వాడుకరి చర్చ:Svrangarao/పాత చర్చ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సర్దార్ వల్లభభాయి పటేల్ వ్యాసం[మార్చు]

రంగారావు గారు, సర్దార్ వల్లభభాయి పటేల్ ఇదివరకే తెవికీలో ఉన్నది. మీరు మరొకటి కొత్తగా తయారుచేశారు. ఒకే విషయానికి సంబంధించి ఒకటికంటే అధికంగా వ్యాసాలు ఉండుట సమంజసం కాదు. కాబట్టి మీరు చేయదల్చిన మార్పులు, చేర్పులు మొదటి వ్యాసంలోనే చేయండి.--C.Chandra Kanth Rao 20:27, 18 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

CKR garu, ఇప్పటికే ఆయన గురించి వ్యాసం ఉన్నదేమోనని వెతికాను కానీ సరి అయిన navigation and linking లేకపోవడం వల్ల మీరు చూపిన వ్యాసం నాకు దొరకలేదు. అందుకే కొత్త వ్యాసం మొదలుపెట్టాను. మీరు సూచించినట్లు అందులోనే మార్పులు చేస్తాను. Thank you! - --Svrangarao 20:52, 18 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బోస్టన్ నగర వ్యాసం[మార్చు]

రంగారావు గారు, బోస్టన్ నగర వ్యాసాన్ని బాగా అనువాదం చేస్తున్నారు. మీరు వ్యాసంలో మూలాలు (రెఫరెన్సులు) కూడా ఇవ్వండి. ఆంగ్ల వికీలోని వ్యాసాన్ని ఎడిట్ మోడ్‌లో నుంచి <ref> </ref> మద్య ఉన్న భాగాన్ని యధాతథంగా ఆ వాక్యం చివర చేర్చేయండి. భద్రపర్చిన పిదప వాక్యం చివర సూపర్‌స్క్రిప్ట్ నమూనాలో (ఇలా[1]) అంకె కనపడుతుంది. వ్యాసం క్రిందిభాగంలో మూలం కనిపిస్తుంది.--C.Chandra Kanth Rao 13:29, 20 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

CKR గారు, ఆ వ్యాసం చివరలో 'వనరులు ' ('మూలాలు ' గా మారుస్తాను)అన్న విభాగంలో లింక్ ఇచ్చాను, అది సరిపోతుంది అనుకున్నాను. మొత్తం వ్యాసం అంతా ఒకే లింక్‌లోనుండి అనువదిస్తున్నపుడు మళ్ళీ వేరే లింకులతో అవసరంలేదు అనుకుంటున్నాను. మీ సూచనలను తెలపండి.--Svrangarao 00:08, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

CKR గారు - ఇపుడే బోస్టన్ వ్యాసంలో మీరు చేసిన మార్పులు చూసాను. మొత్తం వ్యాసం http://en.wikipedia.org/wiki/Boston,_Massachusetts నుండి అనువాదిస్తున్నపుడు మళ్ళీ మూలాలు ఎందుకు? ఆ ఒక్క లింక్ ఇస్తే చాలు కదా? నాకయితే అలా అదనపు మూలాలు ఇవ్వడం అవసరం లేదు అనిపిస్తున్నది. --Svrangarao 00:44, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావు గారు, మూలాల జాబితాలో వ్యాసం మొత్తం లింకు ఇవ్వరాదు. ఆంగ్ల వికీలో మూలాలున్నప్పుడు తెవికీలో అదే వ్యాసానికి మూలం అవసరం లేదని భావించడం కూడా సమంజసం కాదు. తెలుగు వ్యాసం చదివే వారు ఆంగ్ల వ్యాసం కూడా చూస్తారనే నమ్మకమేంటి? మీరొకసారి వికీపీడియా:మూలాలు దర్శించండి. ఇంకో ముఖ్యవిషయం కొత్తసభ్యులు వ్యాసాలు ప్రారంభించినప్పుడు ఇతర సభ్యులు వికీ నిబంధనల ప్రకారం మార్పులు, చేర్పులు చేయడం జరుగుతుంది. వ్యాసం నాణ్యత మెరుగుపర్చడం కోసం చేసిన మార్పులను మీరు తుడిచివేయడం బాగుండదు. మీకేమైనా అభ్యంతరం ఉంటే ఆ వ్యాసపు చర్చాపేజీలో నివేదించండి.--C.Chandra Kanth Rao 13:24, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

