్సు. ఎవరు ఎవరి పిల్లలు అనే ఆలోచనలో ఒకరిని ఒక్కొక్కరికి ఇంచ్చారు. అయినప్పటికి అనుమానాలే మిగిలాయి. ఒక తల్లిదండ్రికి అనుమానం జీవితాంతం ముంచెత్తుతుంది. అనుమానానికి అనుకూలంగానే పెరిగినకొద్ది వారి ఇద్దరు కొడుకులు ఆకారం, చేష్టలు, ఆలోచనలలో వేరు వేరు ఉంటున్నాయి. దీనిద్వార వాడి సంరక్షణలో, మాతృత్వంలో తేడాలు కన్పించాయి. భార్యా భర్తల్లో ఈ విషయంపై మనస్ఫర్దలు మొదలై భార్య మంచాన పడి మరణం వరకుతీసుకు వచ్చిన కథా పాలగుమ్మి రామారావు రాసిన ’రాలని బాష్పం‘. సంతానం తొందరగా కలుగకుంటే ఎన్ని అవమానాలు, అగచాటు మాటలు భరించాలో చక్కగా చిత్రించిన కథ ’ఆవేదన‘. చాలా కాలం తర్వాత సంతానం కల్గిన సమాజం మాట్లాడుకే తీరును విని భరించే బాధను వర్ణించిన తీరు హృదయాన్ని కలవరపెడుతుంది. ఎన్నో కష్టాలుపడి, వ్రతాలు చేయగ ఆడబిడ్డ కలుగుతుంది. ఖర్చులు తగ్గించుకుని కష్టపడి పెంచి పట్టణంలో ఉన్నవారికి ఇచ్చి పెళ్ళిచేసిస్తారు. వారు వరకట్నం కోసం నానా హింసలు పెట్టడం మొదలు పెట్టి, చివరకు అమ్మయి తండ్రి చచ్చిన పంపనంత వరకు వచ్చింది. నాన్న చావును చూడలేననే మనస్థాపంతో రోజురోజుకు ఆరోగ్యం క్షీణించింది. తల్లే వెళ్ళి చూద్దామనుకుంటే భర్త చనిపోయిన మూడు నెలలు నిండకుండా వెళ్ళినట్లయితే ఏమంటారో అని ఆలోచించి, బిడ్డ పరిస్థిని ఊహించుకుని ఉన్నభూమిని అమ్మి పైసల మూటతో వెళ్ళేరోజు రాత్రి అమ్మా... అమ్మా అంటూ కలవిరిస్తూ కాలచేయగ, కాటికి కూడా తీసుకెళ్ళినట్లు తెలియగా మూట కిందపడేసి మూర్చపోయింది తల్లి. దు:ఖాంతంగా ముగించిన కథ హృదయాన్ని కదిలిస్తుంది. కె.లింగరాజు రాసిన ’తిల్లానా‘ కథ వర్ణనాత్మకమైన శైలితో, హైదరాబాదు దర్శనీయ ప్రదేశాల ప్రస్థావనలతో నిండివుంది. కథంతా పాత ఆలోచనల మూటను విప్పుకుని ఒక ఇంట్లో మాట్లాడుతూ కూర్చున్న విషయమే. హైదరాబాద్ లో కొన్నిప్రాంతాల బ్రతుకులను, చిత్రకారుల జీవితాల ప్రస్థావన ఇందులో కనిపిస్తుంది. మంచి సందేశాన్ని అందించిన కథ ’తిరుపతి మొక్కు‘. రచయిత ధరణికోట శ్రీనివాసులు. తోటివారికి సహాయ పడటమే మానవత్వం అనుకునేవారు దరిద్రులలోనే దేవున్ని దర్శించుకుంటారు. తిరుపతి వెళ్దాము అనుకుని ఆఫీసులో సెలవు పెట్టుకున్న తండ్రి, ప్రయాణానికి సరిపడ వస్తువులను సర్దిపెట్టుకున్న తల్లి, ప్రయాణాన్ని ఊహిస్తూ కలలు కంటున్న పాప. రేపే వెళ్దాము అనుకునే లోపే పనిమనిషి కొడుకుకు జ్వరం. ప్రయాణపు ఖర్చుల కోసం పోగుచేసుకున్న పైసల్లో నుండి డాక్టర్ తో చూపించడం. మొత్తంగా తిరుపతి మొక్కు వాయిద పడడం జరుగుతుంది. కథా ముగింపులో రచయిత ’’నా మొక్కులు ఇలా త్యాగాలు చేసే తీర్చాలి. మీరు యిక నా దగ్గరికి రానక్కరలేదు నా మొక్కు నాకు ముట్టింది...