Jump to content

వాడుకరి చర్చ:Papisetti

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Papisetti గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 14:09, 6 డిసెంబర్ 2006 (UTC)


మీరు చెప్పినది నిజమే; తెలుగుపదాలనే వాడాలి; కానీ 'పేజీ' అనే పదము తెలుగు పదమే అన్నంతగా వాడుకలో ఉంది (పుట అనే పదంకంటే కూడా), అందుకనే ఆ పదాన్ని వాడుతున్నాము. ఈ వ్యవహారంమీద ఇంతకు ముందు ఒక సారి చర్చకూడా జరిగింది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 14:27, 6 డిసెంబర్ 2006 (UTC)

నిర్వాహకులు ఎవరు

[మార్చు]

ప్రదీప్ గారు మీ జవాబు చదివాను.మీరు అనేది ఏమిటంటే వీకీ లో వాడుక భాషకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు.నాకొక విషయం చెప్పండి తెలుగు వీకికి నిర్వాహకులు ఎవరు?వారిని ఎలా సంప్రదించవచ్చు.

వికిపిడియాలో నిర్వాహకుల జాబితా అనే పేజీలో మొత్తం అందరి నిర్వాహకుల చిట్టా ఉంటుంది. అక్కడ నుండి వారి చర్చా పేజీలలోకి వెళ్ళి ఎవరినయినా సంప్రదించవచ్చు. నేను కూడా ఒక నిర్వాహకుడినే. తెలుగు వికీలో సమాచారాన్ని చేర్చటానికి ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు మొదలు పెటడం జరిగింది. మీరు కూడా వాటిలో పాల్గొని మీకు చేతనయిన సహాయం చేయవచ్చు. వికిపిడియాకు మరొక్కసారి నా హృదయపూర్వక స్వాగతం. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:03, 6 డిసెంబర్ 2006 (UTC)

వాడుక బాష

[మార్చు]

పాపిశెట్టి గారూ, మీరన్న పేజీ -> పుట, అకౌంటు -> ఖాతా అన్న మార్పుల గురించి ఇది వరకు కూడా చర్చించడము జరిగినది. వీటిని మార్చడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. నిర్వాహకులు సభ్యుల అభిప్రాయన్ని అనుసరించే వ్యవహరిస్తారు. సొంత అభిప్రాయాలను అమలుపరచలేము. కానీ ఏకపక్షముగా మిగిలిన వారితో చర్చించకుండా మొదటి పేజీని మార్చవద్దని మనవి. మళ్లీ ఈ చర్చను ప్రారంభించి మిగిలిన సభ్యులు ఏమంటారో కనుక్కొని దానికి అనుగుణంగా మారుద్దాం. రండి కలిసి పనిచేయ్యాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. కలిసి తెలుగులో తరతరాలు నిలిచే ఒక విజ్ఞాన సర్వస్వము నిర్మిద్దాం --వైఙాసత్య 15:44, 6 డిసెంబర్ 2006 (UTC)

చర్చ ప్రారంభించాను. మీ అభిప్రాయము ఇక్కడ తెలియజేయండి.--వైఙాసత్య 15:58, 6 డిసెంబర్ 2006 (UTC)

ఇంటింటా తెలుగు దివ్వె- గమనిక

[మార్చు]

పాపిసెట్టిగారూ నమస్కారం.

ప్రదీప్ చర్చా పేజీలో మీరు వ్రాసిన "ఇంటింటా తెలుగు దివ్వె" విషయాన్ని ప్రస్తుతానికి చర్చ:తెలుగులోకి మార్చాను. వ్యాసంలో విషయాలు చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి. అయితే ఏ వ్యాసంలో ఎలా పొందుపరచాలో ఇంకా నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. ఆలోచించుదాము .

కాసుబాబు 19:13, 3 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]