CKR గారు, ఎవరయినా మార్పులు చేయవచ్చు కాబట్టి లాస్ ఏంజలెస్ ‎ను ప్రమాణికంగా తీసుకొని నా అనువాదాలను ఇలాగే కొనసాగిస్తాను. --Svrangarao 00:17, 22 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

    • రంగారావుగారూ నమస్కారం, మీఅభిమానాలకు ధన్యవాదాలు, సాయి గారి మాటల్లోనూ సత్యమున్నది, వారి కర్తవ్యనిర్వహణలో వారి నిర్భీతిని కొనియాడాలి. మనం చేయవలసిన పని చాలా యున్నది, సమయం తక్కువ, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం ప్లీజ్, మిత్రుడు nisar 10:00, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావు గారు. మీరు ఒక సారి en:WP:AUTOBIO చదివితే, అక్కడ ఎవరైనా వారి గురించి వారు వ్యాసాలు వ్రాయడం కాని మార్చడం కాని చేయకూడదని అని ఉంది. అది ఏ శైలీలో నైనా కావచ్చు. నేను నిసార్ గారు మంచి కవి కాదు అనలేదు. నేను నిసార్ గారు తెవికీలో కృషి చేయలేదు అనలేదు. నేను వికిపీడియా పాలసి అందరు పాటించాలని భావిస్తాను. దానికి పెద్ద చిన్న లేవన్నది నా నమ్మకం. నేను నిసార్ గారి గురించి వ్యాసం ఉండకూడదు అని కూడ అనలేదు. అది వారు వ్రాయకూడదు అని మాత్రమే అన్నాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. సాయీ(చర్చ) 12:42, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ అహ్మద్ సయ్యద్ వ్యాసానికి {{delete}} template ని ఎందుకు తీసేసారు? ఇంకోసారి తీసేస్తే vandalism కింద పరిగణించాల్సి ఉంటుంది. సాయీ(చర్చ) 12:58, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సాయిగారు, ఆ వ్యాసం గురించి చర్చ అవసరంలేదు కాబట్టి {{delete}} template తీసేసాను.

మరి కొన్ని వివరాలను ఆ వ్యాసం గురించిన చర్చా పేజీలో తెలుపుతున్నాను. - --Svrangarao 15:54, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును రంగారావు గారు. నేను అలాంటి వాళ్ళని చాలామందిని చూసాను. ఆ వ్యాసం మెదలుపెట్టింది నిసార్. నేనైతే నిర్వాహకునిగా ఉంటే en:WP:SOCK క్రింద నిసార్ ని కనీసం ఒక వారం బ్లాక్ చేసేవాణ్ణి. సాయీ(చర్చ) 09:10, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం, ప్రధాన వర్గం[మార్చు]

రంగారావు గారు, మీరు వర్గం:అమెరికాలో ప్రసిద్దులు లో [[వర్గం:అమెరికాలో ప్రసిద్దులు]] కలిపారు. వర్గం, ప్రధాన వర్గం రెండూ ఒకే పేరుతో ఉండరాదు. ఆ వర్గం ఏ ప్రధాన వర్గంలో కలుస్తుందో వర్గం పేజీలో దాన్ని చేర్చాలి. అంతేకాకుండా ఒక వర్గం అనేక ప్రధాన వర్గాలలో కూడా ఉండవచ్చు. అలా ఉండటం వల్ల వ్యాసం వెదకడానికి కూడా సౌలభ్యం. ఉదా.కు అమెరికాలో ప్రసిద్ధులు వర్గం వర్గం:ప్రజలులో ఉండవచ్చు, వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాలులో ఉండవచ్చు. మొదటి పేజీ నుండి ప్రజలు వర్గం నుండి వెళ్ళిననూ, దేశాల వర్గం నుండి వెళ్ళిననూ ఇందులోని వ్యాసాలు తగులుతాయి. ఇది అనుభవం కొద్దీ అర్థమౌతోంది. ఇంకనూ మీ ఆలోచన ప్రకారం మెరుగుపర్చవచ్చు.-- C.Chandra Kanth Rao(చర్చ) 21:22, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

CKR గారు, ఆ వర్గాన్ని సృష్టించినపుడు అంతా ఖాళీగా ఉంటే ఏమి చేయాలో తెలియక అలా చేసాను. మీరు మార్పు చేసిన తర్వాత మరోసారి చూసాను, చాలా బాగుంది. వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు. --Svrangarao 21:29, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం:అమెరికా సంయుక్ర రాష్ట్రాలలోని నగరాలు[మార్చు]