‘‘ అని స్వప్నంతో సందేశానిచ్చి ముగించిన కథ యిది. పాటం చెప్పే పంతులుకు ఇంట్లో పోరు, భార్యవల్ల అశాంతి ఉంటే విద్యార్థలపై ఆ ప్రభావం ఎంతవరకు చూపిస్తుందో తెలిపిన కథ ’సైకాలజీ‘. రచయిత ఇల్లిందల సరస్వతీదేవి ఈ కథద్వారా సైకాలజీ మాస్టరే సరైనా ప్రవర్తనతో లేకుంటే జరిగే పరిణామాలు ఏలా ఉంటాయో, ఎంత మంది విద్యార్థులు బలి అవుతారో అనే విషయాలను చిత్రించారు. ‘‘మధ్యతరగతి బ్రతుకులు లోకం వెలిగించిన కర్పూరపు బిళ్ళలు...’’ అసలు తానెందుకు పుట్టాడు, ఏం సాధిస్తాడు అనే ప్రశ్నలకు జీవితాంతం సమాధానం దొరకని జీవితాలు మధ్యతరగతి బ్రతుకులు. వీరి బ్రతుకుల్లో ‘‘సంపాదన కొంచెం, సరసత్వం జాస్తి’’ గా పిల్లలను పెళ్ళాన్ని సరిగ్గా పటించుకోక సంసారాలను రోడ్డున పడేసుకునే వారుంటారు. అటువంటి తండ్రిగలిగిన పాత్ర ఆలోచిస్తే ఎలా ఉంటుందో తెలిపే కథే ఊటుకూరు రంగారావు రాసిన ‘జీవితగతి’. ఈ కథ పూర్తిగా మనో సంఘర్షనతో కూడి ఉంది. తల్లిప్రేమ, తండ్రి ఆవేశం రెడింటిని గుర్తుచేసుకుంటూ తన జీవితం ఇలా కావడానికి కారణం తండ్రే అనుకుంటూ పరధ్యానంలో తనకు తెలియకుండా తప్పు చేసి జైలు పాలైన జీవితాన్నిఇందులో వివరించారు. జీవిత ప్రయాణంలో కొన్ని తెలియకుండానే జరిగిపోతుంటాయి. అవి ప్రత్యేకంగా వయసులో ఉన్నవారికి చెప్పనక్కరలేదు. తెలియకుండానే ఒకరి హృదయాన్ని ఇచ్చి తరువాత ఎదురయెయ పరిణామాలకు చాలా బాధ్యులు అవుతుంటారు. మనసులో చోటు ఒకరికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. ఆ స్థానాన్ని తరువారు ఎంతమంచి వారైనా మరిపించలేరు. తనమనసులో నిలుపుకన్న వారితో పెళ్ళిచేయక పెద్దలకు నచ్చిన వారికి ఇస్తే వారు హృదయంలేని మనుషులుగా పాతస్మృలతో జీవితాన్ని సాగిస్తుండేవరు ఎందరో! అటువంటి విషయాన్నే వస్తువుగా చేసుకుని రుక్మణీగోపాల్ రాసిన ‘వక్రగతి’ అనే కథరాసారు. ఇందులో శారద అనే పాత్ర ప్రేమించిన మోహన్ రావుకు ఇచ్చిపెళ్ళిచేయకుండా వెంకట్రావుతో పెళ్లి జరిపించారు. నిరంతరం శారద ద్యాస మోహన్ రావే. అనుకోకుండా ఆ మోహన్ రావు వీరి ఇంటి ఎదురుటీ అద్దెకు రావడం. అతని భార్యతో మంచి పరిచయం ఏర్పడిన తర్వాత మోహన్ రావు భార్య అని తెలిసి శారద మనసులో పడిన సంఘర్షన వర్ణానాతీతం. కొన్నిరోజులకు మోహన్ రావుకు తెలిసి ఆయన మనో పరిస్థితి అంతే. తట్టుకోలేని ఆ జంట ఒకరోజు శారద వారి ఇంటో కలుసుకోవడం, నేను చేసింది తప్పని నిరంతరం