వాడుకరి చర్చ:Sarathbiochem
విషయాన్ని చేర్చు
|
|
సూచనలు
[మార్చు]శరత్! తెలుగు వికీలో విజ్ఞాన శాస్త్రానికి చెందిన రచనల లోటు స్పష్టంగా ఉన్నది. మీవంటివారి కృషి వల్ల ఈ విషయంలో మనం ప్రగతి సాధించవచ్చును. చక్కని తెలుగులో భౌతిక శాస్త్రానికి సంబంధించిన రచనలు మొదలు పెట్టినందుకు అభినందనలు. అయితే కొన్ని సూచనలు:
- వ్యాసాలు మరీ నిర్వచనాలతో సరిపెట్టకుండా ఒక పేజీ అన్నా నిడివి ఉండేలాగా పొడిగించమని కోరుతున్నాను. ఆ విషయాలపై ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలను మీరు ఒకసారి పరిశిలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
- మీరు మొదలు పెట్టిన వ్యాసాలలో ఇతరులు చేస్తున్న మార్పులను కూడా గమనిస్తూ ఉండండి.
- తెలుగు సాంకేతిక పదాలకు ప్రక్కన బ్రాకెట్లలో ఆంగ్లపదాలు వ్రాస్తే మంచిదని నా అభిప్రాయం.
ఏమైనా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక వ్రాయండి. --కాసుబాబు 18:54, 21 మే 2007 (UTC)
అభినందనలు
[మార్చు]శరత్ గారు, మీరు చక్కటి విషయపరిజ్ఞానంతోనూ మంచి భాషతోనూ, మీ వికీయాత్రను మొదలు పెట్టారు, అభినందనలు. మీకృషిని ఇలాగే కొనసాగించండి. నిసార్ అహ్మద్ 12:26, 18 మే 2008 (UTC)
వికీపీడియా @ 25 – హైదరాబాద్‌లో ప్రత్యేక వేడుకకు ఆహ్వానం !
[మార్చు]స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందరికీ చేరువ చేసిన మహా ఉద్యమమైన వికీపీడియా 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా జరుపుకుంటున్న శుభసందర్భంలో, ఐఐఐటీ–హైదరాబాద్ క్యాంపస్‌లో 2026 జనవరి 18వ తేదీ ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక వేడుకకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన నగరంలో వికీపీడియా ఎలా ఎదిగిందో, స్వచ్ఛందకర్తల అంకితభావం, వారి విజయగాథలు, అనుభవాలు— అన్నింటినీ కలిసి గుర్తుచేసుకుంటూ, ఈ జ్ఞానోత్సవాన్ని మనమందరం కలిసి సంబరంగా జరుపుకుందాం! నమోదుకు , వివరాలకు ఈవెంట్ పేజీ చూడండి. Krupal (OKI) (చర్చ) 12:03, 16 జనవరి 2026 (UTC)