ఇప్పుడే ఒక పొరపాటును గమనించాను. సంయుక్త బదులు సంయుక్ర అని ఉంది (ఎక్కడినుండో కాపీ చేసాను). అది కాపీ చేసి ఐదు నగరాల వ్యాసాలలో ఉంచాను. ఇది సరిదిద్దగలరు. --Svrangarao 21:15, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మరొకసారి గుర్తు చేస్తున్నాను. గమనించగలరు. --Svrangarao 12:27, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సరిచేసాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:41, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Macintosh user?[మార్చు]

మీరు మ్యాక్ వాడతారా? సాయీ(చర్చ) 07:52, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సాయిగారు, నేను మ్యాక్ వాడను కానీ కాస్త ఆసక్తి ఉంది. --Svrangarao 00:13, 7 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

స్టీవ్ జాబ్స్ వ్యాసం వ్రాస్తూంటేను అడిగాను. నేను వాడతాను. :) సాయీ(చర్చ) 03:53, 7 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


వ్యాసాల జాబితా[మార్చు]

ఎస్ వి రంగారావుగారూ ఎదో తోచింది వ్రాస్తూ పోతున్నానుకాని నేనే ఏమేమి వ్రాసేనో లెక్క చూడలేదు.మీరు అడిగారుగా ఇకమీదట జాబితా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను.
--t.sujatha 01:33, 18 మార్చి 2008 (UTC)


  • ఎస్ వి రంగారావుగారూ నమస్తే, నేను వ్రాసే వ్యాసాల జాబితా అడిగారు, ఇంతవరకూ ఏమి వ్రాసానో లెక్క చూడలేదు, చక్కటి సూచన, ఇక మీదట ప్రయత్నిస్తాను. మిత్రుడు nisar 13:20, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఎస్.వి.రంగారావుగారూ నమస్తే, మక్కా వ్యాసం గురించి చెప్పారు, మీ సూచనకు ధన్యవాదాలు, ఇవికీ నుండి సిటీ ఇన్ఫో మూసను తీసి అతికిస్తే అది పేజీలో కానరాడం లేదండి. మూసలు ఎలా తయారుచేయాలో నాకు తెలియదు, ఇవికీ లో కాపీ చేసి తెవికీ లో అతికించడం మాత్రం తెలుసు. మూసలు, విషయ పట్టికలు, ఫోటో అప్ లోడు లాంటి విషయాలు తెలియవు, ఎలా చేయాలో కొంచెం గైడ్ చేస్తారా? మిత్రుడు nisar 11:10, 21 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావుగారు, బొమ్మ:PSLV-CA 1.jpg అనే పేరుగల బొమ్మను అప్లోడు చేసారు. ఈ బొమ్మ public domain బొమ్మ ఎలా అయ్యిందో వివరించగలరా. ఆ బొమ్మను ఎపరు చూసినా 60 సంవత్సరాల క్రితంది కాదిని ఇట్టే చెప్పగలరు, కాబట్టి అది public domain బొమ్మ కావటానికి వేరే కారణముండలి అదేమిటి? అలాగే మీరు ఈ బొమ్మను ఎక్కడి నుండి సేకరించారో కూడా తెలుపగలరు. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:32, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీపు గారు, ఆ ఫోటో గవర్నమెంట్ సంస్థకు చెందినది కాబట్టి ఎవరయినా ఉపయోగించవచ్చు అనుకొని అప్‌లోడ్ చేసాను. --Svrangarao 12:43, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అది అమెరికా గవర్నమెంటుకు మాత్రమే రంగారావు గారు. మీరు ఇక్కడ చూడండి. అసలు ఆంగ్ల వికీలో ఫెయిర్ యూస్ ట్యాగ్ ఉంటే మీరు PD ట్యాగ్ ఎట్లా తగిలించారు? సాయీ(చర్చ) 17:04, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


వెతుక్కోలేకపోతే
What is a government work?

"Government work" means a work which is made or published by or under the direction or control of

the government or any department of the government

any legislature in India, and

any court, tribunal or other judicial authority in India.

కాబట్టి ఇస్రో దీని కిందికే వస్తుంది

Who is the owner of copyright in a government work?

In the case of a government work, government shall, in the absence of any agreement to the contrary, be the first owner of the copyright therein.