చింతిస్తూ చావడమే చావే దీనికి పరిష్కారమని అని నిశ్చయించుకుంది. చిన్ని కూతురుందని ఎంతగా ఆలోచించిన చావే తనకు పరిష్కారం అని కావేరిలో దూకి చావడం పాఠకేలను కదిలిస్తుంది. తల్లికి కలిగిన సంతానంలో అందరు సమానంగా లేకుంటే తల్లిపడె వేదన ఏవిధంగా ఉంటుందో తెలిపే కథ ‘మూగవాడు’ ఈ కథారచయిత చిళ్ళరబావ నారాయణరావు. ఒక మూగవాడి మన:స్థతి ఎన్ని సంఘర్షణలకు లోనవుతుంది అనే విషయాన్ని అంతసూత్రంగా, మనో భావాలను వ్యక్తపరచలేని మనిషి ప్రతివిషయంలో పడుతున్న ఇబ్బందులను వర్ణించిన తీరు, ఎదుటి వారు అర్థం చేసుకునే వైనాని వర్ణించిన విధానం చాలా బాగుంది. ఊహకందని మలుపుతో కూడిన కథా ‘అంత ఆడవాళ్ళలోనే వుంది’ అనేది. ఒక చదువుకున్న స్ర్తీ ఆలోచన, అభ్యదయ భావాలుగల పురుషుని ఆలోచనలు ఒక కొత్త జీవితం వైపు నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. వరకట్న సమస్య అనేది లేకుంటే ప్రతి తల్లిదండ్రి కూతురికి సరిపోయె భర్తను అనుకున్న సమయంలో వెతికి పెళ్ళిచేసే వారు. పేద స్ర్తీ పెళ్లి సమయానికి అడ్డుతగిలేది వరకట్నమే. ఈ కథలో నాయికకు చిన్నప్పుడే పెళ్ళిచేద్దామనుకున్న తల్లిదండ్రులు డబ్బులేక ఆగిపోయారు. అంతలో తల్లి కాలం చేయడం, మరికొన్నాళ్లకు తండ్రి మరణించడం. జీవనం సాగించడానికి ఉద్యోగంలో చేరడం. తోటి ఉద్యోగి పరిచయం, స్నేహం, ప్రేమగా మారి పెళ్ళిని కోరుకోవడం. అతనికి ముందే పెళ్ళైన విషయం తెలిసీ కూడా అతనితో అతనితో వెళ్ళిపోవడం. నిడిదికోసం అతని మిత్రుని గదిలో ఉండడం. అక్కడి మిత్రుడు ఈమెకు మరో స్ర్తీకి అన్యాయం చేస్తున్నావు అని హితవు చెప్పాలనుకుంటాడు. ఆ స్ర్తీ తన పరిస్థితిని చెప్పి నీవు చేసుకో అనడం. అప్పటి వరకు బయటకు వెళ్ళిన ఆ ప్రియుడు రాగానే ఇది గమనించి వారిద్దరికి పెళ్ళి చేయడంలో వారి మధ్య అమలిన ప్రేమ ఎంతుందో తెలుస్తుంది. స్ర్తీ తోడు కోరుకుంటుంది. దీన్ని ఆసరగా తీసుకుని మోసగించే రోజులలో స్నేహపూర్వకంగా మంచి జీవితాన్ని అందించె పురుషులుంటారని సందేశాన్ని, ఆదర్శాన్ని తెలుపుతున్న కథ ఇది. కథల ఎన్నికల విధానంలో ఏం పాటించారో తెలియదు కాని ఇంచుమించు అన్ని కథలలో అంతసూత్రంగా ఆత్మవేదన, జీవన సంఘర్షణకు సంబంధించిన కథలున్నాయి. పనిలోపడి కొడుకుకు సరైనా జీవితాన్నివ్వక చింతలో పడి మరణించి తల్లి, కొడుకు తనవాడేనా అనే అనుమానంతో నిర్లక్షం చేసి చింతించిన తల్లి, ఒకానొక కూతురును పెళ్ళిచేసి అడిగినంత వరకట్నాన్ని అందించలేక హింసకు చంపుకున్నానే మూర్చిల్లిన మరోతల్లి, మూగవాడైన కుమారునికి ఎదురుకుంటున్న పాట్లను చూసి మదనపడుతున్న ఇంకోతల్లి, ప్రేమ విషయంతో ఎటు తేల్చుకోలేక జీవితంలో సతమతమైన మరో రెండు కథల్లో స్ర్తీ పాతలు ఇట్లా అన్ని పది కథల్లో సమస్యాత్మకంగా మధనపడుతున్న పాత్రలతో కూడిన కథలను గుచ్చంగా మలచిన పుస్తకం ’కథానికా గుచ్ఛం’
కథానిక గుచ్చము జీవితంలో ఏ పార్శ్వాన్ని అయినా చిత్రించి, పాఠకులచే చదివించి ఆనందింప చేసే రక్తి, ఆలోచనలో ముంచేయగల శక్తిగల పక్రియ కథ. సమాజ సమస్యలను కూడా వినోదాత్మకంగా వినిపించే ప్రయత్నం చేసేది కూడా కథనే. కథా శీర్షికావిష్కరణలోనే విశిష్టత కనిపిస్తుంది. కథను ఏ కోణంలో అర్థం చేసుకోవాలి అనే దానికి రచయిత ప్రారంభ పదాలు క దారం వలె మనను వేరే దారిలో వెళ్ళనివ్వకుండా లాగుతుంటాయి. ఇది ఒక రకమైన విమర్శ పద్ధతిలో ప్రారంభమైన కథ అని చెప్పవచ్చు. ఒక తల్లి ఏ పుత్రుని పెంచడానికై పనిలో చేరిందో ఆ పుత్రున మరిచి, వారి మాటల మోహంలో పడి, ఇదినేను తప్ప ఇంకెవరు చేయలేరను భ్రమలో తలమునకలైంది. తన సంతానానికి స్తన్యాన్ని ఇవ్వడం ఎంతముఖ్యమో సంస్కారన్ని ఇవ్వడం అంతకన్నముఖ్యం. ధనాన్ని సంపాదించి ఇవ్వడానికి పైరెండు మరచితే ఎంతిచ్చిన వ్యర్థమే. చాలా మందికి అవసరాలు ఏవేవో పనులను చేయించవచ్చు కానీ దేని అవసరనిమిత్తం చేస్తున్నామో మరచి పనిలోనె మునగడం మూర్ఖత్వం. ఇక్కడ అదే జరిగింది. భర్తకు దూరై కావడంతో కుమారున్ని కష్టపడి గొప్పగ పెంచాలనుకుని ఒక ధనవంతుని ఇంటిలో పనికి చేరుతుంది. వారి కుమారునికి సేవలు చేస్తూ ఆమె తయున్ని మరచిపోతుంది. సంస్కారం లేకుండా పెరిగిన కుమారున్ని చూసి ఏమి చేయలేని వయస్సులో తప్పుని తెలుసుకుని మార్చలేని స్థితిలో మరణమే శరణ్యమైంది. ఎ.ఆర్.కృష్ణ రాసిన ’గాలిచేపలు‘ అనే ఈ కథ చదువుతుంటే పొట్లపల్లి రామారావు రాసిన ’సమాధి‘ కథ గుర్తుకొస్తుంది. అట్లాగే బుద్ధుని జీవిత చరిత్రకూడాను. హాస్పిటల్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన నర్సుల అజాగ్రత వల్ల ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. నవజాత శిశువలందరు రూపంలో, కదలికల్లో, చేష్టలలో ఒకే విధంగా వుంటారు. వారిని గుర్తుపట్టడానికి చేతికి ఒక పటిటవేసే విషయం తెలిసిందే. ఒక రోజు స్నానానికి తీసుకొస్తు పిల్లల పట్టీలను మరిచిపోయింది నర్సు. ఎవరు ఎవరి పిల్లలు అనే ఆలోచనలో ఒకరిని ఒక్కొక్కరికి ఇంచ్చారు. అయినప్పటికి అనుమానాలే మిగిలాయి. ఒక తల్లిదండ్రికి అనుమానం జీవితాంతం ముంచెత్తుతుంది. అనుమానానికి అనుకూలంగానే పెరిగినకొద్ది వారి ఇద్దరు కొడుకులు ఆకారం, చేష్టలు, ఆలోచనలలో