సాయీ(చర్చ) 17:12, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించండి రంగారావు గారు. ఆ బొమ్మ ఎవరో క్రొత్తా సభ్యులు అప్లోడ్ చేశారనుకున్నాను. మీరు ఇప్పుడు ఏమి చేయనక్కర లేదు. నేను ఫెయిర్ యూస్ ట్యాగ్ తగిలించాను. సాయీ(చర్చ) 14:04, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చందమామ పేజీ[మార్చు]

గురువుగారూ! చందమామ వ్యాస వ్యాస పుటలో, అన్నిటికన్న ప్రస్తుతపు సంపాదకుల బొమ్మ చాలా పెద్దది అయిపోయి వషయ-బొమ్మల నిష్పత్తి మీద ప్రభావం చూపుతున్నది.అందుకని బొమ్మను మెగిలిన బొమ్మల సైజుకు మార్చాను,దయచేసి గమనించగలరు.--SIVA 02:53, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావుగారూ! సహాయానికి వచ్చినందుకు ధన్యవాదములు. గాడ్సే బొమ్మ చిన్నది చెయ్యలని నా ప్రయత్నం. అందుకని 1కి 2సార్లు ఉప్లోడ్ ప్రయత్నించాను. దయచేసి గాంధీ పుటలో గాడ్సే చిత్రాన్ని ఇంకా చిన్నది చేసి అంతవరకూ సిమెట్రికల్ గా ఉందేటట్లు చెయ్యగలరా.--SIVA 03:05, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు రంగారావుగారూ. మీరు తగిన సమయం లో సరైన సలహా ఇచ్చారు మరియు నేను తెలియకుండా చేసిన తప్పు తెలియచేసారు.--SIVA 05:50, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చలం వ్యాసఒలో మార్పులు[మార్చు]

రంగారావుగారూ! నమస్కారం.

మీరు చలం వ్యాసంలో చేసిన మార్పులు జత పరచిన విషయాలు చూసాను. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. కాని, ...."చలం ఏకుటుంబ జీవితాన్ని విమర్శించాడో ఆకుటుంబమే, స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు ఈవిధంగా నిలబడింది' వ్రాసిన దాంట్లో నాకెందుకో పూర్తి సబబుగా లేదనిపిస్తున్నది. చలం తన విమర్శలలో ఎప్పుడూ కూడా కుటంబ జీవితంలో స్త్రీలను ఎంత తక్కువగా, ఒక వస్తువను చూసినట్లుగా చూస్తారో, ఎంత తమ అవసరాలకు వాడుకుంటారో వ్రాశారేకాని, కుటంబ జీవితం మీద వేరే విమర్శలు వ్రాసినట్లు నాకు తెలియదు. ఆయన కుటుంబ జీవనాన్ని ఏ కథలో/నవలలో విమర్శించారో చెప్తే బాగుంటుంది.

తరువాత "....తన కుటుంబసభ్యులు అరుణాచలం(తమిళనాడు) లోని రమణ మహర్షి శిష్యులుగా మారి అచటికే వెళ్ళటంతో....." తన కుటుంబ సభ్యులు మాత్రమే రమణ మహర్షి శిష్యులుగా మారితే, చలం గతిలేక తనూ అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ కథ ప్రకారం, దీక్షితులుగారు (అప్పటి తరం మరో రచయిత, చల స్నేహితులు)మొదటిసారి చలాన్ని రమణమహర్షి దగ్గరకు ఎప్పుడో తీసుకొని వెళ్ళారు. క్రమంగా చలం రమణ మహర్షి పట్ల ఆకర్షితులయినట్లు ఆయన ఆత్మ కథలో తెలుస్తుంది. "వొయ్యి" అని పిలుచుకునే ఆయన వదినగారు, విజయవాడలో పేరొందిన వైద్యురాలు. ఆవిడ మరణం తరువాత, సమాజం తన పట్ల చూపుతున్న శతృ వైఖరిని భరించలేక తన కుటుంబంతో సహా చలం విజయవాడ వదలి అరుణాచలం వెళ్ళిపొయ్యరు.ఈ విషయం ఆయన ఆత్మ కథలో స్పష్టంగా ఉన్నది. దయచేసి మీరు మరొక్కసారి verify చెయ్యమని మనవి.--SIVA 17:09, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శివ గారు, చలం కారణంగా ఆయన కుటుంబం ఛిన్నాభిన్నమయినది అన్నదానిలో మీకు కూడా సందేహం లేదు అనుకుంటాను. 'ఆయన వల్లే ఆ కుటుంబం అలా అయింది ' అన్న విషయమే మరో విధంగా అలా చెప్పబడింది. రెండవదానికోసం ఆయన మనవరాలు రాసిన పుస్తకం చూడవలెను.--Svrangarao 23:01, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  1. .