వేరు వేరు ఉంటున్నాయి. దీనిద్వార వాడి సంరక్షణలో, మాతృత్వంలో తేడాలు కన్పించాయి. భార్యా భర్తల్లో ఈ విషయంపై మనస్ఫర్దలు మొదలై భార్య మంచాన పడి మరణం వరకుతీసుకు వచ్చిన కథా పాలగుమ్మి రామారావు రాసిన ’రాలని బాష్పం‘. సంతానం తొందరగా కలుగకుంటే ఎన్ని అవమానాలు, అగచాటు మాటలు భరించాలో చక్కగా చిత్రించిన కథ ’ఆవేదన‘. చాలా కాలం తర్వాత సంతానం కల్గిన సమాజం మాట్లాడుకే తీరును విని భరించే బాధను వర్ణించిన తీరు హృదయాన్ని కలవరపెడుతుంది. ఎన్నో కష్టాలుపడి, వ్రతాలు చేయగ ఆడబిడ్డ కలుగుతుంది. ఖర్చులు తగ్గించుకుని కష్టపడి పెంచి పట్టణంలో ఉన్నవారికి ఇచ్చి పెళ్ళిచేసిస్తారు. వారు వరకట్నం కోసం నానా హింసలు పెట్టడం మొదలు పెట్టి, చివరకు అమ్మయి తండ్రి చచ్చిన పంపనంత వరకు వచ్చింది. నాన్న చావును చూడలేననే మనస్థాపంతో రోజురోజుకు ఆరోగ్యం క్షీణించింది. తల్లే వెళ్ళి చూద్దామనుకుంటే భర్త చనిపోయిన మూడు నెలలు నిండకుండా వెళ్ళినట్లయితే ఏమంటారో అని ఆలోచించి, బిడ్డ పరిస్థిని ఊహించుకుని ఉన్నభూమిని అమ్మి పైసల మూటతో వెళ్ళేరోజు రాత్రి అమ్మా... అమ్మా అంటూ కలవిరిస్తూ కాలచేయగ, కాటికి కూడా తీసుకెళ్ళినట్లు తెలియగా మూట కిందపడేసి మూర్చపోయింది తల్లి. దు:ఖాంతంగా ముగించిన కథ హృదయాన్ని కదిలిస్తుంది. కె.లింగరాజు రాసిన ’తిల్లానా‘ కథ వర్ణనాత్మకమైన శైలితో, హైదరాబాదు దర్శనీయ ప్రదేశాల ప్రస్థావనలతో నిండివుంది. కథంతా పాత ఆలోచనల మూటను విప్పుకుని ఒక ఇంట్లో మాట్లాడుతూ కూర్చున్న విషయమే. హైదరాబాద్ లో కొన్నిప్రాంతాల బ్రతుకులను, చిత్రకారుల జీవితాల ప్రస్థావన ఇందులో కనిపిస్తుంది. మంచి సందేశాన్ని అందించిన కథ ’తిరుపతి మొక్కు‘. రచయిత ధరణికోట శ్రీనివాసులు. తోటివారికి సహాయ పడటమే మానవత్వం అనుకునేవారు దరిద్రులలోనే దేవున్ని దర్శించుకుంటారు. తిరుపతి వెళ్దాము అనుకుని ఆఫీసులో సెలవు పెట్టుకున్న తండ్రి, ప్రయాణానికి సరిపడ వస్తువులను సర్దిపెట్టుకున్న తల్లి, ప్రయాణాన్ని ఊహిస్తూ కలలు కంటున్న పాప. రేపే వెళ్దాము అనుకునే లోపే పనిమనిషి కొడుకుకు జ్వరం. ప్రయాణపు ఖర్చుల కోసం పోగుచేసుకున్న పైసల్లో నుండి డాక్టర్ తో చూపించడం. మొత్తంగా తిరుపతి మొక్కు వాయిద పడడం జరుగుతుంది. కథా ముగింపులో రచయిత ’’నా మొక్కులు ఇలా త్యాగాలు చేసే తీర్చాలి. మీరు యిక నా దగ్గరికి రానక్కరలేదు నా మొక్కు నాకు ముట్టింది...‘‘ అని స్వప్నంతో సందేశానిచ్చి ముగించిన కథ యిది. పాటం చెప్పే పంతులుకు ఇంట్లో పోరు, భార్యవల్ల అశాంతి ఉంటే విద్యార్థలపై ఆ ప్రభావం ఎంతవరకు చూపిస్తుందో తెలిపిన కథ ’సైకాలజీ‘. రచయిత ఇల్లిందల సరస్వతీదేవి ఈ కథద్వారా సైకాలజీ మాస్టరే సరైనా ప్రవర్తనతో లేకుంటే జరిగే పరిణామాలు ఏలా ఉంటాయో, ఎంత మంది విద్యార్థులు బలి అవుతారో అనే విషయాలను చిత్రించారు. ‘‘మధ్యతరగతి బ్రతుకులు లోకం వెలిగించిన కర్పూరపు బిళ్ళలు...’’ అసలు తానెందుకు పుట్టాడు, ఏం సాధిస్తాడు అనే ప్రశ్నలకు జీవితాంతం సమాధానం దొరకని జీవితాలు మధ్యతరగతి బ్రతుకులు. వీరి బ్రతుకుల్లో ‘‘సంపాదన కొంచెం, సరసత్వం జాస్తి’’ గా పిల్లలను పెళ్ళాన్ని సరిగ్గా పటించుకోక సంసారాలను రోడ్డున పడేసుకునే వారుంటారు. అటువంటి తండ్రిగలిగిన పాత్ర ఆలోచిస్తే ఎలా ఉంటుందో తెలిపే కథే ఊటుకూరు రంగారావు రాసిన ‘జీవితగతి’. ఈ కథ పూర్తిగా మనో సంఘర్షనతో కూడి ఉంది. తల్లిప్రేమ, తండ్రి ఆవేశం రెడింటిని గుర్తుచేసుకుంటూ తన జీవితం ఇలా కావడానికి కారణం తండ్రే అనుకుంటూ పరధ్యానంలో తనకు తెలియకుండా తప్పు చేసి జైలు పాలైన జీవితాన్నిఇందులో వివరించారు. జీవిత ప్రయాణంలో కొన్ని తెలియకుండానే జరిగిపోతుంటాయి. అవి ప్రత్యేకంగా వయసులో ఉన్నవారికి చెప్పనక్కరలేదు. తెలియకుండానే ఒకరి హృదయాన్ని ఇచ్చి తరువాత ఎదురయెయ పరిణామాలకు చాలా బాధ్యులు అవుతుంటారు. మనసులో చోటు ఒకరికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. ఆ స్థానాన్ని తరువారు ఎంతమంచి వారైనా మరిపించలేరు. తనమనసులో నిలుపుకన్న వారితో పెళ్ళిచేయక పెద్దలకు నచ్చిన వారికి ఇస్తే వారు హృదయంలేని మనుషులుగా పాతస్మృలతో జీవితాన్ని సాగిస్తుండేవరు ఎందరో! అటువంటి విషయాన్నే వస్తువుగా చేసుకుని రుక్మణీగోపాల్ రాసిన ‘వక్రగతి’ అనే కథరాసారు. ఇందులో శారద అనే పాత్ర ప్రేమించిన మోహన్ రావుకు ఇచ్చిపెళ్ళిచేయకుండా వెంకట్రావుతో పెళ్లి జరిపించారు. నిరంతరం శారద ద్యాస మోహన్ రావే. అనుకోకుండా ఆ మోహన్ రావు వీరి ఇంటి ఎదురుటీ అద్దెకు రావడం. అతని భార్యతో మంచి పరిచయం ఏర్పడిన తర్వాత మోహన్ రావు భార్య అని తెలిసి శారద మనసులో పడిన సంఘర్షన వర్ణానాతీతం. కొన్నిరోజులకు మోహన్ రావుకు తెలిసి ఆయన మనో పరిస్థితి అంతే. తట్టుకోలేని ఆ జంట ఒకరోజు శారద వారి ఇంటో కలుసుకోవడం, నేను చేసింది తప్పని నిరంతరం చింతిస్తూ చావడమే చావే దీనికి పరిష్కారమని అని నిశ్చయించుకుంది. చిన్ని కూతురుందని ఎంతగా ఆలోచించిన చావే తనకు పరిష్కారం అని కావేరిలో దూకి చావడం పాఠకేలను కదిలిస్తుంది. తల్లికి కలిగిన సంతానంలో అందరు సమానంగా లేకుంటే తల్లిపడె వేదన ఏవిధంగా ఉంటుందో తెలిపే కథ ‘మూగవాడు’ ఈ కథారచయిత చిళ్ళరబావ నారాయణరావు. ఒక మూగవాడి మన:స్థతి ఎన్ని సంఘర్షణలకు లోనవుతుంది అనే విషయాన్ని అంతసూత్రంగా, మనో భావాలను వ్యక్తపరచలేని మనిషి ప్రతివిషయంలో పడుతున్న ఇబ్బందులను వర్ణించిన తీరు, ఎదుటి వారు అర్థం చేసుకునే వైనాని వర్ణించిన విధానం చాలా బాగుంది. ఊహకందని మలుపుతో కూడిన కథా ‘అంత ఆడవాళ్ళలోనే వుంది’ అనేది. ఒక చదువుకున్న స్ర్తీ ఆలోచన, అభ్యదయ భావాలుగల పురుషుని ఆలోచనలు ఒక కొత్త జీవితం వైపు నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. వరకట్న సమస్య అనేది లేకుంటే ప్రతి తల్లిదండ్రి కూతురికి సరిపోయె భర్తను అనుకున్న సమయంలో వెతికి పెళ్ళిచేసే వారు. పేద స్ర్తీ పెళ్లి సమయానికి అడ్డుతగిలేది వరకట్నమే. ఈ కథలో నాయికకు చిన్నప్పుడే పెళ్ళిచేద్దామనుకున్న తల్లిదండ్రులు డబ్బులేక ఆగిపోయారు. అంతలో తల్లి కాలం చేయడం, మరికొన్నాళ్లకు తండ్రి మరణించడం. జీవనం సాగించడానికి ఉద్యోగంలో చేరడం. తోటి ఉద్యోగి పరిచయం, స్నేహం, ప్రేమగా మారి పెళ్ళిని కోరుకోవడం. అతనికి ముందే పెళ్ళైన విషయం తెలిసీ కూడా అతనితో అతనితో వెళ్ళిపోవడం. నిడిదికోసం అతని మిత్రుని గదిలో ఉండడం. అక్కడి మిత్రుడు ఈమెకు మరో స్ర్తీకి అన్యాయం చేస్తున్నావు అని హితవు చెప్పాలనుకుంటాడు. ఆ స్ర్తీ తన పరిస్థితిని చెప్పి నీవు చేసుకో అనడం. అప్పటి వరకు బయటకు వెళ్ళిన ఆ ప్రియుడు రాగానే ఇది గమనించి వారిద్దరికి పెళ్ళి చేయడంలో వారి మధ్య అమలిన ప్రేమ ఎంతుందో తెలుస్తుంది. స్ర్తీ తోడు కోరుకుంటుంది. దీన్ని ఆసరగా తీసుకుని మోసగించే రోజులలో స్నేహపూర్వకంగా మంచి జీవితాన్ని అందించె పురుషులుంటారని సందేశాన్ని, ఆదర్శాన్ని తెలుపుతున్న కథ ఇది. కథల ఎన్నికల విధానంలో ఏం పాటించారో తెలియదు కాని ఇంచుమించు అన్ని కథలలో అంతసూత్రంగా ఆత్మవేదన, జీవన సంఘర్షణకు సంబంధించిన కథలున్నాయి. పనిలోపడి కొడుకుకు సరైనా జీవితాన్నివ్వక చింతలో పడి మరణించి తల్లి, కొడుకు తనవాడేనా అనే అనుమానంతో నిర్లక్షం చేసి చింతించిన తల్లి, ఒకానొక కూతురును పెళ్ళిచేసి అడిగినంత వరకట్నాన్ని అందించలేక హింసకు చంపుకున్నానే మూర్చిల్లిన మరోతల్లి, మూగవాడైన కుమారునికి ఎదురుకుంటున్న పాట్లను చూసి మదనపడుతున్న ఇంకోతల్లి, ప్రేమ విషయంతో ఎటు తేల్చుకోలేక జీవితంలో సతమతమైన మరో రెండు కథల్లో స్ర్తీ పాతలు ఇట్లా అన్ని పది కథల్లో సమస్యాత్మకంగా మధనపడుతున్న పాత్రలతో కూడిన కథలను గుచ్చంగా మలచిన పుస్తకం ’కథానికా గుచ్ఛం’